Thursday, September 26, 2024

బృహత్ సంహిత లో చెప్పబడిన నక్షత్ర కారకత్వములు

 అశ్విని : గుఱ్ఱముల వ్యాపారులు , సేనాధిపతులు , వైద్యులు , సేవకులు , గుఱ్ఱములు , వర్తకులు , రూపవంతులను సూచిస్తుంది 

భరణి : క్రూరులు , బానిసలు , కర్రలతో కొట్టేవారు , తృణ ధాన్యములు, శీలం లేని వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది 

కృత్తిక : తెల్లని పువ్వులను, బ్రాహ్మణులు , నిత్యాగ్ని హోత్రము , వేద పఠనము , మంత్రాదులు తెలిసిన వారు , భాషా పండితులు , వ్యాకరణము తెలిసిన వారు , క్షురకులు , కుమ్మరులు , పురోహితులు జ్యోతిష్యులను సూచిస్తుంది . 

రోహిణి : వ్యాపారులు , ప్రభువులు , విశేష సంపదలు కలిగిన వారు , యోగినులు , వాహనములు నడిపేవారు , గోవులు , ఎద్దులు , జలచరములు , వ్యవసాయదారులు , పర్వతములు , అధికారములో వున్న వారినీ సూచిస్తుంది 

మృగశిర : సువాసన కలిగిన వస్తువులు , వస్త్రములు , సముద్రోత్పత్తులు , పువ్వులు , ఫలములు , మణి మాణిక్యములు , గిరిజనులు , పక్షులు , క్రూర మృగములు , సోమ పానము చేయు వారు , సంగీతవేత్తలు , ప్రేమికులు ,  లేఖలను తీసుకెళ్లేవారలనూ ఈ నక్షత్రం సూచిస్తుంది 

ఆర్ద్రా : బానిసలు , వాదించేవారు , అబద్ధములు ఆడు వారు , జారులు , చోరులు , దొమ్మీలు , తగవులు పెట్టేవారు , తృణ ధాన్యములు , క్రూర బుద్ధి కలిగిన వారు , తీవ్ర మంత్ర వాదులు , అభిచార కర్మలు చేసేవారు , క్షుద్రోపాసకులను ఈ నక్షత్రం సూచిస్తుంది . 

పునర్వసు : నిజము ,నిజాయితీ , ధార్మిక గుణమూ , నిర్మలత్వమూ , ఉన్నత కులమూ , సౌందర్యము , తెలివితేటలు , ధనము కీర్తి కలవారు , విలువైన ధాన్యములను , వర్తక వాణిజ్య వేత్తలనూ , సేవకులు , కళాకారులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

పుష్యమి : బార్లీ , గోధుమలు , యవలు ( ఒక రకమైన  ధాన్యం ) , చెఱుకు , అడవులు , మంత్రులు , ప్రభువులు , మత్స్యకారులు , ఇదే రకమైన వృత్తులు కలవారు , త్యాగమూర్తులు , నీతి నిజాయితీ కలవారు వీరికి ఈ నక్షతం కారకత్వం వహిస్తుంది 

ఆశ్రేష : ఆర్టిఫిషల్ లేదా నకిలీ  వస్తువులు , సరీసృపాలు (reptiles ) , విషం (poisonous chemicals) , తృణ ధాన్యాలు , అన్ని రకాల వైద్యులు ( allopathy /homeopathy /ayurvedic ) , వేళ్ళు , దుంపలు , ఫలాలు , పురుగులు , దోపిడీదొంగల ని ఈ నక్షత్రం సూచిస్తుంది 

మఘా : ధనవంతులు , ధాన్యం , ధాన్యాగారాలు , పర్వతారోహకులు , పెద్దలు మరియూ పితూరీ దేవతల పట్ల గౌరమ్మ కలవారు , వర్తకులు , నాయకులు , మాంస భక్షకులు , స్త్రీ ద్వేషులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

పూర్వ ఫల్గుణి ( పుబ్బా ) : నటీ నటులు , అందమైన స్త్రీలు , స్నేహ వర్గములు , సంగీత వేత్తలు , కళాకారులు , వ్యాపారవేత్తలు , ఉప్పు , తేనె , వివిధ తైలములు , బాలల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది . 

