శశ్వద్విశ్వావసావబ్దే మధ్య సస్తార్థ వృష్ఠయః
ప్రచురాశ్చౌర రోగాశ్చ నృపా లోభాభి భూతయః
విశ్వావసు నామక సంవత్సరం లో సస్యములు వర్షములు మధ్యమముగా వుండును. ధాన్యములు ధరలు అధికమగును. రోగములు మరియు చోరులు అధిక మగును. రాజులు లోభముతో కూడి వుందురు.
(నారద సంహిత)
సుపుత్ర దారః సుతరాముదారో
నర్మః సదాచార రతో 2_ తి ధీరః ।
మిష్టన్న భుక్ సర్వ గుణాభిరామో
విశ్వా వ సౌ యస్య భవేత్ప్ర సూతిః ।।
విశ్వావసు నామ సంవత్సరమున జన్మించిన వారలు సత్పుత్రుల తోటి సతీ సమేతుడై , ఉదారభావోపేతులు, సదాచార సంపన్నులు, ఇష్టాన్నపానములు కలిగి, సకల గుణో పేతులై వుండెదరు.
(జాతకాభరణం)