Monday, August 24, 2020

వివాహ పొంతనములు - గమనించవలసిన ముఖ్య విషయాలు


వివాహ పొంతనములు - గమనించవలసిన ముఖ్య విషయములు 

వివాహం చెయ్యటానికి జాతకముల పొంతన కుదరడం చాలా అవసరం. అష్ట కూట పద్ధతి, కాల ప్రకాశిక పద్ధతి ఇలా కొన్ని పద్ధతుల్లో పొంతన కుదిరిందో లేదో సాధారణంగా పరిశీలిస్తాము. మరీ ముఖ్యం గా అష్ట కూట పద్ధతి లో ఎక్కువగా పరిశీలిస్తాము. ఈ పద్ధతి లో మొత్తము 36 points కీ 18 points కానీ అంతకు మించి గానీ వస్తే జాతకాలు కలిసినట్టు అనుకుంటాము. 36 కి 18 పైన ఎన్ని ఎక్కువ points వస్తే అంత మంచిది. 

ఇదే కాక కుజ దోష నిర్ణయం, కాల సర్ప దోష నిర్ణయం చేసిన తరువాత జాతకాలు సరిపోతున్నట్టు ఉన్న పరిస్థితి లో కూడా మరి కొన్ని విషయాలు సరిచూసుకోవాలి. అవేమిటో చెప్పడమే ఈ పోస్టు ఉద్దేశ్యం. 

తులా రాశి లో పాప గ్రహాలు ఉన్న జాతకులు ఆలస్య వివాహాఁ కానీ అసలు వివాహం కాకపోవడానికి కానీ  అవకాశం వుంది. శని కేతువులు తులలో కానీ, సప్తమ భావం లో కానీ ఉండడం వివాహానికి గానీ వైవాహిక జీవితానికి గానీ మంచిది కాదు. 

అలాగే సప్తమం లో గురు దృష్టి లేని శని ఒంటరిగా వున్నప్పుడు, లేక ఇతర పాప గ్రహాలతో కలిసి వున్నప్పుడు కూడా వైవాహిక జీవితానికి మంచిది కాదు. 

సప్తమాధిపతి ఆస్తంగతమై ఉండడం, గ్రహ యుద్ధం లో ఓడి పోయి ఉండడం కూడా ఆలాగే మంచిది కాదు. 

జాతకం లో సప్తమం లో శుక్రుడు ఉండడం మంచిది కాదు.అలాగే శుక్రుడు ఆస్తంగతమైనా, గ్రహ యుద్ధం లో ఓడిపోయి వున్నా, జాతకుడి లో వీర్య కణాల లోపం ఉంటుంది అలాంటి సంబంధం కుదుర్చుకోకపోతేనే మంచిది. 

శుక్రుడు నీచలో ఉండి, నీచ భంగం కానప్పుడు లేదా శుభగ్రహ దృష్టి లేనప్పుడు కూడా జాగ్రత్త పడాలి. 

లగ్న,సప్తమాలలో రాహు కేతువులు ఉండడం, లేక సప్తమాధిపతి కానీ, శుక్రుడు కానీ రాహు గ్రస్తమో,కేతు గ్రస్తమో అవ్వడం కానీ మంచిది కాదు. 

ఇక వివాహం తరువాత సంతానం కలగడం ముఖ్యం కాబట్టి , పంచామాధిపతి ఆస్తంగతమై ఉండడం, గ్రహ యుద్ధం లో ఓడి పోయి ఉండడం, రాశి సంధి లో ఉండడం మంచిది కాదు. అలాగే పంచమాధిపతి రాహు , కేతు గ్రస్తమై ఉండడం మంచిది కాదు. 
గురు గ్రాహం పంచమం లో ఉండడం కానీ, సింహ రాశి లో పాప గ్రహాలు ఉండడం కానీ , సింహ రాశి లో రాహు కేతువులు ఉండడం కానీ సంతానం కలగడానికి అంత అనుకూలం కాదు. 

అమ్మాయి జాతకం లో అష్టమ భావం మాంగల్య స్థానం కాబట్టి, ఈ భావాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అష్టమ భావం రాహు కేతు గ్రస్తమై ఉండ కూడదు, ఇతర పాప గ్రహాల స్థితి, దృష్టి ఉండకూడదు. గురు దృష్టి ఉండడం చాలా మంచిది. 

పంచమ, సప్తమ, అష్టమ అధిపతులు శుభయోగాలలో ఉండడం ముఖ్యం. ఈ భావాలన్నింటికీ సర్వాష్టక బలం అధికంగా ఉండడం చాలా ముఖ్యం. 

