Wednesday, February 28, 2024

ఈ రోజు సంకట హర చతుర్ధి

ఈరోజు బుధవారం సంకటహర చతుర్థి 

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది.అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు.

మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం
అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే  సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం
ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి
ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

* సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం •*
సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానినిపసుపు,
కుంకుమలతో అలంకరణను చేయాలి.మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట
హర చతుర్థి వ్రత కథను చదవాలి.

Tuesday, February 27, 2024

శ్రీ సుభ్రమణ్య తత్వము


శ్రీ సుభ్రమణ్య తత్వము : 
చెడుపై మంచి విజయం సాధించాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో రహస్యం ఏమిటంటే సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు.
కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని.ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీసంవత్సరాగ్ని రూపం.ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

సుబ్రహ్మణ్య స్వామియజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది. అందులోనే శ్రీమహావిష్ణువుకి "స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః" అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.

అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయారు ఉతిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు.

సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథశక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రములో ఉంటుంది.అయితే ఆ కుండలినీ శక్తిని జాగృతం చేయడం సమర్దుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీదేవి, దేవసేనాఅమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు. 

Monday, February 26, 2024

ప్రతీ సోమవారం శివ పూజ - విధానం - ఫలితాలు

ఇలా ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే రుణ బాధలు వదిలిపోతాయి :

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు.

మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.
ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అప్లైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న
 , ఆర్ధిక  సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి.

2. పూజానంతరం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

Saturday, February 24, 2024

మాఘపూర్ణిమ

మాఘపూర్ణిమ :

ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం,
కార్తికం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తికం, మాఘం స్నానాలకు ప్రసిద్ది. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు చేసినట్లే, మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధంగా కనిపిస్తోంది. 

మాఘపౌర్ణమిని మనవారు
మహామాఘి అంటారు. "మాఘే నిమగ్నాహః సలిలే సుశీలే విముక్త పాపాః త్రిదివం ప్రయాంతి" 

మాఘమాసంలో ప్రవహించే  నీటియందు నిలిచి,మంచిమనసుతో స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యమిస్తే పాపవిముక్తులై  స్వర్గానికి చేరుకుంటారు అని ఈ శ్లోకానికి అర్థం. మాఘస్నాన వ్రతం అత్యుత్తమ ఫల దాయకం. కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రం.

మాఘపూర్ణిమ , మహా మాఘి


 ఈ రోజు  మాఘపూర్ణిమ , మహా మాఘి


ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

Thursday, February 22, 2024

నక్షత్ర ఆధారిత ఉపశమన మార్గాలు

నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.
జ్యోతిష శాస్త్రము మరియు కర్మ సిద్ధాంతానికి చాలా అవినాభావ సంబంధము కలదు. మన కర్మలను అనుసరించి మనకు జన్మ లభిస్తుంది. మన కర్మ ఫలాలను తెలిపేదే జ్యోతిషము, జన్మ కుండలి మరియు అందులో గల యోగాలు. మనము అనుభవించే సత్ఫలితము లేదా దుష్ఫలితము అన్ని కూడా కర్మ ఫలాలే. సత్ఫలితాలుంటే అందరికీ సంతోషము. కాని దుష్ఫలితాలు అనుభవించ వలసి వచ్చినపుడు అసలు ఆ దోషమేంటి మరియు దానికి ఏదైనా పరిహారము ఉందా అనే విషయము గూర్చి మనము మనన చేసుకుంటాము. నాకుండే పరిజ్ఞానము మరియు అనుభవాన్ని అనుసరించి దోషానికి పరిహారము లేదు. ఏలనన దోషాలు మన కర్మ ఫలాలు. కర్మ ఫలాలు అనుభవించ వలసిందే. దానికి విరుగుడు లేదు. ఐతే దానికి ఉపశమనాలు ఉంటాయి. ఉపశమనము – పూజలు, జపాలు, దానాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు ఇలా ఎన్నో రకాల ఉపశమనాలు ఉంటాయి. ఈ ఉపశమనాల వలన మనలో మనోబలం పెంపొందుతుంది. భగవంతుని పట్ల నమ్మకము పెరుగుతుంది. మనకు ఎదురగు కష్టాన్ని ఎదుర్కునే శక్తి మనలో వస్తుంది. మనకు ఎదురగు కష్టాలను అత్యంత సునాయాసంగా మనము ఎదుర్కొన గలుగుతాము. ఉపశమనాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనము అత్యంత సులభమైన మరియు ఇతరుల సహాయం లేకుండా మనమే స్వంతగా ఆచరించదగు ఉపశమనాల గూర్చి తెలుసుకొందాము. “లాల్ కితాబ్” అనే గ్రంథము లో కూడా చాలా విధాల ఉపశమనాల గూర్చిన చర్చ ఉంది. ఇట్టి ఉపశమనాలు మరియు ఇతర ప్రామాణిక గ్రంథాలు, స్వతహాగా నాకుండే అనుభవాన్ని జోడించి మీకు కొన్ని సులభమైన ఉపశమన పద్దతులను అందిస్తున్నాను.
ఇట్టి శీర్షికలో మనము ప్రధానముగా జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను.

అశ్విని:
అశ్విని నక్షత్రము నాలుగు చరణాలు – చు, చే చొ, ల – అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారందరూ అశ్విని నక్షత్ర జాతకులు. వీరు దేవా గణానికి చెందిన వారు. వీరి నక్షత్రానికి అధిపతి కేతువు. నక్షత్ర అధిష్టాన దేవత అశ్విని దేవతలు. వీరందరూ కూడా మేష రాశికి చెందినా వారు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు. మంగళవారము నాడు ఉపవాస దీక్షలు
౨. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించడం
౩. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం
౪. ఉలవలు దానం ఇవ్వడం (బ్రాహ్మణుడికి – మంగళవారం నాడు)
౫. వైఢూర్యము మరియు పగడము ధరించడం – వైఢూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయడం (జాతి రత్నాలు ధరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి)
౬. లోహంతో చేసిన (ఇత్తడి, రాగి లేదా పంచ లోహాలు) చేసిన అశ్వ ప్రతిమను ఇంటికి వాయువ్య మూలలో అమర్చాలి. ఇట్టి ప్రతిమను దక్షిణ ముఖము ఉండే విధంగా అమర్చాలి. ఇట్టి ప్రతిమ యొక్క ప్రత్యేకమైన ప్రమాణం లేదా సైజు అనేది ఏమీ లేదు. అశ్వ పటము అనగా ఫోటో అనుకున్నంతగా సత్ఫలితాలను ఇవ్వలేక పోవచ్చును (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి) దీన్ని చాల సులువుగా మన గృహము నందు అమర్చుకొన వచ్చును.

భరణి
భరణి నక్షత్ర నాలుగు చరణాలు మేష రాశి యందే ఉండుట వలన భరణ నక్షత్ర జాతకులు మేష రాశికి చెందినా వారై ఉంటారు. లి, లు, లే, లో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత ‘యముడు’. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి. వీరికి తూర్పు ఉత్తర దిశలు శుభము మరియు పశ్చిమ దక్షిణ దిశలు అధమాలు.

ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి జపం
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. పొట్టుతో ఉన్న బబ్బెర్లు భుజించడం (పొట్టుగల భిన్నము చేయని ధాన్యము నీటియందు నానబెట్టుకుని భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం)
౪. బబ్బెర్లు, లవణం, పత్తి (గింజలు తీయని పత్తి) దానం చేయడం
౫. ఇంట్లో ప్రత్తి మొక్క పెట్టుకొని ప్రతి నిత్యం దానికి నీరు పోయడం
౬. పంచదార తో చేసిన బబ్బెర/శనగ/పెసర/కంది (ధాన్యానికి పొట్టు ఉండాలి) పూర్ణం ప్రతి నిత్యం శ్రీ మహా లక్ష్మికి నైవేద్యం చేసి తినాలి, వివాహం అయిన వారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).

కృత్తిక
కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు. మరియు అధిష్టాన దేవత అగ్ని. కృత్తిక నక్షత్ర ప్రధమ చరణము మేష రాశి యందును మరియు మిగిలిన మూడు చరణాలు వృషభ రాశి యందును ఉంటాయి. అ, ఇ, ఉ, ఎ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు. కృత్తిక మేష రాశి యందు జన్మించిన వారికి పశ్చిమ దక్షిణ దిశలు ప్రతికూలంగా ఉంటాయి. కృత్తిక వృషభ రాశి యందు జన్మించిన వారికి ఉత్తర దిశ ప్రతికూలంగా ఉంటుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. శివ పంచాక్షరి, శివ మానస పూజ, ఆదిత్య హృదయ పారాయణము
౨. రుద్రార్చనలు – ఇంటియందు స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణ తో ప్రతి నిత్యం శివ లింగానికి అభిషేకం చేయడం
౩. బెల్లంతో గోధుమల పాయసము ఆదివారం భుజించుట వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యము.
౪. తెల్ల సంపంగి, జాజి మల్లె, మాలతి మరియు నందివర్ధనం పుష్ప వృక్షాలను పెంచుకోవడం. వాటితో శివార్చన.
౫. గృహ/కుల సిద్ధాంతి మరియు పురోహితుల ను తరచూ కలవడం వారి ఆశిస్సులు ప్రతి సారి పొందడం (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౬. వేదపండితుల శుశ్రూష – వారి పాదాలకు నమస్కరించుట – ఆశిస్సులు పొందుట (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).
౭. దేవాలయాలయందు కామ్యాపెక్ష లేకుండా తెలుపురంగులో గల పుష్పాలను పూజకై పంపించడం. శర్కర తో వండిన శ్వేతాన్నం నివేదన చేయడం. ఇట్టి వాటియందు కామ్యాపెక్ష ఏమాత్రం ఉండరాదు. (ఇది లాల్ కితాబ్ లో ఇవ్వబడిన రెమిడి).

రోహిణి:
రోహిణి నక్షత్ర నాలుగు చరణాలు వృషభ రాశియందే ఉంటాయి. ఓ, వ, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామాక్షరము గల వారు, జన్మ నామము లేని వారికి వ్యవహార నామాక్షరము గల వారందరూ రోహిణి నక్షత్రానికి చెందిన వారే మరియు వారు వృషభ రాశికి చెందిన వారే. వీరిది మనుష్య గణము. వీరికి పశ్చిమ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం
౩. తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణోత్తమునికి దానము చేయడం
౪. శివునికి గోక్షీరము తో అభిషేకము
౫. శ్రీ లలితాంబ కు త్రిమధుర నైవేద్యము (ఆవుపాలు, తేనే, శర్కర)
౬. తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం. వాటికి గ్రాసము తినిపించుట.
౭. గోశాలకు గోగ్రాసమును సమకూర్చుట
౮ గోవులకు సేవ చేయడం

మృగశిర:
మృగశిర ప్రథమ ద్వితీయ చరణాలు వృషభ రాశి యందును, తృతీయ చతుర్థ చరణాలు మిథున రాశి యందును ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు దేవ గణమునకు చెందిన వారు. వె, వో, క, కి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారు ఈ నక్షత్ర కోవకు వస్తారు. మృగశిర ప్రథమ ద్వితీయ నక్షత్ర జాతకులకు తూర్పు దిశ శ్రేష్టమైనది. మిగిలిన దిశలు మాధ్యమాలు. తృతీయ చతుర్థ చరణాల వారికి తూర్పు ఉత్తర దిశలు శ్రేష్టము. మిగిలిన దిశలు మధ్యమ లేదా అధమములు. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. అంగారక చతుర్థి, అంగారక షష్టి, సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు
౨. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, పైన తెలపబడిన దినములందు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనలు
౩. ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యము బ్రాహ్మణోత్తమునికి దానము చేయుట
౪. ఎర్రని కందులు శర్కర తో చేసిన పూర్ణము శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయుట.
౫. వీరు నలుపు మరియు నీలము రంగు వస్త్రాలను దరించ రాదు
౬. వార్తాహరునికి (వార్తలు చేరవేయు వారు, దూతలు) ఎరుపు రంగు వస్త్రాలు బహుకరించుట
౭. సంగీత వేత్తలకు ఎర్రని వస్త్రములు బహుకరించి వారి ఆశిస్సులు పొందుట.
౮. శ్రీ దుర్గ అమ్మవారికి ఎర్రని వస్త్రమును బహుకరించుట. శ్రీ దుర్గా ఆలయమందు ఎర్రని వస్త్రాలు దానం చేయుట.
౯. దేవాలయాలయందు పళ్ళు దానం చేయుట.

ఆర్ద్ర:
ఆర్ద్ర నక్షత్ర 4 చరణాలు మిథున రాశిలోనే ఉంటాయి. కావున ఆర్ద్ర నక్షత్రము ఏ పాదములో జన్మించినను వారు మిథున రాశికి చెందిన వారే. కూ, ఘ, జ్ఞ, ఛ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామ మరియు వ్యవహార నామము గల వారందరూ ఈ రాశి కోవకే వస్తారు. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణము నకు చెందిన వారు. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత ‘రుద్రుడు’. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. రుద్రార్చనలు వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. ప్రతి నిత్యము స్పటిక లింగానికి ఆవు పాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకించడం.
౩. బియ్యాన్ని నానబెట్టి అట్టి నానిన బియ్యముతో శివుడిని అభిషేకించుట.
౪. నల్లని లేదా నీలి వర్ణము గల వస్త్రములకు సాధ్యమైనంత వరకు దూరముగా ఉండుట.
౫. శ్రీ సుబ్రహ్మణ్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతి నిత్యం దానికి విభూదితో అర్చన చేయుట
౬. ప్రతి నిత్యం ఆహారంలో రెండు విధాల పప్పు దినుసులను వాడుట వీరికి శుభ ఫలాలను ఇస్తుంది.
౭. చోరులను మరియు మోసగాళ్ళను పట్టించుట లో సహాయపడుట.
౮. జంతు వధ నిషేధాన్ని వీరు సమర్థించాలి.
౯. నిరంతరమూ శివపంచాక్షరి జప చేస్తూ ఉండాలి. అదే వీరికి సర్వ విధాల రక్ష.

