Wednesday, June 29, 2022

కుజ రాహువుల యుతి 2022


** శ్రీ గురుభ్యోనమః **

మేష రాశి లో కుజ రాహు యుతి - జూన్ 27 నుండీ ఆగస్ట్ 10 వరకు - అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
జూన్ 27 న కుజుడు మేష రాశి ప్రవేశం తో కుజ రాహువుల యుతి మొదలైయ్యింది. మేష రాశిలో కుజుడు ఆగస్టు 10 వరకు ఉంటాడు. ఆ తరువాత వృషభ రాశి లో ప్రవేశించినా రాహువుకి ఆగస్ట్ చివరి వరకు దగ్గిరలోనే ఉంటాడు. కనుక ఈ పైన చెప్పబడిన సమయం అంతా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే.
ఆగస్ట్ 1,2022 న ఒకే డిగ్రీ లో కుజ రాహువులు వుంటారు. ఈ యుతి ప్రభావం ఎక్కువగా ఉండే సమయం ఆగస్ట్ 1 కి 10 రోజులు అటూ 10 రోజులు ఇటూ ఉంటుంది.
యూరోప్,ఆసియా దేశాల్లో ఈ యుతి ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
మృగ శిరా, చిత్తా,దనిష్టా నక్షత్రాల వారూ, మేష,వృశ్చిక, కన్యా రాశుల వారు ఎక్కువగా ప్రభావితం అయ్యే సమయం ఇది.
కుజ రాహువుల యుతి వల్ల ఒక పక్కన అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భయనకమైన సంఘటనలు జరుగుతూ వుంటే మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ , తూర్పు తీర రాష్ట్రాల్లో అతివృష్టి వల్ల వరదలు వొస్తాయి.
మత పరమైన, జాతి పరమైన అల్లర్లు జరగొచ్చు.
ఆటగాళ్లు ప్రమాదాల బారిన పడే సంఘటనలు, డ్రగ్స్ టెస్ట్ ల లో దొరికిపోవడం వంటి సంఘటనలు ,ఇతర ప్రమాదాలకు గురి కావడం వంటివి జరగొచ్చు.
ఉత్తర భారత దేశం లో Civil Unrest,riots జరిగే అవకాశాలు ఉన్నాయి.పెద్ద వయసు రాజకీయ నాయకులకు గండ కాలం. రాజకీయ నాయకుల పై అవినీతి ఆరోపణలుపెరుగుతాయి.బస్సులు, ట్రైన్లు తగలపెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది.
ఈ యుతి కి శని నీచ దృష్టి ఉండడం వల్ల చాలా ఆందోళన కలిగించే గ్రహ యుతి అనే చెప్పాలి.
శని తులా రాశిలో ప్రస్తుతం ఉన్న కేతువు ని చూడడం వల్ల ఎంతో మంది విడిపోవడం,మానసికంగా దూరమైపోవడం వంటివి జరుగుతాయి.
పోలీసు,మిలిటరీ వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
రాశుల వారీ గా ఈ యుతి ప్రభావం :
మేష రాశి : అనుకోని ఖర్చులు.అప్పులు. కుటుంబ సభ్యులతో వివాదాలు
వృషభ రాశి : డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. అగ్ని ప్రమాదాలు. పేలుడు పదార్ధాలకి దూరంగా ఉండాలి.
మిధున రాశి : అనుమానాస్పద వ్యక్తుల నుండీ దూరంగా ఉండాలి. మోసం చేసే స్నేహితులు వుంటారు. ఉద్యోగం లో చికాకులు.
కర్కాటక రాశి: ఇబ్బందికర పరిస్థితులు. ఉద్యోగం లో చికాకులు.
సింహ రాశి : కొంత కాలం పాటు మంచి పేరు ఉంటుంది. తరువాత ఇబ్బందులు ఉంటాయి.
కన్యా రాశి : పరువు ప్రతిష్ట ల కు భంగం. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి : కీళ్ల నొప్పులు. ఆరోగ్య భంగం. కళత్రం మొండిపట్టుదలల వల్ల చికాకులు
వృశ్చిక రాశి : జులై చివరి వారం నుండీ అనుకూలతలు. ఎప్పటినుండో అవ్వని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.
ధను రాశి : ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి.
మకర రాశి : వంట చేసే సమయం లో, వాహనం నడిపేడప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి.
కుంభ రాశి : ప్రయాణాల్లో ఇబ్బందులు. సోదర సోదరీమణుల తో జాగ్రత్తగా మాట్లాడండి.
మీన రాశి : ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఖర్చులు కూడా అదుపులో పెట్టుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి.
పరిహారాలు :
1.సుభ్రమణ్య, నారసింహ,హనుమ,దుర్గా దేవి క్షేత్రాలు సందర్శన పూజలు .
2. ప్రతీ రోజూ పైన చెప్పబడిన దేవతల స్తోత్ర పఠనం
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

91828 17435 

Sunday, June 26, 2022

రేపు 27.06.2022 మాస శివ రాత్రి














 **శ్రీ గురుభ్యోనమః** 

రేపు 27.06.2022 జ్యేష్ఠ కృష్ణ చతుర్ధశి ,సోమవారం. మాస శివరాత్రి. రేపు రోజంతా సర్వార్థసిద్ధి యోగం ఉంది.