పంచమ, సప్తమ,అష్టమ భావాలలో ఏ ఒక్క దానికైనా 20 (56 కి) కన్నా తక్కువ వుంటే వివాహం చెయ్య కూడదు. 

కేవలం గ్రహ మైత్రీ, తారాకూట బలం సరిపోతే చాలు అనుకోవడం మంచిది కాదు

ఇలా అన్ని అంశాలనూ పరిశీలించి గానీ వివాహ నిర్ణయం చేయ కూడదు. 

సోమ శేఖర్ సర్వా 
96407 54054

Saturday, August 22, 2020

Astrology Consultations

 HORA SARVAM is a platform for those who intend to seek astrological readings and get advice on remedies from Me.

About me : I am into studying and researching into Parasharic system of astrology for the past 15 years.I have read considerable number of charts of Clients, friends,family members,collegues and others ,fixed Muhurthas for marraiges,upanayan ceremonies and matched horoscopes of number of prospective couples.
I intend to provide astrological consultancy at reasonable rates and assure prompt replies with in a turnaround time of 48 hours depending on the number of horoscopes to be studied.
A portion of the money earned through this activity will be donated to an Educational Trust.
You can send your accurate Birth details like Time,Date and Place of Birth to my Wats App No. 91 96407 54054 and your question in brief and give me time as mentioned above, to reply you, the astrological indications in your chart and any remedies.

For a sample report which you get for a full life reading you can check at the following link : http://horasarvam.blogspot.com/2015/12/sample-horoscope-reading-report-sent-by.html

Contact : Soma Sekhar Sarva
email : somasekharsarva@gmail.com 
Phone No : + 91 96407 54054

Bank Account Details :

Savings Account No: 055710100091009 Andhra Bank , T.Nagar Branch,Chennai IFSC Code : ANDB0000557

Saturday, August 15, 2020

శకుంతల దేవి జాతకం - జన్మ లగ్నం 

 ఈ దిగువ ఇవ్వబడింది 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలువబడే శకుంతలా దేవి గారి జాతక చక్రం. వికీపీడియా లో, గూగుల్ లో శోధించగా దొరికిన సమాచారం ప్రకారం ఈవిడ 4 నవంబర్ 1929 న బెంగళూర్ లో జన్మించారు. ఎంత వెతికినా ఈవిడ పుట్టిన సమయం ఇంటర్నెట్ లో ఎక్కడా దొరకలేదు.