పునర్వసు:
పునర్వసు నక్షత్ర ౩ చరణాలు మిథున రాశి యందును మరియు చతురత చరణము కర్కాటక రాశి యందును ఉంటుంది. కే, కో, హ, హి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా ఈ నక్షత్ర జాతకులే. ఈ నక్షత్రములో జన్మించిన వారు దేవగణ జాతకులు. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభాలు మరియు పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమ ఫలాలను ఇస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి గురు మరియు అధిష్టాన దేవత ‘అదితి’ జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వేదపండితులు మరియు సద్బ్రాహ్మణ ఆశిస్సులు పొందడం మరియు వారి శుశ్రూష
౨. పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా దానం
౩. వృద్ధ బ్రాహ్మణులకు చేయూతనందించుట
౪. శ్రీ దత్తాత్రేయుని ఆరాధన
౫. గురు దేవుల ఆశిస్సులు పొందుట
౬. మేలిరకం బియ్యం తో అన్నదానం
౭. మేలిరకం బియ్యాన్ని ఊరికి పడమర దిశలో ఉన్న లేదా ఊరికి దగ్గరగా ఉన్న శివాలయానికి దానం చేయుట.

పుష్యమి:
పుష్యమి నక్షత్ర నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. హు, హి, హో, ఢ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు లేదా వ్యవహార నామము గల వారందరూ పుష్యమి నక్షత్ర కర్కాటక రాశికి చెందినా వారే. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు మరియు అధిష్టాన దేవత బృహస్పతి. ఈ నక్షత్రమున జన్మించిన వారందరూ కూడా దేవ గణము నకు చెందిన వారు. వీరికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ ఫలాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. యజ్ఞ యాగాదులు చేయు ఋత్త్విక్కులను గౌరవించడం – వారి ఆశిస్సులు పొందడం
౨. యజ్ఞ యాగాదులు నిర్వహించకున్నను వాటిని దర్శించు కోవడం మరియు యజ్ఞ నారాయణుడి ప్రసాదం స్వీకరించడం
౩. సాధు సత్పురుషులు, బ్రహ్మజ్ఞానుల ఆశిస్సులు పొందడం. వారికి తగిన విధంగా సేవలందించడం.
౪. ఈ నక్షత్రము లో జన్మించిన వారు రాజాజ్ఞను ఎట్టి పరిస్థితిలో నైనా తిరస్కరించ రాదు. రాజాజ్ఞ పాలన వీరు తప్పక చేయాలి.
౫. రాజు వద్ద గల మంత్రుల వద్ద శిష్యరికం చేయడం.
౬. గోధుమలు, యవలు(బార్లీ), బియ్యం మరియు చెరుకు మొదలు వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం చేయుట. ఇట్టి వస్తువులను శివాలయంలో దానం చేయుట.
౭. గురువులను పూజించుట మరియు వారి ఆశిస్సులు పొందుట వీరికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౮. ఇంటిలో దక్షిణ గోడకు ఉత్తర అభిముఖంగా శ్రీ దత్తాత్రేయుని ప్రతిమను ఉంచిన వీరికి అత్యంత శుభ ఫలితాలు అందుతాయి. ఇట్టి ప్రతిమకు నిత్యం ధూప దీప నైవేద్యాలు చేసిన ఇంకను చక్కని సత్ఫలితాలు ఉంటాయి.
౯. గురువారము పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున గురు పుష్యమి యోగము – అట్టి యోగము గల నాడు లేదా రోజున గురువుల ఆశిస్సులను పొందుట, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సద్గురు సాయినాధుని దర్శనము శుభ ఫలితాలను ఇస్తుంది.

ఆశ్రేష:
ఆశ్రేష నక్షత్రము నాలుగు చరణాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందినా వారు. డీ, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఆశ్రేష నక్షత్ర కర్కాటక రాశికి చెందిన వారు. ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత ‘సర్పము’. తూర్పు మరియు ఉత్తర దిశలు సత్ఫలితాలను మరియు దక్షిణ పశ్చిమ దిశలు వీరికి మధ్యమ లేదా అధమ ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వైద్యులను, వైద్య వృత్తిలో ఉన్న వారిని సన్మానించుట
౨. సర్పారాధన, సర్ప ప్రతిమలకు లేదా విగ్రహాలకు మంగళ వారాలు ఆవుపాలతో అభిషేకించుట.
౩. పెసళ్ళు లేదా పెసరపప్పు నాన బెట్టి శ్రీ దుర్గాదేవికి నివేదించి స్వీకరించాలి
౪. పెసళ్ళు లేదా పెసరపప్పు శర్కర తో పూర్ణం వండి అమ్మవారికి నివేదించి భుజించాలి.
౫. సీసం తో గాని లేదా రాగితో గాని లేదా వెండితో తో చేసిన సర్ప ప్రతిమను చెరువులోనో, నదిలోనో లేదా నూతిలోనో ఆశ్రేష నక్షత్రము గల దినము నాడు వేయాలి.
౬. ఆశ్రేష నక్షత్రము గల రోజు సర్ప విగ్రహాన్ని లేదా ప్రతిమను అభిషేకించుట.
(ఆశ్రేష నక్షత్ర ఉపశమనాలు జాతకమున సర్ప దోషము గల వారికీ మరియు కాల సర్ప దోషము గల వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి)

మఖ:
మఖ నక్షత్ర 4 చరణాలు కూడా సింహ రాశిలోనే ఉంటాయి. మఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. మా, మీ, ము, మే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ మఖ నక్షత్ర సింహ రాశికి చెందిన వారే. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవతలు “పితృ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు పితృ దేవతల ప్రీత్యర్థం తర్పణలు దానాలు చేస్తూ ఉండాలి.
౨. ముసలి వారికి, రోగ గ్రస్తులకు నిరంతరం సహాయం అందిస్తూనే ఉండాలి.
౩. తల్లిదండ్రుల ఆశిస్సులు నిరంతరం పొందుతూ ఉండాలి. మరియు వారికి సరియైన విధంగా సేవలు చేస్తూ ఉండాలి
౪. పూర్వీకుల ప్రీత్యర్థం దాన ధర్మాదులను ఆచరించాలి.
౫. ఈ నక్షత్ర జాతకులు మాతా పితరులకు సేవ చేయని ఎడల – మాత్రు శాప మరియు పితృ శాప సుతక్షయమనబడే యోగాల వలన బాధపడలసి ఉంటుంది.
౬. వీరు కొండలు మరియు ఎత్తైన ప్రదేశం లో ఉన్న శివాలయాలు లేదా ఇతర ఆలయాలందు వెలసి ఉన్న దేవతలను దర్శించు కోవాలి. ఇట్టి దేవాలయాలయందు దాన ధర్మాదులను ఆచరించాలి.
౭. ఉలవలు దానం చేయడం మరియు ఉలవలను వంటకాలందు వాడుట మరియు ఇట్టి నక్షత్ర జాతకులు భుజించుట.

