Thursday, July 25, 2024

Tara & Chandra Bala for each Nakshatra Pada along with Auspicious and Inauspicious times for tomorrow 26.07.2024

 

Click on the image for a larger view 

As tomorrow is  Sashti and Friday, it is a good day for initiating graha santhi particularly for Sukra graha. And tomorrow is Uttara Bhadra nakshatra and is a good day to chant dhyana mantras of Sani. Homas for Sukra and Sani can be done by those interested. 

People having their Janma nakshatra tomorrow can start Graha santhi according to their horoscopes.   

Saturday, March 30, 2024

సంపూర్ణ సూర్య గ్రహణం - 08.04.2024

శోభకృత్ నామ సంవత్సరంలో చివరి రోజైన 08.04.2024 న సంపూర్ణ సూర్య గ్రహణం జరుగ నుంది. 
ఈ గ్రహణం భారత దేశం లో ఎక్కడా కనపడదు కనుక గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. 


కానీ నారాయణి సంహిత లో చెప్పబడినట్లు గ్రహణం ఎక్కడైతే కనపడుతుందో అక్కడ పూర్తి ప్రభావాన్ని ఎక్కడైతే కనపడదో అక్కడ 25 నుండీ 50 శాతం ప్రభావాన్ని చూపిస్తుంది. 

ఈ గ్రహణం మీన రాశి లో జరుగనుంది. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం ఉత్తర అమెరికా ఖండం లో ని మెక్సికో లో మొదలైయ్యి టెక్సాస్ వరకు 13 అమెరికా రాష్ట్రాలలో కనపడుతుంది. కెనడా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, పశ్చిమ యూరోప్ లో కూడా కనపడుతుంది. 

ఇలాంటి సంపూర్ణ సూర్య గ్రహణం మళ్లీ 20 ఏళ్ల తరువాత అంటే 2044 లో ఆగస్ట్ 23 న కనపడుతుంది. 

ఈ తరహా గ్రహణం వల్ల ధనికుల ధనం నష్టమౌతుందని చెప్పబడింది. Apple, Microsoft, Google, Amazon,NVIDIA, Tesla, Meta వంటి సంస్థల షేర్ విలువలు తగ్గుతాయి. Stock Market లో భారీ Negative Correction జరిగే అవకాశం వుంది. America లో Recession ప్రభావం మరింత పెరుగుతుంది. 

భారత స్టాక్ మార్కెట్ పై ఈ విధం గా ప్రభావం కనపడుతుంది : Banking, Energy Sectors మీద భారీ ప్రభావం పడుతుంది. 
అత్యంత లాభాలు ఆర్జించే కంపెనీల షేర్ విలువలు తగ్గుతాయి. Tech Companies 2024 2nd Quarter లో Negative Growth చూపించే అవకాశం. 

నిరుద్యోగ శాతం పెరిగే అవకాశం వుంది. 

ఈ గ్రహణం జల తత్వపు రాశి అయిన మీన రాశిలో , రేవతీ నక్షత్రం లో జరుగుతున్నది కనుక Tornados , Floods సంభవించవచ్చు. సముద్రం లో ప్రమాదాలు జరిగే అవకాశం. Sea Transportation ప్రభావితం అవుతుంది. 

భారత దేశం లో ఈశాన్య భారత దేశం లో ఆలర్లు మళ్లీ ప్రబలే అవకాశం వుంది. 

ఈ గ్రహణానికి దగ్గిరలో శని కుజుల యుతి అతి దగ్గిరకి చేరుతుంది (Deep Conjunction). ఇందు వల్ల ఉత్తర భారత దేశం లో ప్రజాందోళనలు , పోలీసు చర్యలు అందువల్ల ప్రాణ నష్టం జరుగొచ్చు. 

ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో చైనా తో యుద్ధ వాతావరణం అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చు. 

గ్రహణ దుష్ప్రభావం దేశం మీద, వ్యక్తిగతం గా పడకుండా వుండడానికి ప్రతీ ఒక్కరూ రుద్ర పారాయణం, విష్ణు సహస్ర నామ పారాయణం , ఏకాదశ రుద్రాభిషేకం వంటివి చెయ్యాలి. 

ఈ గ్రహణ ప్రభావం వల్ల : 
మేష రాశి వారు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రహస్య శత్రువుల వల్ల ప్రమాదాలు వున్నాయి. జాగ్రత్త.
 
వృషభ రాశి వారు : మోసం చేసే మిత్రులు వుంటారు. కానీ ఈ గ్రహణం మంచే చేస్తుంది. 

