Saturday, December 7, 2024
Tara Bala of Jupiter in Transit for each nakshatra in 2025-26
Click on the image for an enlarged view
Above chart shows transit of Jupiter through nakshatras and the periods of transit and the Tarabala of Jupiter transit for each nakshatra is also given.
If Jupiter is transiting in your Janma, Vipat,Pratyak or Naidhana tara , you should perform remedies for Jupiter during the period in which the transit happens.
Thursday, December 5, 2024
Tara Bala of Saturn Transit for each Nakshatra in 2025-26
Following chart shows the Tara Bala of Saturn for each Nakshatra in the year 2025-2026. Saturn transits through Purva Bhadrapada and Uttara Bhadra Pada during the year as shown in the chart below.
Remedies for Saturn are to be done during the period in which Saturn transits your Janma,Vipat, Pratyak or Naidhana Tara .
Natives of Mercury nakshatras Asresha, Jyeshta, Revati have a fully beneficial Saturn transit during the Coming Viswavasu year. Even though Revati natives have Sade Sati period running they will not experience much of its impact.
Wednesday, November 27, 2024
Tuesday, November 5, 2024
Thursday, October 31, 2024
Wednesday, October 30, 2024
రాశి ఫలితాలు నవంబర్ 3 నుండీ నవంబర్ 9 వరకు
మేష రాశి :
వారం మొదట్లో పనులు పూర్తి కాక ఇబంది పడతారు . శుక్ర శని వారాలు అనుకూలం . ఈ రాశి వారు ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడే సూచనలు వున్నాయి . ఆహార నియమాలు పాటించాలి.జీవిత భాగస్వామి, సంతాన ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . దగ్గిర బంధువులతో, భార్య తో లేదా భర్త తో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి . వారం చివరిలో చంద్ర బలం పెరుగుతోంది . అనుకున్న పనులు అన్నీ అధికారుల అండ తో పూర్తి అవుతాయి . శుక్ర శని వారాల్లో ధన లాభం , గృహం లో సంతోష కరమైన వాతావరణం ఉంటాయి .
వృషభ రాశి :
వారం మొదట్లో అన్నింటా అనుకూలతలు ఉంటాయి. మిత్రులు ,బంధువుల రాక తో ఆనందం గా వుంటారు . వారం మధ్యలో మోకాళ్ళ నొప్పి తో బాధ పడతారు . బుధ గురు , వారాల్లో అనుకోని ఆటంకాల వల్ల పనులు వాయిదా పడతాయి . ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల తో వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువై ఒత్తిడి పెరుగుతుంది . కొన్ని విషయాలలో అవమానాలు ఎదుర్కో వలసి వస్తుంది.శుక్ర శని వారాల్లో విచారం , ఆందోళన తగ్గు ముఖం పట్టి ఊపిరి పీల్చు కుంటారు . వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు తొలగుతాయి . శుక్ర శని వారాల్లో పనులు వాయిదా వెయ్యకండి.
మిధున రాశి :
ఈ వారం సోమ మంగళ వారాలు అనుకూలం . మీ పిల్లల విషయాల్లో ఆందోళన చెందుతారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి . తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . ప్రేమ వ్యవహారాలు కలిసి రావు . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . కోర్టు వ్యవహారాలు కలిసి రావు . ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం లభిస్తుంది . ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోండి . కుటుంబ సభ్యుల తో విభేదాలు వొచ్చే అవకాశం వుంది . ఆలోచించి మాట్లాడండి . స్థిరాస్తుల విలువలు తగ్గే అవకాశం వుంది . వారం చివరిలో జీవిత బాగా స్వామి తో విభేదాలు .
కర్కాటక రాశి :
ఏకా దశ గురువు మీ రాశికి చాలా బలాన్ని ఇస్తున్నాడు .అష్టమ శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాడు .గురువు యొక్క ఈ అనుకూల సంచారం వల్ల కొందరికి మంత్ర సిద్ధి , ఉద్యోగ లాభం వంటి ఫలితాలు ఉంటాయి . ఈ రాశి వారికి జన్మ రాశి లో కుజ సంచారం వల్ల జ్వరం వల్ల ఇబ్బంది పడొచ్చు . వాహనాలతో ఇబ్బందులు ఉంటాయి . బంధువులతో, పై అధికారులతో వైరం రాకుండా జాగ్రత్త పడాలి . బుధ వారం నుండీ చంద్ర బలం పెరుగుతుండడం వల్ల నూతన వస్తు ప్రాప్తి , ఆరోగ్యము , శత్రువులపై జయం , మిత్ర లాభం వంటి ఫలితాలు ఉంటాయి . రాహువు నవమ సంచారం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు సరైన ప్లానింగ్ లేకపోతే ఇబ్బందులు పడవలసి ఉంటుంది .
