మేష రాశి :
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ వారం అద్భుతం గా ఉంటుంది . వారం మొదట్లో తలనొప్పి బాదించవొచ్చు . ఉద్యోగస్తులు మంచి పురోగతి సాధిస్తారు . మనః శాంతి ఉంటుంది . పరిచయస్తులు వల్ల లాభ పడతారు . నూతన గృహం కొనుగోలు/నిర్మాణం చేసే ఆలోచన చేస్తారు . ఏ విషయం లో నూ నిర్లక్ష్యం పనికి రాదు . ఈ వారం అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది . విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కొంత మందికి ప్రమోషన్లు వొచ్చే అవకాశం. వారాంతంలో శుభ వార్తలు వింటారు .
వృషభ రాశి :
మీ కృషికి తగిన ఫలితం ఈ వారం మీకు లభిస్తుంది. మనఃశాంతి ఉంటుంది . వారం మొదట్లో సవాళ్లు ఎదుర్కొంటారు . గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు . కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు . మీ వ్యాపారాల్లో లాభాలు పెరిగే విధం గా చర్యలు తీసుకుంటారు . పరిస్థితులు అన్నీ మీ అదుపులో ఉంచుకుంటారు . తోడపుట్టిన వారితో సత్సంబంధాలు ఉంటాయి . గొంతుకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు . మీ సంతానం పురోగతి మీకు సంతోషం కలిగిస్తుంది . ఇన్కమ్ టాక్స్ వల్ల ఇబ్బందులు ఉండొచ్చు . ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రవారం , శని వారం అనుకూలమైన రోజులు .
మిధున రాశి :
ఆరోగ్యం బాగుంటుంది . తోడ పుట్టిన వారి సహకారం ఉంటుంది . కష్ట సాధ్యమైన పనులు సాధిస్తారు . మెడికల్ రంగం లోని వారికి అనుకూలమైన వారం . వ్యాపారం లో అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి . కోపం గా వున్నవారిని కూడా మీ ప్రవర్తనతో శాంత పరుస్తారు . ఆదివారం , సోమవారం అనుకూలమైన రోజులు . ఆదాయానికి ఖర్చులకీ పొంతన ఉండదు . పనులు వాయిదా వెయ్యకండి . ఆదాయ వనరుల్లో పెట్టుబడులు పెడతారు . కుటుంబ వ్యవహారాల్లో బైట వ్యక్తుల ప్రమేయం వల్ల ఇబ్బందులు కలుగుతాయి . బుధ ,గురు వారాల్లో చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి . ఊహల్లో విహరించకండి .
కర్కాటక రాశి :
ఉద్యోగస్తులకు ప్రొమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు రావొచ్చు . తోటి పని ఆరితో మంచి సఖ్యత వారి నుండీ సహకారం ఉంటాయి . మీ మీద మీకు చాలా విశ్వాసం ఉంటుంది . ఈ వారం మీకు మంచి అవకాశాలు ఇస్తుంది . దగ్గిర వ్యక్తుల విలువ తెలుసుకుంటారు . మంగళ,బుధ వారాలు మీకు అనుకూలం . వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు . ఒకేసారి అన్ని పనులు చేద్దామని ప్రయత్నించకండి . ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోకండి . ఆరోగ్య వంతమైన ఆహారపు అలాఅట్లు పాటించాలి . సమయానికి నిద్ర ముఖ్యం . సోమ, శుక్రవారాల్లో అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి .
సింహ రాశి :
ఈ వారం ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉద్యోగస్తుల కు ఈ వారం చాలా అనుకూలం . ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న ప్రయాణాలు ఈ వారం వీలౌతాయి . శుభవార్తలు వింటారు . ఆదాయం పెరుగుతుంది . ఉద్యోగాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు . మీరు ఇష్టపడే వ్యక్తి తో విభేదాలు వస్తాయి . పెద్ద ఉద్యోగ అవకాశాలు వస్తాయి . ఆది , శుక్ర వారాలు అనుకూలం . మునగాల, బుధ వారాలు అననుకూలం గా ఉంటాయి . పెళ్లికాని వారికి సంబంధం కుదిరే అవకాశం . అదృష్టం కలిసి వస్తుంది . మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఎక్కువ పని ఒత్తిడి వల్ల దిన చర్య మీద ప్రభావం చూపిస్తుంది . సరిపడా విశ్రాంతి అవసరం . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి .
కన్యా రాశి :
ఉద్యోగం లో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి . అప్పులు తీర్చేస్తారు . కష్ట సాధ్యమైన పనులు పూర్తి చెయ్యడం లో నిమగ్నమై వుంటారు . భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి . భార్యా భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది . శత్రువులపై విజయం సాధిస్తారు . మంగళ ,బుధ ,గురు వారాలు అనుకూలం . తల్లి తండ్రుల మాట అభిప్రాయాలకి విలువ ఇవ్వండి . పిల్లల విషయాల్లో అసంతృప్తి గా వుంటారు . రహస్య శత్రువులు నష్టం చెయ్యాలని చూస్తారు అన్న విధాలా జాగ్రత్తగా ఉండాలి . అనవసర భయాలు తో ఆందోళన చెందుతారు .
