Monday, February 3, 2025

సష్ట గ్రహ కూటమి

మార్చ్ 28,2025 న మధ్యాహ్నం 2:58 కు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం 4 వ పాదం లో ప్రవేశించడం తో మీన రాశి లో రవి,చంద్ర, రాహు, శని, శుక్ర, బుధ గ్రహాల యుతి తో ఈ  సష్ట గ్రహ కూటమి మొదలు అయ్యి మార్చ్ 30 మధ్యాహ్నం 2:47 వరకు వుంటుంది. 

మన దేశానికి సంబంధించి మీన రాశి  ఈశాన్య రాష్ట్రాలను సూచిస్తుంది. మణిపూర్, మిజోరం, అస్సాం , వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో ప్రకృతి విపత్తులు, హింసా కాండ జరిగే అవకాశం వుంది. ఈ ప్రాంతం లోని పైన చెప్పబడిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రమాదం సూచింపబడుతోంది. 

మీన రాశిలో  జరుగబోతున్న ఈ గ్రహ కూటమి ప్రభావం 3 నెలలు వుంటుంది. 

ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశులలో 

వృషభ రాశి వారికి అఖండ రాజ యోగం కలుగుతుంది.  పట్టిందల్లా బంగారం అవుతుంది.

మేష రాశికి ఖర్చులు, దూరప్రయాణాలు వాయిదా పడడం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు 

మిధున రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో ఒడిదుడుకులు, ప్రభుత్వం తో , బంధువులతో ఇబ్బందులు. 

కర్కాటక రాశి వారికి శుభా శుభ మిశ్రమ ఫలితాలు వుంటాయి. 

సింహ రాశి వారికి అనుకోని సంఘటనలు, ఆరోగ్య భంగాలు, ఆస్తి , ధన నష్టాలు. 

కన్యా రాశి వారికి విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు, వైవాహిక సమస్యలు, భాగస్వాములతో ఇబ్బందులు. 

తులా రాశి వారికి రాజయోగం , శత్రువులపై విజయం , కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో విజయం , ఎప్పటి నుండో వున్న అడ్డంకులు తొలగిపోవడం వంటి ఫలితాలు. 

వృశ్చిక రాశి వారికి సంతానం గురించీ విచారం, కోపం, ఎమోషనల్ గా వుంటారు. కొన్ని విషయాలలో నిర్ణయం చేసుకోలేక  ఫ్రస్ట్రేషన్ వుంటుంది. 

ధనుస్సు రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు వుండవు. వాహన ప్రమాదాలు, బంధువులతో విభేదాలు, తల్లి ఆరోగ్యం క్షీణించడం వంటి ఫలితాలు. 

మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఎక్కువ భాగం శుభ ఫలితాలు వుంటాయి. శత్రువులపై విజయం. కాంపిటీటివ్ సక్సెస్. 

కుంభ రాశి వారికి ఈ కాలం లో ఆర్థిక , కుటుంబ విషయాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఆస్తి విలువలు తగ్గడం వంటి ఫలితాలు. మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 

మీన రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పనైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి.