Saturday, March 30, 2024

సంపూర్ణ సూర్య గ్రహణం - 08.04.2024

శోభకృత్ నామ సంవత్సరంలో చివరి రోజైన 08.04.2024 న సంపూర్ణ సూర్య గ్రహణం జరుగ నుంది. 
ఈ గ్రహణం భారత దేశం లో ఎక్కడా కనపడదు కనుక గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. 


కానీ నారాయణి సంహిత లో చెప్పబడినట్లు గ్రహణం ఎక్కడైతే కనపడుతుందో అక్కడ పూర్తి ప్రభావాన్ని ఎక్కడైతే కనపడదో అక్కడ 25 నుండీ 50 శాతం ప్రభావాన్ని చూపిస్తుంది. 

ఈ గ్రహణం మీన రాశి లో జరుగనుంది. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం ఉత్తర అమెరికా ఖండం లో ని మెక్సికో లో మొదలైయ్యి టెక్సాస్ వరకు 13 అమెరికా రాష్ట్రాలలో కనపడుతుంది. కెనడా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, పశ్చిమ యూరోప్ లో కూడా కనపడుతుంది. 

ఇలాంటి సంపూర్ణ సూర్య గ్రహణం మళ్లీ 20 ఏళ్ల తరువాత అంటే 2044 లో ఆగస్ట్ 23 న కనపడుతుంది. 

ఈ తరహా గ్రహణం వల్ల ధనికుల ధనం నష్టమౌతుందని చెప్పబడింది. Apple, Microsoft, Google, Amazon,NVIDIA, Tesla, Meta వంటి సంస్థల షేర్ విలువలు తగ్గుతాయి. Stock Market లో భారీ Negative Correction జరిగే అవకాశం వుంది. America లో Recession ప్రభావం మరింత పెరుగుతుంది. 

భారత స్టాక్ మార్కెట్ పై ఈ విధం గా ప్రభావం కనపడుతుంది : Banking, Energy Sectors మీద భారీ ప్రభావం పడుతుంది. 
అత్యంత లాభాలు ఆర్జించే కంపెనీల షేర్ విలువలు తగ్గుతాయి. Tech Companies 2024 2nd Quarter లో Negative Growth చూపించే అవకాశం. 

నిరుద్యోగ శాతం పెరిగే అవకాశం వుంది. 

ఈ గ్రహణం జల తత్వపు రాశి అయిన మీన రాశిలో , రేవతీ నక్షత్రం లో జరుగుతున్నది కనుక Tornados , Floods సంభవించవచ్చు. సముద్రం లో ప్రమాదాలు జరిగే అవకాశం. Sea Transportation ప్రభావితం అవుతుంది. 

భారత దేశం లో ఈశాన్య భారత దేశం లో ఆలర్లు మళ్లీ ప్రబలే అవకాశం వుంది. 

ఈ గ్రహణానికి దగ్గిరలో శని కుజుల యుతి అతి దగ్గిరకి చేరుతుంది (Deep Conjunction). ఇందు వల్ల ఉత్తర భారత దేశం లో ప్రజాందోళనలు , పోలీసు చర్యలు అందువల్ల ప్రాణ నష్టం జరుగొచ్చు. 

ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో చైనా తో యుద్ధ వాతావరణం అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చు. 

గ్రహణ దుష్ప్రభావం దేశం మీద, వ్యక్తిగతం గా పడకుండా వుండడానికి ప్రతీ ఒక్కరూ రుద్ర పారాయణం, విష్ణు సహస్ర నామ పారాయణం , ఏకాదశ రుద్రాభిషేకం వంటివి చెయ్యాలి. 

ఈ గ్రహణ ప్రభావం వల్ల : 
మేష రాశి వారు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రహస్య శత్రువుల వల్ల ప్రమాదాలు వున్నాయి. జాగ్రత్త.
 
వృషభ రాశి వారు : మోసం చేసే మిత్రులు వుంటారు. కానీ ఈ గ్రహణం మంచే చేస్తుంది. 

మిధున రాశి వారు పై అధికారుల తో మాట పడకుండా పని పై శ్రద్ధ పెట్టాలి. కొందరి కి అవమానాలు, అప్రతిష్ట. 

కర్కాటక రాశి వారు : గురు , దైవ దూషణలు చేయ కూడదు. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. 

సింహ రాశి వారు : అనుకోని నష్టాలు వున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

కన్యా రాశి : భార్య ఆరోగ్యం ఆందోళన కలిగించచ్చు. భాగ స్వాములు మోసం చేయ వొచ్చు. 

తులా రాశి : గ్రహణం వల్ల ఆరోగ్య లాభం, శత్రువుల పై విజయం. 

వృశ్చిక రాశి : సంతాన విద్యా/ ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కోపావేశాలకు దూరం గా వుండండి.

ధను రాశి: మనః శాంతి తగ్గుతుంది. బంధువుల తో విభేదాలు. చదువు విషయం లో శ్రద్ధ పెట్టాలి. 

మకర రాశి: ప్రయాణాల వల్ల లాభం. తోడబుట్టిన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొందరికి ప్రమోషన్ లు, కోరుకున్న చోటికి transfer లు. 

కుంభ రాశి : ధన సంబంధమైన ఆన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆహారం సమయానికి తీసుకోవాలి.

మీన రాశి: ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆందోళనలు ఎక్కువౌతాయి. 

అందరూ చేసుకోవలసిన పరిహారాలు : 
శివ / విష్ణు ఆరాధన వల్ల సమస్త దోషాలు ఉపశమనం అవుతాయి. 

శుభం భూయాత్ 

శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

Wednesday, March 20, 2024

క్రోధి నామ సంవత్సరం - 09.04.2024 నుండీ 29.03.2025 వరకు - గ్రహ కూటముల ఫలితములు

ఈ సంవత్సరం కర్కాటకం లో కుజ స్థంభన , 2 పంచ గ్రహ కూటములు, 4 చాతుర్గ్రహ కూటములు, 1 సష్ట గ్రహ కూటమి జరుగుతాయి. వీటి వల్ల దేశారిష్ట యోగాలు ఏర్పడుతున్నాయి.

ఈ సంవత్సరం చివరి రోజున అంటే 29.03.2025 న మీన రాశి లో సూర్య గ్రహణం తో పాటు సష్ట గ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఈ సూర్య గ్రహణం భారత దేశం లో కనపడదు. కానీ సష్ట గ్రహ కూటమి వల్ల ప్రపంచం మొత్తం మీద దుష్ప్రభావం వుంటుంది.

ప్రభుత్వం వారు అందరి బాగు కోసం షడ్ గ్రహ యోగ శాంతి చేయించడం మంచిది.

గ్రహ కూటముల వలన కలుగు ఫలములు

యోగాచ్చతుర్గ్రహాణాం సామంత భయం నిరంతరంభవతి ।
పంచగ్రహాఘ్నంతి సమస్త భూపాన్ షట్చ్ గ్రహాః ఘ్నంతి సమస్తదేశాన్ ॥

ఏప్రిల్ 10-13, 23-24 మధ్య మీనంలో చాతుర్రహ కూటమి వలన హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాలలో నాయకులకు అరిష్టం. కాశ్మీర్, పాకిస్తాన్లలో సమస్యలు. ధరలు విపరీత  హెచ్చు తగ్గులు, ప్రజానష్టం కలుగును

* మే 31 నుండి జూన్ 12 వరకు వృషభంలో చాతుర్రహ కూటమి వలన గుజరాత్,ఇరాన్, రష్యా, స్విస్-పోలాండ్ పరిసర ప్రాంతాలలో నాయకులకు అరిష్టం, అతివృష్టి, వరదలు వచ్చును. వ్యాపారాలు స్థంభించుట, సస్యహాని, ప్రజారిష్టము కలుగును.

• జూన్ 5,6,7న వృషభంలో పంచగ్రహకూటమి వలన కాశ్మీర్, ఉత్తరీశాన్య రాష్ట్రాలలో ముఖ్య
పదవులలో ఉన్న నాయకులకు ప్రాణగండం. (ఉదా :11-ఏప్రిల్-2011 మీనంలో పంచగ్రహకూటమి(చం+కు+బు+గు+శు), సప్తమంలో శని సంచారణ సమయంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండు గారు వాతవరణ కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో కాలంచేశారు)

•మార్చ్ 15 నుండి 28 వరకు మీనరాశిలో చాతుర్ధహ కూటమి వలన ఉత్తరాదిలో నాయకులకు అరిష్టం కలుగును. మార్చ్ 28 సాయంత్రం నుండి 29 సాయంత్రం వరకు మీనంలో పంచ గ్రహ కూటమి వలన రాజులకు ప్రాణగండం, అరిష్టము, రాహువుతో కలిసి 5 గ్రహములు ఉండుటవలన వానలు సరిగా పడవు. ప్రజలు మనోవ్యధతో, అస్తవ్యస్తమై వానరులవలె ప్రవర్తించెదరు.

•మార్చ్ 29 సా. 7:40 ని॥ల నుండి మీనరాశిలో రవి + చంద్ర + (బుధ) + (శుక్ర) + శని + రాహువుల
షష్టగ్రహ కూటమి 30న సా. 4:34 ని॥ల వరకు ఉండును (20 గంటల 54 నిముషాలు). దీని
వలన సమస్త దేశాలకు విపత్కర పరిస్థితులు కలుగును. బుధ, శుక్రుల వక్రం వలన అనర్థాలు
జరుగును. ఈరోజున సూర్య గ్రహణం కూడా ఉన్నది. భారతదేశంలో కనపడదు. 
ఉత్తర రష్యా, ఐరోపా, వాయువ్య ఆఫ్రికా దేశాలు, గ్రీన్ల్యాండ్, తూర్పు కెనడా, ఈశాన్య అమెరికా, ఆర్కటిక్ ప్రాంతాలలో కనిపించుటవలన, అక్కడ ఊహింపని దుష్పరిణామాలు కలుగును. 

'శాంతి కమలాకర గ్రంథములో : 
"గ్రహషట్కసమాయోగే మంత్రిణాం మరణం భవేత్ | పశ్వశ్వాది భయం
సర్వం సంకరాదిజనక్షయః ॥ పట్టరాజ్జో వినాశోవా మహాభయమథాపివా" 

అని ఉన్నది. ప్రభుత్వము వారు దేశక్షేమం కొరకు, శాంతి కమలాకరము-మదనరత్నము గ్రంథములలో చెప్పిన విధముగా, "షద్దహయోగ శాంతి" చేయించుట మంచిది.' 
( ఉదా : 25-డిసెంబర్-2019న సా. 4:39 ని॥ల నుండీ 27 డిసెంబర్-2019 రా. 11:43 వరకు (55 గంటల 4 నిముషాలు) ధనుస్సులో షష్ఠిగ్రహ కూటమి, సూర్యగ్రహణం కలిగిన తదుపరి కరోనా వల్ల ప్రపంచదేశాలు విలవిలలాడాయి. )

Tuesday, March 19, 2024

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మీన రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ జీవన కారకుడైన గురుడు 3వ ఇంట సంచారం. రాహువు కేతువులు అనుకూలసంచారం లేనందున మీకు స్వవిషరాయంలో ధైర్యం తక్కువ. ధనాదాయం అనేకరకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్యలేక స్త్రీమూలకంగానే మీజీవితం నిలబడును. శారీరకముగా నిరుత్సాహము. దిగులు ఔషధసేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. 
మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్ధిక చికాకులకు లోనగుట. 

