Wednesday, February 10, 2021

నవగ్రహ దోషనివారణకు జపములు



నవగ్రహస్తోత్రము :-

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి స్తుతి:-
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిదివాకరమ్

రవికోసం పై మంత్రమును 6,000 సార్లు జపించాలి. రుద్రాభిషేకం చేయించి
గోధుమలు, బంగారం దానం చేయాలి.

చంద్ర స్తుతి :-
దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం |
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ -

చంద్రుని కోసం పై మంత్రమును 10,000 సార్లు జపం చేయాలి. దుర్గాపూజ
చేసి బియ్యం, వెండి దానం చేయాలి,

కుజ స్తుతి:-
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమాన్యుహమ్ |

కుజుని కోసం పై మంత్రమును 7,100 సార్లు జపం చేయాలి. సుబ్రహ్మణ్య
పూజ చేసి, కందులు దానం చేయాలి.

రాహు స్తుతి:-
ఆర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం
సింహికాగర్భ సంభూతం రాహుంతం ప్రణమామ్యహం

రాహువు కోసం పై మంత్రమును 18,000 సార్లు జపం చేయాలి దుర్గాపూజ
చేసి మినుములు దానం చేయాలి.

గురు స్తుతి:
దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం ||

గురువు కోసం పై మంత్రమును 16,000 సార్లు జపం చేయాలి. రుద్రాభిషేకం
చేయించి శనగలు దానం చేయాలి.

శని స్తుతి:
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం |

శనికోసం పై మంత్రమును 19,000 సార్లు జపం చేయాలి. తైలాభిషేకం
చేయించి నువ్వులు దానం చేయాలి.

బుధ స్తుతి:
ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం  బుధం
సౌమ్యం సత్యగుణో పేతం తంబుధం ప్రణమామ్యహం !

బుధుని కోసం సైమంత్రమును 17,000 సార్లు జపం చేయాలి.
శ్రీ మహావిష్ణుపూజ చేసి, పెసలు దానం చేయాలి.

కేతు స్తుతి :-
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ||

కేతువు కోసం పైమంత్రమును 7,000 సార్లు జపం చేయాలి.
నమస్కారములు చేసి ఉలవలు దానం చేయాలి.

శుక్రస్తుతి :-
హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ||

శుక్రుడు కోసం పైమంత్రమును 20,000 సార్లు జపం చేయాలి. మహా
లక్షిపూజ చేసి, బొబ్బర్లు దానం చేయాలి.

ప్రతి ఒక్కరు ప్రతిరోజు నవగ్రహ స్తుతిని కనీసం 9 సార్లు జపం చేసిన
శుభం కలుగుతుంది.