పూర్వా ఫల్గుణి (పుబ్బ)
పుబ్బ లేదా పూర్వ ఫల్గుణి నక్షత్రము నందలి 4 చరణాలు కూడా సింహ రాశియందు ఉంటాయి. మో, ట, టి, టు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు జన్మ నక్షత్రము గల వారందరూ కూడా పుబ్బ నక్షత్ర సింహ రాశికి చెందినా వారే. ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. పూర్వాఫల్గుణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “భగ”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలితాలను దక్షిణ దిశ మధ్య పశ్చిమ దిశా అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఈ నక్షత్ర జాతకులు కళాకారులను, కవులను, సంగీత కారులను, నటులను, మిత్ర వర్గాన్ని సదా గౌరవించాలి.
౨. వీరు తేనే ను దానం చేయాలి. ప్రధానంగా శుక్ర వారం నాడు తేనే దానం చేయుట వీరికి శుభము
౩. ఇంటి యందు తూర్పు ముఖంగా నటరాజ విగ్రహాన్ని పెట్టుకోవాలి
౪. సుగంధ ద్రవ్యాలు, అగర, చందనము, మసాలా దినుసులను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి.
౫. ఇంటి యందు “కస్తూరి” ఉంచుకోవాలి. మరియు కస్తూరి ని దానం చేయాలి.

ఉత్తరాఫల్గుణి (ఉత్తర):
ఉత్తరా ఫల్గుణి ప్రథమ చరణము సింహ రాశి యందును మరియు మిగిలిన 3 చరణాలు కన్యా రాశి యందును ఉంటాయి. టే, టో, ప, పి అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామాలు గల వారు మరియు వ్యవహార నామాలు గల వారందరూ ఉత్తరా ఫల్గుణి నక్షత్రమునకు చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “అర్యముడు”. వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ సూర్యారాధన అత్యంత శుభ ఫలాలను ఇస్తుంది.
౨. బ్రాహ్మణులు తప్పని సరిగా సంధ్యా వందనము ఆచరించుట, సూర్యునికి అర్ఘ్య ప్రధానము చేయుట.
౩. బ్రాహ్మణులు కాని వారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి.
౪. కుల దైవాన్ని మరియు ఇష్టదైవాన్ని తప్పని సరిగా పూజించుకోవాలి.
౫. ప్రతి ఆదివారం నాడు గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లం తో చేసిన పాయసం సూర్య భగవానునికి నివేదన చేసి స్వీకరించాలి.
౬. గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము, ఆవు నెయ్యి, రాగి పాత్రలను శివాలయాలకు దానం చేయాలి. ఇట్టి వస్తువులను సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. వీరు రాగి కడియాన్ని దక్షిణ హస్తమునకు ధరించాలి.
౮. ఉత్తములకు చక్కని నాణ్యమైన లేదా నాణ్యత గల ధాన్యమును దానం చేసుకోవాలి. వారి ఆశిస్సులను పొందాలి. ప్రధానంగా భానువారాలు ఇట్టి దానాలు చేసిన శుభ ఫలితాలు ఉంటాయి.

హస్త (హస్తమి):
హస్త నక్షత్ర నాలుగు చరణాలు కన్యా రాశి ఉంటాయి. పు, ష, ణ, ఠ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ హస్త నక్షత్ర కన్యా రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “సవితృ”. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరికి సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి.
౨. వేద పండితులు, వేదాధ్యయనము చేయు వారి సాంగత్యము చేయాలి
౩. వ్యాపార వేత్తలతో స్నేహం చేయండి. వారిని గౌరవించండి. అవసరమైతే వారికి సహాయం చేయండి.
౪. వీలైనంత వరకు తెల్లని వస్త్రాలను ధరించాలి. వీరికి నలుపు మరియు నీలం రంగ వస్త్రాలు ప్రతికూల ఫలాలను ఇస్తాయి.
౫. ఇంటికి తూర్పు ఈశాన్య భాగంలో శ్రీ గణేశ వెండి విగ్రహాన్ని పశ్చిమ ముఖంలో ఉంచి ఇంట్లో నుండి బయటకు వెళ్ళునపుడు నమస్కరించుకోండి.
౬. వెండితో చేసిన శ్రీ గణేశ విగ్రహాన్ని వేద పండితులకు మరియు సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.
౭. శ్రీ సరస్వతి దేవాలయం లో అమ్మవారికి తెల్లని వస్త్రాలను బహుకరించండి.
౮. తెలుపు రంగు వస్త్రాలను, తెల్లని ధాన్యాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేయండి.

చిత్త:
చిత్త నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశి యందును మరియు మిగిలిన రెండు పాదాలు తులా రాశి యందును ఉంటాయి. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. పె, పో, రా, రి అనే నక్షత్రాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ చిత్త నక్షత్రమున జన్మించిన వారే. చిత్త నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములు కన్యా రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దిశ మధ్యమ మరియు దక్షిణ దిశ అధమ ఫలితాలను ఇస్తుంది. చిత్త నక్షత్ర తృతీయ మరియు చతురత చరణములు తులా రాశి యందు జన్మించిన వారికి తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు మరియు అధిష్టాన దేవత “త్వష్ట” జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. బట్టల నేతగాళ్లకు సహాయాన్ని అందించుట
౨. నేత్ర దానం చేయుట
౩. నేత్ర సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారికి సహాయాన్ని అందించుట
౪. నేత్ర వైద్యులను గౌరవించుట
౫. హస్త కళలు, డిజైన్ వేయు వారు, వడ్రంగి మరియు కంసాలి పని చేయువారికి చేయూతనందించుట
౬. పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం చేయుట

స్వాతి:
స్వాతి నక్షత్ర నాలుగు చరణాలు కూడా తులా రాశియందే ఉంటాయి. రు, రే, రో, త అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహారము నామము గల వారందరూ కూడా స్వాతి నక్షత్ర తులా రాశికి చెందిన వారే. వీరు దేవగణము నకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వాయు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. గుర్రపు నాడ ఇంటికి నైఋతి భాగంలో వేలాడదీయాలి.
౨. గుర్రాలు, పశువులు, పక్షులు మొదలగు వాటి గ్రాసము మరియు దాన కొరకు ఆర్ధిక సహాయమును అందించుట.
౩. గోగ్రాసము నకు ఆర్ధిక సహాయమును అందించుట.
౪. నిరంతరం దైవ ధ్యానం లో గడిపే వారికి, యోగులకు, దేవాలయాలయందు నిత్యార్చన చేసే ఉత్తములైన మరియు సద్గుణ సంపన్నులైన అర్చకులకు రెండు సేర్ల లేదా రెండు కిలోల శనగ పప్పును దానం చేయుట.
౫. ఉత్తములైన బ్రాహ్మణులకు విసనకర్రలను – వింజామర లను (ఇప్పటి కాలానికి అనుగుణంగా ఫ్యాన్) దానం చేయుట

విశాఖ:
విశాఖ నక్షత్రము 3 పాదాలు తులా రాశి యందును మరియు చతుర్థ చరణము వృశ్చిక రాశి యందును ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. తీ, తు, తే, తో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారందరూ విశాఖ నక్షత్ర జాతకులే. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత ఇంద్ర/అగ్ని. విశాఖ నక్షత్ర మొదటి మూడు చరణాలు తులా రాశి యందు ఉండుట వలన ఇట్టి నక్షత్ర జాతకులకు తూర్పు, పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మరియు విశాఖ చతుర్థ చరణము వృశ్చిక రాశి యందుండుట వలన తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశా మధ్య ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. మీ కంటే వయస్సులో గాని లేదా స్థాయిలో గాని తక్కువ అయిన వారిని అగౌరవ పరచరాదు.
౨. విద్యాధికులను గౌరవించండి మరియు వారి ఆశిస్సులు పొందండి.
౩. ఇట్టి నక్షత్ర జాతకులు వీలైనంత వరకు ఆగ్నేయ భాగం లో వంట గది గల ఇళ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
౪. యజ్ఞ యాగాదులందు యజ్ఞ నారాయణుడి తీర్థ ప్రసాదములు మరియు అట్టి యజ్ఞాన్ని నిర్వహించు ఋత్విక్కుల ఆశిస్సులు పొందాలి.
౫. ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచాలి (ఎర్ర మందార, ఎర్ర గులాబి, కాంచనం మరియు గన్నేరు మొదలగునవి).
౬. శనగలు మరియు పెసళ్ళు బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౭. శ్రీ సద్గురు సాయినాధుని మరియు శ్రీపాద శ్రీ వల్లభుడి ఆరాధన చేయాలి.

