అస్తంగత గ్రహ దశ ఫలం :
గ్రహో మౌఢ్యం ప్రాప్తో మరణ మచిరాత్ స్త్రీసుత దానై :
ప్రహీ ణత్వం వ్యర్ధే కలహమపవాదం పరిభవం I
సమర్ క్షస్థ : ఖేటన కలయతి వై శేషిక ఫలం
సుఖం వా దుః ఖం వా జనయతి యధా పూర్వమచలం II
భావము : ఏదేని గ్రహము అస్తంగతమైన , అట్టి గ్రహ జాతకుని ఆయుష్షు క్షీణించి మరణ ప్రాప్తియగును , తన ఆస్తి,సంతతి ,భార్యా కూడా ఖిలమగును . అకారణ కలహములు పొందును . ఇతరులచే అసహ్యించుకొనబడువాడగును . కానీ సమ రాశి స్థిత గ్రహమైన పైన చెప్పిన ఫలితములు ఏమియునూ లేక సుఖమూ సంతోషమూ కలుగచేయును
(ఫలదీపిక - మేషాది లగ్న ఫలాధ్యాయము లోని 19 వ శ్లోకము )