అందుకే ఆ రోజు రాత్రి 9.30 గంటలు పుట్టిన సమయం గా తీసుకుని జాతక చక్రం తయారు చెయ్యబడింది. ఈ సమయం ఎందుకు తీసుకున్నానో చెప్పడమే ఈ పోస్టు ఉద్దేశ్యం.
శోధించగా తెలిసింది ఏమిటంటే ఈవిడ గణితంలో మేధావియే కాకుండా ఒక రచయిత అనీ, హోరా శాస్త్రం లో కూడా నిపుణురాలని. శకుంతలా దేవి గారికి ఉన్న ఈ లక్షణాలన్నీ బుధ కారకత్వాలే !!! అంటే ఈవిడ జన్మ లగ్నము బుధుడు అధిపతి అయిన రాశులలో ఒకటి అయ్యుండాలి. ఇదే కాక తెలివి తేటలని సూచించే పంచమ స్థానం ప్రత్యేకం గా , బలం గా ఉండాలి. అందుకు ఈవిడ జన్మ లగ్నం మిథునం ఐతే సరిపోతుందనిపించి అదే జన్మ లగ్నం గా తీసుకోవడం జరిగింది.
మిథునం జన్మ లగ్నం గా తీసుకున్న తరువాత శకుంతలా దేవి గారి జీవితం లో ని కొన్ని సంఘటనలు జాతక చక్రం తో సరిపోలుతున్నట్టు గా అనిపిస్తోంది. మిధున లగ్నానికి సప్తమం లో ఉన్న శనీశ్వరుడు ఈవిడ భర్త నుండీ విడాకులు తీసుకోవడం సూచిస్తోంది. లగ్నానికి పంచమం లో ఉన్న లగ్నాధిపతి బుధుడు మిత్ర రాశి లో ఉండడం, శుక్రుడి తో పరివర్తన లో ఉండడం , మరి మూడు గ్రహాలతో కలిసివుండడం, రాహు దృష్టి బుధుడిపై ఉండడం ఇవన్నీ పంచమ స్ధానానికి ప్రత్యేక బలాన్ని, పరమార్ధాన్నీ తెచ్చిపెడుతున్నాయి. పంచమం లోని గ్రహ సంయోగాలు ఈమెకు తీవ్ర బుద్ధి యోగం కలుగచేస్తున్నాయి.
గణితం మీద, జాతక శాస్త్రం మీదే కాకుండా ఈవిడ 'హోమోసెక్సువాలిటీ' ని బల పరుస్తూ ఆ రోజుల్లోనే ఒక పుస్తకం రచించారు. ఇది ఈవిడ లో ని ప్రత్యేక కోణం !!! ఈ ప్రత్యేకతే మనం ఈవిడ జాతకం తెలుసుకోవడానికి ఓ క్లూ కూడా !!!
ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ఈవిడకి ఇంత విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణి ఎందుకు కలిగింది !!??? ఏ గ్రహం ఈవిడకి ఇలాంటి ఆలోచన కలిగించింది అని ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైన గ్రహ స్థితి మనకి ఈవిడ జాతకం లో కనపడుతుంది !!! అది యురేనస్ గ్రహం చంద్రుడి నించీ పంచమం లో ఉండడం. మనం పరిశీలిస్తున్న జన్మ సమయానికి ఉన్న మిధున లగ్నానికి దశమం లో యురేనస్ ఉండడం.
వెస్ట్రన్ అస్ట్రోలోజర్స్ ప్రకారం యురేనస్ ( మనం ఇంద్ర గ్రహం అంటాము) పాత కాలపు సాంప్రదాయ పద్ధతులనీ, ఆలోచనా ధోరణులనీ ప్రశ్నించే గ్రహం. వీటిని మార్చేసే గ్రహం ఇది. ఈ గ్రహం చంద్రుడినించీ 5 లో(ఆలోచనలనీ, తెలివి తేటలని సూచించే స్థానం) , లగ్నంనించీ దశమం లో ఉండడం ఈవిడకి ఈ కొత్త తరహా ఆలోచనలు రావడానికి కారణ మైయ్యింది.
పైన చెప్పిన కారణాలతో శకుంతలా దేవి గారు రాత్రి 9.30 గంటలకు అటూ ఇటూ గా పుట్టి ఉంటారని నా నమ్మకం.

జాతకం లోని దోషాలు -  పాశుపత తంత్రం 

 జాతక చక్రం లో ని దోషాలకూ, మహర్దశ వల్ల, అంతర్దశ వల్ల, గోచారం వల్ల కలిగే అనేక దోషాలకూ పాశుపత తంత్రం లో చెప్పబడిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది.

పెళ్లి ఆలస్యము అవుతున్న యువకులు కన్యా పాశుపతం హోమం, అభిషేకం చేయించుకోవొచ్చు
పెళ్లి ఆలస్యము అవుతున్న యువతులు గౌరీ పాశుపతం హోమం, అభిషేకం చేయించుకోవాలి
సఖ్యత లేని భార్యా భర్తలు కుటుంబ పాశుపతం హోమం, అభిషేకం చేయించుకోవాలి .
ఆధ్యాత్మిక పురోగతి కోసం కొన్ని పాసుపతాలు చెప్పబడ్డాయి.
ఇలా అనేకమైన పరిహారాలు పాశుపత తంత్రం లో చెప్పబడ్డాయి. మనో కామ్యాలకి తగట్టుగా చాలా ఉపాయాలు ఉన్నాయి
సర్వా సోమ శేఖర్
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
9640754054

క్షీర సాగర మధనం - రహస్యం 

 పురాణాల్లో చెప్పబడిన క్షీర సాగర మధనం ఎప్పుడో కృత యుగం కన్నా ముందు ఎప్పుడో జరిగిందని మనం అనుకోవడం పొరపాటు .

అది నిరంతరం ప్రతీ క్షణం కొనసాగుతూనే ఉంటుంది గ్రహ గతుల వల్ల , గ్రహణాలు వల్ల , గ్రహ కూటముల వల్ల !!!
అప్పుడు వర్ణించబడిన సాగర మధనం లో చెప్పబడిన మేరు పర్వతం మనం వున్న భూగోళం. ఆ మేరు పర్వతానికి చుట్టబడిన ఆది శేషువు రాహు కేతువులే . భూగోళాన్ని సూన్యం లో నిలబెడుతున్న శక్తి ఏదైతే వుందో ఆ శక్తే కూర్మావతారం లో ని విష్ణువు . ఆది శేషుడిని ఇరు ప్రక్కలా పట్టుకుని లాగుతున్న దేవతలూ , రాక్షసులూ మన సౌర మండలం లో ని గ్రహాలే !!!
ఈ మధనం వల్ల ఒక్కోసారి అమృతం పుడుతుంది , ఒక్కోసారి హాలాహలం పుడుతుంది . ఒక్కోసారి కారణ జన్ములు పుడుతూ వుంటారు.
సర్వా సోమ శేఖర్
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

వాక్సిన్  ప్రకటించే రోజులు - సెప్టెంబరు 2020

 8,9,10, 14 ,15 సెప్టెంబర్ కరోనా వాక్సిన్ కనిపెట్టే ప్రయత్నం లో చాలా ముఖ్యమైన రోజులు. ఈ రోజుల్లో 6 గ్రహాలు స్వంత రాశులలో ఉంటాయి . కుజుడు,చంద్రుడు,రవి, బుధుడు,బృహస్పతి, శనీశ్వరుడు స్వంత రాశులలో వుంటారు. 26 డిసెంబర్ న సూర్య గ్రహణం జరిగినప్పుడు ఈ 6 గ్రహాలే గ్రహణం తో సంయోగం లో ఉన్నాయి !!!

ఈ రోజుల్లో ఏదో ఒక రోజు బాగా పని చేసే వాక్సిన్ ప్రకటించే అవకాశం ఉంది.
సర్వా సోమ శేఖర్
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

రాబోయే అమావాస్య - కేతు గ్రహ ప్రభావం


ఈ 19 వ తారీకున రాబోయే అమావస్య తరువాత, 5 గ్రహాలు అగ్నితత్వపు రాశులైన మేష, సింహ,ధనుస్సుల్లో ఉండి కేతు నక్షత్రాల్లో ఉంటాయి.
సింహ రాశి లో మఘా నక్షత్రంలో అమావస్య జరుగుతోంది.
కేతు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని sudden events ,అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది.
అమెరికా లాంటి దేశాల్లో స్కూల్స్ దగ్గిర మాస్ షూటింగ్ జరుగొచ్చు, దేశాధ్యక్షులు ఎవరైనా ప్రమాదం ఎదురు కోవచ్చు. ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు జరగొచ్చు. కొరియా,చైనా లాంటి దేశాల్లో కూడా దుర్ఘటనలు జరుగొచ్చు.
విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం మంచిది
సర్వా సోమ శేఖర్
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054

Saturday, July 11, 2020

Corona Virus - The manifestation

These are the charts of the two Solar eclipses that happened in 2019. First one is in July 2019 and the second one is in December 2019. 

The Covid Virus pandemic is thought to have started somewhere in January 2020. But many doubt the Chinese coverup about the actual position. There are doubts about the Chinese claims that the pandemic started in the end of December.
 
Seeing the Eclipse chart of July 2019 and that of December 2019 I believe the spread of virus is very much known to the Chinese atleast by August itself.  

A study of charts of various eclipse charts near to the outbreaks of previous pandemics like Spanish Flu and Swine Flu , I can say the Rahu grastha Surya Grahana which happened in the MOIST Constellation of ARDRA and in the AIRY sign of Mithuna  in July 2019 in opposition to a venomous and extremely malefic  Saturn Ketu conjunction in Sagittarius is the actual trigger to the outbreak of the pandemic  or wishful spread of the Virus from the Lab in Wuhan.

Saturn's exact conjunction with Ketu and 100% aspect to the Eclipse is the proof of the Great Chinese Conspiracy behind the spread.  My take is after the wishful leak in August , they waited for the right mutations(rather dangerous) to happen to the Virus and then let it out into the world.

After the eclipse in July, all the planets were in the HIND side of the Rahu-Ketu axis which helped the Chinese to cover up the spread successfully and once Ketu entered into Moola and the Eclipse of 26th December happenning in the extremely malefic MOOLA constellation along with the Six planetary conjunction happenning in Sagittarius, and in the aftermath, when all planets aligned in the face of the Rahu - Ketu axis, the world went into lockdown with the worst fears and the pandemic effecting millions of humans around the world !!! 

The Spanish Flu pandemic was prevalent for about two years and lost its effectiveness afterwards. The same might happen with the COVID Virus too with relief in some form coming around September 23rd !!!

Friday, December 13, 2019

కంకణ సూర్య గ్రహణం - 26.12.2019

ఓం శ్రీమాత్రే నమః

సూర్య గ్రహణం గ్రహకూటమి వలన ఏర్పడే ఫలితాలు.