మిధున రాశి వారు పై అధికారుల తో మాట పడకుండా పని పై శ్రద్ధ పెట్టాలి. కొందరి కి అవమానాలు, అప్రతిష్ట. 

కర్కాటక రాశి వారు : గురు , దైవ దూషణలు చేయ కూడదు. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. 

సింహ రాశి వారు : అనుకోని నష్టాలు వున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

కన్యా రాశి : భార్య ఆరోగ్యం ఆందోళన కలిగించచ్చు. భాగ స్వాములు మోసం చేయ వొచ్చు. 

తులా రాశి : గ్రహణం వల్ల ఆరోగ్య లాభం, శత్రువుల పై విజయం. 

వృశ్చిక రాశి : సంతాన విద్యా/ ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కోపావేశాలకు దూరం గా వుండండి.

ధను రాశి: మనః శాంతి తగ్గుతుంది. బంధువుల తో విభేదాలు. చదువు విషయం లో శ్రద్ధ పెట్టాలి. 

మకర రాశి: ప్రయాణాల వల్ల లాభం. తోడబుట్టిన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొందరికి ప్రమోషన్ లు, కోరుకున్న చోటికి transfer లు. 

కుంభ రాశి : ధన సంబంధమైన ఆన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆహారం సమయానికి తీసుకోవాలి.

మీన రాశి: ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆందోళనలు ఎక్కువౌతాయి. 

అందరూ చేసుకోవలసిన పరిహారాలు : 
శివ / విష్ణు ఆరాధన వల్ల సమస్త దోషాలు ఉపశమనం అవుతాయి. 

శుభం భూయాత్ 

శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

Wednesday, March 20, 2024

క్రోధి నామ సంవత్సరం - 09.04.2024 నుండీ 29.03.2025 వరకు - గ్రహ కూటముల ఫలితములు

ఈ సంవత్సరం కర్కాటకం లో కుజ స్థంభన , 2 పంచ గ్రహ కూటములు, 4 చాతుర్గ్రహ కూటములు, 1 సష్ట గ్రహ కూటమి జరుగుతాయి. వీటి వల్ల దేశారిష్ట యోగాలు ఏర్పడుతున్నాయి.

ఈ సంవత్సరం చివరి రోజున అంటే 29.03.2025 న మీన రాశి లో సూర్య గ్రహణం తో పాటు సష్ట గ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఈ సూర్య గ్రహణం భారత దేశం లో కనపడదు. కానీ సష్ట గ్రహ కూటమి వల్ల ప్రపంచం మొత్తం మీద దుష్ప్రభావం వుంటుంది.

ప్రభుత్వం వారు అందరి బాగు కోసం షడ్ గ్రహ యోగ శాంతి చేయించడం మంచిది.

గ్రహ కూటముల వలన కలుగు ఫలములు

యోగాచ్చతుర్గ్రహాణాం సామంత భయం నిరంతరంభవతి ।
పంచగ్రహాఘ్నంతి సమస్త భూపాన్ షట్చ్ గ్రహాః ఘ్నంతి సమస్తదేశాన్ ॥

ఏప్రిల్ 10-13, 23-24 మధ్య మీనంలో చాతుర్రహ కూటమి వలన హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాలలో నాయకులకు అరిష్టం. కాశ్మీర్, పాకిస్తాన్లలో సమస్యలు. ధరలు విపరీత  హెచ్చు తగ్గులు, ప్రజానష్టం కలుగును

* మే 31 నుండి జూన్ 12 వరకు వృషభంలో చాతుర్రహ కూటమి వలన గుజరాత్,ఇరాన్, రష్యా, స్విస్-పోలాండ్ పరిసర ప్రాంతాలలో నాయకులకు అరిష్టం, అతివృష్టి, వరదలు వచ్చును. వ్యాపారాలు స్థంభించుట, సస్యహాని, ప్రజారిష్టము కలుగును.