అనూరాధ:
అనూరాధ నక్షత్ర 4 చరణాలు కూడా వృశ్చిక రాశి యందు ఉంటాయి. న, ని, ను, నే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా అనూరాధ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు దేవ గణమునకు చెందిన వారు. ఇట్టి నక్షత్రమున జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ఫలాలను, దక్షిణ దిశ మధ్యమ ఫలాలను, పశ్చిమము అధమ ఫలాలను ప్రసాదించును. అనూరాధ నక్షత్రానికి అధిపతి శని మరియు అధిష్టాన దేవత “మిత్ర”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు చక్కని గోష్టి మరియు సత్సంగాలందు పాల్గొనాలి.
౨. ఉత్తములు మరియు జ్ఞానులతో మిత్రుత్వాన్ని చేయాలి
౩. వీరు ఎట్టి పరిస్థితిలో మిత్ర ద్రోహము చేయరాదు.
౪. ఉన్ని మరియు చర్మం తో చేసిన వస్తువులను దానం చేయాలి.
౫. శ్రీ మహావిష్ణు ఆరాధన శుభ ఫలాలను ఇస్తుంది
౬. స్వచ్చమైన నెయ్యి, ఖర్జూరాలు, బెల్లం, కొబ్బరి మరియు బియ్యం పిండి తో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. ఇట్టి దానాన్ని సద్బ్రాహ్మణుడికి గాని మిత్రులకు గాని ఇవ్వాలి.

జ్యేష్ఠ:
జ్యేష్ఠ నక్షత్ర నాలుగు చరణాలు వృశ్చిక రాశియందే ఉంటాయి. నో, యా, యి, యూ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా జ్యేష్ఠ నక్షత్ర వృశ్చిక రాశికి చెందిన వారే. వీరు రాక్షస గణమునకు చెందిన వారు. ఈ నక్షత్ర జాతకులకు తూర్పు, ఉత్తర దిశలు శుభ ఫలితాలను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “ఇంద్రుడు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఇట్టి నక్షత్ర జాతకులు తమకంటే పెద్ద వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి.
౨. చోరులు మరియు చొర ప్రవృత్తి గల వారిని పట్టించుటలో సహకరించాలి
౩. యుద్ద వీరులను మరియు సైన్యాన్ని గౌరవించాలి. వారికి సదా సేవలను అందించాలి.
౪. పెసర్లు, శర్కర మరియు మంచి నెయ్యి తో చేసిన పూర్ణం శ్రీ మహావిష్ణుకు నివేదన చేసి స్వీకరించాలి.
౫. శ్రీ విష్ణు దేవాలయాలకు తరచూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి
౬. శ్రీ మహావిష్ణు దేవాలయాలయందు పెసర్లు దానం చేయాలి
౭. ఒక కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి గాని లేదా రక్షక భటులకు గాని దానం చేయాలి.
౮. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం శుభ ఫలాలను ఇస్తుంది
౯. శ్రీ వైష్ణవ పీఠాధిపతుల సందర్శన మరియు వారి ఆశిస్సులను పొందాలి.

మూల:
మూల నక్షత్ర నాలుగు చరణాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. యే, యో, బ. బి అను అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారందరూ మూల నక్షత్ర ధనుస్సు రాశికి చెందిన వారే. మూలా నక్షత్రములో జన్మించిన వారు రాక్షస గణమునకు చెందిన వారు. మూల నక్షత్ర జాతకులకు తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను, దక్షిణ మరియు పశ్చిమ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు అధిష్టాన దేవత “రాక్షస”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. గృహము నందు ఓషధులను పెంచాలి.
౨. రైతులకు మేలురకం విత్తనాలను దానం చేయాలి
౩. ఔషధ తత్త్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౪. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయూతనందించాలి.
౫. కుమారి లేదా Aloe Vera లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి.
౬. మంగళ వారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషది మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్త్వం గల పుష్పాలను జలం లో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి.

పూర్వాషాఢ:
పూర్వాషాఢ నక్షత్ర 4 చరణాలు కూడా ధనుస్సు రాశి యందే ఉంటాయి. బూ, ధ, భా, ఢ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాషాఢ నక్షత్ర ధనుస్సు రాశి కి చెందిన వారే. వీరు మనుష్య గణమునకు చెందిన వారు, వీరికి తూర్పు మరియు ఉత్తర దిశలు అత్యంత శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలితాలను ఇస్తాయి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత “ఆప”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామమునకు తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయము లేనట్లయితే గ్రామములో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాలి.
౨. ప్రతి గురు మరియు శుక్ర వారాలలో చేపలకు ఆహారం వేయాలి.
౩. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలి వేయాలి
౪. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్ర వారం నాడు దానం చేయాలి
౫. దేవాలయాలకు అగరువత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబి జలము, మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి.
౬. జాలరులు – చేపలు పట్టే వారు కష్టాలలో ఉన్నట్లైతే వారిని ఆపన్నహస్తం అందించాలి.

ఉత్తరాషాఢ:
ఉత్తరాషాఢ ప్రథమ చరణము ధనుస్సు నందును మరియు మిగిలిన మూడు చరణాలు మకర రాశి యందును ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. బే, బో, జా, జి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులే. ఉత్తరాషాఢ ప్రధమ చరణమున ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదముగాను మరియు పశ్చిమ దక్షిణ దిశలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ ద్వితీయ, తృతీయ మరియు చతుర్థ చరణము మకర రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత “విశ్వదేవ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి
౨. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండే లాగ అమర్చాలి లేదా తగిలించాలి
౩. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలాలను ఇస్తుంది
౪. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్ళు పోయాలి
౫. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి
౬. గోధుమలు, బెల్లం, మంచినేయ్యి తో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి

శ్రవణము:
శ్రవణా నక్షత్ర నాలుగు చరణాలు మకర రాశి యందు ఉంటాయి. జు, జే, జో, ఖ అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము కల వారందరూ శ్రావణ నక్షత్ర మకర రాశికి చెందిన వారు. వీరు దేవా గణమునకు చెందిన వారు. శ్రావణ నక్షత్ర మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. శ్రవణా నక్షత్రమునకు అధిపతి చంద్రుడు మరియు అధిష్టాన దేవత “విష్ణు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు విష్ణు మూర్తిని మరియు విష్ణు భక్తులను గౌరవించాలి.
౨. వీరు గృహము నందు ఔషధ గుణములు గల మొక్కలను పెంచాలి.
౩. వీరు అహింస ను ఎత్తి పరిస్థితి లో ప్రోత్సహించ రాదు.
౪. సాధ్యమైనంత వరకు శాకాహార భోజనం చేయాలి
౫. సర్వ భూతములందు దయను కలిగి ఉండాలి. ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండాలి.
౬. బకుల, జుహీ లేదా మల్లెలు, కదంబ పుష్పము, సంపంగి, అశోక, చంప అనబడే పుష్పాలు అన్ని గాని లేదా ఏవేని కొన్ని గాని శ్రీ విష్ణు దేవాలయాలకు బహుకరించండి. ఇట్టి పుష్పాల మొక్కలను ఇట్టి దేవాలయాలకు బహుకరించండి.
౭. శ్రీ మహా విష్ణు దేవాలయాలయందు మూల విరాటు విగ్రహానికి అలంకార సామాగ్రిని సమకూర్చండి.
౮. శ్రీ మహా విష్ణు దేవాలయాలను, శ్రీ వెంకటేశ్వర దేవాలయాలను, శ్రీ కృష్ణ మందిరాలను దర్శించాలి.

ధనిష్ఠ:
ధనిష్ఠ నక్షత్ర రెండు చరణాలు మకర రాశి యందును మరియు చివరి రెండు చరణాలు కుంభ రాశి యందును ఉంటాయి. గ, గి, గు, గే అనబడే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము లేదా వ్యవహార నామము గల వారు ధనిష్ఠ నక్షత్ర జాతకులు. ధనిష్ఠ నక్షత్రము రాక్షస గణమునకు చెందినది. ధనిష్ఠ నక్షత్ర ప్రథమ మరియు ద్వితీయ చరణములతో మకర రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు పశ్చిమ దిశలు శుభ ఫలాలను మరియు దక్షిణ దిశ మధ్యమ మరియు ఉత్తర దిశ హీన ఫలాలను ఇస్తాయి. ధనిష్ఠ నక్షత్ర తృతీయ మరియు చతురత చరణము కుంభ రాశి యందు జన్మించిన వారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి అంగారకుడు మరియు అధిష్టాన దేవత “వసు”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరికి శ్రీ శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
౨. శివాలయాలయందు గోధుమలను సద్బ్రాహ్మణు లకు దానం చేయాలి
౩. కందులు మరియు కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి
౪. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలయందు స్వామి వారి అభిషేకానికి కావలసిన సామాగ్రిని ఇవ్వాలి.
౫. స్త్రీలను ద్వేషించ రాదు. స్త్రీలను గౌరవించాలి.
౬. పాత మిత్రులను సదా గౌరవించాలి
౭. ధర్మ పరాయణత ను కలిగి ఉండాలి. అధర్మాన్ని ప్రోత్సహించ రాదు.

శతభిష (శతతార):
శతభిష నాలుగు చరణాలు కుంభ రాశి యందు ఉంటాయి. గో, స, సి, సు అనే అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము మరియు వ్యవహార నామము గల వారు శతభిష నక్షత్ర కుంభ రాశికి చెందిన వారగుదురు. శతభిష నక్షత్ర జాతకులు రాక్షస గణమునకు చెందిన వారు. శతభిష నక్షత్ర కుంభ రాశి యందు జన్మించిన వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు మరియు అధిష్టాన దేవత “వరుణ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. వీరు ఎల్లపుడూ పరిశుభ్రమైన దుస్తులను మాత్రమె ధరించాలి.
౨. నీటియందు తిరిగే చేపలు మరియు ఇతర జంతు రాశికి ఆహారాన్ని వేయాలి.
౩. వీరు సముద్ర వస్తువులను ఇతరులకు దానం చేయాలి
౪. స్వల్ప ప్రమాణంలో మద్యం ను నీటిలో ప్రవహింప చేయాలి.
౫. వీరు మాధ్యమును సేవించ రాదు (ఆ విషయానికి వస్తే మద్యం ఎవరు కూడా సేవించ రాదు)
౬. వీరు మినుములు మరియు నల్లని నువ్వులు శివాలయాలయందు దానం చేయాలి

పూర్వాభాద్ర:
పూర్వాభాద్ర మొదటి మూడు చరణాలు కుంభ రాశి యందును మరియు చివరి పాదము మీన రాశి యందును ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మనుష్య గణమునకు చెందిన వారు. సే, సో, ద, ది అక్షరాలతో ప్రారంభమగు జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ పూర్వాభాద్ర నక్షత్రమునకు జన్మించిన వారు. పూర్వాభాద్ర మొదటి మూడు చరణము లందు జన్మించిన కుంభ రాశి వారికీ తూర్పు మరియు ఉత్తర దిశలు శుభ ప్రదము, పశ్చిమ మరియు దక్షిణ దిశలు మధ్యమములు. పూర్వాభాద్ర చతుర్థ చరణము మీన రాశి యందు జన్మించిన వారికి ఉత్తర మరియు దక్షిణ దిశలు శుభ మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలు మధ్యమ లేదా హీన ఫలాలను ఇస్తాయి. పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు అధిష్టాన దేవత “అజైకపాద”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఆవులను కాచే కాపరులకు కష్టాలలో ఉన్న వారికి చేయూతనందించాలి.
౨. గృహము నందు మామిడి చెట్టు పెంచాలి. పెంచే సౌకర్యము లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్ళు పోయాలి.
౩. ఔషధీ మొక్కలను గృహము నందు పెంచాలి.
౪. ఆయుర్వేద వైద్యులను గౌరవించాలి. అవసరం అయినపుడు ఆయుర్వేద మందులను సేవించాలి.
౫. దొంగలను పట్టించుటలో సహకరించాలి
౬. ఒంటరిగా జీవించే సాదువులకు నెయ్యిని దానం చేయాలి.
౭. గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలయందు శివునికి చక్కని నాణ్యమైన గోఘ్రుతం తో అభిషేకం చేయాలి. ఇట్టి ఆవునేయ్యిని శివాలయాలకు దానం చేయాలి.
౮. వేద పండితులను సన్మానించాలి మరియు వారి ఆశిస్సులు పొందాలి.
౯. ఏక పాదులకు (కుంటి వారు) సేవ చేయాలి. ప్రధానంగా వారికి వైద్య సహాయాన్ని అందించాలి.

ఉత్తరాభాద్ర:
ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశిలో ఉంటాయి. దూ, శం, ఝూ, థ – అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము కల వారందరూ ఉత్తరాభాద్ర నక్షత్ర మీన రాశి జాతకులు. వీరు మనుష్య గణమునకు చెందిన వారు. ఈ నక్షత్రమున జన్మించిన వారికీ ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు మరియు అధిష్టాన దేవత “ఆహిర్బుద్నియ”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. ఇట్టి జాతకులు నిరంతరమూ దాన ధర్మాదులను ఆచరిస్తూ ఉండాలి.
౨. బ్రాహ్మణులు, ప్రధానంగా వృద్ధ బ్రాహ్మణులు, తపస్సు చేసుకునే వారి ఆశిస్సులు సదా పొందాలి.
౩. విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేయాలి.
౪. “అష్టౌ బ్రాహ్మణాన్” ఎనిమిది మంది బ్రాహ్మణులకు పాలతో చేసిన మిఠాయిలు, కోవా మొదలగునవి దానం చేయాలి.
౫. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలయందు పాలతో చేసిన మిఠాయిలు మరియు కోవా మొదలగునవి స్వామి వారికి నివేదన చేయాలి.
౬. వృద్ధాశ్రమాలయందు ఉన్న వృద్ధులకు మంచి నాణ్యమైన విలువైన ధాన్యము, పంచదార, బియ్యం మరియు పాలు, వస్త్రాలను దానం చేయాలి. (ఇట్టి వస్తువు లందు ఏదేని ఒకటి కాని లేదా అన్నీ కాని చేయవచ్చు. యథాశక్తి.)

