Showing posts with label Festivals. Show all posts
Showing posts with label Festivals. Show all posts

Friday, March 8, 2024

శివాష్టకం


శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।
జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ ।
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ ।
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥
ఓం నమః శివాయ మహాశివరాత్రి శుభాాంక్షలు శుభ శుక్రవారం

Saturday, February 24, 2024

మాఘపూర్ణిమ

మాఘపూర్ణిమ :

ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం,
కార్తికం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తికం, మాఘం స్నానాలకు ప్రసిద్ది. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు చేసినట్లే, మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధంగా కనిపిస్తోంది. 

మాఘపౌర్ణమిని మనవారు
మహామాఘి అంటారు. "మాఘే నిమగ్నాహః సలిలే సుశీలే విముక్త పాపాః త్రిదివం ప్రయాంతి" 

మాఘమాసంలో ప్రవహించే  నీటియందు నిలిచి,మంచిమనసుతో స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యమిస్తే పాపవిముక్తులై  స్వర్గానికి చేరుకుంటారు అని ఈ శ్లోకానికి అర్థం. మాఘస్నాన వ్రతం అత్యుత్తమ ఫల దాయకం. కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రం.

మాఘపూర్ణిమ , మహా మాఘి


 ఈ రోజు  మాఘపూర్ణిమ , మహా మాఘి


ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పా౦డున౦దన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

Saturday, February 17, 2024

ఈ రోజు భీష్మాష్టమి సందర్భంగా - భీష్మ తర్పణ విధి

ఈ రోజు మాఘ శుక్ల అష్టమి. భీష్మ అష్టమి. ఈ రోజు భీష్ముడు తన కు వున్న స్వచ్ఛంద  మరణ వర ప్రభావం తో తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజు. 
ఈ రోజు భీష్ముడికి తర్పణాలు ఇవ్వడం ఆచారం. 
విష్ణు సహస్ర నామం పారాయణ చెయ్యాలి. భీష్ముడి గాథను స్మరణం చేసుకోవాలి లేదా చదవాలి. 

భీష్మతర్పణ విధి - భీష్మాష్టమి:
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం.

శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి

నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
తర్పణము
1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)

1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)

పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)

అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!

ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"

వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!

అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్ 

Friday, February 16, 2024

రథ సప్తమి శుభాకాంక్షలు

🌺రధసప్తమి_శుభాకాంక్షలు🌺

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రధసప్తమి పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

_*"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"*_

ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.

1. ఈ జన్మలో చేసిన, 
2. జన్మాంతరాలలో చేసిన, 
3. మనస్సుతో, 
4. మాటతో, 
5. శరీరంతో, 
6. తెలిసీ, 
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి
నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

 తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు.

 ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
_______________________________

🌹సూర్యుని ఎందుకు ఆరాధించాలి?🌹

1. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

2. ప్రపంచవ్యాప్తంగా సూర్యారాధన

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడు కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షినాయనం ముగించుకుని ఉత్తరాయనం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు.

3. సూర్యుడికి సంబంధించిన పురాణ కథలు

సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

4. సూర్యుడే జ్ఞానానికి ఆది దేవుడు

వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు

5. సూర్యారాధన ప్రాముఖ్యత

ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.

6. సూర్య చికిత్స ప్రతిభ

సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని అర్థమవుతుంది.

Saturday, February 10, 2024

ఈ రోజు నుండీ మాఘ మాసం

ఈరోజు నుండి మాఘ మాసం ప్రారంభం

చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది. కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత.... అంత ప్రాధాన్యత!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం"

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని,బావుల వద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.
పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే, కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి
.
స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించాలి.

ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.
అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా, సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి. కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని
ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. శ్రీ పంచమి, వరచతుర్దశి, వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్ముఏకాదశి, మాఘ పూర్ణిమ.

Wednesday, December 27, 2023

Aardra Darshana

Aardra Darshan : 

Aardra Darshan is a Tamil festival and this day is dedicated to Lord Shiva. Aardra Nakshatram, which is also known as Thiruvaathirai Nakshatram, during
Maargazhi Masam is considered highly auspicious.

