గురు గ్రహం అక్టోబర్ 31 న సింహ రాశిలో ప్రవేశస్తారు. అప్పటి నుండీ వచ్చే సంవత్సరం చివరిలో కన్యా రాశి లో ప్రవేశించే వరకు అనూ రాధా నక్షత్రం వారి పై గురు సంచార ప్రభావం చెప్పే రిపోర్ట్ ఈ క్రింద ఇవ్వబడింది.
మీ నక్షత్రం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా Phone No. 96407 54054.
**** **** ***** **** **** **** ****
అనురాధ నక్షత్రం పై గురు సంచార ఫలితం :
2026 అక్టోబర్ 31 నుండి 2027 జనవరి 25 వరకు: దశమ గురుడు సింహ రాశి లో మఖ నక్షత్ర సంచారం లో విపత్ తారలో ప్రవేశిస్తున్నందున నూతన ప్రాజెక్టులు, బాధ్యతల విషయంలో సంయమనం వహించాలి; గురు దృష్టి ద్వితీయ స్థానంపై ఉండటం వల్ల ఆర్థిక భద్రతకు ఢోకా ఉండదు.
25 జనవరి 2027 నుండి 26 జూన్ 2027 వరకు గురుడు వక్రగతితో తిరిగి కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలో ఉంటాడు. అది సంపత్ తార కావడంతో పాటు, భాగ్య స్థాన గురుడు కావడం వల్ల విశేష ధనలాభాన్ని, శుభాలను చేకూరుస్తుంది
2027 ఆగస్టు 28 నుండి నవంబర్ 10 వరకు: గురుడు సింహ రాశి లో పుబ్బ నక్షత్ర సంచారం లో క్షేమ తారలో సంచరించే కాలం వృత్తి, వ్యక్తిగత జీవితాలలో అత్యుత్తమ ఫలితాలను, ఎదుగుదలను అందిస్తుంది.
10 నవంబర్ 2027 నుండి 26 నవంబర్ 2027 వరకు సింహ రాశి లో ఉత్తర 1వ పాద సంచారం ఇది అనూరాధా నక్షత్రానికి ప్రత్యక్ తార (రుజు మార్గం, తదుపరి కన్యారాశి ప్రవేశం.
ఈ స్వల్ప కాలంలో చేపట్టిన పనులలో ప్రతికూలతలు లేదా చివరి నిమిషంలో అడ్డంకులు రావచ్చు. కీలకమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు నిశిత పరిశీలన అవసరం. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా సొంత పనులపైనే దృష్టి సారించాలి.
పరిహారం: విపత్ తార మరియు ప్రత్యక్ తార దోష నివారణకు గురువారం నాడు దక్షణామూర్తి లేదా శివారాధన చేయడం, శనగలు దానం చేయడం, "ఓం నమో భగవతే దక్షిణామూర్తయే" లేదా గురు స్తోత్ర పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభాలు చేకూరుతాయి