ద్వితీయార్ధం నుండి యోగ ఫలములు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీరపోషణార్ధం ఇష్టకార్యసిద్ధి, కుటుంబసౌఖ్యం. ధన లాభాలు,సర్వతో ముఖాభివృద్ధి, తీర్ధయాత్రా ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాదులలో లాభం. భార్యా, పిల్లలు, కుటుంబంపై లోలోపల  అధైర్యంచెందుటకలుగును. 

కొన్నిసందర్భములలో శత్రువులే మిత్రులగుట, పుణ్య క్షేత్రాది దివ్యసందర్శన భాగ్యంచే కొంత మనఃశ్శాంతి చేకూరును. ఎట్టి లోటుపాట్లు కలుగవు. గౌరవం నిలబెట్టుకొనుటకే వ్యయం. మీరు సాంఘికంగా ఉండవలసిన వ్యక్తులగుటచే శతృభీతి హెచ్చును. దైవభక్తి, శక్తి, బంధువర్గములో ప్రత్యేకత కలు గును. మొత్తం మీద అన్నివిధాలుగా అందరికీ ఈ సం॥ యోగదాయకంగా లాభ
దాయకంగా ఉండును. 

ఏల్నాటి శని జన్మరాహువు ఉన్నప్పటికీ గురుబలం వల్ల ముందుకు పోగలరు. ఉద్యోగస్తులకు అనుకూలసమయమే. ఆదాయంకు మించిన ఖర్చులు చేయుదురు. గృహంలో శుభకార్యములు కలిసివచ్చును. ధైర్యం పెరుగును.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన సం॥రం మీ పనికితగ్గగుర్తింపు. తెలివి తేటలు సద్వినియోగపడును. జీవనలాభం, ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుచును. గత సం॥కంటే అనుకూలసమయం.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కుంభ రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కారకుడైన గురుడు వృషభంలో శని జన్మంలో ఉండుటచే మీ గృహకుటుంబ పరిస్థితులు సాంఘిక ముగాను, గృహ సంబంధముగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రధమార్ధంలో బాగుంటుంది.
ఏపని తలపెట్టినా అవలీలగా పూర్తిచేయగలరు. సెప్టెంబర్ నుండి అగ్నిభయము.దొంగల వలన భయం. వృధాగా శ్రమపడుట, ప్రయాణములందు కష్టములు,నష్టములు ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు. కావున దైవధ్యానం చేయాలి. నామ,జపం వ్రతముచే వెలుగు నీడలుగా పరిణమించిన మీ జీవితం ధన్యత నొందును.

మీ ఆరోగ్యం చక్కగా చూచుకొనేది. గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమితం లేకఏమి మాట్లాడుచున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పటుత్వం దిగజారును. ధాతుబలంతగ్గును. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలకు లోటురాదు. ప్రతి పని లాభదాయకముగా కన్పించినా లోలోపల పడే బాధలు దేవుని కెరుక అన్నట్లుండును. అధికార వర్గము, బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయును. ఎంతకష్టపడి సంపాదించినా చివరకు ఏనుగు మ్రింగిన వెలుగ
పండుమాదిరి అనిపించును. మీలోగల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైన తప్పించుకుంటారు. 

గౌరవము నిలబడినా ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు.ఏల్నాటి శని ప్రభావం మీపై దుష్ప్రభావం చూపించును. ఆరోగ్యభంగములు. 

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగష్టువరకు పరిస్థితులు అనుకూలం. ఊహించని సమస్యలు. జీవితంలో మరచిపోలేని సంఘటనలు జరుగును.  మీ శక్తి సామర్ధ్యములు మిమ్మల్ని రక్షించలేవు. బంధుమిత్ర అరిష్టములు. నష్టము.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మకర రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడు గురుడు 5వ ఇంట, లగ్నాధిపతి శని 2వ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బేలన్సుగా ఉండును. పట్టుదల ఎక్కువ. 

ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముఖాలుగా చేతికందును. ఒడిదుడుకులు లేని జీవితమైఉండును. మీమాట, ఆడవారిమాట ఒకటైరాణించును. మీ నమ్మకం,
మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారం, పుణ్యనదీ స్నానం. పుణ్యకార్యాలు చేయుదురు. ఎంత ఆదాయమో అంత ఖర్చుఅగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారులు వలన కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్నపానీయములు స్వశక్తి సామర్ధ్యములపైకి రాగలుగుట జరుగును. మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును. 

మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారంకలుగును. మీలో దైవత్వం, పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యంఉండదు. గతసంవత్సరం వలెనే ఉంటుంది.స్త్రీప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కల్గించును. సద్దోష్టులు చేస్తారు. ధర్మ బుద్ధితో ఉంటారు. అన్నిరంగాల వార్కి యోగ్యకాలమని చెప్పవచ్చు. స్తిరాస్తులు కొంటారు. గృహమార్పులు, స్థానమార్పులు, పాతగృహంలో మార్పులు, స్వల్పంగా దొంగల వల్ల నష్టాలు, ప్రయాణాదులలో ఇబ్బందులు, సోదరమూలక నష్టాలు.

ఏల్నాటి శని ప్రభావం కొంత తగ్గుటచే ఉద్యోగస్తులు గతంలో ఉన్న సమస్యల నుండి బయట పడుదురు. మీపై ఉన్న కేసులు తొలగును. పై అధికారుల మన్ననలచే ప్రమోషన్తోకూడిన బదిలీలు జరుగును. స్త్రీలు సంతోషంతో ఉందురు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవనం బాగుండును. ఏల్నాటి శని ప్రభావం తగ్గును. రాహువు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైనకుటుంబ జీవితం. సాంఘికంగా, మానసికంగా ఉన్నతస్థితిలభించును. ఈర్ష్య అసూయ మీ పై ఉండును.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో ధనుస్సు రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు 6వ ఇంట, రాహువు, కేతువులు 4,10స్థానములలో ఉండుటచేతను, శనిస్థితి యోగించును. అన్నిరంగములో తమ జీవితమునకు విలువతెచ్చుకుంటారు. అధికారవర్గములో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. ధైర్యసాహసములు ' పెరుగుట, కొన్ని శక్తులు సమకూరుట వల్ల ఆత్మీయతను పెంపొందించుట సంఘంలో మంచి స్థానము. 

బంధుమిత్రుల ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివి తేటలను అందరు గుర్తించెదరు.
మీరుచేయుపనులకు, గృహజీవితంలో నరఘోష ఎక్కువ. ఎంతటి ధనవ్యయంమైనా లెక్కచేయక విజయంసాధించుట, సొంతవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్దఎక్కువ. మీ వాక్ప్రభావం గొప్పది. మీరుమాట్లాడే మాటలు అందరికి రుచించును. ప్రతీ పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబ సమస్యలు తప్పవు.

కుటుంబ వ్యక్తుల వల్ల ధనవ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతలు మూలకంగా ధనవ్యయంతప్పదు. సోదరులనుకునేవారి వల్ల ధననష్టం. ఊహించని సమస్యలలో ఇరుక్కొనుట, గురుబలంవల్లవాటినుండి బయటపడుదురు. 

 కుటుంబసమస్యలువల్ల ప్రతీచిన్నవిషయాన్ని గమనించి మసులుకోవలెను. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు, రాహువుల ప్రభావం వల్ల శని ప్రభావం వలన జీవన సౌఖ్యం, సాంఘికంగా, మానసికంగా ఉత్తేజంతో జీవించగలరు. కాని కొంతమేర జాగ్రత్త అవసరం. మీ ధైర్యమే మీకు రక్షణ.

క్రో ధి నామ సంవత్సరం (2024-25) లో వృశ్చిక రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ గౌరవకారకులైన గురుడు 7వ స్థానంలో సంచారం.  రాహువు, కేతువులు 5,11స్థానములలో సంచరించుట,  అన్నిరంగములలో జయమగును. మీ ఆశయములు మనోవాంఛలు సిద్దించును.

ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా సాగి ఫలించును. లోగడ వదలివేసిన వ్యవహారాలు కలసివచ్చును. అధికారుల యొక్క అనుగ్రహం, బాకీలు   వసూలగుట, మహోన్నతికి రాగలగుట జరుగును. అర్ధాష్టమ శని ప్రభావం వున్ననూ జీవనము మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లు జీవితాధిక్యత, అన్నిరంగాలలో ఉన్నతస్థితి, ధనాదాయంనకు స్వల్ప అవమానకరమైనమాటలు, పనులు, ఇతరులకు బాధకలిగించేవి చేస్తేనే గాని మీకు జయం చేకూరదు. ఆడవారి ప్రోద్భలములచే ఉత్సాహ ప్రోత్సాహాలుసిద్దించును. మానసికధైర్యం, సూక్ష్మబుద్ధి, యోచనాశక్తితో మీరు ముందుకుపోగలరు. దూరప్రయాణాలు, తీర్ధయాత్రలు చేయుట, స్థిరాస్థివృద్ధి జరుగును. 

శని, కుజులువల్ల కుటుంబ కలతలు, భార్యాబిడ్డలు వలన మధ్య మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గురుబలం వల్ల వాటిని చివరినిముషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయిన పనులతో జయం ఆధ్యాత్మిక సాధన, పుణ్యనదీస్నానం, అధికారప్రాబల్యం. వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును.మీమాటకువిలువ, భూ, గృహాధిపేచీలుతొలగి ఆనందమైన జీవనం లభించును.

ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, గృహనిర్మాణాలు కలిసివచ్చును. నూతన వాహనములు కొంటారు. జీవితంలో సమస్యలు తొలగి సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కలిసి దూరప్రయాణాలుచేస్తారు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగా
ఉంటుంది. కొన్నివర్గాలవార్కిబాధలుతప్పవు. శుభాశుభమిశ్రమఫలితాలుండును.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో తులా రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవికబలం హెచ్చుగానుండును. ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 8వ ఇంట సంచారం. ఏపనిలోనైనా  ఆత్మవిశ్వాసముతో ముందుకు పోగలుగుట, రాహు, కేతువులు, బలము వలన  శని, 5వ స్థానంలో ఉండుట విశేషించి యోగమును అనుభవిస్తారు. శతృవులు అంతరించుట వ్యవహారాదులలో జయం. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలించును. 

ఏ వృత్తివ్యాపారాదులలో ఉన్న వారలకైనా బాగుండును. ఒడిదుడుకుల నుండి బయటపడుదురు. రావలసిన సొమ్ములు వచ్చును. గృహసబంధరీత్యా లాభములు, నూతన గృహములు నిర్మించుట కనీసం ఇండ్ల స్థలమైన కొంటారు. అపనిందలు వంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయ క్షేమం కలుగును. సాంఘికాభివృద్ది, మనోవాంఛలు నెరవేరి, స్వశక్తి సామర్థ్యముచే పైకిరాగలరు. ఒక్కో సమయాన ఆదాయమునకు మించిన ఖర్చులు చేయుదురు. 

శతృత్వములు వచ్చినా అణచివేస్తారు. నూతన ప్లానులు పోకడలచే సంఘంలో గౌరవాదులు లభించును. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహంలో వివాహాది శుభకార్యాలు కలసి వచ్చుట, దాంపత్యానుకూలత, గృహ జీవితానందం కలుగును. ప్రతీచిన్నవిషయమునుమీకు అనుకూలంగా మలచుకొందురు. 8వ ఇంట గురువు వలన గృహ సంబంధమైన ఒత్తిడి ఒడిదుడుకులు ఆర్ధికంగా సర్దుబాటులేకున్ననూ ఏదోలా ధనము చేతికి అందును. మీలో గల నిజాయితీ, ప్రవర్తన కొంతమేర
కష్టములనుండి కాపాడును. పనివారలు వలనదొంగలు వలన మోసపోవుదురు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, మిమ్మల్ని రక్షించును. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం. మంచిఅభిప్రాయంకలుగును. అన్నివిధములుగా బాగుండును.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కన్యా రాశి వారికి ఫలితాలు

ఈ రాశి వారలకు గురుడు భాగ్యమందు సంచారం, శని ఆరింట బలీయుడు, ఈ సం॥రం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉండును. మీలో ఎన్నో రకముల సామర్ధ్యాలున్నా ముందుకు వెళ్ళ లేకుండుట జరుగును. అకారణముగా మాటలు పడుట, రావలసిన బాకీలు రాకుండుట, ఆదాయమునకు అంతరాయం. లోలోపల అధైర్యంఏర్పడును. 