రేవతి:
రేవతి నక్షత్ర నాలుగు చరణాలు మీన రాశి యందు ఉంటాయి. దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మ నామము గల వారు మరియు వ్యవహార నామము గల వారందరూ రేవతి నక్షత్ర మీన రాశికి చెందినా వారే. ఇట్టి నక్షత్ర జాతకులు దేవా గణమునకు చెందిన వారుల. ఈ నక్షత్రమున జన్మించిన వారికి ఉత్తర దక్షిణ దిశలు శుభాప్రదముగాను మరియు తూర్పు మరియు పశ్చిమ మధ్యమ ఫలాలను ఇస్తాయి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు మరియు అధిష్టాన దేవత “పూషన్”. జాతక రీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవిత కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించ బడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి.

ఉపశమనాలు:
౧. “దక్షిణావర్తి శంఖాన్ని” శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి.
౨. వీరు గృహము నందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి
౩. గ్రామము నందు గల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాల హారాన్ని అమ్మవారి మూల విరాట్టుకు బహుకరించాలి.
౪. శంఖము, ముత్యాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి.
౫. సువాసన గల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం చేయాలి.
౬. పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహా విష్ణును పూజించాలి.
౭. ఉప్పు, పద్మాలు, పలు విధాలైన ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి.

Sunday, February 18, 2024

సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రము

 సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రము


అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే
అసమాన బలా యార్తరక్షకాయ నమోనమః 1

ఆదిత్యా యాది భూతాయ ఆఖిలాగమ వేదినే
అచ్యుత్యాయాఖిలాజ్ఞాయ అనంతాయ నమోనమః 2

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తేనమః 3

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః 4

ఉజ్జ్వలా యోగ్రరూపాయ ఊర్ద్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీ కేశాయ తే నమః 5

ఊర్జస్వలాయ వీర్యాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావ రూపయుక్త సారథయే నమః 6

ఋషివంద్యాయ ఋక్చాస్త్రే ఋక్షచక్ర చరాయ చ
ఋజుస్వభావ చిత్తాయ నిత్యస్తుతాయ తే నమః 7

ౠకార మాతృ కావర్ణ రూపాయోజ్వల తేజసే
ౠక్షాధినాథ మిత్రాయ పుష్కరాక్షాయ తే నమః 8

ఇప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయచ
కనత్కనక భూషాయ ఖద్యోతాయ నమోనమః 9

ఐనితాఖిల దైత్యాయ సత్యానంద స్వరూపిణే
అపవర్గ ప్రదాయార్త శరణ్యాయ నమోనమః 10

ఏకాకినే భగవతే సృష్టి స్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః 11

ఐశ్వర్యద్రాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశది క్సంప్రకాశాయ భక్తవశ్యాయ తేనమః 12

ఓజస్కరాయ జయినే జగదానంద హేతవే
జన్మమృత్యు జరావ్యాధి వర్జితాయ నమోనమః 13

ఔన్నత్య పదసంచార రథస్థా యాత్మ రూపిణే
కమనీయకరా యాబ్జవల్లభాయ నమోనమః 14

అంతర్బహీర్ ప్రకాశాయ అచింత్యా యాత్మరూపిణే
అచ్యుతాయా మరేశాయ పరస్మై జ్యోతిషే నమః 15

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణం పతయేనమః 16

ఓం నమో భాస్కరాయ దిమధ్యాంత రహితాయచ
సౌఖ్యప్రదాయ సకల జగతాం పతయేనమః 17

నమస్సూర్యాయ కవయే నమోనారాయణాయచ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః 18

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐ మిష్టార్దధాయస్తు సుప్రసన్నాయ నమో నమః 19

శ్రీమతే శ్రేయస్సే భక్తకోటి సౌఖ్య ప్రదాయినే
నిఖలాగమవేద్యాయ నిత్యానందాయతే నమః 20

యో మానవ స్సంతత మర్క మర్చయన్ పఠేత్ ప్రభాతే విమలేన చేతసా
ఇమాని నామాని చ నిత్య పుణ్యం ఆయుర్థనం ధాన్యముపైతి నిత్యం 21

ఇమం స్తవం దేవవరస్య కీర్తయే చ్ఛృణోతియో యం నుమనాస్సమహితః
స ముచ్యతే శోకదవాగ్ని సాగరా ల్ల భేత సర్వా న్మనసో యథేప్సి తాన్ 22

ఫలం: సర్వాభీష్టసిద్ధి, శోకవినాశనం

Saturday, February 17, 2024

ఋణవిమోచన అంగారక స్తోత్రం

అప్పులు(ఋణములు) ఉన్నవారికి త్వరగా ఇబ్బందులు తొలగడానికి ఈ స్తోత్రం చాలా ఉపయోగపడుతుంది. కుజుడు గొడవలు, యుద్ధం, భూమి, వాహన, ఇల్లు, శత్రు, రోగ, ఋణ, శస్త్ర చికిత్స కారకుడు. ఈయన జాతకంలో బాలేకపోతే ఇవన్నీ ఇబ్బందుల్ని కలిగిస్తాయి. జాతకంలో బాగుంటే ఇవన్నీ యోగిస్తాయి. కాబట్టి దురదృష్టవశాత్తు ఎవరికైనా ఋణ బాధలుంటే ఈ ఋణవిమోచన అంగారక స్తోత్రం 41 రోజులు రోజుకి 11సార్లు లేదా 21సార్లు లేదా కనీసం 7సార్లు పారాయణ చేయండి. తప్పక బాధల నుండి ఉపశమనం లభించి ఇబ్బంది నుండి గట్టెక్కే మార్గం దొరుకుతుంది త్వరలో సమస్య నుండి విముక్తి పొందుతారు.







ఋణవిమోచన అంగారక స్తోత్రం :

స్కంద ఉవాచః

ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం - హితార్థం హితకామదం

శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య - గౌతమ ఋషిః - అనుష్ఠుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః

ధ్యానం
రక్తమాల్యాంబరధరః - శూలశక్తిగదాధరః
చతుర్భుజో మేషగతో - వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః - సర్వకామ ఫలప్రదః
లోహితో లోహితాక్షతశ్చ - సామగానాం కృపాకరః
ధరత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందనః
అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః
సృష్టేః కర్తాచ హర్తాచ - సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని - నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య - ధనం ప్రాప్నో త్య సంశయం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపైర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రతః
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృశన్

మూలమంత్రం :

అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
ఏవంకృతే న సందేహో - ఋణం హిత్వా ధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా

అర్ఘ్యము :

అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి - గృహాణార్ఘ్యం నమోస్తుతే


ఇతి ఋణ మోచన అంగారక స్తోత్రం సంపూర్ణం

ఈ రోజు భీష్మాష్టమి సందర్భంగా - భీష్మ తర్పణ విధి

ఈ రోజు మాఘ శుక్ల అష్టమి. భీష్మ అష్టమి. ఈ రోజు భీష్ముడు తన కు వున్న స్వచ్ఛంద  మరణ వర ప్రభావం తో తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజు. 
ఈ రోజు భీష్ముడికి తర్పణాలు ఇవ్వడం ఆచారం. 
విష్ణు సహస్ర నామం పారాయణ చెయ్యాలి. భీష్ముడి గాథను స్మరణం చేసుకోవాలి లేదా చదవాలి. 

