Sunday, May 14, 2023

Hanuman Jayanthi - 14.05.2023

అంజనానందనం వీరం జానకీ శోక నాశనం
కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం
ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం

వైశాఖ బహుళ దశమి, శ్రీ హనుమజ్జయంతి మహాపర్వదినమున బుద్ధి, బలము,యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, అజాడ్యము, నిర్భయత్వము, వాక్పటుత్వముతో పాటు శ్రీరామ పాదాంబుజముల యందు తరగని భక్తి, ధర్మాచరణము యందు అనురక్తి అనుగ్రహించమని స్వామి హనుమ పాదములు పట్టి ప్రార్థిస్తూ :

అందరికీ హనుమత్ జయంతి శుభకాంక్షలు.


వైశాఖ కృష్ణ దశమి శనివారం రోజున మధ్యాన్న సమయం లో పూర్వాభాద్ర నక్షత్రం లో హనుమంతుడు జన్మించారని పరాశర సంహిత లో వుంది.

వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతిని తెలుగువారు వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ఉంటాయి. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.