సింహ రాశి :
రవి , బుధ , శుక్రులు అనుకూలంగా వున్నారు . అనవసరమైన ఖర్చులు అదుపు చెయ్యాలి . మూడవ ఇంట రవి సంచారం వల్ల ధన లాభం , బంధు మిత్రుల కలయిక , స్థాన లాభం , అనుకున్నది సాధించడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి . శుక్ర శని వారాల్లో అనుకూలతలు ఎక్కువ . సంతాన పురోగతి విషయం లో సంతోషం గా వుంటారు . నాల్గవ ఇంట బుధ సంచారం వల్ల తల్లి ఆరోగ్యం మెరుగు పడుతుంది . ధన ధాన్య లాభం ఉంటుంది . ప్రారంభించిన పనులు మంచి ఫలితాలను ఇస్తాయి . 12 వ ఇంట కుజ సంచారం వల్ల దేశాంతర వాసం , పలుకుబడి తగ్గడం , అనేక రకాల ఖర్చులు , స్త్రీ లతో వివాదాలు ఉండొచ్చు .
కన్యా రాశి :
సోమ మంగళ వారాలు అనుకూలం . బుధవారం చెయ్యవలసిన పనులు పూర్తి కాక ఆందోళన పడతారు . మీకు అనవసరమైన వ్యవహారాల్లో తలా దూర్చకండి . కొన్ని విషయాల్లో అనుమానాలు ఉంటాయి . అనవసరమైన ఖర్చులు చేస్తారు . శుక్ర శని వారాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు . బుధుడి మూడవ ఇంట సంచారం వల్ల అవసరమైన విషయాలు మరిచిపోవడం , పరధ్యాస గా ఉండడం వంటి ప్రభావాలు ఉండొచ్చు . మొత్తం మీద ఈ రాశి వారికి మంచి కాలం జరుగుతోంది . ఏకాదశ కుజ స్థితి , నవమ గురు స్థితి , 6 వ ఇంట శని స్థితి వల్ల ఈ కాలం లో మంచి అభివృద్ధి సాధిస్తారు . ఆర్ధికం గా స్థిర పడతారు . మంచి పేరు తెచ్చుకుంటారు .
తులా రాశి :
వారం మధ్య నుండీ చంద్ర బలం పెరుగుతుంది . బుధ వారం నుండీ అనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగలుగుతారు . జన్మ రాశి లో రవి సంచారం వల్ల తల నొప్పి , కీళ్ల నొప్పులు బాధించ వొచ్చు . బంధు మిత్ర విరోధము , కోపం ,ఆందోళన , రోగ భయమూ ఉంటాయి . పదవ ఇంట కుజ సంచారం వల్ల పై అధికారులతో విభేదాలు , శత్రువులు పెరగడం , ఎప్పుడూ తిరుగుతూ వుండే ఉద్యోగం చెయ్యడం వంటి ఫలితాలు ఉంటాయి . బుధుడి రెండవ రాశి సంచారం వల్ల రాబోయే రెండు నెలలు ధన లాభం , మంచి ఆరోగ్యం కలుగుతాయి. వారం మొదట్లో రెండవ ఇంట శుక్ర సంచారం వల్ల ధన లాభం , కీర్తి , వస్త్ర లాభం , కుటుంబ వృద్ధి ఉంటాయి . వారం మధ్య నుండీ శుక్ర సంచారం మధ్యమ ఫలితాలు ఇస్తాడు . మీ మాటకి విలువ పెరుగుతుంది . మిత్ర లాభం ఉంటుంది కానీ శతృవృద్ధి కూడా ఉంటుంది .
వృశ్చిక రాశి :
బుధ గురు వారాల్లో కొంత ఇబ్బందులు వున్నా మిగిలిన వారం బావుంటుంది . జన్మ రాశి లో, తరువాత ద్వితీయ రాశి లో శుక్ర సంచారం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి . మీ మాటకి విలువ పెరుగుతుంది. ధన వస్త్ర లాభాలు ఉంటాయి . సప్తమ గురు సంచారం మీకు వొచ్చే మే వరకు అనుకూల ఫలితాలు ఇస్తూనే ఉంటాడు . 12 వ ఇంట రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు , ఉద్యోగ మార్పులు , స్థాన చలనం ఉండొచ్చు . పై అధికారులతో విభేదాల వల్ల మీకు మనః శాంతి తక్కువ గా ఉంటుంది . జన్మ రాశి లో బుధ సంచారం వల్ల మతిమరపు , శత్రువులు పెరగడం , బంధు వైరం వంటి ఫలితాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవలసిన సమయం కాదు . మీ సంతానం తో విరోధం ఉండొచ్చు . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి .కొందరు ప్రభుత్వ జరిమానాలు కట్టవలసి రావొచ్చు .