ఉత్తర ఫల్గుణి ( ఉత్తర) : మంచి వారు , బద్దకస్తులు , వినయము కలిగిన వారు , ధార్మిక గుణము కలవారు , విద్యా జ్ఞానము కలవారు , మంచి ధాన్యము , విశేషమైన సంపదలు కలిగిన వారు , ఉత్తమ కర్మలు చేయు వారు , ప్రభువుల కోసం బాధ్యత తీసుకునే వారికి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

హస్తా  : చోరులు , ఏనుగులు , రథములు నడిపేవారు , మావటీ లు , వివిధ కళాకారులు , శిల్పులు , తృణ ధాన్యాలు , వేద శాస్త్రాలు చదివిన వారు , వర్తకులు , అమితమైన శక్తి యుక్తులు కలవారి కి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

చిత్తా : రత్నా భరణాలు , నగలు తయారు చేసేవారు , చిత్ర కారులు , వ్రాత కారులు , సంగీతము , సుగంధ ద్రవ్యములు , గణిత శాస్త్ర వేత్తలు , వస్త్రములు నేసే వారు , నేత్ర వైద్యుల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

స్వాతీ : పక్షులు , క్రూర మృగాలు , గుర్రాలు , వర్తకులు , ధాన్యము , పప్పు ధాన్యములు , కుత్సితమైన మనస్సు కలిగిన మిత్రులు , సాత్వీకులు , పుణ్య కుశలురకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది . 

విశాఖ : ఎర్రటి పుష్పాలు ,ఫలాలు , నువ్వులు ,పెసలు , మినుములు ,సెనగలు , పత్తి , ఇంద్ర మరియు అగ్ని ఆరాధకులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

అనురాధ : సౌర్య వంతులు , అత్యున్నత సంస్థలకు అధిపతులు , మంచి మిత్రులు , రాజ సభ లో గోష్టులు చేసే వారు , ప్రయాణాలు చేసే వారు , నీతి ,నిజాయితీ గల జనులు , శరదృతువులో ఉద్భవించే అన్నింటికీ అనురాధా నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

జ్యేష్టా : యుద్ధ తంత్ర నిపుణులు , ఉన్నత వర్గములకు చెందిన వారు , వారి కుటుంబము , సంపదలు , కీర్తి , చోరులు , సేనానులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

మూలా : ఔషధములు , వైద్యులు , పెద్ద పెద్ద సంస్థ ల ను నడిపే స్త్రీ లు , పువ్వులు , పళ్ళు , విత్తనములు , పూలు పళ్ళు అమ్మేవారు , ధన వంతులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

పూర్వాషాఢ : మృదువైన మనస్సు గల వారినీ , చేపలు పట్టే వాళ్ళనీ , టూరిస్ట్ గైడ్ ల నూ , జల చరాలనూ , నీతి నిజాయితీ , సంపదలు కలవారినీ , వంతెనలు కట్టే  ఇంజినీర్లనూ  , నీటి ఆధారిత వృత్తులు చేసుకునే వారినీ , నీటి లో వుండే పూలనూ , పళ్ళనూ ఈ నక్షత్రం సూచిస్తుంది 

ఉత్తరాషాఢ : మావటి వాళ్లు , వస్తాదులు , ఏనుగులు , గుర్రాలు , దైవ భక్తులు , సైనికులు , తీవ్రవాదులనూ  ఈ నక్షత్రం  సూచిస్తుంది 

శ్రవణా : విష్ణు భక్తులు , నిజాయితీ కల వారు , magicians , సమర్ధత కలవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది 