రక్తబంధు వర్గములో కలతలు. అశాంతి, మనస్సు ఆందోళనచెందుట, మందత్వం, గుప్తశత్రుభాధలు, స్వంతపనుల కంటే పై వారి పనులలో శ్రద్ధ, లేనిపోని అనుమానాలకు మనస్సులోనగుట, మీ సొమ్ముతిని ఉపకారం పొందినవారే శత్రువులుగా అగుదురు. ఆడవారి ప్రేరేపణచే జరుగు పనులలో ఆందోళన హెచ్చును. ధనవ్యయంమీదకొట్టివేయును. పుణ్యక్షేత్రసంచారం.

గృహమార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి. ఔషధసేవలు చేయుట, చోరభయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదులలో మార్పులు, ఏదోరూపంగాధనంచేతికి అందుచూ అనేకరకములుగా సొమ్ము హారతి కర్పూరంవలె హరించును. శారీరక మానసిక బాధలు తప్పవు. ఆందోళనలు హెచ్చును. వ్యసనాలు ద్వారా ధనవ్యయం. వృధాగా కాలక్షేపం చేయుట, శని బలీయంగా ఉండుటచే కొన్నివిషయాలలో ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ధైర్య సాహములే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును.

భార్యాభర్తలమధ్య ఒక్కోసారి మాటమాటా పట్టింపులు, విడిపోయేంతవరకు సమస్యలు వచ్చును. బంధుమిత్రుల అరిష్టం. కావలసినవారు దూరమగుట జరుగును.మొత్తం మీద ఈ సం॥రం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుండును.

కొందరికి యోగం, మరికొందరి అవయోగం. శని బలంగా ఉన్ననూ రాహు, కేతువులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోనికిరావు. ఊహించని సమస్యల వల్ల చాలా ఇబ్బందులు.

క్రోధి నామ సంవత్సరం (2034-25) లో సింహ రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడైన గురుడు పదవరాశిలో రాహువు అష్టమందు ఉన్నందున సం॥రం ప్రారంభం నుండి నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కృంగదీయును. శరీరములో ఆరోగ్యబాధలు,నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసినవి తప్పక పోవుట, ఎంతమంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం, నెపముగా పరిణమించును.

అనేకఊహించని సంఘటనలు జరుగును. ప్రారంభంలో కష్టనష్టాలుగా కనిపించినా చివరకు ఆదాయం, రాజ్యపూజ్యత కొంత మేర కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు లభించును. మీయొక్క తెలివితేటలు వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడుదురు. కళత్ర, సంతాన పీడలు, ధనవ్యయం,ప్రయాణాదులలోధననష్టం, చోరభయం, ప్రతీ విషయంలో ఆంతరంగిక భయం కలుగును. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్నకార్యము తలపెట్టినా ఆడవారి సలహా తీసుకొనుట మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు
సాగును. 

బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్దితో మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకొంటారు.సాంఘికంగానూ, ఆధ్యాత్మికముగా కూడా దైనందిన కార్యములో అభివృద్ధి కన్పించును. ఒక్కోసారి ఆవేశపూరితంగా వ్యవహరించుటచే నష్టపోవుదురు.

మొత్తంమీద ఈరాశి స్త్రీపురుషాదులకు గ్రహసంచారం మిశ్రమంగా ఉన్నందు వలన అన్నివర్గాల వార్కిఇబ్బందులు. మీ యొక్కశక్తి సామర్ధ్యాలు, తెలివి తేటలు,ధైర్యసాహసాలఫలితం ఉండదు. ప్రతీచిన్నవిషయం యోచించి మసలు కోవలెను.

Monday, March 18, 2024

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కర్కాటక రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారుకుడైన గురుడు మంచిస్థానములందుండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు. 

వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవప్రతిష్ఠలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి, అధికార వర్గముగా ఉపకారలాభాలు కలుగును. గృహనిర్మాణాది పనులు కలసివచ్చును. మీ జీవన మార్పులు వలన సంఘంలో గౌరవం. మంచిఫలితాలు ఇచ్చును. నూతనప్రయత్నములు ఫలించును.

బంధువర్గంలో మీప్రాముఖ్యత హెచ్చును. అన్నిరంగాలవార్కి జీవనవృద్ధి, రాజ పూజ్యతహెచ్చును. కుటుంబఔన్నత్యం. చిత్రవిచిత్ర వస్తు వస్త్ర మూలక ధనవ్యయం కలుగును. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును. అష్టమ శని వల్ల స్వల్పంగాఅనారోగ్యం, రక్తమార్పు, ధాతుబలం తగ్గుట, కళత్రవంశ పీడలు కలుగును. వాహనప్రమాదాలుగాన జాగ్రత్తగా, ఆచితూచి ప్రయాణాలు చేయవలెను. సోదరసోదరీలు అనుకూలత, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవనరంగములో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యములు,
భూగృహాదులుకొనుటలేదా పాతగృహంలో మార్పులు, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి, గుప్తస్త్రీసమావేశములు, వినోద విహారాదులు కలుగును.

పుణ్యక్షేత్ర సందర్శనములు, మనఃశ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైన జీవనం. దాంపత్య సౌఖ్యం.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం. ఊహించని విధంగాజీవిస్తారు. ప్రతిఒక్కరిదృష్టి మీపై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం లభించును. మీయొక్క శక్తిసామర్ధ్యాలు అందరికీతెలిసి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. అష్టమశనిప్రభావం స్వల్పంగా ఉంటుంది.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మిధున రాశి వారికి ఫలితాలు

ఈ రాశి వార్కి బుద్ధి, ధనము, కుటుంబ కారకుడైన గురుడు, బలీయంగా ఉండుట, శని, రాహువుల కూడా బలంగా యుండుటచే ఉన్నతస్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చును. ధనాదాయం చాలాబాగుండును. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం నూతన గృహలాభములు, కట్టడములు, గృహములో వివాహాది శుభకార్యములు ఆనందంగా జరుగును.

నూతన బాంధవ్యములు, పుణ్యక్షేత్రములకు వెళ్ళుట, వాహనలాభము, మనస్సుకు సంతోషమైన పనులు చేయుట, తమ యొక్క మాట చమత్కార, యుక్తి ప్రభావము చేత ఎంతటి వారలైన లోబరుచుకొనుట కలుగును. గత సంవత్సరంకంటే విశేష యోగం అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగును. తోడు లేకుండా ఏ పనికలసిరాదు. స్త్రీప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైన సాధిస్తారు. 

మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని నడిపించేది. గతంలో ఉన్న జీవితాశయాలు నెరవేరును. లోగడ చేసిన ఋణబాధలు తొలగును. దైవీకమైన శక్తి, బలం ఒకవిధమైన ఆత్మీయత కలిగించును. శనిబలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. చేయు కృషి, వ్యవహారాలలో మార్పులు, క్రమేపి శరీర ఆరోగ్యం అంతరించుట స్త్రీ మూలక సంతోషము. కుటుంబ సంరక్షణ, నూతన కార్యప్రారంభములు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్థిలో మార్పులు భూగృహాదులు వలన తగిన ఆదాయం చేకూరును. అ ప్రయత్న ధనలాభములు, రెండు మూడు విధములైన ఆదాయం కలుగును. సాంఘిక సేవా కార్యములు చేయుదురు. దూరప్రయాణాలు.

మొత్తంమీద ఈరాశి స్త్రీ,పురుషాదులకు మంచియోగకాలంగా చెప్ప వచ్చును. గత సం॥రం కంటె మెరుగ్గా ఉండును. మీ యొక్క సామర్ధ్యములు, తోడుగా గ్రహబలం తోడగుటచే మీకు ఎదురులేకుండా పోవును. అనుకున్న జీవనం, సౌఖ్యం, ఆనందంగా జీవించగలరు. సమస్యలు తొలగును. సౌఖ్యము.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో వృషభ రాశి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము సంపత్తు కుటుంబ మునకు కారకుడైన గురుడు జన్మంలో కలసినందున సప్తమంలోశని రాజ్యస్థానంలో ఉండుట. ఈగ్రహ సముదాయ బలంచే జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును. అయినా శుభాశుభ ఫలితములేఇచ్చును. సంసారజీవితంలో ఆనందం.|ఉత్సాహప్రోత్సాహములు, మనోనిశ్చితకార్యములు నెరవేరుట జరుగును. స్థిరాస్థిని వృద్ధిచేయుట, భూగృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందుట, అధికారఅనుగ్రహం,స్త్రీమూలకలాభం,అన్యస్త్రీలాభాలు, విలవైనవస్తువులు కొనుట,

కొన్ని విషయాలలో అపనిందలు, అపవాదులు ఎదుర్కొనవలసి వచ్చును. ఆకస్మిక నిర్ణయాలువల్ల బుద్ధిచాంచల్యం తేజోనాశనం. ఇతరులు వలన మోసపోవుటయు, ఆందోళన, ధననష్టం, బంధుజనులు వలన దుఃఖము, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదాలు తప్పవు. విదేశీ ప్రయాణాలున్నవారికి అనుకూలత త్వరగా వీసాలభించును. నూతనవ్యాధులు, భయాందోళనకలిగించు సంఘటనలు. ప్రయాణాలందు ఆరోగ్యభంగములు, అలసట, భార్యకు స్పల్పంగా ఆరోగ్యభంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట మనో దుఃఖములు, సోదర మూలకంగా విరోధాలు, నేత్రఉదర, సంబంధవ్యాధులు, మిత్రవిరోధాలు కలుగును.

కుటుంబంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును. కొన్ని విషయములలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు మీ బలమే కొండంత అండ. మీ తెలివితేటలు, ఎత్తుగడలతో కొన్ని కార్యములు సాధించుకోగలరు. తీర్ధయాత్రాఫలప్రాప్తి.

మొత్తం మీద ఈరాశి స్త్రీపురుషాదులకు శుభాశుభమిశ్రమఫలితాలు వచ్చును. కొంతమందిని అనుకూలత మరికొంతమందికి నిరుత్సాహం. ఎంతప్రతిభ కనపరచినా ఫలితంఉండదు. మీ శక్తిసామర్ధ్యాలు ఏమాత్రం పనిచేయవు. ఏపనితల పెట్టినాచాలాశ్రమపడి విజయంసాధిస్తారు. సంఘజీవనంబాగుంటుంది. సౌఖ్యం.

క్రోధి నామ సంవత్సరం ( 2024 -25) లో మేష రాశి ఫలితాలు

క్రోధి నామ సంవత్సరం 09.04.2024 నుండీ 29.03. 2025 వరకు 

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు భాగ్య, వ్యయాధిపతి గురుడు ధనస్థానములో ఉండుట శని 11వ ఇంట బలీయంగా, రాహువు, కేతువులు వ్యయం, షష్టములందు ఉన్నందువలన అన్నివిధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనం చేయు వారికైనా ధనాదాయం బాగుండును. తమ అమూల్య కార్యముల పట్ల విజయం, వ్యవహార నిపుణత. యోచనాశక్తి, శత్రుమూలకముగా అనర్ధములు, సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్ని పరిష్కారమునకు వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నా, హోదా, గౌరవంగల వ్యక్తులు పరిచయంవల్ల గృహ జీవితానందం మంచి ప్రోత్సాహం కలుగును. 