• జూన్ 5,6,7న వృషభంలో పంచగ్రహకూటమి వలన కాశ్మీర్, ఉత్తరీశాన్య రాష్ట్రాలలో ముఖ్య
పదవులలో ఉన్న నాయకులకు ప్రాణగండం. (ఉదా :11-ఏప్రిల్-2011 మీనంలో పంచగ్రహకూటమి(చం+కు+బు+గు+శు), సప్తమంలో శని సంచారణ సమయంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండు గారు వాతవరణ కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో కాలంచేశారు)

•మార్చ్ 15 నుండి 28 వరకు మీనరాశిలో చాతుర్ధహ కూటమి వలన ఉత్తరాదిలో నాయకులకు అరిష్టం కలుగును. మార్చ్ 28 సాయంత్రం నుండి 29 సాయంత్రం వరకు మీనంలో పంచ గ్రహ కూటమి వలన రాజులకు ప్రాణగండం, అరిష్టము, రాహువుతో కలిసి 5 గ్రహములు ఉండుటవలన వానలు సరిగా పడవు. ప్రజలు మనోవ్యధతో, అస్తవ్యస్తమై వానరులవలె ప్రవర్తించెదరు.

•మార్చ్ 29 సా. 7:40 ని॥ల నుండి మీనరాశిలో రవి + చంద్ర + (బుధ) + (శుక్ర) + శని + రాహువుల
షష్టగ్రహ కూటమి 30న సా. 4:34 ని॥ల వరకు ఉండును (20 గంటల 54 నిముషాలు). దీని
వలన సమస్త దేశాలకు విపత్కర పరిస్థితులు కలుగును. బుధ, శుక్రుల వక్రం వలన అనర్థాలు
జరుగును. ఈరోజున సూర్య గ్రహణం కూడా ఉన్నది. భారతదేశంలో కనపడదు. 
ఉత్తర రష్యా, ఐరోపా, వాయువ్య ఆఫ్రికా దేశాలు, గ్రీన్ల్యాండ్, తూర్పు కెనడా, ఈశాన్య అమెరికా, ఆర్కటిక్ ప్రాంతాలలో కనిపించుటవలన, అక్కడ ఊహింపని దుష్పరిణామాలు కలుగును. 

'శాంతి కమలాకర గ్రంథములో : 
"గ్రహషట్కసమాయోగే మంత్రిణాం మరణం భవేత్ | పశ్వశ్వాది భయం
సర్వం సంకరాదిజనక్షయః ॥ పట్టరాజ్జో వినాశోవా మహాభయమథాపివా" 

అని ఉన్నది. ప్రభుత్వము వారు దేశక్షేమం కొరకు, శాంతి కమలాకరము-మదనరత్నము గ్రంథములలో చెప్పిన విధముగా, "షద్దహయోగ శాంతి" చేయించుట మంచిది.' 
( ఉదా : 25-డిసెంబర్-2019న సా. 4:39 ని॥ల నుండీ 27 డిసెంబర్-2019 రా. 11:43 వరకు (55 గంటల 4 నిముషాలు) ధనుస్సులో షష్ఠిగ్రహ కూటమి, సూర్యగ్రహణం కలిగిన తదుపరి కరోనా వల్ల ప్రపంచదేశాలు విలవిలలాడాయి. )

Tuesday, March 19, 2024

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మీన రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ జీవన కారకుడైన గురుడు 3వ ఇంట సంచారం. రాహువు కేతువులు అనుకూలసంచారం లేనందున మీకు స్వవిషరాయంలో ధైర్యం తక్కువ. ధనాదాయం అనేకరకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్యలేక స్త్రీమూలకంగానే మీజీవితం నిలబడును. శారీరకముగా నిరుత్సాహము. దిగులు ఔషధసేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. 
మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్ధిక చికాకులకు లోనగుట. 

ద్వితీయార్ధం నుండి యోగ ఫలములు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీరపోషణార్ధం ఇష్టకార్యసిద్ధి, కుటుంబసౌఖ్యం. ధన లాభాలు,సర్వతో ముఖాభివృద్ధి, తీర్ధయాత్రా ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాదులలో లాభం. భార్యా, పిల్లలు, కుటుంబంపై లోలోపల  అధైర్యంచెందుటకలుగును. 

కొన్నిసందర్భములలో శత్రువులే మిత్రులగుట, పుణ్య క్షేత్రాది దివ్యసందర్శన భాగ్యంచే కొంత మనఃశ్శాంతి చేకూరును. ఎట్టి లోటుపాట్లు కలుగవు. గౌరవం నిలబెట్టుకొనుటకే వ్యయం. మీరు సాంఘికంగా ఉండవలసిన వ్యక్తులగుటచే శతృభీతి హెచ్చును. దైవభక్తి, శక్తి, బంధువర్గములో ప్రత్యేకత కలు గును. మొత్తం మీద అన్నివిధాలుగా అందరికీ ఈ సం॥ యోగదాయకంగా లాభ
దాయకంగా ఉండును. 