అందరికీ ఆనందాన్ని కలిగించే
 నూతన సంవత్సరము రాకకు ముందు
డిసెంబర్ 25 /26 తేదీలలో ఏర్పడే సూర్యగ్రహణం, ఆ సమయంలో  ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన అన్ని రాశుల వారిపై ప్రభావం మరియు కొత్త సంవత్సరంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం.

ధనురాశి ద్వంద్వ రాశి. అగ్ని తత్వ రాశి. రాశి అధిపతి గురుడు ..అందులోనే శని కేతువు ల తో కలిసి ఉండడం.. ధను రాశి లోకి రవి సంక్రమణం వల్ల అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్యగ్రహణం ఏర్పడడం కొంత చికాకు ,ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశం. జ్ఞానం వైపు అడుగులు సహజంగానే పడవు.
రవి మరియు శని ఒకే రాశిలో ఉండటం కూడా.. వ్యతిరేకమైన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంటుంది. మానసికమైన అహం తలెత్తే అవకాశం ఉంది.
 అమావాస్య రోజుల్లో చంద్రుని వలన బుద్ధి ప్రకాశవంతంగా ఉండక కల్లోలానికి గురవుతారు.
ద్వంద్వ రాశులలో గ్రహ సంచారం వలన
విద్య ఉద్యోగాలు అభివృద్ధి, చలనము మొదలగు మార్పులను గమనిస్తూ ఉంటాం.

అగ్ని తత్వ రాశి అయిన ధనురాశిలో ఈ
 షష్ట గ్రహ ప్రభావము మన మానసిక శక్తి పరీక్ష లాంటిది. కోరికలను  అదుపులో ఉంచుకుంటే ఈ పరీక్ష చక్కగా దాటగలం. అదే సంతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు. కేతువు బంధనాలను విడదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనక క్షణికమైన ఆవేశాలను మనం గెలవాలి.
అప్పుడే బంధాలను బాధ్యతలను కాపాడుకోగలం. ఈ వచ్చే కాలాన్ని అంతర్ముఖంగా ఆత్మ శోధన చేసుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తులు తప్పకుండా సానుకూల ఫలితాలు పొందుతారు.

డిసెంబరు నెలలో పై గ్రహ ప్రభావం వలన సూర్య గ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వారికి జరుగుతున్న దశ అంతర్దశ నక్షత్ర ప్రభావమును బట్టి ఫలితాలు నిజానికి నిర్ణయం అవుతాయి. మన భావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. కానీ వీటిపైనే పూర్తిగా ఆధారపడి ఉండకూడదు.

*మేష రాశి వారికి కి అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం లాగా ఆనందంగా గడపండి.

*వృషభ రాశి  వారి అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.

*మిధున రాశి :ఆవేశం  అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి.
ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు.

*కర్కాటక రాశి : ఏ విధంగా ఆలోచనలు వెళ్తాయో ఫలితాలు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా ధ్యాన మార్గం అవలంబించండి.

*సింహరాశి: ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలు మొదలగు విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు , మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి 100% అవకాశం ఉంటుంది.. తాత్కాలికంగా ఇప్పుడు వచ్చే అనిశ్చితమైన పరిస్థితిని మనోధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని విజయం సాధించడం మీ చేతుల్లోనే ఉంది.

*కన్యా రాశి: అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే.
*తులారాశి: ద్వితీయ అధిపతి కుజుడు అద్వితీయము లోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధి దాయకం. శాంతి సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .

*వృశ్చిక రాశి: రాజ్యాధిపతి కుజుడు సొంత రాశిలో ఉండటం వలన, ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.

*ధను రాశి: అత్యంత ఒత్తిడికి , ఆందోళనకు, అనిశ్చిత త్వం ఈ రాశి వారి లో గమనిస్తాం.
వీరికి ఇది నిజంగా పరీక్షా కాలమే. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా డా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు.

*మకర రాశి: గుర్తింపులు పొంద లేరు , అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ ఓరిమే మీకు శ్రీరామరక్ష.

*కుంభరాశి: ఈ రాశి వారికి అత్యంత అదృష్టం అయినా కాలం గా చెప్పుకోవచ్చును. అన్ని గ్రహాలు కలసివచ్ మీనరాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ ఈ సంవత్సరం అంతా అత్యంత శుభదాయకం ఈ సంవత్సరం ఈ  సూర్య గ్రహణం వల్ల 12 రాశుల వారు సూర్యుడికి జపం చేయించుకోవాలి ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వలన 12 రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది సూర్యుడికి రాహుకేతువుల కి జప తర్పణ హోమాలు దానాలు చేయడం చాలా మంచిది వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం మంచిది