జాతక చక్రం లో చంద్రుడు నీచ,శత్రు,దుస్థానాల్లో ఉన్నవారు, బలహీనమైన చంద్ర దశ, అంతర్దశ జరుగుతున్నవారు పాలు, బియ్యం, నెయ్యి, పెరుగు, ఔషధాలు బ్రాహ్మణులకి , పేద వారికి దానం చెయ్యడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. 

సూర్యాస్తమయానికి 1:30 ముందు నుండీ 1:30 తరువాత వరకు ప్రదోషకాలం ఈ సమయం లో రుద్రాభిషేకం బిల్వ దళాలతో చెయ్యడం వల్ల ఆరోగ్యం,కీర్తి,యశస్సు లభిస్తాయి. 

రేపు చంద్ర,కుజ,రాహువు మంత్రాలు జపం చేసుకోవాలి.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Monday, June 20, 2022

కుజుడి గండాంత సంచారం - జూన్ 22 నుండీ జులై 1 వరకు.


 ** శ్రీ గురుభ్యోనమః **

కుజుడి గండాంత సంచారం - జూన్ 22 నుండీ జులై 1 వరకు.
ప్రస్తుతం మీన రాశి లో ఉన్న కుజుడు రాశిలోని చివరి నవాంశ లో జూన్ 22 ఉదయం నుండీ సంచారం చేస్తాడు.
జల తత్వపు రాశికి అగ్నితత్వపు రాశి కి మధ్యన అంటే రేవతీ నక్షత్రం 4 వ పాదం నుండీ అశ్వినీ నక్షత్రం మొదటి పాదం వరకు గండాంత సంచారం అని చెప్పబడింది.
ఈ నక్షత్ర పాదాలలో కుజ సంచారం వల్ల మేష,వృశ్చిక రాశుల వారికీ, మృగశిర,చిత్తా, దనిష్టా నక్షత్రాల వారికీ, కుజ దశాంతర్దశలు జరుగుతున్న వారి పై ఈ సంచార ప్రభావం ఎక్కువగా కనపడుతుంది.
ఈ సంచారం వల్ల ఈ క్రింది పరిణామాలు కలుగవొచ్చు :
ప్రపంచ స్థాయిలో-
1. కుజుడు భూమి కారకుడని చెప్పబడింది కనుక భూకంపాలు సంభవించవొచ్చు. జలతత్వపు రాశి లో సంచారం కనుక సముద్రపు అడుగున భూమి కంపించవొచ్చు.
2. సముద్రపు అడుగున ఉన్న అగ్నిపర్వతం బద్దలుకావొచ్చు.
వ్యక్తుల స్థాయిలో-
3. ఎక్కడో లోపల అణిచిపెట్టుకున్న కోపం బయటపడొచ్చు.
4. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
5. భూముల విలువలు అమాంతంగా పడిపోవచ్చు.
6.పైన చెప్పబడిన రాశుల, నక్షత్రాల వారు సముద్రం దగ్గిరకి,నదుల దగ్గిరకి వెళ్లక పోవడం మంచిది.

చేయవలసిన పరిహారాలు :
1.శుభ్రమణ్య అష్టోత్తర శత నామావళి రోజుకి 9 సార్లు పారాయణ చెయ్యాలి.
2. భూమి సూక్తం ప్రతీ రోజూ పారాయణ గానీ శ్రవణం గానీ శ్రద్ధగా చెయ్యడం.
3.శుభ్రమణ్య క్షేత్ర సందర్శనం, పూజ.ఎర్రటి మందారపూల తో పూజ చెయ్యాలి.
4.కుజ గ్రహ జపం చేయించుకోవాలి.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Wednesday, June 15, 2022

మిధున సంక్రాంతి - సరస్వతీ ఆరాధన

 



**శ్రీ గురుభ్యోనమః**

మిధున సంక్రాంతి - సరస్వతీ ఆరాధన
ఈ రోజు బుధవారం, జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి. ఈరోజు రవి ఉ 11గం 31 ని కి మిధున రాశి ప్రవేశం చేస్తుండటంతో ఇవ్వాళ్ళ మిధున సంక్రాంతి.
బుధుడు విద్యా కారకుడు.చంద్రుడు మూలా నక్షత్రం లో వున్నప్పుడు, బుధవారం రోజు బుధ రాశి మిథునం లో సూర్య భగవానుడి ప్రవేశం జరుగుతున్నది కనుక ఇవ్వాళ్ళ సరస్వతీ దేవి ఆలయ సందర్శనం, సరస్వతీ దేవి స్తోత్ర పారాయణం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఉ 11 గం 31 ని ల నుండీ సా 5 గం 51 ని ల వరకు మిధున సంక్రాంతి పుణ్య కాలం. అందులోనూ 11 గం 31 ని ల నుండీ మ 1 గం 52 ని ల వరకు మిధున సంక్రాంతి మహా పుణ్య కాలం. ఈ సమయం లో సరస్వతీ ఆరాధన విద్యార్థులకు మంచిది.
సత్సంగాల్లో పాల్గొనడం మంచిది.
పాలు, పాల పదార్ధాలు దానం చెయ్యడం మంచిది.
బుధ గ్రహ మంత్రాలు జప ధ్యానాలు చేసుకోవడం మంచిది.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435