ఏదోవిధంగా ధనము చేతికందును.ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళవలె ఖర్చ గును. చేతిలో సొమ్ము నిలవదు. ఋణాలు చేయవలసి వచ్చును. తీర్ధయాత్రలు చేయుదురు. ఆప్తబంధుమిత్రుల మరణములు కొంత బాధకలిగించును. కర్మలు
కూడా చేయవలసివచ్చును. ఆకస్మికంగా, అనుకోకుండా దూర ప్రయాణములు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండును. గతంలో ఉన్న రోగములు తగ్గును.

సుఖమైన, ఆనందమైనజీవనం అనుభవించెదరు. సంతానంవలనసౌఖ్యం,గృహంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును. స్థలం కొనుట, లేదా గృహం కొనుట తప్పక జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధకార్యములు రెండవ నెల నుండి పూర్తగును. గృహనిర్మాణలాభములు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చును.

గురు,శనులబలం బాగుంది. రాహువువల్ల సూతకాలు పితృ, మాతృ సోదర వర్గ అరిష్టములు కలుగును. జీవితంలో ఔన్నత్యములు కలుగును. అనుకున్నది సాధించ గల తపన పెరుగును. మనోబలంతో కార్యలాభం , జీవనసౌఖ్యము కలుగును.

Sunday, March 17, 2024

Pawan Kalyan Winning in Pithapuram - నిన్నటి పోస్ట్ కి అనుబంధం గా - ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ - పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు :


నిన్నటి పోస్ట్ కి అనుబంధం గా - ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ - పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు :


సెప్టెంబర్ 2, 1967 ఉదయం 04:10 కి బాపట్ల లో పవన్ కళ్యాణ్ జన్మించినట్లు తెలుస్తోంది . ఈ వివరాలతో జూన్ 4 ,2024 న తిథి ప్రవేశ చక్రం లో గ్రహ స్థితులు, బలాలు ఎలా వున్నాయో పరీక్షిస్తే ఈ క్రింది విధమైన అంచనాకి రావడం జరిగింది :

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఖచ్చితం గా గెలవబోతున్నాడు. ఇంతకు ముందు ఎవరూ గెలవనంత మెజారిటీ తో గెలవబోతున్నాడు.

దశమ ఏకాదశాధిపతి శని శ్వ స్ధానం లో ఏకాదశ భావం లో వుండడం విజయానికి బలమైన కారణం.

విజయాన్ని సూచించే ఏకాదశ భావం సర్వాష్టకవర్గు లో అతి బలం గా (41/56) వుండడం వల్ల 200% విజయం సాధిస్తాడని చెప్పొచ్చు.


ఏకా దశాధిపతి శని కి ఆ రోజు తిధిప్రవేశ చక్రం లో లగ్న, ఘటీ లగ్న , హోరా లగ్నాల తో సంబంధం ఉన్న కారణం గా మహా యోగం ఏర్పడింది.


అలాగే పంచమ , నవమాధిపతులైన రవి గురువుల యుతి వల్ల రాజ యోగం ఏర్పడింది.

ఆ రోజు జాతకం లో బుధుడు 6 వ భావాధిపతి అవ్వడం వల్ల పోటీ దారుని సూచిస్తాడు. ఈ బుధుడు నవమాధిపతి గురువు తో గ్రహ యుద్ధం లో ఓడిపోయి వున్నాడు. ఇది విజయాన్ని సూచించే ఇంకొక శుభ యోగం.

Saturday, March 16, 2024

Andhra Pradesh Assembly/Loksabha Elections - 2024 - Who will Win ???

 

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది.

మే 13 న 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.
జూన్ 4 న ఎన్నికల ఫలితాలు ప్రకటింపబడతాయి.

మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 21 డిసెంబర్, 1972 న ఉదయం 01:32 ( 20 వ తారీకు అర్ధరాత్రి దాటిన తరువాత ) కి పుట్టినట్టు తెలుస్తోంది.

ఫలితాలు వెల్లడి అయ్యే జూన్ 4 వ తారీకు న జగన్ జాతకం ఎలా వుందో తిథి ప్రవేశ చక్రం ద్వారా అంచనా వేస్తే ఈ క్రింది విధంగా వుంది :

లగ్నం సింహ రాశి అయ్యింది. లగ్నాధిపతి రవి దశమ స్థానం లో వృషభ రాశి లో గురు ,బుధ , శుక్రుల తో కలిసి చాతుర్గ్రహ కూటమి లో వుండడం గమనించవచ్చు.

ఎన్నికలలో జగన్ విజయావకాశాలు ఈ నాలుగు గ్రహాల కూటమి స్పష్టం చేస్తోంది.

బుధుడు ఏకాదశాథిపతి గా విజయావకాశాలు గురించీ చెప్తున్నాడు. ఈ బుధుడు అష్టమాధిపతి గురువు తో గ్రహ యుద్ధం లో ఒడింపబడి వున్నాడు. ఇది ఒక నెగటివ్ అంశం.

లగ్నం నుంచీ దశమంలో అష్టమాధిపతి గురువు వుండడం మరో ప్రతికూలమైన స్థితి.



అధికారాన్ని సూచించే దశమాధిపతి శుక్రుడు రవి కి అతి దగ్గిరగా వుండడం వల్ల అస్తంగత దోషం లో వున్నాడు. ఇది మరో ప్రతికూలమైన స్థితి.

ఆ రోజున నవమ భావంలో రాహు వుండడం దురదృష్టాన్ని సూచిస్తోంది.

జూన్ 4 వ తారీకు న వున్న గ్రహ స్థితులు జగన్ కి ఏమాత్రం అనుకూలం గా లేవు.

మొత్తం మీద చూస్తే రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి దారుణమైన ఎదురు దెబ్బ తగలడం ఖాయం గా కనపడుతోంది.

Friday, March 15, 2024

మార్చ్ 25,2024 న చంద్ర గ్రహణం - ప్రభావం :

 


ఈ గ్రహణం భారత దేశం లో కనపడదు. ఈశాన్య ఆసియా ఖండం లో, యూరోప్, ఆస్ట్రేలియా,ఆఫ్రికా ఖండాలలో ని చాలా భాగం, ఉత్తర ,దక్షిణ అమెరికా ల లో కనపడుతుంది.

గ్రహణం కనపడే ప్రదేశాలలో 75 నుండీ 100 శాతం ప్రభావం చూపిస్తే కనపడని ప్రాంతాలలో 25 నుండీ 50 శాతం ప్రభావం చూపిస్తుందని నారాయణ సంహిత లో చెప్పబడింది.
గ్రహణం దేశాల ఆర్థిక వ్యవస్థ ల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం కనపడుతోంది.
ఈ గ్రహణానికి దగ్గిర లో టెక్నాలజీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని layoffs చేసే అవకాశం వుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవొచ్చు. ద్రవ్యోల్బణం అధిక స్థాయి కి చేరుకుంటుంది.
ఉత్తర అమెరికా మీద ఈ గ్రహణం ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం వుంది.
భారత దేశం లో పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరలో టెర్రరిస్ట్ దాడులు, వెస్ట్ బెంగాల్ లో మత పరమైన అల్లర్లు జరిగే అవకాశం .

Thursday, March 14, 2024

రేపటి నుండీ కుంభ రాశిలో కుజ సంచారం - శని తో యుతి - ప్రభావం : 

 

రేపు అంటే 15. 03. 2024 న సాయంత్రం 17:20 కి కుజుడు కుంభ రాశి ప్రవేశం చేసి ఏప్రిల్ 23,2024 వరకు ఈ రాశి లో సంచారం చేస్తాడు . ఈ సంచారం లో చెప్పుకోదగ్గది శని తో కుజుడి యుతి . ఏప్రిల్ 9 వ తారీకు న ఉగాది తరువాత ఏప్రిల్ 11 వ తారీకున  శని కుజుల ఖచ్చితమైన  యుతి కుంభ రాశి లో జరుగుతుంది . రెండు ఆధి శతృ గ్రహాలు యుతి లో ఉండడం ప్రపంచానికి అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు . 

ఇంతకు పూర్వం కుంభ రాశి లో శని కుజుల యుతి 1994 వ సంవత్సరం లో జరిగింది.మార్చ్ 14,1994 న ఈ యుతి జరిగింది .  ఈ యుతి వల్ల ప్రజాందోళణలు సంభవించే అవకాశం ఉంటుంది . ప్రభుత్వం వెనుకడుగు వెయ్య వలసి ఉంటుంది . విమాన ప్రమాదాలు జరిగే అవకాశం. 

1994 లో ఈ యుతి జరిగినప్పుడు  సంభవించిన ముఖ్య ఘటనలు : 
మార్చ్ 23 న నార్త్ కెరొలినా లో  రెండు యుద్ధ విమానాలు ఢీ కొని ప్రాణ నష్టం సంభవించింది . 
అదే రోజు మెక్సికో ప్రెసిడెంట్ హత్య కి గురికాబడడం . 
పైన ఉదహరించిన సంఘటనల వంటివి మళ్ళీ జరిగే అవకాశం  వుంది 

ఉత్తర దక్షిణ అమెరికా దేశాల మీద ఈ యుతి ప్రభావం ఉంటుంది .  

వరాహమిహిరుడి కూర్మ చక్ర విధానం ప్రకారం ఈ యుతి ఉత్తర భారత దేశం మీద ఎక్కువ ఉంటుంది . ప్రజానాయకుల కు ప్రమాదం వుంది . ప్రముఖ నాయకుడు ఒకరు హత్యకు గురికావొచ్చు. విమాన దుర్ఘటనలు , అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరగొచ్చు . 

వివిధ రాశుల వారి మీద శని కుజుల యుతి ప్రభావం ఈ విధం గా ఉండొచ్చు : 

మేష రాశి : మిత్రులతో అభిప్రాయభేదాలు / వైరం. ఆదాయం పెరుగుతుంది. మీ విజయాలను చూసి ఈర్ష్య పడేవాళ్ళు ఎక్కువ అవుతారు . 

వృషభ రాశి : ఆఫీస్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి . పై అధికారులు వారు చేసిన తప్పులు మీ మీద మోపే అవకాశం . ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకొంత కాలం వేచి ఉండాల్సి వస్తుంది . 

మిధున రాశి : అదృష్టం తక్కువ గా ఉంటుంది . మీ క్రింద పని చేసేవాళ్ళు మోసం చేస్తారు జాగ్రత్త . తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి . తీర్ధయాత్రలు వాయిదా వేసుకోవడం మంచిది . 

కర్కాటక రాశి : దగ్గిర వాళ్ళు దూరం అవుతారు . మాట్లాడే ముందు ఆలోచించాలి . కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . 

సింహ రాశి : భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి . భాగస్వామ్యుల తో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి . భార్య తో మనఃస్పర్ధలు రావొచ్చు . అరుగుదల లేకపోవడం వల్ల సమస్యలు ఉంటాయి . 

కన్యా రాశి : శత్రువుల పై విజయం సాధిస్తారు . పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు . అప్పులు తీర్చిస్తారు . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . 

తులా రాశి  :  సంతానం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . కోపావేశాలను అదుపులో పెట్టుకోవాలి . ఏ  నిర్ణయమూ తీసుకోలేక ఇబ్బంది పడతారు . 

వృశ్చిక రాశి : తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి . ఇంటికి రిపేర్లు  చేయిస్తారు . విద్యార్థులు అనుకున్న విజయం సాధించలేరు .      

