పురాణాల్లో చెప్పబడిన క్షీర సాగర మధనం ఎప్పుడో కృత యుగం కన్నా ముందు ఎప్పుడో జరిగిందని మనం అనుకోవడం పొరపాటు .
అది నిరంతరం ప్రతీ క్షణం కొనసాగుతూనే ఉంటుంది గ్రహ గతుల వల్ల , గ్రహణాలు వల్ల , గ్రహ కూటముల వల్ల !!!
అప్పుడు వర్ణించబడిన సాగర మధనం లో చెప్పబడిన మేరు పర్వతం మనం వున్న భూగోళం. ఆ మేరు పర్వతానికి చుట్టబడిన ఆది శేషువు రాహు కేతువులే . భూగోళాన్ని సూన్యం లో నిలబెడుతున్న శక్తి ఏదైతే వుందో ఆ శక్తే కూర్మావతారం లో ని విష్ణువు . ఆది శేషుడిని ఇరు ప్రక్కలా పట్టుకుని లాగుతున్న దేవతలూ , రాక్షసులూ మన సౌర మండలం లో ని గ్రహాలే !!!
ఈ మధనం వల్ల ఒక్కోసారి అమృతం పుడుతుంది , ఒక్కోసారి హాలాహలం పుడుతుంది . ఒక్కోసారి కారణ జన్ములు పుడుతూ వుంటారు.