Sunday, May 29, 2022

జూన్ నెలలో ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలి

 


** శ్రీ గురుభ్యో నమః **


జూన్ నెలలో ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలి  :


మేష రాశి : 

1. శుక్రవారం రోజు అలచందలు దానం చెయ్యాలి 

2. శుక్ర మంత్రం ఏదైనా జపం/ధ్యానం చేసుకోవాలి 

3. దుర్గాదేవి కి శుక్రవారాల్లో 20 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి 

4. కనక దుర్గా దేవి ఆలయం దర్శించి , కుంకుమార్చన చేయించుకోవాలి 

5. శుక్రవారాలు ఉపవాసం చెయ్యడం మంచిది 


వృషభ రాశి : 

1. ఈ  నెలలో సూర్యారాధన మంచిది 

2. గోధుమరవ్వ దానం చెయ్యాలి 

3. ఆదివారాల్లో విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకుని 18 ప్రదక్షిణలు చెయ్యాలి 

4. సూర్య గ్రహానికి అభిషేకం , హోమం చెయ్యడం మంచిది 

5. రవి గ్రహ జపం - చేయించుకోవాలి 


మిధున రాశి :

1. కేతు జపం చేయించుకోవాలి 

2. ఉలవలు దానం చెయ్యాలి 

3. లక్ష్మీ గణపతి హోమం ఉండ్రాళ్ళ తో చెయ్యాలి 

4. మంగళ వారాల్లో ఉపవాసం మంచిది 


కర్కాటక రాశి :

1. శని భగవానుడి ధ్యానం మంచిది 

2. శని జపం చేయించుకోవాలి 

3. శని వారాల్లో నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చెయ్యడం మంచిది 

4. నల్ల నువ్వులు దానం చెయ్యాలి 

5. జమ్మి చెట్టు మొదట్లో శనివారం ప్రదోష కాలం లో దీపారాధన చెయ్యాలి 

6. దశరధ ప్రోక్త శని స్తోత్రం పారాయణ మంచిది 


సింహ రాశి  :

1. శని భగవానుడి ధ్యానం మంచిది 

2. శని జపం చేయించుకోవాలి 

3. శని వారాల్లో నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చెయ్యడం మంచిది 

4. నల్ల నువ్వులు దానం చెయ్యాలి 

5. జమ్మి చెట్టు మొదట్లో శనివారం ప్రదోష కాలం లో దీపారాధన చెయ్యాలి 

6. దశరధ ప్రోక్త శని స్తోత్రం పారాయణ మంచిది 


కన్యా రాశి : 

1. కుజ గ్రహ జపం చేయించుకోవాలి 

2. 1. 25 kg కందులు ఒక  మంగళవారం దానం చేయడం మంచిది 

3. ఆంజనేయ స్వామి కి మంగళ వారం తమలపాకులతో అర్చన చెయ్యాలి 

4. మంగళ వారం ఉపవాసం చెయ్యడం మంచిది 

5. కుజ అష్టోత్తర శత శత నామ స్తోత్రం పారాయణ చెయ్యడం మంచిది 


తులా రాశి : 

1. ఈ  నెలలో సూర్యారాధన మంచిది 

2. గోధుమరవ్వ దానం చెయ్యాలి 

3. ఆదివారాల్లో విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకుని 18 ప్రదక్షిణలు చెయ్యాలి 

4. సూర్య గ్రహానికి అభిషేకం , హోమం చెయ్యడం మంచిది 

5. రవి గ్రహ జపం - చేయించుకోవాలి 


వృశ్చిక రాశి : 

1. ఓం బుధాయ నమః - ఈ  మంత్రం ప్రతీ రోజూ 17 సార్లు ధ్యానం చెయ్యాలి 

2. 1. 25 kg పెసలు బుధవారం దానం చెయ్యాలి 

3. బుధ జపం చేయించుకోవాలి 

4. బుధ గ్రహ స్తోత్రం పారాయణ మంచిది 


ధను రాశి : 

1. రాహు గ్రహ ధ్యానం మంచిది 

2. 1. 25 Kg  మినుములు ఆదివారం రోజున దానం చెయ్యాలి 

3. సుభ్రమణ్య స్వామి కి అభిషేకం చేయించాలి 

4. రాహు జపం చేయించుకోవాలి 

5. ఆదివారాల్లో ఏక భుక్తం చెయ్యడం మంచిది 


మకర రాశి : 

1. ఈ  నెలలో సూర్యారాధన మంచిది 

2. గోధుమరవ్వ దానం చెయ్యాలి 

3. ఆదివారాల్లో విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకుని 18 ప్రదక్షిణలు చెయ్యాలి 

4. సూర్య గ్రహానికి అభిషేకం , హోమం చెయ్యడం మంచిది 

5. రవి గ్రహ జపం - చేయించుకోవాలి 

6. శ్రీ విష్ణు అష్టోత్తరం పారాయణ చేసుకోవాలి 


కుంభ రాశి : 

