అశ్విని : గుఱ్ఱముల వ్యాపారులు , సేనాధిపతులు , వైద్యులు , సేవకులు , గుఱ్ఱములు , వర్తకులు , రూపవంతులను సూచిస్తుంది
భరణి : క్రూరులు , బానిసలు , కర్రలతో కొట్టేవారు , తృణ ధాన్యములు, శీలం లేని వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది
కృత్తిక : తెల్లని పువ్వులను, బ్రాహ్మణులు , నిత్యాగ్ని హోత్రము , వేద పఠనము , మంత్రాదులు తెలిసిన వారు , భాషా పండితులు , వ్యాకరణము తెలిసిన వారు , క్షురకులు , కుమ్మరులు , పురోహితులు జ్యోతిష్యులను సూచిస్తుంది .
రోహిణి : వ్యాపారులు , ప్రభువులు , విశేష సంపదలు కలిగిన వారు , యోగినులు , వాహనములు నడిపేవారు , గోవులు , ఎద్దులు , జలచరములు , వ్యవసాయదారులు , పర్వతములు , అధికారములో వున్న వారినీ సూచిస్తుంది
మృగశిర : సువాసన కలిగిన వస్తువులు , వస్త్రములు , సముద్రోత్పత్తులు , పువ్వులు , ఫలములు , మణి మాణిక్యములు , గిరిజనులు , పక్షులు , క్రూర మృగములు , సోమ పానము చేయు వారు , సంగీతవేత్తలు , ప్రేమికులు , లేఖలను తీసుకెళ్లేవారలనూ ఈ నక్షత్రం సూచిస్తుంది
ఆర్ద్రా : బానిసలు , వాదించేవారు , అబద్ధములు ఆడు వారు , జారులు , చోరులు , దొమ్మీలు , తగవులు పెట్టేవారు , తృణ ధాన్యములు , క్రూర బుద్ధి కలిగిన వారు , తీవ్ర మంత్ర వాదులు , అభిచార కర్మలు చేసేవారు , క్షుద్రోపాసకులను ఈ నక్షత్రం సూచిస్తుంది .
పునర్వసు : నిజము ,నిజాయితీ , ధార్మిక గుణమూ , నిర్మలత్వమూ , ఉన్నత కులమూ , సౌందర్యము , తెలివితేటలు , ధనము కీర్తి కలవారు , విలువైన ధాన్యములను , వర్తక వాణిజ్య వేత్తలనూ , సేవకులు , కళాకారులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది
పుష్యమి : బార్లీ , గోధుమలు , యవలు ( ఒక రకమైన ధాన్యం ) , చెఱుకు , అడవులు , మంత్రులు , ప్రభువులు , మత్స్యకారులు , ఇదే రకమైన వృత్తులు కలవారు , త్యాగమూర్తులు , నీతి నిజాయితీ కలవారు వీరికి ఈ నక్షతం కారకత్వం వహిస్తుంది
ఆశ్రేష : ఆర్టిఫిషల్ లేదా నకిలీ వస్తువులు , సరీసృపాలు (reptiles ) , విషం (poisonous chemicals) , తృణ ధాన్యాలు , అన్ని రకాల వైద్యులు ( allopathy /homeopathy /ayurvedic ) , వేళ్ళు , దుంపలు , ఫలాలు , పురుగులు , దోపిడీదొంగల ని ఈ నక్షత్రం సూచిస్తుంది
మఘా : ధనవంతులు , ధాన్యం , ధాన్యాగారాలు , పర్వతారోహకులు , పెద్దలు మరియూ పితూరీ దేవతల పట్ల గౌరమ్మ కలవారు , వర్తకులు , నాయకులు , మాంస భక్షకులు , స్త్రీ ద్వేషులను ఈ నక్షత్రం సూచిస్తుంది
పూర్వ ఫల్గుణి ( పుబ్బా ) : నటీ నటులు , అందమైన స్త్రీలు , స్నేహ వర్గములు , సంగీత వేత్తలు , కళాకారులు , వ్యాపారవేత్తలు , ఉప్పు , తేనె , వివిధ తైలములు , బాలల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది .
ఉత్తర ఫల్గుణి ( ఉత్తర) : మంచి వారు , బద్దకస్తులు , వినయము కలిగిన వారు , ధార్మిక గుణము కలవారు , విద్యా జ్ఞానము కలవారు , మంచి ధాన్యము , విశేషమైన సంపదలు కలిగిన వారు , ఉత్తమ కర్మలు చేయు వారు , ప్రభువుల కోసం బాధ్యత తీసుకునే వారికి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది
హస్తా : చోరులు , ఏనుగులు , రథములు నడిపేవారు , మావటీ లు , వివిధ కళాకారులు , శిల్పులు , తృణ ధాన్యాలు , వేద శాస్త్రాలు చదివిన వారు , వర్తకులు , అమితమైన శక్తి యుక్తులు కలవారి కి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది
చిత్తా : రత్నా భరణాలు , నగలు తయారు చేసేవారు , చిత్ర కారులు , వ్రాత కారులు , సంగీతము , సుగంధ ద్రవ్యములు , గణిత శాస్త్ర వేత్తలు , వస్త్రములు నేసే వారు , నేత్ర వైద్యుల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది
స్వాతీ : పక్షులు , క్రూర మృగాలు , గుర్రాలు , వర్తకులు , ధాన్యము , పప్పు ధాన్యములు , కుత్సితమైన మనస్సు కలిగిన మిత్రులు , సాత్వీకులు , పుణ్య కుశలురకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది .
విశాఖ : ఎర్రటి పుష్పాలు ,ఫలాలు , నువ్వులు ,పెసలు , మినుములు ,సెనగలు , పత్తి , ఇంద్ర మరియు అగ్ని ఆరాధకులను ఈ నక్షత్రం సూచిస్తుంది
అనురాధ : సౌర్య వంతులు , అత్యున్నత సంస్థలకు అధిపతులు , మంచి మిత్రులు , రాజ సభ లో గోష్టులు చేసే వారు , ప్రయాణాలు చేసే వారు , నీతి ,నిజాయితీ గల జనులు , శరదృతువులో ఉద్భవించే అన్నింటికీ అనురాధా నక్షత్రం కారకత్వం వహిస్తుంది
జ్యేష్టా : యుద్ధ తంత్ర నిపుణులు , ఉన్నత వర్గములకు చెందిన వారు , వారి కుటుంబము , సంపదలు , కీర్తి , చోరులు , సేనానులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది
మూలా : ఔషధములు , వైద్యులు , పెద్ద పెద్ద సంస్థ ల ను నడిపే స్త్రీ లు , పువ్వులు , పళ్ళు , విత్తనములు , పూలు పళ్ళు అమ్మేవారు , ధన వంతులను ఈ నక్షత్రం సూచిస్తుంది
పూర్వాషాఢ : మృదువైన మనస్సు గల వారినీ , చేపలు పట్టే వాళ్ళనీ , టూరిస్ట్ గైడ్ ల నూ , జల చరాలనూ , నీతి నిజాయితీ , సంపదలు కలవారినీ , వంతెనలు కట్టే ఇంజినీర్లనూ , నీటి ఆధారిత వృత్తులు చేసుకునే వారినీ , నీటి లో వుండే పూలనూ , పళ్ళనూ ఈ నక్షత్రం సూచిస్తుంది
ఉత్తరాషాఢ : మావటి వాళ్లు , వస్తాదులు , ఏనుగులు , గుర్రాలు , దైవ భక్తులు , సైనికులు , తీవ్రవాదులనూ ఈ నక్షత్రం సూచిస్తుంది
శ్రవణా : విష్ణు భక్తులు , నిజాయితీ కల వారు , magicians , సమర్ధత కలవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది
ధనిష్టా : గౌరవాదులు లేని వారు , కుత్సితమైన బుద్ధి కలవారు , స్త్రీ ద్వేషం కలవారు , ధార్మిక గుణం కలవారు , శాంతి కాముకులను ఈ నక్షత్రం సూచిస్తుంది
శతభిషా : సముద్ర ఉత్పత్తులు , రజకులు , బోయలు , చేపలు పట్టే వారు , చేపల వ్యాపారం చేసే వారినీ , పందులను వేటాడే వారినీ , సారా కాచే వారినీ పక్షులను వేటాడే వారినీ ఈ నక్షత్రం సూచిస్తుంది .
పూర్వాభాద్రపదా : పశుపాలకులు , చోరులు , హంతకులు , పిసినారులు , చెడ్డ బుద్ధి కలవారు , డాంబికం గా వుండే వాళ్ళు , నీతి ,మతము పై గౌరవము లేని వారు , రెండు నాలుకల ధోరణి కలిగిన వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది .
ఉత్తరాభాద్రపదా : బ్రాహ్మణులు , త్యాగ నిరతులు , ధార్మిక సంస్థలు , నివారణోపాయములు , తపస్సు , విలువైన సారవంతమైన ధాన్యములు , ధనవంతులు , విరాగులు , నాస్తీకులు , మతవిరోధులు , ప్రభువులను ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది
రేవతీ : నీరు అధికం గా వుండే పళ్ళు , పువ్వులు , ఉప్పు, రత్నాలు , శంఖాలు , ముత్యాలు , సుగంధ ద్రవ్యాలు , వాసన గల పుష్పాలు , వీటితో వర్తకం చేసేవారు , నౌకలు నడిపేవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది .