రేపు అంటే 15. 03. 2024 న సాయంత్రం 17:20 కి కుజుడు కుంభ రాశి ప్రవేశం చేసి ఏప్రిల్ 23,2024 వరకు ఈ రాశి లో సంచారం చేస్తాడు . ఈ సంచారం లో చెప్పుకోదగ్గది శని తో కుజుడి యుతి . ఏప్రిల్ 9 వ తారీకు న ఉగాది తరువాత ఏప్రిల్ 11 వ తారీకున శని కుజుల ఖచ్చితమైన యుతి కుంభ రాశి లో జరుగుతుంది . రెండు ఆధి శతృ గ్రహాలు యుతి లో ఉండడం ప్రపంచానికి అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు .
ఇంతకు పూర్వం కుంభ రాశి లో శని కుజుల యుతి 1994 వ సంవత్సరం లో జరిగింది.మార్చ్ 14,1994 న ఈ యుతి జరిగింది . ఈ యుతి వల్ల ప్రజాందోళణలు సంభవించే అవకాశం ఉంటుంది . ప్రభుత్వం వెనుకడుగు వెయ్య వలసి ఉంటుంది . విమాన ప్రమాదాలు జరిగే అవకాశం.
1994 లో ఈ యుతి జరిగినప్పుడు సంభవించిన ముఖ్య ఘటనలు :
మార్చ్ 23 న నార్త్ కెరొలినా లో రెండు యుద్ధ విమానాలు ఢీ కొని ప్రాణ నష్టం సంభవించింది .
అదే రోజు మెక్సికో ప్రెసిడెంట్ హత్య కి గురికాబడడం .
పైన ఉదహరించిన సంఘటనల వంటివి మళ్ళీ జరిగే అవకాశం వుంది
ఉత్తర దక్షిణ అమెరికా దేశాల మీద ఈ యుతి ప్రభావం ఉంటుంది .
వరాహమిహిరుడి కూర్మ చక్ర విధానం ప్రకారం ఈ యుతి ఉత్తర భారత దేశం మీద ఎక్కువ ఉంటుంది . ప్రజానాయకుల కు ప్రమాదం వుంది . ప్రముఖ నాయకుడు ఒకరు హత్యకు గురికావొచ్చు. విమాన దుర్ఘటనలు , అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరగొచ్చు .
వివిధ రాశుల వారి మీద శని కుజుల యుతి ప్రభావం ఈ విధం గా ఉండొచ్చు :
మేష రాశి : మిత్రులతో అభిప్రాయభేదాలు / వైరం. ఆదాయం పెరుగుతుంది. మీ విజయాలను చూసి ఈర్ష్య పడేవాళ్ళు ఎక్కువ అవుతారు .
వృషభ రాశి : ఆఫీస్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి . పై అధికారులు వారు చేసిన తప్పులు మీ మీద మోపే అవకాశం . ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకొంత కాలం వేచి ఉండాల్సి వస్తుంది .
మిధున రాశి : అదృష్టం తక్కువ గా ఉంటుంది . మీ క్రింద పని చేసేవాళ్ళు మోసం చేస్తారు జాగ్రత్త . తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి . తీర్ధయాత్రలు వాయిదా వేసుకోవడం మంచిది .
కర్కాటక రాశి : దగ్గిర వాళ్ళు దూరం అవుతారు . మాట్లాడే ముందు ఆలోచించాలి . కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి .
సింహ రాశి : భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి . భాగస్వామ్యుల తో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి . భార్య తో మనఃస్పర్ధలు రావొచ్చు . అరుగుదల లేకపోవడం వల్ల సమస్యలు ఉంటాయి .
కన్యా రాశి : శత్రువుల పై విజయం సాధిస్తారు . పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు . అప్పులు తీర్చిస్తారు . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి .
తులా రాశి : సంతానం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . కోపావేశాలను అదుపులో పెట్టుకోవాలి . ఏ నిర్ణయమూ తీసుకోలేక ఇబ్బంది పడతారు .
వృశ్చిక రాశి :
తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి . ఇంటికి రిపేర్లు చేయిస్తారు . విద్యార్థులు అనుకున్న విజయం సాధించలేరు .
ధనుస్సు రాశి : పోటీ పరీక్షలలో నెగ్గుతారు . ఆట పోటీ లలో విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలతో వ్యవహరిస్తారు .
మకర రాశి : ఆలోచించి మాట్లాడాలి . ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉంటాయి . మోసం చేసే వాళ్ళు అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటారు జాగ్రత్త వహించండి . కుటుంబ సమస్యలు ఉంటాయి . వివాదాలకి దూరంగా ఉంటుంది .
కుంభ రాశి : మానసిక ఆందోళనలు ఉంటాయి . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . మెడిటేషన్ చెయ్యండి . ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . దూర ప్రయాణాలు చేస్తారు .
మీన రాశి : ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆస్తి కొనుగోలు అమ్మకాలు విషయాల్లో జాగ్రత్త వహించాలి .