1. ఈ  నెలలో సూర్యారాధన మంచిది 

2. గోధుమరవ్వ దానం చెయ్యాలి 

3. ఆదివారాల్లో విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకుని 18 ప్రదక్షిణలు చెయ్యాలి 

4. సూర్య గ్రహానికి అభిషేకం , హోమం చెయ్యడం మంచిది 

5. రవి గ్రహ జపం - చేయించుకోవాలి 

6. శ్రీ విష్ణు అష్టోత్తరం పారాయణ చేసుకోవాలి 


మీన రాశి :  

1. రాహు గ్రహ ధ్యానం మంచిది 

2. 1. 25 Kg  మినుములు ఆదివారం రోజున దానం చెయ్యాలి 

3. సుభ్రమణ్య స్వామి కి అభిషేకం చేయించాలి 

4. రాహు జపం చేయించుకోవాలి 

5. ఆదివారాల్లో ఏక భుక్తం చెయ్యడం మంచిది


శుభం భూయాత్


శివరామకృష్ణ జ్యోతిష్యాలయం

96407 54054

91828 17435

Tuesday, May 24, 2022

భరణీ నక్షత్రం వారు చేయవలసిన పరిహారాలు

1.శివ పంచాక్షరీ జపం

2. రుద్రార్చనలు - ఇంట్లో స్పటిక లింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్ఛారణతో ప్రతి నిత్యం శివలింగానికి అభిషేకం చేయడం.

3.పొట్టుతో ఉన్న బొబ్బర్లు భుజించడం (పొట్టు గల భిన్నము చేయని ధాన్యము నీటియందు నానబెట్టుకుని భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం.)

4. బొబ్బర్లు, లవణం, పత్తి (గింజలు తీయని పత్తి) దానం చేయడం

5. ఇంట్లో ప్రత్తి మొక్క పెట్టుకొని ప్రతి నిత్యం దానికి నీరు పోయడం.

6.పంచదారతో చేసిన బొబ్బర/శనగ/పెసర/కంది (ధాన్యానికి పొట్టు ఉండాలి)పూర్ణం ప్రతి నిత్యం శ్రీ మహాలక్ష్మికి నైవేద్యం చేసి తినాలి, వివాహం అయిన వారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి. (ఇది లాలికితాబ్లో ఇవ్వబడిన రెమిడి).

Monday, May 23, 2022

అశ్వినీ నక్షత్రం వారు చేయవలసిన పరిహారాలు

 1. శుభ్రమణ్యస్వామి ఆరాధన, మంగళవారం ఉపవాస దీక్షలు.

2. నిరుపేదలకు వైద్య సహాయం అందించడం.

3. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం.

4. మంగళవారం బ్రాహ్మణుడికి ఉలవలు దానం చేయడం.

5.లోహం తో చేసిన అశ్వప్రతిమను దక్షిణ ముఖం గా ఇంటి వాయువ్య మూల లో  అమార్చాలి. 

6. వైడూర్యము,పగడం జాతి రత్నాలను దానం చేయాలి

Saturday, May 21, 2022

మే 28 న కుజ గురువులు అతి దగ్గరి సంయోగం


 ** శ్రీ గురుభ్యోనమః **

గ్రహ వార్తలు
ఇవ్వాళ్ళ వైశాఖ కృష్ణ సష్టి. భూసూక్త పారాయణ చేసుకోవడం లేదా వీలైనన్ని సార్లు వినడం వల్ల భూ, గృహ లాభాలు కలుగుతాయి .
నిన్న, ఈరోజు శుక్రుడు తన ఉచ్ఛ రాశైన మీన రాశి లో వర్గోత్తమం లో ఉండి అతి శుభ బలం తో ఉంటున్నాడు. భరణీ, పుబ్బా,పూర్వాషాఢ నక్షత్రాల వారికీ, వృషభ, తులా రాశుల వారికీ చాలా మంచిది. లక్ష్మీ ఆష్టోత్తర పారాయణ చాలా శుభ ఫలితాలు ఇస్తుంది.
మే 17 న కుజుడు మీన రాశి ప్రవేశం తో గురు మంగళ యోగం ఏర్పడింది. శుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనం వల్ల కామ్యార్ధ సిద్ధి కలుగుతుంది.
మే 28 న కుజ గురువులు అతి దగ్గరి సంయోగం లో వుంటారు. ఆ రోజు న శని త్రయోదశి, మాస శివరాత్రి కూడా అయ్యింది. చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున ఉదయం శుభ్రమణ్యా రాధన, శనికి తైలాభిషేకం , సాయంత్రం ప్రదోష కాలం లో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల గ్రహ దోష నివృత్తి కలుగుతుంది.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Friday, May 6, 2022

Bhanu Saptami on 8th May,Sunday


**Sree Gurubhyo Namah**

Sunday and Saptami fall on the same day on 8th May and is Bhanu Saptami. As the Nakshatra is Pushyami on that date , Arka Pushya Yoga is formed.