తులా రాశి :
వారం మొదట్లో శుభ వార్తలు వింటారు . భార్యా భర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది . వ్యాపారం లో మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు వస్తాయి . కండరాల సమస్యలు ఉండొచ్చు . ముఖ్యమైన వ్యవహారాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల ఇబ్బందులు పడతారు . అడ్మినిస్ట్రేషన్ రంగం లో ని వారికి ఈ వారం చాలా అనుకూలం . మీ సమర్ధత పెరుగుతుంది . కన్సల్టెంట్ ల కి అనుకూలం . ఆర్ధిక వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి . కొంత మంది మిమ్ములను అపార్ధం చేసుకునే ప్రమాదం వుంది . సోమ ,శుక్ర వారాల్లో మంచి అనుకూలతలు . మంగళ బుధ వారాల్లో ఇబ్బందులు ఉంటాయి . స్వంత విషయాలు అందరికీ తేలిపోతాయని భయపడతారు . మీ సంతానం మొండి పట్టుదల పట్టడం వల్ల చిరాకు పడతారు .
వృశ్చిక రాశి :
ఆర్ధిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది . ఆఫీసు లో మీ అధికారాలు పెరుగుతాయి . అవసరమైన సమయానికి మీ మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి . మీ దగ్గిర పని చేసే వాళ్లకి జీతాలు పెంచాల్సిన పరిస్థితి . వ్యాపారాల్లో అన్ని సవాళ్లనూ అధిగమిస్తారు . పాత పొరపాట్లనుంచీ మంచి పాఠాలు నేర్చుకుంటారు . కుటుంబ సమస్యలు ఉంటాయి . ఖర్చులు ఎక్కువ అవుతాయి . మీ పట్టుదల వల్ల పూర్తి కావాల్సిన పనులు త్వరగా పూర్తి అవుతాయి . ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు . ఆదివారం నుండీ బుధ వారం వరకు అనుకూలం . శుక్ర శని వారాలు కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకపోతేనే మంచిది . చెడు స్నేహాల వల్ల మీకు చెడ్డ పేరు వొచ్చే అవకాశం.
ధనుస్సు రాశి :
మీరు చేసిన మంచి పనుల వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది . రాజకీయ నాయకీలకి బాగా అనుకూలమైన వారం .ఆర్ధిక విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది . విదేశీ ప్రయాణాలకు అవకాశం . కానీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండొచ్చు . ఏదైనా పని మొదలు పెట్టేముందు పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం మంచిది. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు . స్నేహితులతో ఆనందం గా గడుపుతారు . ఈ వారం ఎదురైనా అన్ని ఆటంకాలు అధిగమిస్తారు . బుధ గురు వారాలు అనుకూలం . రక్తపోటు మధుమేహం సమస్యలు వున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . కుటుంబ సమస్యలు పరాయి వ్యక్తుల ముందు ప్రస్తావించకండి . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి . తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి .
మకర రాశి :
ఈ వారం పనులతో తల మునకలై వుంటారు . నూతనోత్సాహం తో వుంటారు . వ్యాపారం లో పురోగతి సాధిస్తారు . మీ పై అధికారులు మిమ్ములను ప్రశంసిస్తారు . షేర్ మార్కెట్ పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి . రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్ మొదలు పెట్టొచ్చు . మీ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారు . బంధువులు లేక మిత్రుల రాక తో ఆనందం గా వుంటారు . శుక్ర శని వారాలు అనుకూలం . పని ఒత్తిడితో చిరాకు ప్రదర్శిస్తారు . మీ గౌరవం పెరుగుతుంది . భజంత్రీ గాళ్ళను నమ్మకండి . ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి .
కుంభ రాశి :
ఉద్యోగస్తులకు చాలా పని ఉంటుంది . కుటుంబం లో సుఖ సంతోషాలు ఉంటాయి . ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటుంది . మీ పై అధికారులతో మీ సంబంధాలు బావుంటాయి . కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి . ధైర్యం తో మంచి నిర్ణయాలు తీసుకుంటారు . ఇంటికి మరమత్తులు చేయిస్తారు . మీ సంతానం పరివర్తన పట్ల సంతోషం గా వుంటారు . దగ్గు జలుబు వంటి వాటితో ఇబ్బంది పడతారు . భుజం నొప్పితో బాధ పడతారు . సరైన ఆరామ వ్యాయామాలు ఉండేలా జాగ్రత్త పడాలి . బుధ గురు వారాల్లో అన్ని విషయాల్లో జాగ్రత్త గా ఉండాలి .
మీన రాశి :
మత పరమైన వ్యవహారాల లో ఆసక్తి చూపిస్తారు . మీ మీద గౌరవం పెరుగుతుంది . ముఖ్యమైన వ్యవహారాలు అనుభవజ్ఞులు , సీనియర్ ల సహాయం తో పూర్తి చేస్తారు . వ్యాపారం లో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తారు . మీ జీవిత భాగస్వామి వృత్తిపరమైన మంచి విజయం సాధిస్తారు . విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోవాలి . ఆర్ధిక పురోగతి బాగుంటుంది . మంగళ బుధ వారాలు బాగా అనుకూలం . ఎక్కువ పని ఒత్తిడి వాళ్ళ ఇబందులు ఉంటాయి . అలసట , చిరాకు వల్ల ఇబ్బంది పడతారు . సరైన ఆహార నియమాలు పాటించాలి .