Monday, June 20, 2022

కుజుడి గండాంత సంచారం - జూన్ 22 నుండీ జులై 1 వరకు.


 ** శ్రీ గురుభ్యోనమః **

కుజుడి గండాంత సంచారం - జూన్ 22 నుండీ జులై 1 వరకు.
ప్రస్తుతం మీన రాశి లో ఉన్న కుజుడు రాశిలోని చివరి నవాంశ లో జూన్ 22 ఉదయం నుండీ సంచారం చేస్తాడు.
జల తత్వపు రాశికి అగ్నితత్వపు రాశి కి మధ్యన అంటే రేవతీ నక్షత్రం 4 వ పాదం నుండీ అశ్వినీ నక్షత్రం మొదటి పాదం వరకు గండాంత సంచారం అని చెప్పబడింది.
ఈ నక్షత్ర పాదాలలో కుజ సంచారం వల్ల మేష,వృశ్చిక రాశుల వారికీ, మృగశిర,చిత్తా, దనిష్టా నక్షత్రాల వారికీ, కుజ దశాంతర్దశలు జరుగుతున్న వారి పై ఈ సంచార ప్రభావం ఎక్కువగా కనపడుతుంది.
ఈ సంచారం వల్ల ఈ క్రింది పరిణామాలు కలుగవొచ్చు :
ప్రపంచ స్థాయిలో-
1. కుజుడు భూమి కారకుడని చెప్పబడింది కనుక భూకంపాలు సంభవించవొచ్చు. జలతత్వపు రాశి లో సంచారం కనుక సముద్రపు అడుగున భూమి కంపించవొచ్చు.
2. సముద్రపు అడుగున ఉన్న అగ్నిపర్వతం బద్దలుకావొచ్చు.
వ్యక్తుల స్థాయిలో-
3. ఎక్కడో లోపల అణిచిపెట్టుకున్న కోపం బయటపడొచ్చు.
4. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
5. భూముల విలువలు అమాంతంగా పడిపోవచ్చు.
6.పైన చెప్పబడిన రాశుల, నక్షత్రాల వారు సముద్రం దగ్గిరకి,నదుల దగ్గిరకి వెళ్లక పోవడం మంచిది.

చేయవలసిన పరిహారాలు :
1.శుభ్రమణ్య అష్టోత్తర శత నామావళి రోజుకి 9 సార్లు పారాయణ చెయ్యాలి.
2. భూమి సూక్తం ప్రతీ రోజూ పారాయణ గానీ శ్రవణం గానీ శ్రద్ధగా చెయ్యడం.
3.శుభ్రమణ్య క్షేత్ర సందర్శనం, పూజ.ఎర్రటి మందారపూల తో పూజ చెయ్యాలి.
4.కుజ గ్రహ జపం చేయించుకోవాలి.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435