ఏల్నాటి శని జన్మరాహువు ఉన్నప్పటికీ గురుబలం వల్ల ముందుకు పోగలరు. ఉద్యోగస్తులకు అనుకూలసమయమే. ఆదాయంకు మించిన ఖర్చులు చేయుదురు. గృహంలో శుభకార్యములు కలిసివచ్చును. ధైర్యం పెరుగును.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన సం॥రం మీ పనికితగ్గగుర్తింపు. తెలివి తేటలు సద్వినియోగపడును. జీవనలాభం, ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుచును. గత సం॥కంటే అనుకూలసమయం.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కుంభ రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కారకుడైన గురుడు వృషభంలో శని జన్మంలో ఉండుటచే మీ గృహకుటుంబ పరిస్థితులు సాంఘిక ముగాను, గృహ సంబంధముగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రధమార్ధంలో బాగుంటుంది.
ఏపని తలపెట్టినా అవలీలగా పూర్తిచేయగలరు. సెప్టెంబర్ నుండి అగ్నిభయము.దొంగల వలన భయం. వృధాగా శ్రమపడుట, ప్రయాణములందు కష్టములు,నష్టములు ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు. కావున దైవధ్యానం చేయాలి. నామ,జపం వ్రతముచే వెలుగు నీడలుగా పరిణమించిన మీ జీవితం ధన్యత నొందును.

మీ ఆరోగ్యం చక్కగా చూచుకొనేది. గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమితం లేకఏమి మాట్లాడుచున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పటుత్వం దిగజారును. ధాతుబలంతగ్గును. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలకు లోటురాదు. ప్రతి పని లాభదాయకముగా కన్పించినా లోలోపల పడే బాధలు దేవుని కెరుక అన్నట్లుండును. అధికార వర్గము, బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయును. ఎంతకష్టపడి సంపాదించినా చివరకు ఏనుగు మ్రింగిన వెలుగ
పండుమాదిరి అనిపించును. మీలోగల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైన తప్పించుకుంటారు. 

గౌరవము నిలబడినా ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు.ఏల్నాటి శని ప్రభావం మీపై దుష్ప్రభావం చూపించును. ఆరోగ్యభంగములు. 

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగష్టువరకు పరిస్థితులు అనుకూలం. ఊహించని సమస్యలు. జీవితంలో మరచిపోలేని సంఘటనలు జరుగును.  మీ శక్తి సామర్ధ్యములు మిమ్మల్ని రక్షించలేవు. బంధుమిత్ర అరిష్టములు. నష్టము.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మకర రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడు గురుడు 5వ ఇంట, లగ్నాధిపతి శని 2వ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బేలన్సుగా ఉండును. పట్టుదల ఎక్కువ. 

ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముఖాలుగా చేతికందును. ఒడిదుడుకులు లేని జీవితమైఉండును. మీమాట, ఆడవారిమాట ఒకటైరాణించును. మీ నమ్మకం,
మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారం, పుణ్యనదీ స్నానం. పుణ్యకార్యాలు చేయుదురు. ఎంత ఆదాయమో అంత ఖర్చుఅగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారులు వలన కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్నపానీయములు స్వశక్తి సామర్ధ్యములపైకి రాగలుగుట జరుగును. మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును. 

మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారంకలుగును. మీలో దైవత్వం, పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యంఉండదు. గతసంవత్సరం వలెనే ఉంటుంది.స్త్రీప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కల్గించును. సద్దోష్టులు చేస్తారు. ధర్మ బుద్ధితో ఉంటారు. అన్నిరంగాల వార్కి యోగ్యకాలమని చెప్పవచ్చు. స్తిరాస్తులు కొంటారు. గృహమార్పులు, స్థానమార్పులు, పాతగృహంలో మార్పులు, స్వల్పంగా దొంగల వల్ల నష్టాలు, ప్రయాణాదులలో ఇబ్బందులు, సోదరమూలక నష్టాలు.

ఏల్నాటి శని ప్రభావం కొంత తగ్గుటచే ఉద్యోగస్తులు గతంలో ఉన్న సమస్యల నుండి బయట పడుదురు. మీపై ఉన్న కేసులు తొలగును. పై అధికారుల మన్ననలచే ప్రమోషన్తోకూడిన బదిలీలు జరుగును. స్త్రీలు సంతోషంతో ఉందురు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవనం బాగుండును. ఏల్నాటి శని ప్రభావం తగ్గును. రాహువు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైనకుటుంబ జీవితం. సాంఘికంగా, మానసికంగా ఉన్నతస్థితిలభించును. ఈర్ష్య అసూయ మీ పై ఉండును.

