ఈ సంవత్సరం కర్కాటకం లో కుజ స్థంభన , 2 పంచ గ్రహ కూటములు, 4 చాతుర్గ్రహ కూటములు, 1 సష్ట గ్రహ కూటమి జరుగుతాయి. వీటి వల్ల దేశారిష్ట యోగాలు ఏర్పడుతున్నాయి.
ఈ సంవత్సరం చివరి రోజున అంటే 29.03.2025 న మీన రాశి లో సూర్య గ్రహణం తో పాటు సష్ట గ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఈ సూర్య గ్రహణం భారత దేశం లో కనపడదు. కానీ సష్ట గ్రహ కూటమి వల్ల ప్రపంచం మొత్తం మీద దుష్ప్రభావం వుంటుంది.
ప్రభుత్వం వారు అందరి బాగు కోసం షడ్ గ్రహ యోగ శాంతి చేయించడం మంచిది.
గ్రహ కూటముల వలన కలుగు ఫలములు
యోగాచ్చతుర్గ్రహాణాం సామంత భయం నిరంతరంభవతి ।
పంచగ్రహాఘ్నంతి సమస్త భూపాన్ షట్చ్ గ్రహాః ఘ్నంతి సమస్తదేశాన్ ॥
ఏప్రిల్ 10-13, 23-24 మధ్య మీనంలో చాతుర్రహ కూటమి వలన హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాలలో నాయకులకు అరిష్టం. కాశ్మీర్, పాకిస్తాన్లలో సమస్యలు. ధరలు విపరీత హెచ్చు తగ్గులు, ప్రజానష్టం కలుగును
* మే 31 నుండి జూన్ 12 వరకు వృషభంలో చాతుర్రహ కూటమి వలన గుజరాత్,ఇరాన్, రష్యా, స్విస్-పోలాండ్ పరిసర ప్రాంతాలలో నాయకులకు అరిష్టం, అతివృష్టి, వరదలు వచ్చును. వ్యాపారాలు స్థంభించుట, సస్యహాని, ప్రజారిష్టము కలుగును.
• జూన్ 5,6,7న వృషభంలో పంచగ్రహకూటమి వలన కాశ్మీర్, ఉత్తరీశాన్య రాష్ట్రాలలో ముఖ్య
పదవులలో ఉన్న నాయకులకు ప్రాణగండం. (ఉదా :11-ఏప్రిల్-2011 మీనంలో పంచగ్రహకూటమి(చం+కు+బు+గు+శు), సప్తమంలో శని సంచారణ సమయంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండు గారు వాతవరణ కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో కాలంచేశారు)
పదవులలో ఉన్న నాయకులకు ప్రాణగండం. (ఉదా :11-ఏప్రిల్-2011 మీనంలో పంచగ్రహకూటమి(చం+కు+బు+గు+శు), సప్తమంలో శని సంచారణ సమయంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండు గారు వాతవరణ కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో కాలంచేశారు)
•మార్చ్ 15 నుండి 28 వరకు మీనరాశిలో చాతుర్ధహ కూటమి వలన ఉత్తరాదిలో నాయకులకు అరిష్టం కలుగును. మార్చ్ 28 సాయంత్రం నుండి 29 సాయంత్రం వరకు మీనంలో పంచ గ్రహ కూటమి వలన రాజులకు ప్రాణగండం, అరిష్టము, రాహువుతో కలిసి 5 గ్రహములు ఉండుటవలన వానలు సరిగా పడవు. ప్రజలు మనోవ్యధతో, అస్తవ్యస్తమై వానరులవలె ప్రవర్తించెదరు.
•మార్చ్ 29 సా. 7:40 ని॥ల నుండి మీనరాశిలో రవి + చంద్ర + (బుధ) + (శుక్ర) + శని + రాహువుల
షష్టగ్రహ కూటమి 30న సా. 4:34 ని॥ల వరకు ఉండును (20 గంటల 54 నిముషాలు). దీని
వలన సమస్త దేశాలకు విపత్కర పరిస్థితులు కలుగును. బుధ, శుక్రుల వక్రం వలన అనర్థాలు
జరుగును. ఈరోజున సూర్య గ్రహణం కూడా ఉన్నది. భారతదేశంలో కనపడదు.
ఉత్తర రష్యా, ఐరోపా, వాయువ్య ఆఫ్రికా దేశాలు, గ్రీన్ల్యాండ్, తూర్పు కెనడా, ఈశాన్య అమెరికా, ఆర్కటిక్ ప్రాంతాలలో కనిపించుటవలన, అక్కడ ఊహింపని దుష్పరిణామాలు కలుగును.
'శాంతి కమలాకర గ్రంథములో :
"గ్రహషట్కసమాయోగే మంత్రిణాం మరణం భవేత్ | పశ్వశ్వాది భయం
సర్వం సంకరాదిజనక్షయః ॥ పట్టరాజ్జో వినాశోవా మహాభయమథాపివా"
అని ఉన్నది. ప్రభుత్వము వారు దేశక్షేమం కొరకు, శాంతి కమలాకరము-మదనరత్నము గ్రంథములలో చెప్పిన విధముగా, "షద్దహయోగ శాంతి" చేయించుట మంచిది.'
( ఉదా : 25-డిసెంబర్-2019న సా. 4:39 ని॥ల నుండీ 27 డిసెంబర్-2019 రా. 11:43 వరకు (55 గంటల 4 నిముషాలు) ధనుస్సులో షష్ఠిగ్రహ కూటమి, సూర్యగ్రహణం కలిగిన తదుపరి కరోనా వల్ల ప్రపంచదేశాలు విలవిలలాడాయి. )