ఏదైనా పని మొదలుపెట్టే ముందు సామాన్యం గా మన లో చాలా మంది తిధి, తారా బలం మాత్రమే చూసుకుని ముందుకెళుతూవుంటారు. కానీ ముహూర్త బలం నిర్ణయించే విధానం ' ఫలిత నవరత్న సంగ్రహం' అనే గ్రంధం లో ఈ క్రింది విధంగా చెప్పబడింది:
తిధి - 1
నక్షత్రం - 4
వారం - 8
కరణం - 16
యోగం - 32
తారాబలం - 60
చంద్ర బలం - 100
మొత్తంగా - 221
ఏదైనా 'ముఖ్యమైన' కార్యక్రమం మొదలిపెట్టే ముందు పైన చెప్పినవి దృష్టిలో పెట్టుకోవాలి.
తిధి కి అతి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది గమనించండి.
చంద్ర బలం ఏ ముహూర్తానికైనా పునాది అనీ మిగతా గ్రహాలు అన్నిటికీ బలాన్నిచ్చేది,కాపాడేదీ చంద్రుడి బలమే ననీ నారద సంహిత లో చెప్పబడింది.