ధనుస్సు రాశి : పోటీ పరీక్షలలో నెగ్గుతారు . ఆట పోటీ లలో విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలతో వ్యవహరిస్తారు . 

మకర రాశి : ఆలోచించి మాట్లాడాలి . ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉంటాయి . మోసం చేసే వాళ్ళు అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటారు జాగ్రత్త వహించండి . కుటుంబ సమస్యలు ఉంటాయి . వివాదాలకి దూరంగా ఉంటుంది . 

కుంభ రాశి : మానసిక ఆందోళనలు ఉంటాయి . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . మెడిటేషన్ చెయ్యండి . ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . దూర ప్రయాణాలు చేస్తారు . 

మీన రాశి : ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆస్తి కొనుగోలు అమ్మకాలు   విషయాల్లో జాగ్రత్త వహించాలి .   

Friday, March 8, 2024

శివాష్టకం


శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।
జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ ।
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ ।
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥
ఓం నమః శివాయ మహాశివరాత్రి శుభాాంక్షలు శుభ శుక్రవారం

Thursday, March 7, 2024

శ్రీ వేద వ్యాస స్తుతి/श्री वेद व्यास स्तुति

శ్రీ వేద వ్యాస స్తుతి

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥ 1

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥ 2

కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్ ।
వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిమ్ ॥ 3

వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణమ్ ।
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహమ్ ॥ 4

అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః ।
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః ॥ 5

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్ ।
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ॥ 6

బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే ।
జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేః ॥ 7

వ్యాసః సమస్తధర్మాణాం వక్తా మునివరేడితః ।
చిరంజీవీ దీర్ఘమాయుర్దదాతు జటిలో మమ ॥ 8

ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేదవిభాజకః ।
కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీగురవే నమః ॥ 9

జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః ।
కృష్ణాజినధరః కృష్ణస్తస్మై శ్రీగురవే నమః ॥ 10

భారతస్య విధాతా చ ద్వితీయ ఇవ యో హరిః ।
హరిభక్తిపరో యశ్చ తస్మై శ్రీగురవే నమః ॥ 11

జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయనందనో వ్యాసః ।
యస్యాస్య కమలగలితం భారతమమృతం జగత్పిబతి ॥ 12

వేదవిభాగవిధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే ।
సకలధృతిహేతుసాధనసూత్రసృజే సత్యవత్యభివ్యక్తి మతే ॥ 13

వేదాంతవాక్యకుసుమాని సమాని చారు
జగ్రంథ సూత్రనిచయేన మనోహరేణ ।
మోక్షార్థిలోకహితకామనయా మునిర్యః
తం బాదరాయణమహం ప్రణమామి భక్త్యా ॥ 14

ఇతి శ్రీ వేదవ్యాస స్తుతిః ।


श्री वेद व्यास स्तुति

व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् ।
पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ॥ 1

व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ।
नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॥ 2

कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतम् ।
वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् ॥ 3

वेदव्यासं स्वात्मरूपं सत्यसन्धं परायणम् ।
शान्तं जितेन्द्रियक्रोधं सशिष्यं प्रणमाम्यहम् ॥ 4

अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः ।
अफाललोचनः शम्भुः भगवान् बादरायणः ॥ 5

शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् ।
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥ 6

ब्रह्मसूत्रकृते तस्मै वेदव्यासाय वेधसे ।
ज्ञानशक्त्यवताराय नमो भगवतो हरेः ॥ 7

व्यासः समस्तधर्माणां वक्ता मुनिवरेडितः ।
चिरञ्जीवी दीर्घमायुर्ददातु जटिलो मम ॥ 8

प्रज्ञाबलेन तपसा चतुर्वेदविभाजकः ।
कृष्णद्वैपायनो यश्च तस्मै श्रीगुरवे नमः ॥ 9

जटाधरस्तपोनिष्ठः शुद्धयोगो जितेन्द्रियः ।
कृष्णाजिनधरः कृष्णस्तस्मै श्रीगुरवे नमः ॥ 10

भारतस्य विधाता च द्वितीय इव यो हरिः ।
हरिभक्तिपरो यश्च तस्मै श्रीगुरवे नमः ॥ 11

जयति पराशरसूनुः सत्यवती हृदयनन्दनो व्यासः ।
यस्यास्य कमलगलितं भारतममृतं जगत्पिबति ॥ 12

वेदविभागविधात्रे विमलाय ब्रह्मणे नमो विश्वदृशे ।
सकलधृतिहेतुसाधनसूत्रसृजे सत्यवत्यभिव्यक्ति मते ॥ 13

वेदान्तवाक्यकुसुमानि समानि चारु
जग्रन्थ सूत्रनिचयेन मनोहरेण ।
मोक्षार्थिलोकहितकामनया मुनिर्यः
तं बादरायणमहं प्रणमामि भक्त्या ॥ 14

इति श्री वेदव्यास स्तुतिः ।

Wednesday, February 28, 2024

ఈ రోజు సంకట హర చతుర్ధి

ఈరోజు బుధవారం సంకటహర చతుర్థి 

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది.అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు.

మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం
అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే  సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం
ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి
ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

* సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం •*
సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానినిపసుపు,
కుంకుమలతో అలంకరణను చేయాలి.మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట
హర చతుర్థి వ్రత కథను చదవాలి.

Tuesday, February 27, 2024

శ్రీ సుభ్రమణ్య తత్వము


శ్రీ సుభ్రమణ్య తత్వము : 
చెడుపై మంచి విజయం సాధించాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో రహస్యం ఏమిటంటే సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు.
కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని.ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీసంవత్సరాగ్ని రూపం.ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

సుబ్రహ్మణ్య స్వామియజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది. అందులోనే శ్రీమహావిష్ణువుకి "స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః" అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.

అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయారు ఉతిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు.

సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథశక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రములో ఉంటుంది.అయితే ఆ కుండలినీ శక్తిని జాగృతం చేయడం సమర్దుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీదేవి, దేవసేనాఅమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు. 

Monday, February 26, 2024

ప్రతీ సోమవారం శివ పూజ - విధానం - ఫలితాలు

ఇలా ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే రుణ బాధలు వదిలిపోతాయి :

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు.

మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.
ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అప్లైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న
 , ఆర్ధిక  సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి.

2. పూజానంతరం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

Saturday, February 24, 2024

మాఘపూర్ణిమ

మాఘపూర్ణిమ :

ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం,
కార్తికం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తికం, మాఘం స్నానాలకు ప్రసిద్ది. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు చేసినట్లే, మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధంగా కనిపిస్తోంది. 

మాఘపౌర్ణమిని మనవారు
మహామాఘి అంటారు. "మాఘే నిమగ్నాహః సలిలే సుశీలే విముక్త పాపాః త్రిదివం ప్రయాంతి" 

మాఘమాసంలో ప్రవహించే  నీటియందు నిలిచి,మంచిమనసుతో స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యమిస్తే పాపవిముక్తులై  స్వర్గానికి చేరుకుంటారు అని ఈ శ్లోకానికి అర్థం. మాఘస్నాన వ్రతం అత్యుత్తమ ఫల దాయకం. కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రం.

మాఘపూర్ణిమ , మహా మాఘి


 ఈ రోజు  మాఘపూర్ణిమ , మహా మాఘి


ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

Thursday, February 22, 2024

నక్షత్ర ఆధారిత ఉపశమన మార్గాలు

నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.
జ్యోతిష శాస్త్రము మరియు కర్మ సిద్ధాంతానికి చాలా అవినాభావ సంబంధము కలదు. మన కర్మలను అనుసరించి మనకు జన్మ లభిస్తుంది. మన కర్మ ఫలాలను తెలిపేదే జ్యోతిషము, జన్మ కుండలి మరియు అందులో గల యోగాలు. మనము అనుభవించే సత్ఫలితము లేదా దుష్ఫలితము అన్ని కూడా కర్మ ఫలాలే. సత్ఫలితాలుంటే అందరికీ సంతోషము. కాని దుష్ఫలితాలు అనుభవించ వలసి వచ్చినపుడు అసలు ఆ దోషమేంటి మరియు దానికి ఏదైనా పరిహారము ఉందా అనే విషయము గూర్చి మనము మనన చేసుకుంటాము. నాకుండే పరిజ్ఞానము మరియు అనుభవాన్ని అనుసరించి దోషానికి పరిహారము లేదు. ఏలనన దోషాలు మన కర్మ ఫలాలు. కర్మ ఫలాలు అనుభవించ వలసిందే. దానికి విరుగుడు లేదు. ఐతే దానికి ఉపశమనాలు ఉంటాయి. ఉపశమనము – పూజలు, జపాలు, దానాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు ఇలా ఎన్నో రకాల ఉపశమనాలు ఉంటాయి. ఈ ఉపశమనాల వలన మనలో మనోబలం పెంపొందుతుంది. భగవంతుని పట్ల నమ్మకము పెరుగుతుంది. మనకు ఎదురగు కష్టాన్ని ఎదుర్కునే శక్తి మనలో వస్తుంది. మనకు ఎదురగు కష్టాలను అత్యంత సునాయాసంగా మనము ఎదుర్కొన గలుగుతాము. ఉపశమనాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనము అత్యంత సులభమైన మరియు ఇతరుల సహాయం లేకుండా మనమే స్వంతగా ఆచరించదగు ఉపశమనాల గూర్చి తెలుసుకొందాము. “లాల్ కితాబ్” అనే గ్రంథము లో కూడా చాలా విధాల ఉపశమనాల గూర్చిన చర్చ ఉంది. ఇట్టి ఉపశమనాలు మరియు ఇతర ప్రామాణిక గ్రంథాలు, స్వతహాగా నాకుండే అనుభవాన్ని జోడించి మీకు కొన్ని సులభమైన ఉపశమన పద్దతులను అందిస్తున్నాను.
ఇట్టి శీర్షికలో మనము ప్రధానముగా జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.

అశ్విని:
అశ్విని నక్షత్రము నాలుగు చరణాలు – చు, చే చొ, ల – అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారందరూ అశ్విని నక్షత్ర జాతకులు. వీరు దేవా గణానికి చెందిన వారు. వీరి నక్షత్రానికి అధిపతి కేతువు. నక్షత్ర అధిష్టాన దేవత అశ్విని దేవతలు. వీరందరూ కూడా మేష రాశికి చెందినా వారు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు. మంగళవారము నాడు ఉపవాస దీక్షలు
౨. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించడం
౩. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం
౪. ఉలవలు దానం ఇవ్వడం (బ్రాహ్మణుడికి – మంగళవారం నాడు)
౫. వైఢూర్యము మరియు పగడము ధరించడం – వైఢూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయడం (జాతి రత్నాలు ధరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి)
౬. లోహంతో చేసిన (ఇత్తడి, రాగి లేదా పంచ లోహాలు) చేసిన అశ్వ ప్రతిమను ఇంటికి వాయువ్య మూలలో అమర్చాలి. ఇట్టి ప్రతిమను దక్షిణ ముఖము ఉండే విధంగా అమర్చాలి. ఇట్టి ప్రతిమ యొక్క ప్రత్యేకమైన ప్రమాణం లేదా సైజు అనేది ఏమీ లేదు. అశ్వ పటము అనగా ఫోటో అనుకున్నంతగా సత్ఫలితాలను ఇవ్వలేక పోవచ్చును (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి) దీన్ని చాల సులువుగా మన గృహము నందు అమర్చుకొన వచ్చును.

