ఈ రోజు మార్గశిర పౌర్ణమి. దత్తా త్రేయ జయంతి. దత్తా త్రేయుడికి జ్ఞానోదయం అయిన రోజు గా చెప్పబడింది. త్రిమూర్తులను కలగలిపిన శక్తి స్వరూపం దత్తా త్రేయుడు. ఈయనే ఆది గురువు.
భగవద్గీత లో పరమాత్ముడు మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. మార్గశిర మాసం మాసాలలో 9 వ ది. మార్గశిర పౌర్ణమి రోజున మృగశిరా నక్షత్రం లో పౌర్ణమి జరుగుతుంది. ఇదే మాసం లో రవి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ధనుస్సు రాశి రాశులలో 9 వ రాశి. అందుకే ఇది అత్యంత విశేషమైన మాసం .
ఈ రోజు దత్తాత్రేయ ఆలయ సందర్శనం, విశేష పూజ జరిపించుకోవడం, గురువులను గౌరవించు కోవడం, గురు చరిత్ర పుస్తకాలను పంచిపెట్టడం, దత్తాత్రేయుడి మంత్రాలలో ఏదైనా ఒకటి 108 సార్లు జపం చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.