క్రోధి నామ సంవత్సరం (2024-25) లో ధనుస్సు రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు 6వ ఇంట, రాహువు, కేతువులు 4,10స్థానములలో ఉండుటచేతను, శనిస్థితి యోగించును. అన్నిరంగములో తమ జీవితమునకు విలువతెచ్చుకుంటారు. అధికారవర్గములో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. ధైర్యసాహసములు ' పెరుగుట, కొన్ని శక్తులు సమకూరుట వల్ల ఆత్మీయతను పెంపొందించుట సంఘంలో మంచి స్థానము. 

బంధుమిత్రుల ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివి తేటలను అందరు గుర్తించెదరు.
మీరుచేయుపనులకు, గృహజీవితంలో నరఘోష ఎక్కువ. ఎంతటి ధనవ్యయంమైనా లెక్కచేయక విజయంసాధించుట, సొంతవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్దఎక్కువ. మీ వాక్ప్రభావం గొప్పది. మీరుమాట్లాడే మాటలు అందరికి రుచించును. ప్రతీ పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబ సమస్యలు తప్పవు.

కుటుంబ వ్యక్తుల వల్ల ధనవ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతలు మూలకంగా ధనవ్యయంతప్పదు. సోదరులనుకునేవారి వల్ల ధననష్టం. ఊహించని సమస్యలలో ఇరుక్కొనుట, గురుబలంవల్లవాటినుండి బయటపడుదురు. 

 కుటుంబసమస్యలువల్ల ప్రతీచిన్నవిషయాన్ని గమనించి మసులుకోవలెను. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు, రాహువుల ప్రభావం వల్ల శని ప్రభావం వలన జీవన సౌఖ్యం, సాంఘికంగా, మానసికంగా ఉత్తేజంతో జీవించగలరు. కాని కొంతమేర జాగ్రత్త అవసరం. మీ ధైర్యమే మీకు రక్షణ.

క్రో ధి నామ సంవత్సరం (2024-25) లో వృశ్చిక రాశి వారికి ఫలితాలు

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ గౌరవకారకులైన గురుడు 7వ స్థానంలో సంచారం.  రాహువు, కేతువులు 5,11స్థానములలో సంచరించుట,  అన్నిరంగములలో జయమగును. మీ ఆశయములు మనోవాంఛలు సిద్దించును.

ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా సాగి ఫలించును. లోగడ వదలివేసిన వ్యవహారాలు కలసివచ్చును. అధికారుల యొక్క అనుగ్రహం, బాకీలు   వసూలగుట, మహోన్నతికి రాగలగుట జరుగును. అర్ధాష్టమ శని ప్రభావం వున్ననూ జీవనము మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లు జీవితాధిక్యత, అన్నిరంగాలలో ఉన్నతస్థితి, ధనాదాయంనకు స్వల్ప అవమానకరమైనమాటలు, పనులు, ఇతరులకు బాధకలిగించేవి చేస్తేనే గాని మీకు జయం చేకూరదు. ఆడవారి ప్రోద్భలములచే ఉత్సాహ ప్రోత్సాహాలుసిద్దించును. మానసికధైర్యం, సూక్ష్మబుద్ధి, యోచనాశక్తితో మీరు ముందుకుపోగలరు. దూరప్రయాణాలు, తీర్ధయాత్రలు చేయుట, స్థిరాస్థివృద్ధి జరుగును. 

శని, కుజులువల్ల కుటుంబ కలతలు, భార్యాబిడ్డలు వలన మధ్య మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గురుబలం వల్ల వాటిని చివరినిముషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయిన పనులతో జయం ఆధ్యాత్మిక సాధన, పుణ్యనదీస్నానం, అధికారప్రాబల్యం. వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును.మీమాటకువిలువ, భూ, గృహాధిపేచీలుతొలగి ఆనందమైన జీవనం లభించును.

ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, గృహనిర్మాణాలు కలిసివచ్చును. నూతన వాహనములు కొంటారు. జీవితంలో సమస్యలు తొలగి సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కలిసి దూరప్రయాణాలుచేస్తారు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగా
ఉంటుంది. కొన్నివర్గాలవార్కిబాధలుతప్పవు. శుభాశుభమిశ్రమఫలితాలుండును.