ఆకాశం లో అద్భుతం జరుగుతోంది ప్రస్తుతం. అదే గురు శనుల కలయిక. కొన్ని వందల సంవత్సరాల తరువాత ఇంత దగ్గిర గా ఒకే నక్షత్రం/గ్రహం లా వీరిద్దరూ కనపడతారని చెప్తున్నారు.
ప్రతీ 20 సంవత్సరాలకీ జరిగే ఈ గురు శనుల కలయుక ప్రపంచ స్థితినీ గతినీ మార్చే కలయిక.
ఊహించని విధంగా కష్ట నష్టాలనీ, అలాగే ఊహించనంత సంపదలనీ సంతోషాలనీ మన కర్మానుసారం గా ఇచ్చే శనీశ్వరుడు విష్ణు స్వరూపమైతే , జ్ఞానాన్నిచ్చి నిజమైన సంతోషాలనీ సంపదలనీ తెలియచేసే గురువు శివ స్వరూపం.
ఈసారి వీరిద్దరి కలయిక రవి నక్షత్రమైన ఉత్తరాషాఢ లో తరువాత చంద్రుడి నక్షత్రమైన శ్రవణా నక్షత్రం లో జరగడం ఇంకా ప్రత్యేకమైనది.రవి ఆత్మ కారకుడూ, చంద్రుడు మనః కారకుడు కాబట్టి ఈ కలయిక వల్ల మనుషులందరి ఆలోచనా సరళి లో చాలా మార్పులు జరుగుతాయి.భావోద్వేగాలు ఎక్కువౌతాయి. Intuition ఎక్కువౌతుంది. కొత్త inventions చాలా జరుగుతాయి.
సంగీతం లో నూతన ఓరవడులు వొస్తాయి.
గురు శనుల కలయిక అంటే హరి హరుల కలయికే అనుకోవాలి. వీరి కలయుక వెనుక రహస్యం ఇదే.
ఈ సమయం లో హరి హారులని ఇద్దరినీ పూజించడం చాలా మంచిది.