On this day Aardra Nakshatra also coincides with Pournami.

On this day Nataraj form of Lord Shiva is
worshipped during Arunodaya along with holy chanting from Vedas. Being dedicated to Nataraj form of Lord Shiva this day is also considered as the birthday of Lord Shiva. 

In rest of the India it is Maha Shivaratri which is considered as the birthday of Lord Shiva.

Tuesday, December 26, 2023

దత్త జయంతి శుభాకాంక్షలు

ఈ రోజు మార్గశిర పౌర్ణమి. దత్తా త్రేయ జయంతి. దత్తా త్రేయుడికి జ్ఞానోదయం అయిన రోజు గా చెప్పబడింది. త్రిమూర్తులను కలగలిపిన శక్తి స్వరూపం  దత్తా త్రేయుడు. ఈయనే ఆది గురువు. 

భగవద్గీత లో పరమాత్ముడు మాసాలలో నేను  మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. మార్గశిర మాసం మాసాలలో 9 వ ది. మార్గశిర పౌర్ణమి రోజున మృగశిరా నక్షత్రం లో పౌర్ణమి జరుగుతుంది. ఇదే మాసం లో రవి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ధనుస్సు రాశి రాశులలో 9 వ రాశి. అందుకే ఇది అత్యంత విశేషమైన మాసం . 

ఈ రోజు దత్తాత్రేయ ఆలయ సందర్శనం, విశేష పూజ జరిపించుకోవడం, గురువులను గౌరవించు కోవడం, గురు చరిత్ర పుస్తకాలను పంచిపెట్టడం, దత్తాత్రేయుడి మంత్రాలలో ఏదైనా ఒకటి 108 సార్లు జపం చేసుకోవడం వల్ల  చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. 

Saturday, December 23, 2023

అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు


మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 

Wednesday, December 20, 2023

బుధాష్టమి శుభాకాంక్షలు

బుధాష్టమి :
బుధవారము నాడు సంభవించిన అష్టమిని "బుదాష్టమి” అని అంటారు. ఈ
బుదాష్టమి శివ పార్వతుల పూజకు మరియు గణపతిని ఆరాధించడం
శ్రేష్టము. ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసముండి, శివారాధన, పార్వతి ఆరాధన చేస్తారో, అట్టి వారు, వారి మరణానంతరం నరకమునకు పోరట.
స్వచ్ఛమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితాన సకాల అభివృద్ధి పొందుతారు. అలాగే బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని
పండితులు చెబుతున్నారు. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అప్లైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి, ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించాలి. ఇలా ఆచరించినవారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి, బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.

బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత, పూర్వ జన్మ పాపముల నుండి  విముక్తి లభించును. శివ, పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ
దోషములు నివారింపబడి, బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.

Sunday, December 17, 2023

రేపు సుభ్రమణ్య షష్ఠి

 
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. 

కృత్తిక నక్షత్రాన
జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల
శరవణభవుడని,ఆరుముఖాలుండటం  వల్ల షణ్ముఖుడని, ఇంకా
స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు.

శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం
నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం,
షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు  నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ, రాహు, కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు, సంతానంలేని వారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని
పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని   సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు.
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ  తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. 

బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. 

శ్లో : 
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

పై  శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూర్తిగా పఠించితే శత్రు విజయం చేకూరుతుంది.

Friday, November 17, 2023

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు


ఈ రోజు నాగుల చవితి పర్వదినం. 

పుట్టలో పాలు పోసి పూజ చెయ్యాలి. గంధ అక్షతలతో పూజించి క్షీరం తో నాగేంద్ర స్వామి ని తృప్తిపరవాలి. 

ఈ రోజంతా ఉపవాసం చేసి  పంచమి తిథి లో ఉపవాస విరమణ చేస్తే నాగ దోషాలు, రాహు కేతు దోషాలు, కాల సర్ప దోషాలు ఉపశమిస్తాయి. 

