Monday, August 24, 2020

వివాహ పొంతనములు - గమనించవలసిన ముఖ్య విషయాలు


వివాహ పొంతనములు - గమనించవలసిన ముఖ్య విషయములు 

వివాహం చెయ్యటానికి జాతకముల పొంతన కుదరడం చాలా అవసరం. అష్ట కూట పద్ధతి, కాల ప్రకాశిక పద్ధతి ఇలా కొన్ని పద్ధతుల్లో పొంతన కుదిరిందో లేదో సాధారణంగా పరిశీలిస్తాము. మరీ ముఖ్యం గా అష్ట కూట పద్ధతి లో ఎక్కువగా పరిశీలిస్తాము. ఈ పద్ధతి లో మొత్తము 36 points కీ 18 points కానీ అంతకు మించి గానీ వస్తే జాతకాలు కలిసినట్టు అనుకుంటాము. 36 కి 18 పైన ఎన్ని ఎక్కువ points వస్తే అంత మంచిది. 

ఇదే కాక కుజ దోష నిర్ణయం, కాల సర్ప దోష నిర్ణయం చేసిన తరువాత జాతకాలు సరిపోతున్నట్టు ఉన్న పరిస్థితి లో కూడా మరి కొన్ని విషయాలు సరిచూసుకోవాలి. అవేమిటో చెప్పడమే ఈ పోస్టు ఉద్దేశ్యం. 

తులా రాశి లో పాప గ్రహాలు ఉన్న జాతకులు ఆలస్య వివాహాఁ కానీ అసలు వివాహం కాకపోవడానికి కానీ  అవకాశం వుంది. శని కేతువులు తులలో కానీ, సప్తమ భావం లో కానీ ఉండడం వివాహానికి గానీ వైవాహిక జీవితానికి గానీ మంచిది కాదు. 

అలాగే సప్తమం లో గురు దృష్టి లేని శని ఒంటరిగా వున్నప్పుడు, లేక ఇతర పాప గ్రహాలతో కలిసి వున్నప్పుడు కూడా వైవాహిక జీవితానికి మంచిది కాదు. 

సప్తమాధిపతి ఆస్తంగతమై ఉండడం, గ్రహ యుద్ధం లో ఓడి పోయి ఉండడం కూడా ఆలాగే మంచిది కాదు. 

జాతకం లో సప్తమం లో శుక్రుడు ఉండడం మంచిది కాదు.అలాగే శుక్రుడు ఆస్తంగతమైనా, గ్రహ యుద్ధం లో ఓడిపోయి వున్నా, జాతకుడి లో వీర్య కణాల లోపం ఉంటుంది అలాంటి సంబంధం కుదుర్చుకోకపోతేనే మంచిది. 

శుక్రుడు నీచలో ఉండి, నీచ భంగం కానప్పుడు లేదా శుభగ్రహ దృష్టి లేనప్పుడు కూడా జాగ్రత్త పడాలి. 

లగ్న,సప్తమాలలో రాహు కేతువులు ఉండడం, లేక సప్తమాధిపతి కానీ, శుక్రుడు కానీ రాహు గ్రస్తమో,కేతు గ్రస్తమో అవ్వడం కానీ మంచిది కాదు. 

ఇక వివాహం తరువాత సంతానం కలగడం ముఖ్యం కాబట్టి , పంచామాధిపతి ఆస్తంగతమై ఉండడం, గ్రహ యుద్ధం లో ఓడి పోయి ఉండడం, రాశి సంధి లో ఉండడం మంచిది కాదు. అలాగే పంచమాధిపతి రాహు , కేతు గ్రస్తమై ఉండడం మంచిది కాదు. 
గురు గ్రాహం పంచమం లో ఉండడం కానీ, సింహ రాశి లో పాప గ్రహాలు ఉండడం కానీ , సింహ రాశి లో రాహు కేతువులు ఉండడం కానీ సంతానం కలగడానికి అంత అనుకూలం కాదు. 

అమ్మాయి జాతకం లో అష్టమ భావం మాంగల్య స్థానం కాబట్టి, ఈ భావాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అష్టమ భావం రాహు కేతు గ్రస్తమై ఉండ కూడదు, ఇతర పాప గ్రహాల స్థితి, దృష్టి ఉండకూడదు. గురు దృష్టి ఉండడం చాలా మంచిది. 

పంచమ, సప్తమ, అష్టమ అధిపతులు శుభయోగాలలో ఉండడం ముఖ్యం. ఈ భావాలన్నింటికీ సర్వాష్టక బలం అధికంగా ఉండడం చాలా ముఖ్యం. 

పంచమ, సప్తమ,అష్టమ భావాలలో ఏ ఒక్క దానికైనా 20 (56 కి) కన్నా తక్కువ వుంటే వివాహం చెయ్య కూడదు. 

కేవలం గ్రహ మైత్రీ, తారాకూట బలం సరిపోతే చాలు అనుకోవడం మంచిది కాదు

ఇలా అన్ని అంశాలనూ పరిశీలించి గానీ వివాహ నిర్ణయం చేయ కూడదు. 

సోమ శేఖర్ సర్వా 
96407 54054