భీష్మతర్పణ విధి - భీష్మాష్టమి:
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం.

శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి

నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
తర్పణము
1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)

1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)

పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)

అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!

ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"

వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!

అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్ 

Friday, February 16, 2024

రథ సప్తమి శుభాకాంక్షలు

🌺రధసప్తమి_శుభాకాంక్షలు🌺

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రధసప్తమి పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

_*"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"*_

ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.

1. ఈ జన్మలో చేసిన, 
2. జన్మాంతరాలలో చేసిన, 
3. మనస్సుతో, 
4. మాటతో, 
5. శరీరంతో, 
6. తెలిసీ, 
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి
నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

 తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు.

 ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
_______________________________

🌹సూర్యుని ఎందుకు ఆరాధించాలి?🌹

1. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

2. ప్రపంచవ్యాప్తంగా సూర్యారాధన

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడు కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షినాయనం ముగించుకుని ఉత్తరాయనం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు.

3. సూర్యుడికి సంబంధించిన పురాణ కథలు

సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

4. సూర్యుడే జ్ఞానానికి ఆది దేవుడు

వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు

5. సూర్యారాధన ప్రాముఖ్యత

ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.

6. సూర్య చికిత్స ప్రతిభ

సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని అర్థమవుతుంది.

అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు.

అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు.

ప్రత్యక్ష దైవమైన, శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్యజయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమినాడు జరుపుకుంటారు. ఈ సూర్యజయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సముదాయం రథం ఆకారంలో వుండడం వలన ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది.
ఈ విశేషమైన పుణ్యదనమున అర్కః అను నామము కలిగిన
సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల(తెల్ల జిల్లేడు ఆకుల) కు రంధ్రం చేసి, ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై, భుజములపై, హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలెను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్యనుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించాలి.

సూర్యుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యుని అనుగ్రహం కొరకు ఈ ద్వాదశ నామాలను సూర్యునికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉచ్చరించండి. వెంటనే అనుగ్రహం కలుగుతుంది.

సూర్య ద్వాదశ నామాలు

1. ఓం మిత్రాయ నమః
2. ఓం రవయే నమః
3. ఓం సూర్యాయ నమః
4. ఓం భానువే నమః
5. ఓం ఖగాయ నమః
6. ఓం పూష్లే నమః
7. ఓం హిరణ్య గర్భాయ నమః
8. ఓం మరీచయే నమః
9.ఓం ఆదిత్యాయ నమః
10.ఓం సవిత్రే నమః
11. ఓం అర్కాయ నమః
12. ఓం భాస్కరాయ నమః

Sunday, February 11, 2024

2024 కుజ గ్రహ సంచారం - దక్షిణ భారత దేశం పై తీవ్ర అస్థిరత కలిగించే ప్రభావం

 

ప్రస్తుతం మకర రాశి లో సంచారం చేస్తున్న కుజ గ్రహం , ఏప్రిల్ 2 వ తారీకు నుండీ మొదలుకుని శని గ్రహం తో పూర్వ భాద్ర నక్షత్రం లో యుతి లో వుండడం జరుగుతుంది. ఏప్రిల్ 10 వ తారీకు న ఖచ్చితమైన యుతి లో ఈ రెండు పాప గ్రహాలు వుంటాయి. ఏప్రిల్ 19 వ తారీకు నుండీ ఈ యుతి విడి పడి రెండు గ్రహాలు దూరం అవుతాయి. శని కుజులు ఇలా యుతి లో వుండడం వల్ల దుర్ఘటన లు ఎక్కువ గా జరిగే అవకాశం వుంటుంది. కుజుడు ముఖ్యం గా దక్షిణ భారత దేశాన్ని ప్రభావితం చేస్తాడు కనుక వింధ్యా పర్వతాల నుండీ దక్షిణ రాష్ట్రాలు అన్నీ శ్రీ లంక తో సహా ఎక్కువ ప్రభావితం అవుతాయి.

శని కుజులు యుతి తరువాత మే 12 నుండీ మొదలుకుని రాహు కుజులు యుతి లో వుంటారు. మే 19 న ఖచ్చితమైన యుతి లో ఈ రెండు గ్రహాలు వుంటాయి. మే 27 తరువాత నుండీ ఈ రెండు గ్రహాల యుతి ప్రభావం తగ్గుతుందని చెప్పవొచ్చు.
పైన చెప్ప బడిన రెండు గ్రహ యుతు ల కాలం లో హింసాత్మక ఘటనలు, అశాంతి, యాక్సిడెంట్లు, పోలీసు చర్య లు వంటివి ఎక్కువగా వుండే అవకాశం ఉంది.
ఆగస్ట్ నుండీ మిధున, కర్కాటక రాశులలో కుజుడు మామూలుగా కంటే ఎక్కువ కాలం వుంటాడు. ఈ సంవత్సరం కుజ వక్ర సంచారం, స్థంభన వున్నాయి.
రాబోయే క్రోధి నామ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం గమనార్హం.
దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగబోయే సంవత్సరం లో కుజుడి విపరీత యుతి , గతులు ఆందోళన కరమే.
ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య వైరం ఎక్కువ వుంటుంది. ఒక దక్షిణ రాష్ట్రం లో ఏం ఎల్ ఏ ల తిరుగుబాటు మూలం గా ప్రభుత్వం సంవత్సరం ద్వితీయార్థంలో కూలిపోవడం జరుగుతుంది.

ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం


ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం : 

"నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహిదేవః జగత్పతే!!"

అర్థం : 
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు.

సూర్య ద్వాదశ నామాలు

1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూర్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8. ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః

ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.

Saturday, February 10, 2024

ఈ రోజు నుండీ మాఘ మాసం

ఈరోజు నుండి మాఘ మాసం ప్రారంభం

చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది. కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత.... అంత ప్రాధాన్యత!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం"

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని,బావుల వద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.
పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే, కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి
.
స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించాలి.

ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.
అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా, సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి. కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని
ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. శ్రీ పంచమి, వరచతుర్దశి, వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్ముఏకాదశి, మాఘ పూర్ణిమ.

Friday, February 2, 2024

Tara&Chandra Bala, Ghataka Chakra, Ashtama Chandra Dosha for Tomorrow - 03.02.2024

 

Click on the above image for a better view

161 st Birth Anniversary of Swami Vivekananda

 


On the 161 st Birth Anniversary of Swami Vivekananda , may his teachings inspire us towards wisdom,compassion and unity. 

Wishing You all a day filled with reflection and Positive Energy