నవ నాగ స్తోత్రం , సర్ప సూక్తం పారాయణ లేదా శ్రవణం వల్ల శుభం కలుగుతుంది. 

Sunday, October 15, 2023

Subh Navratri/ శరన్నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు


Subh Navratri to you and all yours. 
ఆత్మీయ మిత్ర బంధువులు అందరికీ శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు 

Sunday, May 14, 2023

Hanuman Jayanthi - 14.05.2023

అంజనానందనం వీరం జానకీ శోక నాశనం
కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం
ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం

వైశాఖ బహుళ దశమి, శ్రీ హనుమజ్జయంతి మహాపర్వదినమున బుద్ధి, బలము,యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, అజాడ్యము, నిర్భయత్వము, వాక్పటుత్వముతో పాటు శ్రీరామ పాదాంబుజముల యందు తరగని భక్తి, ధర్మాచరణము యందు అనురక్తి అనుగ్రహించమని స్వామి హనుమ పాదములు పట్టి ప్రార్థిస్తూ :

అందరికీ హనుమత్ జయంతి శుభకాంక్షలు.


వైశాఖ కృష్ణ దశమి శనివారం రోజున మధ్యాన్న సమయం లో పూర్వాభాద్ర నక్షత్రం లో హనుమంతుడు జన్మించారని పరాశర సంహిత లో వుంది.

వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతిని తెలుగువారు వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ఉంటాయి. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.

Friday, April 28, 2023

Masik Durgashtami Today - 28.04.2023 - Tara & Chandra Balam for today


Today is Vaisakha Sukla Ashtami till evening 04;01. Today is also Masik Durgashtami. Very good day to pray to Durga Matha. Chanting Durga Sooktam will bring immense benefits and reduce the ill effects of all planets in one's horoscope especially Rahu. 

Visit any Durga temple nearby to you and get ashtottara puja. Or performing Kum Kum pooja for the mother will give extremely good results.

Today is Aslesha till 12:47. Good day to start doing japa for Budha. If Budha is placed in dusthanas or is debilitated or combust in your horoscope you can do a Japa (17000 times) of Budha mantra yourself or by a purohita.

Wednesday, April 26, 2023

Ganga Saptami - 27.04.2023

Tomorrow ie 27.04.2023 is Vaisakha Sukla Saptami and is celebrated as Ganga Saptami. This day is believed to be the day when Ganga was reborn.

According to Hindu Mythology Ganga  descended to the Earth on Ganga Dussehra day. When mighty Ganga was descended to the Earth, Lord Shiva took her in His hairs to break Ganga's descent to avoid Ganga sweeping the whole Earth away. Later Lord Shiva released Ganga so that she can accomplish her mission to purge the cursed souls of Bhagiratha's ancestors.

          
While on her way to kingdom of Bhagiratha, her mighty flow and gushing turbulent water destroyed the Ashram of sage Jahnu. This angered Sage Jahnu and he drank up all of Ganga's water. Upon this, Bhagiratha and the Gods prayed to Rishi Jahnu to release Ganga so that she could proceed on her mission. Pleased with prayers Jahnu released Ganga from his ear.

According to legends Jahnu Rishi released Ganga from his ear on Saptami of Vaishakha Shukla Paksha. Because of this legend this day is also known as Jahnu Saptami. Ganga is also known as Jahnavi, the daughter of Rishi Jahnu.

On Ganga Saptami devotees worship Goddess Ganga and take bath in Ganges. Taking bath in Ganges on Ganga Saptami day is considered highly auspicious.

This Mythological Story finds mention in Padma Purana, Brahma Purana and Narada Purana.

On this day, people take bath in Ganga river, recite Ganga Stotram and can also offer jal to shivlinga chanting ॐ गंगाधराय नमः॥

Tuesday, April 25, 2023

Aadi Sankara Jayanti - 1235th Birth Anniversary - 25.04.2023 - Vaisakha Sukla Panchami

Today is Aadi Sankaracharya Jayanti. This day is the 1235th Birth Anniversary of Sree Aadi Sankaracharya. 

