Thursday, December 17, 2020

ప్రస్తుత గ్రహ స్థితులు - జాగ్రత్తలు

ప్రస్తుత గ్రహ స్థితులని చూస్తే : నీచ రాశి లో గ్రహ యుద్ధం లో  ఓడిపోయిన గురువు, శని గురువుల సంయోగం,  గండా౦తం లో బుధుడు, బుధుడు రేపటినుండీ  జనవరి 4 వ తారీఖు వరకు ఆస్తంగత స్థితిలో ఉండడం , December 31 నుండీ చంద్రుడు మాత్రమే కలసర్పానికి వెలుపల ఉండడం జనవరి 11 నుండీ పూర్తి కాలసర్ప యోగం మళ్లీ పట్టడం గమనించవొచ్చు. 

బుధుడు ఆస్తంగతమై ఉన్నంతవరకూ మనసు, బుద్ధీ గమనించుకుంటూ వుండాలి పక్క దారులు పట్టకుండా. ఏదైనా రాసినప్పుడు, మాట్లాడినప్పుడు అపార్దాలు రాకుండా,తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన documents జాగ్రత్త పెట్టుకోవాలి. Cell Phone లు అజాగ్రత్తగా పెట్టుకోవొద్దు.   ముఖ్యం గా మిధున, కన్యా రాశి/లగ్నం వారు . 

ధనుస్సు,మకరం, మీనం రాశి/లగ్నం వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త పడాలి. మీ పర్సు,క్రెడిట్ కార్డులు,డెబిట్ కార్డులు జాగ్రత్త పెట్టుకోవాలి. జేబు దొంగల బారిన పడవొచ్చు జాగ్రత్త. 

పిల్లల విషయం లో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అన్ని రాశుల వారూ. 

గురు/దైవ దూషణ గానీ అపహాస్యం గానీ చేయొద్దు. దొంగ స్వాముల దగ్గిరకి వెళ్లొద్దు.

December 31 తరువాత కొన్ని vaccine ల side effects ఆందోళన కలిగించొచ్చు. 

జనవరి 11 తరువాత Covid ప్రభావం పెరగవొచ్చు. 

భూకంపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. 

ఇప్పటి నుండీ రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత కనీసం అరగంట పాటు 'ఓం నమః శివాయ' మంత్రం జపం చేసుకుంటే చాలా మంచిది .