ఓం శ్రీమాత్రే నమః
సూర్య గ్రహణం గ్రహకూటమి వలన ఏర్పడే ఫలితాలు.
అందరికీ ఆనందాన్ని కలిగించే
నూతన సంవత్సరము రాకకు ముందు
డిసెంబర్ 25 /26 తేదీలలో ఏర్పడే సూర్యగ్రహణం, ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన అన్ని రాశుల వారిపై ప్రభావం మరియు కొత్త సంవత్సరంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం.
ధనురాశి ద్వంద్వ రాశి. అగ్ని తత్వ రాశి. రాశి అధిపతి గురుడు ..అందులోనే శని కేతువు ల తో కలిసి ఉండడం.. ధను రాశి లోకి రవి సంక్రమణం వల్ల అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్యగ్రహణం ఏర్పడడం కొంత చికాకు ,ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశం. జ్ఞానం వైపు అడుగులు సహజంగానే పడవు.
రవి మరియు శని ఒకే రాశిలో ఉండటం కూడా.. వ్యతిరేకమైన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంటుంది. మానసికమైన అహం తలెత్తే అవకాశం ఉంది.
అమావాస్య రోజుల్లో చంద్రుని వలన బుద్ధి ప్రకాశవంతంగా ఉండక కల్లోలానికి గురవుతారు.
ద్వంద్వ రాశులలో గ్రహ సంచారం వలన
విద్య ఉద్యోగాలు అభివృద్ధి, చలనము మొదలగు మార్పులను గమనిస్తూ ఉంటాం.
అగ్ని తత్వ రాశి అయిన ధనురాశిలో ఈ
షష్ట గ్రహ ప్రభావము మన మానసిక శక్తి పరీక్ష లాంటిది. కోరికలను అదుపులో ఉంచుకుంటే ఈ పరీక్ష చక్కగా దాటగలం. అదే సంతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు. కేతువు బంధనాలను విడదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనక క్షణికమైన ఆవేశాలను మనం గెలవాలి.
అప్పుడే బంధాలను బాధ్యతలను కాపాడుకోగలం. ఈ వచ్చే కాలాన్ని అంతర్ముఖంగా ఆత్మ శోధన చేసుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తులు తప్పకుండా సానుకూల ఫలితాలు పొందుతారు.
డిసెంబరు నెలలో పై గ్రహ ప్రభావం వలన సూర్య గ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వారికి జరుగుతున్న దశ అంతర్దశ నక్షత్ర ప్రభావమును బట్టి ఫలితాలు నిజానికి నిర్ణయం అవుతాయి. మన భావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. కానీ వీటిపైనే పూర్తిగా ఆధారపడి ఉండకూడదు.
*మేష రాశి వారికి కి అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం లాగా ఆనందంగా గడపండి.
*వృషభ రాశి వారి అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.
*మిధున రాశి :ఆవేశం అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి.
ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు.
*కర్కాటక రాశి : ఏ విధంగా ఆలోచనలు వెళ్తాయో ఫలితాలు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా ధ్యాన మార్గం అవలంబించండి.
*సింహరాశి: ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలు మొదలగు విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు , మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి 100% అవకాశం ఉంటుంది.. తాత్కాలికంగా ఇప్పుడు వచ్చే అనిశ్చితమైన పరిస్థితిని మనోధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని విజయం సాధించడం మీ చేతుల్లోనే ఉంది.
*కన్యా రాశి: అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే.
*తులారాశి: ద్వితీయ అధిపతి కుజుడు అద్వితీయము లోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధి దాయకం. శాంతి సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .
*వృశ్చిక రాశి: రాజ్యాధిపతి కుజుడు సొంత రాశిలో ఉండటం వలన, ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.
*ధను రాశి: అత్యంత ఒత్తిడికి , ఆందోళనకు, అనిశ్చిత త్వం ఈ రాశి వారి లో గమనిస్తాం.
వీరికి ఇది నిజంగా పరీక్షా కాలమే. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా డా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు.
*మకర రాశి: గుర్తింపులు పొంద లేరు , అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ ఓరిమే మీకు శ్రీరామరక్ష.
*కుంభరాశి: ఈ రాశి వారికి అత్యంత అదృష్టం అయినా కాలం గా చెప్పుకోవచ్చును. అన్ని గ్రహాలు కలసివచ్ మీనరాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ ఈ సంవత్సరం అంతా అత్యంత శుభదాయకం ఈ సంవత్సరం ఈ సూర్య గ్రహణం వల్ల 12 రాశుల వారు సూర్యుడికి జపం చేయించుకోవాలి ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వలన 12 రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది సూర్యుడికి రాహుకేతువుల కి జప తర్పణ హోమాలు దానాలు చేయడం చాలా మంచిది వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం మంచిది