ధనుస్సు రాశి :
బుధ గురు వారాలు అనుకూలం . ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వారికి అనుకూలమైన కాలం . టెండర్ లు మీకు అనుకూలం గా వస్తాయి . ధన , మిత్ర లాభం ఉంటుంది . మీరు తలచిన అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . మీ ఇంటి కి మరమత్తులు చేయిస్తారు . అరుగుదల కి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు . సరైన ఆరామ వ్యాయామాలు ఉండాలి . అష్టమ కుజుడి వల్ల ఆరోగ్య సమస్యలు ధన నష్టం , అప్పుల వల్ల అవమానాలు ఉండొచ్చు . బ్రోన్ కై టిస్ , ఆస్తమా వున్న వాళ్లకి ఇబ్బందికరమైన సంచారం ఇది. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి . గురువారం నుండీ జన్మ రాశి లో శుక్ర సంచారం వల్ల ధన లాభం , విద్యా వృద్ధి .
మకర రాశి :
వారం మొదట్లో 6 గ్రహాలు అనుకూలం గా వున్నాయి . మంచి అభివృద్ధి , ధన లాభం వుంటాయి . బుధ గురు వారాల్లో మధ్యమ ఫలితాలు . మిగతా వారం అనుకూలం . ఏకాదశ స్థానం లో బుధ, చంద్ర , శుక్రుల సంచారం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి . ఆరోగ్య , ధన , మిత్ర లాభాలు ఉంటాయి . బుధ వారం శుక్రుడి రాశి మార్పు వల్ల చోర భయం , కార్య విఘ్నాలు కలుగుతాయి . ఖర్చులు ఎక్కువ అవుతాయి .
సప్తమ కుజుడి వల్ల రాబోయే కొంత కాలం ఈ రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి . బంధువులతో ఎడతెగని విరోధం , ఇబ్బంది కలిగించే మాటలు వినుట , భార్య తో మాట పట్టింపులు . సంతానం తో , సోదరులతో విభేదాలు ఉండవచ్చు . నేత్ర , ఉదర వ్యాధులు వుండే అవకాశం . 5 వ ఇంట గురు సంచారం వల్ల సంతాన పరంగా ఆనందం , అధికారుల ప్రాపకం ఉంటాయి .
కుంభ రాశి :
శుక్ర శని వారాల్లో తప్ప మిగిలిన వారం అంతా అనుకూలమైన చంద్ర బలం వుంది . దశమ బుధుడి వల్ల ఉద్యోగ వృద్ధి , కీర్తి , జయము ఉంటాయి . ఆహార నియమాలు పాటించాలి . పనులు వాయిదా వేసే ధోరణి పక్కన పెట్టాలి . వారం మధ్య నుండీ శుక్రుడి అనుకూల సంచారం వల్ల ధన లాభం , కీర్తి , మిత్ర లాభము , క్షీరాన్న భోజనము , ఇష్ట మైన కార్యక్రమములలో పాల్గొనడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ లు వొచ్చే అవకాశం . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . నాలుగవ ఇంట గురు సంచారం వల్ల , జన్మ శని వల్ల విచారం , బంధు విరోధం వంటివి ఉండొచ్చు. మనః శాంతి కోసం మెడిటేషన్, ధ్యానం వంటివి చెయ్యాలి .
మీన రాశి :
బుధ వారం తరువాత నుండీ మంచి ఫలితాలు ఉంటాయి . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . తోడపుట్టిన వాళ్ళతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి . ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి . పనులు వాయిదా వెయ్యకూడదు .తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . ప్రభుత్వ కాంట్రాక్టర్ ల కి అనుకూలమైన కాలం కాదు . జరిమానాలు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది . ఈ వారం గ్రహ స్థితులు కొంత ఇబ్బంది పెట్టేవి గా వున్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి . దూర ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండొచ్చు . సరైన ఆరామ వ్యాయామాలు ఉండేట్టు చూసుకోండి . పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . ఎంత చేసిన ఫలితం వుండదేమిటని విచారం గా ఉంటుంది .
Subscribe to:
Posts (Atom)