భరణి
భరణి నక్షత్ర నాలుగు చరణాలు మేష రాశి యందే ఉండుట వలన భరణ నక్షత్ర జాతకులు మేష రాశికి చెందినా వారై ఉంటారు. లి, లు, లే, లో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత ‘యముడు’. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి. వీరికి తూర్పు ఉత్తర దిశలు శుభము మరియు పశ్చిమ దక్షిణ దిశలు అధమాలు.

ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి జపం
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. పొట్టుతో ఉన్న బబ్బెర్లు భుజించడం (పొట్టుగల భిన్నము చేయని ధాన్యము నీటియందు నానబెట్టుకుని భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం)
౪. బబ్బెర్లు, లవణం, పత్తి (గింజలు తీయని పత్తి) దానం చేయడం
౫. ఇంట్లో ప్రత్తి మొక్క పెట్టుకొని ప్రతి నిత్యం దానికి నీరు పోయడం
౬. పంచదార తో చేసిన బబ్బెర/శనగ/పెసర/కంది (ధాన్యానికి పొట్టు ఉండాలి) పూర్ణం ప్రతి నిత్యం శ్రీ మహా లక్ష్మికి నైవేద్యం చేసి తినాలి, వివాహం అయిన వారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).

కృత్తిక
కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు. మరియు అధిష్టాన దేవత అగ్ని. కృత్తిక నక్షత్ర ప్రధమ చరణము మేష రాశి యందును మరియు మిగిలిన మూడు చరణాలు వృషభ రాశి యందును ఉంటాయి. అ, ఇ, ఉ, ఎ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. కృత్తిక మేష రాశి యందు జన్మించిన వారికి పశ్చిమ దక్షిణ దిశలు ప్రతికూలంగా ఉంటాయి. కృత్తిక వృషభ రాశి యందు జన్మించిన వారికి ఉత్తర దిశ ప్రతికూలంగా ఉంటుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి, శివ మానస పూజ, ఆదిత్య హృదయ పారాయణము
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. బెల్లంతో గోధుమల పాయసము ఆదివారం భుజించుట వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యము.
౪. తెల్ల సంపంగి, జాజి మల్లె, మాలతి మరియు నందివర్ధనం పుష్ప వృక్షాలను పెంచుకోవడం. వాటితో శివార్చన.
౫. గృహ/కుల సిద్ధాంతి మరియు పురోహితుల ను తరచూ కలవడం వారి ఆశిస్సులు ప్రతి సారి పొందడం (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౬. వేదపండితుల శుశ్రూష – వారి పాదాలకు నమస్కరించుట – ఆశిస్సులు పొందుట (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౭. దేవాలయాలయందు కామ్యాపెక్ష లేకుండా తెలుపురంగులో గల పుష్పాలను పూజకై పంపించడం. శర్కర తో వండిన శ్వేతాన్నం నివేదన చేయడం. ఇట్టి వాటియందు కామ్యాపెక్ష ఏమాత్రం ఉండరాదు. (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).

రోహిణి:
రోహిణి నక్షత్ర నాలుగు చరణాలు వృషభ రాశియందే ఉంటాయి. ఓ, వ, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామాక్షరము గల వారు, జన్మ నామము లేని వారికి వ్యవహార నామాక్షరము గల వారందరూ రోహిణి నక్షత్రానికి చెందిన వారే మరియు వారు వృషభ రాశికి చెందిన వారే. వీరిది మనుష్య గణము. వీరికి పశ్చిమ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం
౩. తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణోత్తమునికి దానము చేయడం
౪. శివునికి గోక్షీరము తో అభిషేకము
౫. శ్రీ లలితాంబ కు త్రిమధుర నైవేద్యము (ఆవుపాలు, తేనే, శర్కర)
౬. తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం. వాటికి గ్రాసము తినిపించుట.
౭. గోశాలకు గోగ్రాసమును సమకూర్చుట
౮ గోవులకు సేవ చేయడం

మృగశిర:
మృగశిర ప్రథమ ద్వితీయ చరణాలు వృషభ రాశి యందును, తృతీయ చతుర్థ చరణాలు మిథున రాశి యందును ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు దేవ గణమునకు చెందిన వారు. వె, వో, క, కి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారు ఈ నక్షత్ర కోవకు వస్తారు. మృగశిర ప్రథమ ద్వితీయ నక్షత్ర జాతకులకు తూర్పు దిశ శ్రేష్టమైనది. మిగిలిన దిశలు మాధ్యమాలు. తృతీయ చతుర్థ చరణాల వారికి తూర్పు ఉత్తర దిశలు శ్రేష్టము. మిగిలిన దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. అంగారక చతుర్థి, అంగారక షష్టి, సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, పైన తెలపబడిన దినములందు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు
౩. ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యము బ్రాహ్మణోత్తమునికి దానము చేయుట
౪. ఎర్రని కందులు శర్కర తో చేసిన పూర్ణము శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయుట.
౫. వీరు నలుపు మరియు నీలము రంగు వస్త్రాలను దరించ రాదు
౬. వార్తాహరునికి (వార్తలు చేరవేయు వారు, దూతలు) ఎరుపు రంగు వస్త్రాలు బహుకరించుట
౭. సంగీత వేత్తలకు ఎర్రని వస్త్రములు బహుకరించి వారి ఆశిస్సులు పొందుట.
౮. శ్రీ దుర్గ అమ్మవారికి ఎర్రని వస్త్రమును బహుకరించుట. శ్రీ దుర్గా ఆలయమందు ఎర్రని వస్త్రాలు దానం చేయుట.
౯. దేవాలయాలయందు పళ్ళు దానం చేయుట.

ఆర్ద్ర:
ఆర్ద్ర నక్షత్ర 4 చరణాలు మిథున రాశిలోనే ఉంటాయి. కావున ఆర్ద్ర నక్షత్రము ఏ పాదములో జన్మించినను వారు మిథున రాశికి చెందిన వారే. కూ, ఘ, జ్ఞ, ఛ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామ మరియు వ్యవహార నామము గల వారందరూ ఈ రాశి కోవకే వస్తారు. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణము నకు చెందిన వారు. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత ‘రుద్రుడు’. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. రుద్రార్చనలు వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. ప్రతి నిత్యము స్పటిక లింగానికి ఆవు పాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకించడం.
౩. బియ్యాన్ని నానబెట్టి అట్టి నానిన బియ్యముతో శివుడిని అభిషేకించుట.
౪. నల్లని లేదా నీలి వర్ణము గల వస్త్రములకు సాధ్యమైనంత వరకు దూరముగా ఉండుట.
౫. శ్రీ సుబ్రహ్మణ్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతి నిత్యం దానికి విభూదితో అర్చన చేయుట
౬. ప్రతి నిత్యం ఆహారంలో రెండు విధాల పప్పు దినుసులను వాడుట వీరికి శుభ ఫలాలను ఇస్తుంది.
౭. చోరులను మరియు మోసగాళ్ళను పట్టించుట లో సహాయపడుట.
౮. జంతు వధ నిషేధాన్ని వీరు సమర్థించాలి.
౯. నిరంతరమూ శివపంచాక్షరి జప చేస్తూ ఉండాలి. అదే వీరికి సర్వ విధాల రక్ష.

పునర్వసు:
పునర్వసు నక్షత్ర ౩ చరణాలు మిథున రాశి యందును మరియు చతురత చరణము కర్కాటక రాశి యందును ఉంటుంది. కే, కో, హ, హి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా ఈ నక్షత్ర జాతకులే. ఈ నక్షత్రములో జన్మించిన వారు దేవగణ జాతకులు. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి గురు మరియు అధిష్టాన దేవత ‘అదితి’ జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వేదపండితులు మరియు సద్బ్రాహ్మణ ఆశిస్సులు పొందడం మరియు వారి శుశ్రూష
౨. పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా దానం
౩. వృద్ధ బ్రాహ్మణులకు చేయూతనందించుట
౪. శ్రీ దత్తాత్రేయుని ఆరాధన
౫. గురు దేవుల ఆశిస్సులు పొందుట
౬. మేలిరకం బియ్యం తో అన్నదానం
౭. మేలిరకం బియ్యాన్ని ఊరికి పడమర దిశలో ఉన్న లేదా ఊరికి దగ్గరగా ఉన్న శివాలయానికి దానం చేయుట.

పుష్యమి:
పుష్యమి నక్షత్ర నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. హు, హి, హో, ఢ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారందరూ పుష్యమి నక్షత్ర కర్కాటక రాశికి చెందినా వారే. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు మరియు అధిష్టాన దేవత బృహస్పతి. ఈ నక్షత్రమున జన్మించిన వారందరూ కూడా దేవ గణము నకు చెందిన వారు. వీరికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ ఫలాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. యజ్ఞ యాగాదులు చేయు ఋత్త్విక్కులను గౌరవించడం – వారి ఆశిస్సులు పొందడం
౨. యజ్ఞ యాగాదులు నిర్వహించకున్నను వాటిని దర్శించు కోవడం మరియు యజ్ఞ నారాయణుడి ప్రసాదం స్వీకరించడం
౩. సాధు సత్పురుషులు, బ్రహ్మజ్ఞానుల ఆశిస్సులు పొందడం. వారికి తగిన విధంగా సేవలందించడం.
౪. ఈ నక్షత్రము లో జన్మించిన వారు రాజాజ్ఞను ఎట్టి పరిస్థితిలో నైనా తిరస్కరించ రాదు. రాజాజ్ఞ పాలన వీరు తప్పక చేయాలి.
౫. రాజు వద్ద గల మంత్రుల వద్ద శిష్యరికం చేయడం.
౬. గోధుమలు, యవలు(బార్లీ), బియ్యం మరియు చెరుకు మొదలు వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం చేయుట. ఇట్టి వస్తువులను శివాలయంలో దానం చేయుట.
౭. గురువులను పూజించుట మరియు వారి ఆశిస్సులు పొందుట వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౮. ఇంటిలో దక్షిణ గోడకు ఉత్తర అభిముఖంగా శ్రీ దత్తాత్రేయుని ప్రతిమను ఉంచిన వీరికి అత్యంత శుభ ఫలితాలు అందుతాయి. ఇట్టి ప్రతిమకు నిత్యం ధూప దీప నైవేద్యాలు చేసిన ఇంకను చక్కని సత్ఫలితాలు ఉంటాయి.
౯. గురువారము పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున గురు పుష్యమి యోగము – అట్టి యోగము గల నాడు లేదా రోజున గురువుల ఆశిస్సులను పొందుట, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సద్గురు సాయినాధుని దర్శనము శుభ ఫలితాలను ఇస్తుంది.

