Monday, February 13, 2023


 శని అస్తంగత స్థితి - ప్రభావం

శని గ్రహం ఫిబ్రవరి 10 వ తారీఖు ఉదయం సుమారు 5 గం ల నుండీ ఫిబ్రవరి 23 వ తారీఖు సా 4: 32 ని ల వరకు అస్తంగత స్థితి లో వుంటాడు.
గ్రహ రాజైన సూర్యుడికి దగ్గిరగా వచ్చినప్పుడు శని అస్తంగత (combust) స్థితి లో వుండి దుష్ప్రభావాలు ఇస్తాడని చెప్పబడింది. ముఖ్యంగా మకర ,కుంభ రాశుల వారూ,కర్కాటక,వృశ్చిక రాశుల వారు, మీన రాశి వారు ,. పుష్యమీ, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్ష త్రా ల వారూ వీరి మీద ఎక్కువ ప్రభావం వుంటుంది. శని దశ అంతర్దశ లు జరుగుతున్న వారి మీద కూడా ప్రభావం ఉంటుంది.
అస్తంగత శని వల్ల ఈ క్రింది ఫలితాలు కలుగవొచ్చు:
1. వృత్తి ఉద్యోగాల్లో వొత్తిడి పెరుగుతుంది
2. పై అధికారులతో విభేదాలు రావొచ్చు.
3. మద్య పానం చేసే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావొచ్చు
4. కీళ్ల నొప్పు లు , నడుం నొప్పి, కండరాల సమస్యలు రావొచ్చు.
5. ఉద్యోగం మారాల్సి రావొచ్చు
6. కొంత మందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావొచ్చు.
7. ఎంత కష్ట పడ్డా తగ్గ ప్రతి ఫలం రాకపోవచ్చు.
8. చెడు స్నేహాల వల్ల నష్ట పోతారు.
చేసుకోవలసిన పరిహారాలు : వొచ్చే మహా శివరాత్రి రోజున శని. త్రయోదశి కూడా కలిసివచ్చింది. శనికి మన్యు సూక్త పారాయణ సహిత తైలాభిషేకం , రుద్రాభిషేకం వల్ల ఉపశమనం కలుగుతుంది.
శివరామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435