This day is very auspicious for praying lord Surya with Japa/Dhyana/Homa.
Praying Lord Surya on this day will increase Longevity, will improve health for those suffering from illnesses, people expecting good Job, Promotion will get what they wish Works related to Government will get resolved favourably.

Rituals to be done :
1. Maha Souram and Aruna Parayana at your home by veda panditas
2. Performing Gayatri Homa by yourself if you can or with the help of Purohitas
3. Japa for Ravi Graha
4. Performing Ravi Homa
5. Visiting Temple of Lord Surya and performing pooja
6. Visiting Lord Rama Temple

Make use of the most auspicious time to get the relief you wish.

వొచ్చే 8 వ తారీఖు ఆదివారం,భాను సప్తమి


**శ్రీ గురుభ్యోనమః **

వొచ్చే 8 వ తారీఖు ఆదివారం ,సప్తమి కలిసిరావడం వాళ్ళ భాను సప్తమి అయ్యింది . ఈ రోజు పుష్యమీ నక్షత్రం కూడా కావడం తో అర్క పుష్య యోగం ఏర్పడింది . ఈ రోజు సూర్య భగవానుడికి పూజ చేసుకోవడానికి చాలా విశేషమైన రోజు . 

ఈ రోజు సూర్య భగవానుడికి జప,ధ్యాన ,హోమాలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుండీ బయటపడొచ్చు . ప్రమోషన్ కావలసిన వారు ,ప్రభుత్వ పనులు సానుకూలం కావాలనుకునే వారూ , మంచి పదవీ ప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు పెరగడం కోసం , దీర్గాయుష్షు కోసం ఈ రోజు తప్పని సరిగా సూర్య భగవానుడి ప్రసన్నత కోసం వారి శక్తి కొద్దీ పూజించాలి . 

ఈ రోజు న మీ ఇంట్లో వేద పండితులతో మహా సౌరము ,అరుణ పారాయణ చేయించుకోవడం  ,గాయత్రీ హోమం చేసుకోవడం , 108 సార్లు సూర్య అధర్వశీర్ష పారాయణం చేయించుకోవడం ,రవి హోమం చేసుకోవడం లేదా చేయించుకోవడం , రవి గ్రహ జపం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి.  

శుభం భూయాత్ 
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం 
96407 54054
91828 17435

 

Thursday, May 5, 2022

కార్తీక,మాఘ మాసాల తరువాత వైశాఖం అంతటి మహత్యం ఉన్న మాసం.

 


మే 1 వ తేదీ నుండీ వైశాఖ మాసం మొదలైయ్యింది.

కార్తీక,మాఘ మాసాల తరువాత వైశాఖం అంతటి మహత్యం ఉన్న మాసం.
ధారా పాత్ర ద్వారా శివుడి అభిషేకం జరిగేలా ఏర్పాటు చెయ్యడం శుభఫలితాలు కలుగుతాయి.
వైశాఖ మాసం లో నదీ స్నానం చాలా మంచిది. గంగా గోదావరీ నదీ జలాలని స్నానపు నీటిలోకి ఆవాహన చేసుకుని స్నానం చెయ్యాలి.
ఈ నెలలో మామిడి పళ్లు , చెరకు దానం చెయ్యడం మంచిది. తాగు నీరు,మజ్జిగ దానం చెయ్యడం వల్ల మంచిఫలితాలు.
స్త్రీలు కుంకుమ దానం చెయ్యడం శుభం.

Monday, May 2, 2022

రేపు వైశాఖ శుక్ల తృతీయ ; 03. 05. 2022 ; మంగళవారం . పరశురామ జయంతి , అక్షయ తృతీయ.


 **శ్రీ గురుభ్యోనమః**

రేపు వైశాఖ శుక్ల తృతీయ ; 03. 05. 2022 ; మంగళవారం . పరశురామ జయంతి , అక్షయ తృతీయ. రేపు త్రేతా యుగాది కూడా .
రేపు రోజంతా చంద్రుడు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశి లో సంచారం చేస్తాడు . తులా రాశి వారికి చంద్రాష్టమ స్థితి .
పునర్వసు,విశాఖ,పూర్వాభాద్రపదా వారికి నైధన తార
భరణీ ,పుబ్బ ,పూర్వాషాఢ వారికి విపత్ తార
ఆశ్లేష ,జ్యేష్ఠ ,రేవతీ వారికి ప్రత్యక్ తార
రేపటి (03. 05. 2022) తారా చంద్ర బలాలు శుభ కాల దుర్ముహుర్త రాహు వర్జ్య కాలాలు తెలిపే పట్టిక ఇవ్వబడింది
రేపు కుజ ,చంద్ర ,శుక్ర గ్రహ మంత్రాలు జప ధ్యానాలు చేసుకోవడం శుభం. లక్ష్మీ నారాయణులను పూజించాలి .
కనక ధారా స్తోత్ర పారాయణ విశేష ఫలితం ఇస్తుంది.