ఆశ్రేష:
ఆశ్రేష నక్షత్రము నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందినా వారు. డీ, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఆశ్రేష నక్షత్ర కర్కాటక రాశికి చెందిన వారు. ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత ‘సర్పము’. తూర్పు మరియు ఉత్తర దిశలు సత్ఫలితాలను మరియు దక్షిణ పశ్చిమ దిశలు వీరికి మధ్యమ లేదా అధమ ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వైద్యులను, వైద్య వృత్తిలో ఉన్న వారిని సన్మానించుట
౨. సర్పారాధన, సర్ప ప్రతిమలకు లేదా విగ్రహాలకు మంగళ వారాలు ఆవుపాలతో అభిషేకించుట.
౩. పెసళ్ళు లేదా పెసరపప్పు నాన బెట్టి శ్రీ దుర్గాదేవికి నివేదించి స్వీకరించాలి
౪. పెసళ్ళు లేదా పెసరపప్పు శర్కర తో పూర్ణం వండి అమ్మవారికి నివేదించి భుజించాలి.
౫. సీసం తో గాని లేదా రాగితో గాని లేదా వెండితో తో చేసిన సర్ప ప్రతిమను చెరువులోనో, నదిలోనో లేదా నూతిలోనో ఆశ్రేష నక్షత్రము గల దినము నాడు వేయాలి.
౬. ఆశ్రేష నక్షత్రము గల రోజు సర్ప విగ్రహాన్ని లేదా ప్రతిమను అభిషేకించుట.
(ఆశ్రేష నక్షత్ర ఉపశమనాలు జాతకమున సర్ప దోషము గల వారికీ మరియు కాల సర్ప దోషము గల వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి)

మఖ:
మఖ నక్షత్ర 4 చరణాలు కూడా సింహ రాశిలోనే ఉంటాయి. మఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. మా, మీ, ము, మే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ మఖ నక్షత్ర సింహ రాశికి చెందిన వారే. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవతలు “పితృ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు పితృ దేవతల ప్రీత్యర్థం తర్పణలు దానాలు చేస్తూ ఉండాలి.
౨. ముసలి వారికి, రోగ గ్రస్తులకు నిరంతరం సహాయం అందిస్తూనే ఉండాలి.
౩. తల్లిదండ్రుల ఆశిస్సులు నిరంతరం పొందుతూ ఉండాలి. మరియు వారికి సరియైన విధంగా సేవలు చేస్తూ ఉండాలి
౪. పూర్వీకుల ప్రీత్యర్థం దాన ధర్మాదులను ఆచరించాలి.
౫. ఈ నక్షత్ర జాతకులు మాతా పితరులకు సేవ చేయని ఎడల – మాత్రు శాప మరియు పితృ శాప సుతక్షయమనబడే యోగాల వలన బాధపడలసి ఉంటుంది.
౬. వీరు కొండలు మరియు ఎత్తైన ప్రదేశం లో ఉన్న శివాలయాలు లేదా ఇతర ఆలయాలందు వెలసి ఉన్న దేవతలను దర్శించు కోవాలి. ఇట్టి దేవాలయాలయందు దాన ధర్మాదులను ఆచరించాలి.
౭. ఉలవలు దానం చేయడం మరియు ఉలవలను వంటకాలందు వాడుట మరియు ఇట్టి నక్షత్ర జాతకులు భుజించుట.

పూర్వా ఫల్గుణి (పుబ్బ)
పుబ్బ లేదా పూర్వ ఫల్గుణి నక్షత్రము నందలి 4 చరణాలు కూడా సింహ రాశియందు ఉంటాయి. మో, ట, టి, టు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు జన్మ నక్షత్రము గల వారందరూ కూడా పుబ్బ నక్షత్ర సింహ రాశికి చెందినా వారే. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. పూర్వాఫల్గుణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “భగ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఈ నక్షత్ర జాతకులు కళాకారులను, కవులను, సంగీత కారులను, నటులను, మిత్ర వర్గాన్ని సదా గౌరవించాలి.
౨. వీరు తేనే ను దానం చేయాలి. ప్రధానంగా శుక్ర వారం నాడు తేనే దానం చేయుట వీరికి శుభము
౩. ఇంటి యందు తూర్పు ముఖంగా నటరాజ విగ్రహాన్ని పెట్టుకోవాలి
౪. సుగంధ ద్రవ్యాలు, అగర, చందనము, మసాలా దినుసులను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి.
౫. ఇంటి యందు “కస్తూరి” ఉంచుకోవాలి. మరియు కస్తూరి ని దానం చేయాలి.

ఉత్తరాఫల్గుణి (ఉత్తర):
ఉత్తరా ఫల్గుణి ప్రథమ చరణము సింహ రాశి యందును మరియు మిగిలిన 3 చరణాలు కన్యా రాశి యందును ఉంటాయి. టే, టో, ప, పి అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామాలు గల వారు మరియు వ్యవహార నామాలు గల వారందరూ ఉత్తరా ఫల్గుణి నక్షత్రమునకు చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “అర్యముడు”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ సూర్యారాధన అత్యంత శుభ ఫలాలను ఇస్తుంది.
౨. బ్రాహ్మణులు తప్పని సరిగా సంధ్యా వందనము ఆచరించుట, సూర్యునికి అర్ఘ్య ప్రధానము చేయుట.
౩. బ్రాహ్మణులు కాని వారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి.
౪. కుల దైవాన్ని మరియు ఇష్టదైవాన్ని తప్పని సరిగా పూజించుకోవాలి.
౫. ప్రతి ఆదివారం నాడు గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లం తో చేసిన పాయసం సూర్య భగవానునికి నివేదన చేసి స్వీకరించాలి.
౬. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, ఆవు నెయ్యి, రాగి పాత్రలను శివాలయాలకు దానం చేయాలి. ఇట్టి వస్తువులను సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. వీరు రాగి కడియాన్ని దక్షిణ హస్తమునకు ధరించాలి.
౮. ఉత్తములకు చక్కని నాణ్యమైన లేదా నాణ్యత గల ధాన్యమును దానం చేసుకోవాలి. వారి ఆశిస్సులను పొందాలి. ప్రధానంగా భానువారాలు ఇట్టి దానాలు చేసిన శుభ ఫలితాలు ఉంటాయి.

హస్త (హస్తమి):
హస్త నక్షత్ర నాలుగు చరణాలు కన్యా రాశి ఉంటాయి. పు, ష, ణ, ఠ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ హస్త నక్షత్ర కన్యా రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “సవితృ”. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరికి సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. వేద పండితులు, వేదాధ్యయనము చేయు వారి సాంగత్యము చేయాలి
౩. వ్యాపార వేత్తలతో స్నేహం చేయండి. వారిని గౌరవించండి. అవసరమైతే వారికి సహాయం చేయండి.
౪. వీలైనంత వరకు తెల్లని వస్త్రాలను ధరించాలి. వీరికి నలుపు మరియు నీలం రంగ వస్త్రాలు ప్రతికూల ఫలాలను ఇస్తాయి.
౫. ఇంటికి తూర్పు ఈశాన్య భాగంలో శ్రీ గణేశ వెండి విగ్రహాన్ని పశ్చిమ ముఖంలో ఉంచి ఇంట్లో నుండి బయటకు వెళ్ళునపుడు నమస్కరించుకోండి.
౬. వెండితో చేసిన శ్రీ గణేశ విగ్రహాన్ని వేద పండితులకు మరియు సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.
౭. శ్రీ సరస్వతి దేవాలయం లో అమ్మవారికి తెల్లని వస్త్రాలను బహుకరించండి.
౮. తెలుపు రంగు వస్త్రాలను, తెల్లని ధాన్యాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.

చిత్త:
చిత్త నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశి యందును మరియు మిగిలిన రెండు పాదాలు తులా రాశి యందును ఉంటాయి. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. పె, పో, రా, రి అనే నక్షత్రాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ చిత్త నక్షత్రమున జన్మించిన వారే. చిత్త నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములు కన్యా రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. చిత్త నక్షత్ర తృతీయ మరియు చతురత చరణములు తులా రాశి యందు జన్మించిన వారికి తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు మరియు అధిష్టాన దేవత “త్వష్ట” జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. బట్టల నేతగాళ్లకు సహాయాన్ని అందించుట
౨. నేత్ర దానం చేయుట
౩. నేత్ర సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారికి సహాయాన్ని అందించుట
౪. నేత్ర వైద్యులను గౌరవించుట
౫. హస్త కళలు, డిజైన్ వేయు వారు, వడ్రంగి మరియు కంసాలి పని చేయువారికి చేయూతనందించుట
౬. పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం చేయుట

స్వాతి:
స్వాతి నక్షత్ర నాలుగు చరణాలు కూడా తులా రాశియందే ఉంటాయి. రు, రే, రో, త అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా స్వాతి నక్షత్ర తులా రాశికి చెందిన వారే. వీరు దేవగణము నకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వాయు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. గుర్రపు నాడ ఇంటికి నైఋతి భాగంలో వేలాడదీయాలి.
౨. గుర్రాలు, పశువులు, పక్షులు మొదలగు వాటి గ్రాసము మరియు దాన కొరకు ఆర్ధిక సహాయమును అందించుట.
౩. గోగ్రాసము నకు ఆర్ధిక సహాయమును అందించుట.
౪. నిరంతరం దైవ ధ్యానం లో గడిపే వారికి, యోగులకు, దేవాలయాలయందు నిత్యార్చన చేసే ఉత్తములైన మరియు సద్గుణ సంపన్నులైన అర్చకులకు రెండు సేర్ల లేదా రెండు కిలోల శనగ పప్పును దానం చేయుట.
౫. ఉత్తములైన బ్రాహ్మణులకు విసనకర్రలను – వింజామర లను (ఇప్పటి కాలానికి అనుగుణంగా ఫ్యాన్) దానం చేయుట

విశాఖ:
విశాఖ నక్షత్రము 3 పాదాలు తులా రాశి యందును మరియు చతుర్థ చరణము వృశ్చిక రాశి యందును ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. తీ, తు, తే, తో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారందరూ విశాఖ నక్షత్ర జాతకులే. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత ఇంద్ర/అగ్ని. విశాఖ నక్షత్ర మొదటి మూడు చరణాలు తులా రాశి యందు ఉండుట వలన ఇట్టి నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మరియు విశాఖ చతుర్థ చరణము వృశ్చిక రాశి యందుండుట వలన తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశా మధ్య ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. మీ కంటే వయస్సులో గాని లేదా స్థాయిలో గాని తక్కువ అయిన వారిని అగౌరవ పరచరాదు.
౨. విద్యాధికులను గౌరవించండి మరియు వారి ఆశిస్సులు పొందండి.
౩. ఇట్టి నక్షత్ర జాతకులు వీలైనంత వరకు ఆగ్నేయ భాగం లో వంట గది గల ఇళ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
౪. యజ్ఞ యాగాదులందు యజ్ఞ నారాయణుడి తీర్థ ప్రసాదములు మరియు అట్టి యజ్ఞాన్ని నిర్వహించు ఋత్విక్కుల ఆశిస్సులు పొందాలి.
౫. ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచాలి (ఎర్ర మందార, ఎర్ర గులాబి, కాంచనం మరియు గన్నేరు మొదలగునవి).
౬. శనగలు మరియు పెసళ్ళు బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. శ్రీ సద్గురు సాయినాధుని మరియు శ్రీపాద శ్రీ వల్లభుడి ఆరాధన చేయాలి.

అనూరాధ:
అనూరాధ నక్షత్ర 4 చరణాలు కూడా వృశ్చిక రాశి యందు ఉంటాయి. న, ని, ను, నే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా అనూరాధ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశ మధ్యమ ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. అనూరాధ నక్షత్రానికి అధిపతి శని మరియు అధిష్టాన దేవత “మిత్ర”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు చక్కని గోష్టి మరియు సత్సంగాలందు పాల్గొనాలి.
౨. ఉత్తములు మరియు జ్ఞానులతో మిత్రుత్వాన్ని చేయాలి
౩. వీరు ఎట్టి పరిస్థితిలో మిత్ర ద్రోహము చేయరాదు.
౪. ఉన్ని మరియు చర్మం తో చేసిన వస్తువులను దానం చేయాలి.
౫. శ్రీ మహావిష్ణు ఆరాధన శుభ ఫలాలను ఇస్తుంది
౬. స్వచ్చమైన నెయ్యి, ఖర్జూరాలు, బెల్లం, కొబ్బరి మరియు బియ్యం పిండి తో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి గాని మిత్రులకు గాని ఇవ్వాలి.