ధనిష్టా : గౌరవాదులు లేని వారు , కుత్సితమైన బుద్ధి కలవారు , స్త్రీ ద్వేషం కలవారు , ధార్మిక గుణం కలవారు , శాంతి కాముకులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

శతభిషా : సముద్ర ఉత్పత్తులు , రజకులు , బోయలు , చేపలు పట్టే వారు , చేపల వ్యాపారం చేసే వారినీ , పందులను వేటాడే వారినీ , సారా కాచే వారినీ పక్షులను వేటాడే వారినీ ఈ నక్షత్రం సూచిస్తుంది . 

పూర్వాభాద్రపదా : పశుపాలకులు , చోరులు , హంతకులు , పిసినారులు , చెడ్డ బుద్ధి కలవారు , డాంబికం గా వుండే వాళ్ళు , నీతి ,మతము పై గౌరవము లేని వారు , రెండు నాలుకల ధోరణి కలిగిన వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది . 

ఉత్తరాభాద్రపదా : బ్రాహ్మణులు , త్యాగ నిరతులు , ధార్మిక సంస్థలు , నివారణోపాయములు , తపస్సు , విలువైన సారవంతమైన ధాన్యములు , ధనవంతులు , విరాగులు , నాస్తీకులు , మతవిరోధులు , ప్రభువులను ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

రేవతీ : నీరు అధికం గా వుండే పళ్ళు , పువ్వులు , ఉప్పు, రత్నాలు , శంఖాలు , ముత్యాలు , సుగంధ ద్రవ్యాలు , వాసన గల పుష్పాలు , వీటితో వర్తకం చేసేవారు , నౌకలు నడిపేవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది .       

Tuesday, September 17, 2024

Gaja Kesari Yoga

Gaja Kesari Yoga forms between Jupiter and Moon. ' चन्द्र केन्द्रे बृहस्पतिं ' is the phrase used while describing this Yoga. In English  it is 'Chandra Kendre Bruhaspatim ' . Which means when Jupiter is in a kendra from Moon , then this Yoga is said to be formed. 

The person who has this yoga will be very famous and affluent. 

For the Yoga to give its full results neither Moon or Jupiter should be afflicted due to aspect or conjunction  from a malefic planet . They should not be in their signs of debilitation. They should  be with good Shad bala and should not be weak. The Yoga will give its full results when one of Jupiter or Moon are in their signs of exaltation. 

Why the name Gaja Kesari Yoga ?? -  Gaja means Elephant and Kesari means Lion. The Yoga when formed in a horoscope, drives away the doshas in the horoscope just like how One Lion scares away a group of Elephants !!! . That is the purpose of naming this yoga as Gaja Kesari Yoga.    


General Effects of Gaja Kesari Yoga : 

This yoga gives the person  a plethora of opportunities to generate money on a continual basis.
-The person with this yoga will be fortunate and lucky to have a good spouse, who will come from a well-established family.
-The person with this yoga will get married at an early stage and get settled.
-will have the caliber to become a successful entrepreneur and a businessman.
-will have good health and high vitality.
-will transform the person into a leader capable of inspiring others and changing others through motivational speech and actions.
- will accumulate wealth, fame, name, and respect.

The Yoga gives effect in the dasas of both Moon and Jupiter. The Yoga gives its results based on the houses where the Moon and Jupiter are situated in the horoscope. 

along with being a highly successful person materially as above mentioned, - 

When the Yoga is formed by Moon and Jupiter both being placed in the lagna , the person with this Yoga will be a Political leader, Philanthropist and a very good person at heart . 

When the Yoga is formed with  Moon in the lagna and Jupiter in the 10th house , the person will be a spiritual Guru or a great Teacher 

When the Yoga is formed with Moon in the 5th house and Jupiter in the 8th house , the person with such a Gaja Kesari Yoga may be a scientist who will be making path breaking inventions.