Adi Shankara was born in Kalady which is situated in Kerala during 788 C.E. and he disappeared at young age of 32 in year 820 C.E. Adi Shankaracharya Jayanti is observed on Panchami Tithi during Shukla Paksha of Vaishakha month and currently falls between April and May.

Shankaracharya consolidated the doctrine of Advaita Vedanata and revived it at a time when Hindu culture was on decline.

Adi Shankara, along with Madhava and Ramanuja, was instrumental in the revival of Hinduism. 

These three teachers formed the doctrines that are followed by their respective sects even today. 

They have been the most important figures in the recent history of Hindu philosophy.





Today's Tara and Chandra Balam Chart :



Tuesday, April 11, 2023

Matsya Jayanti - 11.04.2023


Today is Chaitra Krishna Panchami till 07.17 AM and Jyeshta Nakshatra. 

Panchami is only till 07:17 AM and from then Chaitra Krishna Sashti Starts. Sashti will be running till 05:39 AM ,tomorrow till before sunrise. So Today is Tidhi Dwayam. Tomorrow is Chaitra Krishna Saptami. 

Timings given in the above chart are for Mchilipatnam,Andhra Pradesh and may vary slightly depending on the place where you live (Only for India). 

Today Chandra Balam is more important as it is Krishna Panchami and can be considered for starting routine auspicious activities.  If both Tara and Chandra Balam are good for your Nakshatra Pada then the day is extremely auspicious for you. 

As Guru Moudhyami is running till 29th April, no important auspicious activities llike marraiges , engagements, First time meeting of Bride and Groom ,Gruha Pravesha can be done till then.

Today is Matsya Jayanti. The Day lord Vishnu took his form as Matsya Avatara. Reading the story of Matsya Avatara will give good results. Click on this link to read : Story of Matsya Avatara of Lord Vishnu

Today is good for chanting Sree Vishnu Namashtakam. Visiting Temples of Venkateswara/Balaji and performing special poojas.

శ్రీ హరి నామాష్టకం :

శ్రీ కేశవాచ్యుత ముకుంద రథాంగపాణే
గోవింద మాధవ జనార్దన దానవారే |
నారాయణామరపతే త్రిజగన్నివాస
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ॥

శ్రీదేవదేవ మధుసూదన సారంగపాణే
దామోదరార్ణవనికేతన కైటభారే |
విశ్వంభరాభరతభూషిత భూమిపాల
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ॥

శ్రీపద్మలోచన గదాధర పద్మనాభ
పద్మేశ పద్మపద పావన పద్మపాణే |
పీతాంబరాంబరరుచే రుచిరావతార
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ||

శ్రీకాంత కౌస్తుభధరార్తిహరాబ్జపాణే
విష్ణో త్రివిక్రమ మహీధర ధర్మసేతో ।
వైకుంఠవాస వసుధాధిప వాసుదేవ
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ||

శ్రీనారసింహ నరకాంతక కాంతమూర్తే
లక్ష్మీపతే గరుడవాహన శేషశాయిన్ |
కేశిప్రణాశన సుకేశ కిరీటమౌళే
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ||

శ్రీవత్సలాంఛన సురర్షభ శంఖపాణే
కల్పాంతవారధివిహార హరే మురారే |
యగ్నేశ యగ్నమయ యగ్నభుగాదిదేవ
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ||

శ్రీరామ రావణరిపో రఘువంశకేతో
సీతాపతే దశరథాత్మజ రాజసింహ |
సుగ్రీవమిత్ర మృగవేధన చాపపాణే
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ॥

శ్రీకృష్ణ వృష్టివర యాదవ రాధికేశ
గోవర్ధనోద్ధరణ కంసవినాశ శౌరే |
గోపాల వేణుధర పాండుసుతైకబంధో
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి ॥

ఇత్యష్టకం భగవతః సతతం నరో యో
నామాంకితం పఠతి నిత్యమనన్యచేతాః |
విష్ణోః పరం పదముపైతి పునర్న జాతు
మాతుః పయోధరరసం పిబతీహ సత్యమ్ ॥

ఇతి శ్రీమత్పరమహంస బ్రహ్మానంద విరచితం శ్రీ
హరినామాష్టకమ్ |