జ్యేష్ఠ:
జ్యేష్ఠ నక్షత్ర నాలుగు చరణాలు వృశ్చిక రాశియందే ఉంటాయి. నో, యా, యి, యూ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా జ్యేష్ఠ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు రాక్షస గణమునకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, ఉత్తర దిశలు శుభ ఫలితాలను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “ఇంద్రుడు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఇట్టి నక్షత్ర జాతకులు తమకంటే పెద్ద వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి.
౨. చోరులు మరియు చొర ప్రవృత్తి గల వారిని పట్టించుటలో సహకరించాలి
౩. యుద్ద వీరులను మరియు సైన్యాన్ని గౌరవించాలి. వారికి సదా సేవలను అందించాలి.
౪. పెసర్లు, శర్కర మరియు మంచి నెయ్యి తో చేసిన పూర్ణం శ్రీ మహావిష్ణుకు నివేదన చేసి స్వీకరించాలి.
౫. శ్రీ విష్ణు దేవాలయాలకు తరచూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి
౬. శ్రీ మహావిష్ణు దేవాలయాలయందు పెసర్లు దానం చేయాలి
౭. ఒక కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి గాని లేదా రక్షక భటులకు గాని దానం చేయాలి.
౮. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం శుభ ఫలాలను ఇస్తుంది
౯. శ్రీ వైష్ణవ పీఠాధిపతుల సందర్శన మరియు వారి ఆశిస్సులను పొందాలి.

మూల:
మూల నక్షత్ర నాలుగు చరణాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. యే, యో, బ. బి అను అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ మూల నక్షత్ర ధనుస్సు రాశికి చెందిన వారే. మూలా నక్షత్రములో జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. మూల నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవత “రాక్షస”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. గృహము నందు ఓషధులను పెంచాలి.
౨. రైతులకు మేలురకం విత్తనాలను దానం చేయాలి
౩. ఔషధ తత్త్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౪. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయూతనందించాలి.
౫. కుమారి లేదా Aloe Vera లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి.
౬. మంగళ వారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషది మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్త్వం గల పుష్పాలను జలం లో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి.

పూర్వాషాఢ:
పూర్వాషాఢ నక్షత్ర 4 చరణాలు కూడా ధనుస్సు రాశి యందే ఉంటాయి. బూ, ధ, భా, ఢ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాషాఢ నక్షత్ర ధనుస్సు రాశి కి చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు, వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలితాలను ఇస్తాయి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “ఆప”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామమునకు తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయము లేనట్లయితే గ్రామములో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాలి.
౨. ప్రతి గురు మరియు శుక్ర వారాలలో చేపలకు ఆహారం వేయాలి.
౩. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలి వేయాలి
౪. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్ర వారం నాడు దానం చేయాలి
౫. దేవాలయాలకు అగరువత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబి జలము, మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి.
౬. జాలరులు – చేపలు పట్టే వారు కష్టాలలో ఉన్నట్లైతే వారిని ఆపన్నహస్తం అందించాలి.

ఉత్తరాషాఢ:
ఉత్తరాషాఢ ప్రథమ చరణము ధనుస్సు నందును మరియు మిగిలిన మూడు చరణాలు మకర రాశి యందును ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. బే, బో, జా, జి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులే. ఉత్తరాషాఢ ప్రధమ చరణమున ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ ద్వితీయ, తృతీయ మరియు చతుర్థ చరణము మకర రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “విశ్వదేవ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి
౨. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండే లాగ అమర్చాలి లేదా తగిలించాలి
౩. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలాలను ఇస్తుంది
౪. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్ళు పోయాలి
౫. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి
౬. గోధుమలు, బెల్లం, మంచినేయ్యి తో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి

శ్రవణము:
శ్రవణా నక్షత్ర నాలుగు చరణాలు మకర రాశి యందు ఉంటాయి. జు, జే, జో, ఖ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము కల వారందరూ శ్రావణ నక్షత్ర మకర రాశికి చెందిన వారు. వీరు దేవా గణమునకు చెందిన వారు. శ్రావణ నక్షత్ర మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. శ్రవణా నక్షత్రమునకు అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “విష్ణు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు విష్ణు మూర్తిని మరియు విష్ణు భక్తులను గౌరవించాలి.
౨. వీరు గృహము నందు ఔషధ గుణములు గల మొక్కలను పెంచాలి.
౩. వీరు అహింస ను ఎత్తి పరిస్థితి లో ప్రోత్సహించ రాదు.
౪. సాధ్యమైనంత వరకు శాకాహార భోజనం చేయాలి
౫. సర్వ భూతములందు దయను కలిగి ఉండాలి. ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండాలి.
౬. బకుల, జుహీ లేదా మల్లెలు, కదంబ పుష్పము, సంపంగి, అశోక, చంప అనబడే పుష్పాలు అన్ని గాని లేదా ఏవేని కొన్ని గాని శ్రీ విష్ణు దేవాలయాలకు బహుకరించండి. ఇట్టి పుష్పాల మొక్కలను ఇట్టి దేవాలయాలకు బహుకరించండి.
౭. శ్రీ మహా విష్ణు దేవాలయాలయందు మూల విరాటు విగ్రహానికి అలంకార సామాగ్రిని సమకూర్చండి.
౮. శ్రీ మహా విష్ణు దేవాలయాలను, శ్రీ వెంకటేశ్వర దేవాలయాలను, శ్రీ కృష్ణ మందిరాలను దర్శించాలి.

ధనిష్ఠ:
ధనిష్ఠ నక్షత్ర రెండు చరణాలు మకర రాశి యందును మరియు చివరి రెండు చరణాలు కుంభ రాశి యందును ఉంటాయి. గ, గి, గు, గే అనబడే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారు ధనిష్ఠ నక్షత్ర జాతకులు. ధనిష్ఠ నక్షత్రము రాక్షస గణమునకు చెందినది. ధనిష్ఠ నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములతో మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ధనిష్ఠ నక్షత్ర తృతీయ మరియు చతురత చరణము కుంభ రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి అంగారకుడు మరియు అధిష్టాన దేవత “వసు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
౨. శివాలయాలయందు గోధుమలను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి
౩. కందులు మరియు కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి
౪. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలయందు స్వామి వారి అభిషేకానికి కావలసిన సామాగ్రిని ఇవ్వాలి.
౫. స్త్రీలను ద్వేషించ రాదు. స్త్రీలను గౌరవించాలి.
౬. పాత మిత్రులను సదా గౌరవించాలి
౭. ధర్మ పరాయణత ను కలిగి ఉండాలి. అధర్మాన్ని ప్రోత్సహించ రాదు.

శతభిష (శతతార):
శతభిష నాలుగు చరణాలు కుంభ రాశి యందు ఉంటాయి. గో, స, సి, సు అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారు శతభిష నక్షత్ర కుంభ రాశికి చెందిన వారగుదురు. శతభిష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. శతభిష నక్షత్ర కుంభ రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వరుణ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు ఎల్లపుడూ పరిశుభ్రమైన దుస్తులను మాత్రమె ధరించాలి.
౨. నీటియందు తిరిగే చేపలు మరియు ఇతర జంతు రాశికి ఆహారాన్ని వేయాలి.
౩. వీరు సముద్ర వస్తువులను ఇతరులకు దానం చేయాలి
౪. స్వల్ప ప్రమాణంలో మద్యం ను నీటిలో ప్రవహింప చేయాలి.
౫. వీరు మాధ్యమును సేవించ రాదు (ఆ విషయానికి వస్తే మద్యం ఎవరు కూడా సేవించ రాదు)
౬. వీరు మినుములు మరియు నల్లని నువ్వులు శివాలయాలయందు దానం చేయాలి

పూర్వాభాద్ర:
పూర్వాభాద్ర మొదటి మూడు చరణాలు కుంభ రాశి యందును మరియు చివరి పాదము మీన రాశి యందును ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. సే, సో, ద, ది అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాభాద్ర నక్షత్రమునకు జన్మించిన వారు. పూర్వాభాద్ర మొదటి మూడు చరణము లందు జన్మించిన కుంభ రాశి వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. పూర్వాభాద్ర చతుర్థ చరణము మీన రాశి యందు జన్మించిన వారికి ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభ మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలు మధ్యమ లేదా హీన ఫలాలను ఇస్తాయి. పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత “అజైకపాద”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఆవులను కాచే కాపరులకు కష్టాలలో ఉన్న వారికి చేయూతనందించాలి.
౨. గృహము నందు మామిడి చెట్టు పెంచాలి. పెంచే సౌకర్యము లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్ళు పోయాలి.
౩. ఔషధీ మొక్కలను గృహము నందు పెంచాలి.
౪. ఆయుర్వేద వైద్యులను గౌరవించాలి. అవసరం అయినపుడు ఆయుర్వేద మందులను సేవించాలి.
౫. దొంగలను పట్టించుటలో సహకరించాలి
౬. ఒంటరిగా జీవించే సాదువులకు నెయ్యిని దానం చేయాలి.
౭. గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలయందు శివునికి చక్కని నాణ్యమైన గోఘ్రుతం తో అభిషేకం చేయాలి. ఇట్టి ఆవునేయ్యిని శివాలయాలకు దానం చేయాలి.
౮. వేద పండితులను సన్మానించాలి మరియు వారి ఆశిస్సులు పొందాలి.
౯. ఏక పాదులకు (కుంటి వారు) సేవ చేయాలి. ప్రధానంగా వారికి వైద్య సహాయాన్ని అందించాలి.

ఉత్తరాభాద్ర:
ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశిలో ఉంటాయి. దూ, శం, ఝూ, థ – అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము కల వారందరూ ఉత్తరాభాద్ర నక్షత్ర మీన రాశి జాతకులు. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఈ నక్షత్రమున జన్మించిన వారికీ ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు మరియు అధిష్టాన దేవత “ఆహిర్బుద్నియ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఇట్టి జాతకులు నిరంతరమూ దాన ధర్మాదులను ఆచరిస్తూ ఉండాలి.
౨. బ్రాహ్మణులు, ప్రధానంగా వృద్ధ బ్రాహ్మణులు, తపస్సు చేసుకునే వారి ఆశిస్సులు సదా పొందాలి.
౩. విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేయాలి.
౪. “అష్టౌ బ్రాహ్మణాన్” ఎనిమిది మంది బ్రాహ్మణులకు పాలతో చేసిన మిఠాయిలు, కోవా మొదలగునవి దానం చేయాలి.
౫. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలయందు పాలతో చేసిన మిఠాయిలు మరియు కోవా మొదలగునవి స్వామి వారికి నివేదన చేయాలి.
౬. వృద్ధాశ్రమాలయందు ఉన్న వృద్ధులకు మంచి నాణ్యమైన విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు, వస్త్రాలను దానం చేయాలి. (ఇట్టి వస్తువు లందు ఏదేని ఒకటి కాని లేదా అన్నీ కాని చేయవచ్చు. యథాశక్తి.)

రేవతి:
రేవతి నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశి యందు ఉంటాయి. దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ రేవతి నక్షత్ర మీన రాశికి చెందినా వారే. ఇట్టి నక్షత్ర జాతకులు దేవా గణమునకు చెందిన వారుల. ఈ నక్షత్రమున జన్మించిన వారికి ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “పూషన్”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. “దక్షిణావర్తి శంఖాన్ని” శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి.
౨. వీరు గృహము నందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి
౩. గ్రామము నందు గల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాల హారాన్ని అమ్మవారి మూల విరాట్టుకు బహుకరించాలి.
౪. శంఖము, ముత్యాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౫. సువాసన గల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం చేయాలి.
౬. పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహా విష్ణును పూజించాలి.
౭. ఉప్పు, పద్మాలు, పలు విధాలైన ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి.