Showing posts with label Festivals and Poojas. Show all posts
Showing posts with label Festivals and Poojas. Show all posts

Wednesday, February 28, 2024

ఈ రోజు సంకట హర చతుర్ధి

ఈరోజు బుధవారం సంకటహర చతుర్థి 

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది.అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు.

మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం
అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే  సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం
ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి
ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

* సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం •*
సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానినిపసుపు,
కుంకుమలతో అలంకరణను చేయాలి.మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట
హర చతుర్థి వ్రత కథను చదవాలి.

Friday, February 16, 2024

అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు.

అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు.

ప్రత్యక్ష దైవమైన, శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్యజయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమినాడు జరుపుకుంటారు. ఈ సూర్యజయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సముదాయం రథం ఆకారంలో వుండడం వలన ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది.
ఈ విశేషమైన పుణ్యదనమున అర్కః అను నామము కలిగిన
సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల(తెల్ల జిల్లేడు ఆకుల) కు రంధ్రం చేసి, ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై, భుజములపై, హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలెను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్యనుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించాలి.

సూర్యుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యుని అనుగ్రహం కొరకు ఈ ద్వాదశ నామాలను సూర్యునికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉచ్చరించండి. వెంటనే అనుగ్రహం కలుగుతుంది.

సూర్య ద్వాదశ నామాలు

1. ఓం మిత్రాయ నమః
2. ఓం రవయే నమః
3. ఓం సూర్యాయ నమః
4. ఓం భానువే నమః
5. ఓం ఖగాయ నమః
6. ఓం పూష్లే నమః
7. ఓం హిరణ్య గర్భాయ నమః
8. ఓం మరీచయే నమః
9.ఓం ఆదిత్యాయ నమః
10.ఓం సవిత్రే నమః
11. ఓం అర్కాయ నమః
12. ఓం భాస్కరాయ నమః

Friday, February 2, 2024

161 st Birth Anniversary of Swami Vivekananda

 


On the 161 st Birth Anniversary of Swami Vivekananda , may his teachings inspire us towards wisdom,compassion and unity. 

Wishing You all a day filled with reflection and Positive Energy 

Monday, November 27, 2023

అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


 అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు . ఈ రోజు కృత్తికా నక్షత్రం లో పౌర్ణమి. శివుడు త్రిపురాసుర సంహారం చేసిన రోజు కనుక త్రిపురా పౌర్ణమి అని కూడా పేరు . మహా కార్తీకి అని కూడా పేరు .

ఈ సంవత్సరం పౌర్ణమి సోమవారం రోజున రావడం అత్యంత శుభ విశేషం .  

సముద్ర / పుణ్య నదీ స్నానం , నక్త వ్రతం , శివారాధన చెయ్యడం , కుమార స్వామి దర్శనం చెయ్యడం , పూర్ణిమా హోమం చెయ్యడం అత్యంత శుభప్రదం .  

దానాలు :  వరి అన్నపు భోజనం , వెండి , వస్త్ర  దానాలు చెయ్యడం అక్షయ ఫల ప్రదం . మార్కండేయ పురాణం పుస్తకం దానం చెయ్యడం చాలా మంచిది .  

Wednesday, June 15, 2022

మిధున సంక్రాంతి - సరస్వతీ ఆరాధన

 



**శ్రీ గురుభ్యోనమః**

మిధున సంక్రాంతి - సరస్వతీ ఆరాధన
ఈ రోజు బుధవారం, జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి. ఈరోజు రవి ఉ 11గం 31 ని కి మిధున రాశి ప్రవేశం చేస్తుండటంతో ఇవ్వాళ్ళ మిధున సంక్రాంతి.
బుధుడు విద్యా కారకుడు.చంద్రుడు మూలా నక్షత్రం లో వున్నప్పుడు, బుధవారం రోజు బుధ రాశి మిథునం లో సూర్య భగవానుడి ప్రవేశం జరుగుతున్నది కనుక ఇవ్వాళ్ళ సరస్వతీ దేవి ఆలయ సందర్శనం, సరస్వతీ దేవి స్తోత్ర పారాయణం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఉ 11 గం 31 ని ల నుండీ సా 5 గం 51 ని ల వరకు మిధున సంక్రాంతి పుణ్య కాలం. అందులోనూ 11 గం 31 ని ల నుండీ మ 1 గం 52 ని ల వరకు మిధున సంక్రాంతి మహా పుణ్య కాలం. ఈ సమయం లో సరస్వతీ ఆరాధన విద్యార్థులకు మంచిది.
సత్సంగాల్లో పాల్గొనడం మంచిది.
పాలు, పాల పదార్ధాలు దానం చెయ్యడం మంచిది.
బుధ గ్రహ మంత్రాలు జప ధ్యానాలు చేసుకోవడం మంచిది.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Saturday, May 21, 2022

మే 28 న కుజ గురువులు అతి దగ్గరి సంయోగం


 ** శ్రీ గురుభ్యోనమః **

గ్రహ వార్తలు
ఇవ్వాళ్ళ వైశాఖ కృష్ణ సష్టి. భూసూక్త పారాయణ చేసుకోవడం లేదా వీలైనన్ని సార్లు వినడం వల్ల భూ, గృహ లాభాలు కలుగుతాయి .
నిన్న, ఈరోజు శుక్రుడు తన ఉచ్ఛ రాశైన మీన రాశి లో వర్గోత్తమం లో ఉండి అతి శుభ బలం తో ఉంటున్నాడు. భరణీ, పుబ్బా,పూర్వాషాఢ నక్షత్రాల వారికీ, వృషభ, తులా రాశుల వారికీ చాలా మంచిది. లక్ష్మీ ఆష్టోత్తర పారాయణ చాలా శుభ ఫలితాలు ఇస్తుంది.
మే 17 న కుజుడు మీన రాశి ప్రవేశం తో గురు మంగళ యోగం ఏర్పడింది. శుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనం వల్ల కామ్యార్ధ సిద్ధి కలుగుతుంది.
మే 28 న కుజ గురువులు అతి దగ్గరి సంయోగం లో వుంటారు. ఆ రోజు న శని త్రయోదశి, మాస శివరాత్రి కూడా అయ్యింది. చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున ఉదయం శుభ్రమణ్యా రాధన, శనికి తైలాభిషేకం , సాయంత్రం ప్రదోష కాలం లో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల గ్రహ దోష నివృత్తి కలుగుతుంది.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Friday, May 6, 2022

Bhanu Saptami on 8th May,Sunday


**Sree Gurubhyo Namah**

Sunday and Saptami fall on the same day on 8th May and is Bhanu Saptami. As the Nakshatra is Pushyami on that date , Arka Pushya Yoga is formed.

This day is very auspicious for praying lord Surya with Japa/Dhyana/Homa.
Praying Lord Surya on this day will increase Longevity, will improve health for those suffering from illnesses, people expecting good Job, Promotion will get what they wish Works related to Government will get resolved favourably.

Rituals to be done :
1. Maha Souram and Aruna Parayana at your home by veda panditas
2. Performing Gayatri Homa by yourself if you can or with the help of Purohitas
3. Japa for Ravi Graha
4. Performing Ravi Homa
5. Visiting Temple of Lord Surya and performing pooja
6. Visiting Lord Rama Temple

Make use of the most auspicious time to get the relief you wish.

వొచ్చే 8 వ తారీఖు ఆదివారం,భాను సప్తమి


**శ్రీ గురుభ్యోనమః **

వొచ్చే 8 వ తారీఖు ఆదివారం ,సప్తమి కలిసిరావడం వాళ్ళ భాను సప్తమి అయ్యింది . ఈ రోజు పుష్యమీ నక్షత్రం కూడా కావడం తో అర్క పుష్య యోగం ఏర్పడింది . ఈ రోజు సూర్య భగవానుడికి పూజ చేసుకోవడానికి చాలా విశేషమైన రోజు . 

ఈ రోజు సూర్య భగవానుడికి జప,ధ్యాన ,హోమాలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుండీ బయటపడొచ్చు . ప్రమోషన్ కావలసిన వారు ,ప్రభుత్వ పనులు సానుకూలం కావాలనుకునే వారూ , మంచి పదవీ ప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు పెరగడం కోసం , దీర్గాయుష్షు కోసం ఈ రోజు తప్పని సరిగా సూర్య భగవానుడి ప్రసన్నత కోసం వారి శక్తి కొద్దీ పూజించాలి . 

ఈ రోజు న మీ ఇంట్లో వేద పండితులతో మహా సౌరము ,అరుణ పారాయణ చేయించుకోవడం  ,గాయత్రీ హోమం చేసుకోవడం , 108 సార్లు సూర్య అధర్వశీర్ష పారాయణం చేయించుకోవడం ,రవి హోమం చేసుకోవడం లేదా చేయించుకోవడం , రవి గ్రహ జపం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి.  

శుభం భూయాత్ 
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం 
96407 54054
91828 17435

 

Thursday, May 5, 2022

కార్తీక,మాఘ మాసాల తరువాత వైశాఖం అంతటి మహత్యం ఉన్న మాసం.

 


మే 1 వ తేదీ నుండీ వైశాఖ మాసం మొదలైయ్యింది.

కార్తీక,మాఘ మాసాల తరువాత వైశాఖం అంతటి మహత్యం ఉన్న మాసం.
ధారా పాత్ర ద్వారా శివుడి అభిషేకం జరిగేలా ఏర్పాటు చెయ్యడం శుభఫలితాలు కలుగుతాయి.
వైశాఖ మాసం లో నదీ స్నానం చాలా మంచిది. గంగా గోదావరీ నదీ జలాలని స్నానపు నీటిలోకి ఆవాహన చేసుకుని స్నానం చెయ్యాలి.
ఈ నెలలో మామిడి పళ్లు , చెరకు దానం చెయ్యడం మంచిది. తాగు నీరు,మజ్జిగ దానం చెయ్యడం వల్ల మంచిఫలితాలు.
స్త్రీలు కుంకుమ దానం చెయ్యడం శుభం.

Saturday, April 30, 2022

ఈ రోజు 2022 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం

 


**శ్రీ గురుభ్యోనమః**

ఈ రోజు 2022 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం. ఈ గ్రహణం భారత దేశం లో కనిపించదు. దక్షిణ అమెరికా, చిలీ,అర్జెంటీనా, నైరుతి బొలీవియా, ఉరుగ్వే, పరాగ్వే వంటి దేశాల్లో కనిపిస్తుంది.

మన దేశం పై ప్రభావం చూపించకపోయినా ఈ రోజు సూర్య దేవుడిని పూజించడం శుభకరం.

శనివారం,అమావస్య కనుక పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడం, శనికి తైలాభిషేకం చేయించడం మంచిది.

దక్షిణ కాళీ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

ఈ కింద ఇవ్వబడిన సూర్య నామావళి ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవడం మంచిది.

సూర్య దేవుని ఏక వింశతి నామావళి :
వికర్తన వివస్వన మార్తాండ భాస్కర రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షు గ్రహేశ్వర లోకసాక్షి త్రిలోకేశ కర్త హర్త తమిస్రహ తపన తాపన శుచి సప్తాశ్వవాహన గభస్థిహస్త బ్రహ్మ సర్వదేవనమస్కృత - ఓం సూర్య దేవాయ నమః

Friday, April 29, 2022

ఈ రోజు చైత్ర కృష్ణ చతుర్ధశి, మాస శివ రాత్రి.


 









ఈ రోజు చైత్ర కృష్ణ చతుర్ధశి, మాస శివ రాత్రి.

మీన రాశిలో దేవ రాక్షస గురువులైన గురు శుక్రులు ఇద్దరూ అతి దగ్గరి సంయోగంలో ప్రస్తుతం వున్నారు. మీన రాశి అన్ని రాశులలో చివరిది , ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇచ్చే రాశి. గురు శుక్రులు ఈ రాశి లో వున్నప్పుడు శివ గాయత్రీ మంత్రాలతో శివారాధన విశేష ఫలితాలనిస్తుంది.
ఈ కింద ఇవ్వబడిన ఏదైనా ఒక శివ గాయత్రీ మంత్రాన్ని మీ శక్తి కొద్దీ జపం చేసుకోవాలి :
1. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ
ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!
2. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ
ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.!!
3. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్!!
4. పంచవక్త్రయ విద్మహే అతిశుద్ధాయ
ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ !!
5. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ
ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!
6. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ
ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!

Wednesday, April 27, 2022

రేపు చైత్ర కృష్ణ త్రయోదశి. వరాహ జయంతి

**శ్రీ గురుభ్యోనమః**
నక్షత్ర పాదాల వారీగా రేపటి (28.04.2022) తారా చంద్ర బలాలు,శుభ కాల,దుర్ముహూర్త,రాహు,వర్జ్య కాలాలు తెలిపే పట్టిక ఇవ్వబడింది.
రేపు రోజంతా మీన రాశిలో గండాంత డిగ్రీ ల లో చంద్రుడి సంచారం జరుగుతుంది ఏప్రిల్ 30 రా 20:13 వరకు. సింహ రాశి వారికి చంద్రాష్టమ స్థితి.
రేపు చైత్ర కృష్ణ త్రయోదశి. వరాహ జయంతి. విష్ణు భగవానుడిని వరాహ అవతారం లో పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చాలా మంచిది.
రేపు భరణీ కార్తె. తెల్లవారుజామున అర్ధ రాత్రి దాటిన తరువాత సూర్య భగవానుడి భరణీ నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల శుభం.
రేపు సాయంత్రం 18:23 నుండీ 20:39 మధ్య ప్రదోష కాలం లో రుద్రాభిషేకం చెయ్యడం,నమక చమక పారాయణం అత్యంత శుభప్రదం.

 

Tuesday, April 19, 2022

రేపు చేసుకోవలసిన పూజ,ధ్యానం


 **శ్రీ గురుభ్యోనమః**

రేపటి (20.04.2022) తారా చంద్ర బలాలు, శుభ కాల, దుర్ముహూర్త,రాహు,వర్జ్య కాలాలు తెలిపే పట్టిక. 

కలి ఆహర్గణన : 1871224 రోజులు. 

రేపంతా చంద్రుడు వృశ్చిక రాశి సంచారం రాత్రి 23:41 వరకు. మేష రాశి వారికి అష్టమ చంద్ర స్థితి. 

రాత్రి 23:41 వరకు జ్యేష్టా నక్షత్రం కనుక  కృత్తికా,ఉత్తరా,ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి నైధన తార. 
పునర్వసు,విశాఖ, పూర్వాభాద్రపదా వారికి విపత్ తార.మృగ శిరా, చిత్తా,దనిష్టా వారికి ప్రత్యక్ తార . 

మధ్యాన్నం 13:52 తరువాత నుండీ పంచమి. మత్స్య పంచమి కనుక విష్ణు ద్వాదశ నామ

స్తోత్రం పారాయణ మంచిది.

రేపు బుధ,చంద్ర,కేతువుల గ్రహ మంత్రాలు జపం చేసుకోవడం శుభం. 

శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

Friday, April 15, 2022

రేపు చైత్ర శుక్ల పౌర్ణమి చాలా విశేషమైన రోజు :


 **శ్రీ గురుభ్యో నమః **

రేపటి తారా చంద్ర బలాలు, శుభ కాలాలు , దుర్ముహుర్త ,రాహు ,వర్జ్య కాలాలు తెలిపే పట్టిక తో పాటు రేపటి విశేషం.
రేపు చైత్ర శుక్ల పౌర్ణమి చాలా విశేషమైన రోజు :
1. ఉత్తర భారత దేశం లో హనుమత్ జయంతి జరుపుకుంటారు . ఆంజనేయుడి ఆలయ సందర్శనం ,పూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది .

2. మన వైపు కొంత మంది ఏరువాక పౌర్ణమి గా పండగ చేసుకుంటారు . రంగు రంగు ల వస్త్రాలు దానం చెయ్యడం వల్ల సౌభాగ్యం పెరుగుతుందని నమ్ముతారు .
3. మహా చైత్ర సత్య నారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు .
4. శుక్రుడికి తప్ప మిగిలిన అన్ని గ్రహాలకు జప,దాన ,హోమాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు కూడా

Saturday, April 9, 2022

ముందస్తుగా అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .


రేపు చైత్ర శుక్ల నవమి ఏప్రిల్ 10 ,2022 ఆదివారం,శ్రీ రామ నవమి.ముందస్తుగా అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .

రేపు రోజంతా పుష్యమీ నక్షత్రం. ఆదివారం పుష్యమీ నక్షత్రం కలిసి రావడం వల్ల అర్క పుష్య యోగం ఏర్పడింది . అలాగే సర్వార్ధ సిద్ధి యోగం , రవి యోగం అనబడే శుభ యోగాలు రేపంతా ఉండడం వల్ల రేపు చాలా విశేషమైన శ్రీ రామ నవమి అని చెప్పాలి . రేపు చేసే పూజకి ఫలితం ఎక్కవ.
మీకు ఇష్టమైన శ్రీ రామ స్తోత్రం పారాయణ , సీతా రామ కళ్యాణం చెయ్యడం లేదా చూడడం , రామాలయ సందర్శనం వల్ల విశేషమైన ఫలితం.
రవి హోమం చేసుకోవడానికి అనుకూలమైన రోజు . శుక్ర , శని గ్రహాలకు దోష నివారణ జపాలు హోమాలు జరిపించుకోవటానికి విశేషంగా అనుకూలమైన రోజు .
ఏకశ్లోకీ రామాయణం :
అధౌ రామ తపోవనాదిగమనం
హత్వా మృగం కాంచనమ్ ||
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్ర తరణం
లంకాపురీదహనమ్ |
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం చేతద్ధి రామాయణమ్ ||

Monday, April 4, 2022

Tomorrow is Sree Panchami / Lakshmi Panchami - Rituals to be done


Tomorrow is a very auspicious day.

Chaitra Sukla Panchami is celebrated as Sree Panchami / Lakshmi Panchami .

This is believed to be the day when Goddess Lakshmi Devi descended on Earth.

This is also the day when the Naagas were born.
And this is the day when Lord Vishnu is worshipped as Hayagriva.

Poojaas to be done this day (5.04.2022) :

1. Sree Sookta Paaraayana or Sravanaa(Listening)

2. Lakshmi devi has to be worshipped with Lotus flowers with Sahasra Naama stotram. Girls has to be gifted cosmetics or New dresses

3. Sarpa Sookta Paaraayana or Sravana has to be done . Naaga pooja has to be done

4.Aswa Sooktam has to be recited or listened.

5. Lord Haya Greeva has to be worshipped by reciting his Stotra. Visit Hayagreeva temple.

రేపు శ్రీ పంచమి / లక్ష్మీ పంచమి


శ్రీ పంచమి / లక్ష్మీ పంచమి : 
 
రేపు అనగా 05. 04. 2022 చైత్ర శుక్ల పంచమి ని శ్రీ పంచమి గా లక్ష్మీ పంచమి గా జరుపుకుంటాము . లక్ష్మీ దేవి భూ లోకానికి వేం చేసిన రోజు . ఈ రోజు చాలా విశిష్ట మైన రోజు.  

లక్ష్మీ దేవి కి కలువలతో అష్టోత్తర పూజ చెయ్యడం , శ్రీ సూక్తం పారాయణ లేదా శ్రవణం, ఆడపిల్లలకు అలంకరణ సామాగ్రి బహుకరించడం  మంచిది . ఇలా చెయ్యడం వల్ల గ్రహ బాధల నుండీ ఉపశమనం కలుగుతుంది . 

ఈ రోజునే నాగులు ఆవిర్భవించిన రోజు కూడా.నాగ పూజ చెయ్యాలి.సర్ప సూక్త పారాయణ లేదా శ్రవణం వల్ల రాహుకేతు దోష ఉపశమనం కలుగుతుంది.

హయగ్రీవ వ్రతం కూడా ఈ రోజునే చేస్తారు . హయగ్రీవ స్తోత్రం చదువుకోవాలి . అశ్వసూక్తం పారాయణ చెయ్యాలి .