Wednesday, November 25, 2020

ఓం నమః శివాయ


యద్భావం తద్భవతి . శివ మయం ఇదం జగత్ !!! ఓం నమః శివాయ

Sunday, November 22, 2020

సూర్య స్తుతి

సూర్య స్తుతి 

లోహితం రధ మారూఢం సర్వలోక పితామహం 

మహోపకారం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం 

శ్రీ విష్ణుం జగతం నాధం జ్ఞాన విజ్ఞాన చక్షధం 

మహా పాపహరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం  



Wednesday, November 18, 2020

నాగుల చవితి శుభాకాంక్షలు

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.

పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి. 

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ!
అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః!!
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః!
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా!!
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః!
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ!!
 త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః!
క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః!!

 నాగుల చవితి రోజు ఈ పదహారు నామాల మహా మంత్రం చదువుకోవడం మంచిది. ఈ 16మంత్రములను ఇచ్చిన వారు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.

Tuesday, November 17, 2020

గ్రహ దోషాలకు పరిహారాలు - పాశుపత తంత్ర పధ్ధతి

కార్తీక మాసారంభ శుభాకాంక్షలు అందరికీ. ఈ నెల మొత్తం పరమ శివుణ్ణి ఎన్ని సార్లు తలుచుకుంటే అంత మంచిది.  

పంచాక్షరీ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదు. ఎవ్వరైనా ఎన్నిసార్లైనా జపం చేసుకోవొచ్చు.  

ఏదైనా గ్రహ దశ వల్ల దుష్ఫలితాలు కలుగుతుంటే త్ర్యంబక మంత్రం తో కలిపి ఆ గ్రహ గాయత్రీ మంత్రం జపం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి. 
ఈ క్రింద మీకు ఉపయోగపడే మంత్రాలు ఇవ్వడం జరిగింది:

త్య్రంబకం యజామహే సుగన్ధిమ్ పుష్టి వర్ధనం 
ఉర్వారుక మివ బంధనాన్  మృత్యోర్ ముక్షీయ మామృతాత్ 

ఓం భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహీ 
తన్నో ఆదిత్య: ప్రచోదయాత్ 

ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి 
తన్నశ్చంద్ర : ప్రచోదయాత్ 

ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి 
తన్న: కుజ: ప్రచోదయాత్ 

ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి 
తన్నో బుధ: ప్రచోదయాత్ 

సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి 
తన్నో గురుః ప్రచోదయాత్ 

భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి 
తన్నో శుక్ర: ప్రచోదయాత్ 

రవిసుతాయ విద్మహే  మంద గ్రహాయ ధీమహి 
తన్నో శని: ప్రచోదయాత్ 

శీర్ష రూపాయ విద్మహే వక్ర: పంధాయ ధీమహి 
తన్నో రాహు:ప్రచోదయాత్ 

తమో గ్రహాయ విద్మహే ధ్వజస్ధితాయ ధీమహి 
తన్నో కేతుః ప్రచోదయాత్

జపం చేసుకునే విధానం: 
మొదట త్రయంబక  మంత్రం చదివి తరువాత రెండుసార్లు గ్రహగాయత్రీ మంత్రం చదివి తరువాత మళ్ళీ త్రయంబక  మంత్రం చదవాలి. ఇది ఒక సారి చదివినట్టు. ఇలా రోజుకి ఒక రుద్రాక్ష మాల (108 రుద్రాక్షలు ఉన్నది ) చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వొస్తాయి. ప్రయత్నించండి.

Wednesday, November 11, 2020

మీనం లో కుజుడు - శని వీక్షణ - ప్రభావం

ప్రస్తుతం వక్ర గతి లో మీన రాశి లో ఉన్న కుజుడు 14 వ తారీఖున వక్ర త్యాగం చెయ్యబోతున్నాడు. December 24 వరకూ మీన రాశిలో ఉండి మేషం లో కి ప్రవేశిస్తాడు. 

ఈ కుజుడికి మకరం లో ఉన్న శని దృష్టి వల్ల అకాల వర్షాలు, పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు December చివరి వరకూ పడే అవకాశం. దీనికి తోడు విపరీతమైన చలిగాలులు, మంచు ఇబ్బంది పెడతాయి.

December లో వృశ్చిక రాశి లో జరిగే గ్రహ కూటముల వల్ల ప్రత్యేకం గా దక్షిణ భారత దేశం లో భారీ వర్షాలు , తుఫానులు వొచ్చే అవకాశం ఉంది.

సింహ, కన్యా,వృశ్చిక, ధనూ,మీన,వృషభ రాశుల వారు వాహనాలు నడిపే సమయం లో జాగ్రత్తలు వహించాలి. 

December 21 న మకరం లో  జరిగే గురు శనుల కలయిక వల్ల ప్రజల్లో అలజడి,అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ వాగ్వివాదాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యం గా కన్యా,ధనూ,మకర, కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

రాబోయే గ్రహణాలు - ప్రభావం

సెప్టెంబరు 23 న రాహు కేతువులు వృషభ వృశ్చిక రాశులలో కి మారడం తో రాబోయే సంవత్సరంన్నర కాలం లో జరుగబోయే గ్రహణాలు అన్నీ వృషభ వృశ్చిక రాశులలోనే జరుగుతాయి. 
భారత దేశానిది వృషభ లగ్నం అవ్వడం వల్ల మన దేశం మీద ఈ గ్రహణాల ప్రభావం ఎక్కువే అని చెప్పాలి. 
ఎక్కువగా ఆర్ధిక వ్యవస్థ మీద, దౌత్య సంబంధాల మీద ప్రభావం చూపిస్తాయి. 
బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఆగ్రీ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ తయారీ సంస్థలు నష్టాలు చూస్తాయి.
ఢిల్లీ, ముంబై లాంటి పట్టణాల్లో టెర్రరిస్ట్ దాడులు జరుగుతాయి. ముఖ్యం గా కుజుడు వృషభ రాశిలో ప్రవేశించిన దగ్గిర నించీ అంటే ఫిబ్రవరి 22 నుండీ ఏప్రిల్ 13 మధ్యలో జరిగే అవకాశం ఉంది.

Saturday, November 7, 2020

మకర రాశి లో గురు గ్రహ సంచారం - 20. 11. 2020 నుండీ సంవత్సరాంతం వరకు - రాశులపై ప్రభావం - Part 3

 మకర రాశి /లగ్నం : వ్యయ తృతీయాధి పతి గురువు తన నీచ రాశిలో సంచారం వల్ల  మకర రాశి వారికి ఈ సమయం లో వివాహం జరిగే అవకాశం ఉంటుంది . ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి .  కొన్ని తెలివితక్కువ నిర్ణయాలు చేసే అవకాశం  . ఖర్చులు ఎక్కువగా చేస్తారు . తమ్ముడికి వృత్తి పరమైన ఇబ్బందులు ఉంటాయి .సంపాదన కూడా తక్కువగా ఉంటుంది . మకర రాశి వారికి స్థల మార్పులు వుండే అవకాశం .  మకర రాశి లో గురువు తో బుధుడు కలిసినప్పుడు రాతల వల్ల , మాటల వల్ల ఇబ్బందులు వొస్తాయి . శుక్రుడితో కలిసినప్పుడు సంతానం కలిగే అవకాశం . శని తో కలిసి గురువు ఇక్కడ సంచరిస్తున్నప్పుడు వ్యవసాయ మూలక  నష్టాలు ఉంటాయి . గురువు ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచరిస్తున్నప్పుడు సంఘం లో గౌరవం పెరుగుతుంది కానీ తండ్రికి ఆరోగ్య భంగం. శ్రవణా నక్షత్రం లో గురువు సంచరిస్తున్నప్పుడు గురువు నీచత్వం తగ్గి మంచి ఫలితాలు ఇస్తాడు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి లాభాలు ఉంటాయి . 

కుంభ రాశి /లగ్నం : ద్వితీయ ఏకాదశాధిపతి గురువు వ్యయం లో తన నీచ రాశిలో సంచారం వల్ల ఆర్ధిక పరమైన ఇబ్బందులు తప్పవు. దేనిలోనూ జయం ఉండదు . పెద్దన్నయ్య కి లాభం గా ఉంటుంది . కుటుంబం ఇబ్బందుల్లో ఉంటుంది . సంతోషం తక్కువగా ఉంటుంది . మాతృ వర్గీయులు బాగుంటారు కానీ వారితో విరోధం ఉంటుంది . 

మీన రాశి /లగ్నం : లగ్న దసమాధిపతి ఏకాదశం లో నీచ రాశి లో సంచారం వల్ల సంఘం లో గౌరవం తగ్గుతుంది . ఆదాయం,సంతోషం, విజయం తక్కువ . సంతానం వల్ల సంతోషం ఉంటుంది . అనవసర ప్రయాణాలు ఉంటాయి . తమ్ముడికి ఆరోగ్య భంగం . విదేశాల్లో ఇబ్బందులు


 .   

బుధ గ్రహ దోషాలకి పరిహారం

ప్రస్తుతం తులా రాశిలో ఉన్న బుధుడు అష్టకవర్గు లో అతి బలం గా ఉండడం వల్ల ఉదయాన్నే 4.45  గంటల నుండీ మొదలుపెట్టి 6 గంటల వరకూ విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యడం,  వినడం, గీతాబోధ చేస్తున్న కృష్ణుడిని స్మరిస్తూ ధ్యానం చెయ్యడం , నారాయణ గాయత్రీ మంత్రం జపం చెయ్యగలిగితే జాతకం లోని బుధ గ్రహం వల్ల కలిగిన దోషాలు తొలగిపోవచ్చు. ప్రయత్నించండి. ఈ నెల 12 వ తారీఖు వరకు కనీసం చేస్తే చాలా మంచిది.

మకర రాశి లో గురు గ్రహ సంచారం - 20. 11. 2020 నుండీ సంవత్సరాంతం వరకు - రాశులపై ప్రభావం - Part 2

 గురు గ్రహ సంచారం - 20. 11. 2020 - రాశులపై ప్రభావం - Part 2

సింహ రాశి/లగ్నం : పంచమ అష్టమాధిపతి సష్ట స్థానం లో తన నీచ రాశి లో సంచారం వల్ల శత్రువులపై విజయం సిద్ధిస్తుంది . పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి . లివర్ , పాంక్రియాస్ ,గాల్  బ్లాడర్  సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు . జీవిత భాగ స్వామి సంతోషం గా వుండరు . ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు . సంతానానికి సంబంధించిన చీకాకులు ఉండొచ్చు . ఉత్తరాషాఢ లో సంచారం జరుగుతున్నప్పుడు ఉదర సంబంధ వ్యాధులు రావొచ్చు . శ్రవణా నక్షత్రం లో సంచారం జరిగే సమయం లో సెంటిమెంట్ల వల్ల  బాధ కలుగుతుంది . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్న సమయం లో వాహన ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త పడాలి . 

కన్య రాశి /లగ్నం : చతుర్థ  సప్తమాధిపతి తన నీచ రాశి లో పంచమ స్థానం లో  సంచారం వల్ల వైవాహిక పరమైన  సమస్యలు ఉంటాయి . ఆర్ధిక లాభాలు తక్కువ స్థాయి లో ఉంటాయి . ఇష్టం లేకుండా వున్నా ఊరి నుండీ మర వలసి వొస్తుంది . శ్రవణా నక్షత్రం లో సంచారం బాగుంటుంది . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ప్రయాణాలు ఉంటాయి . స్థల మార్పులు ఉంటాయి .    

తులా రాసి/లగ్నం : తృతీయ సష్ట స్థానాధిపతి  చతుర్ధం లో తన నీచ రాశి లో సంచారం వల్ల సుఖం ఉండదు . సౌకర్యాలు కొరవడతాయి. వృత్తి ,వ్యాపారాలు బాగుంటాయి . పితృ సంబంధిత ఆస్తి వ్యవహారాలు లాభిస్తాయి . బంధువులతో ఇబ్బందులు ఉంటాయి . శత్రు బాధ ఉంటుంది . ఆకతాయిల వల్ల  ఇబ్బందులు ఉంటాయి . తల్లి కి ఆరోగ్య భంగం . ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్య భంగం .  సంతానం వల్ల  విచారం . శ్రవణా నక్షత్రం లో సంచారం వృత్తి పరమైన ఇబ్బందులు ఉంటాయి . పై చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది కానీ విఫలమౌతారు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి లాభం ఉంటుంది కానీ మనఃశాంతి ఉండదు . స్పెక్యులేషన్ ,జూదం కలిసి రావు . 

వృశ్చిక రాశి /లగ్నం : ద్వితీయ పంచమాధిపతి తన నీచ రాశిలో తృతీయం లో సంచారం వల్ల ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉంటాయి . దానాలు చేస్తారు . సంతానం వల్ల విచారం. చిన్న తమ్ముడి  వాళ్ళ ఇబ్బందులు,ఆర్ధిక నష్టాలు  . స్పెక్యులేషన్ వల్ల నష్టాలు . పెద్దన్నయ్యకి గృహ సమస్యలు . శ్రవణా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆర్ధిక లాభాలు ,అదృష్ట యోగం . భార్య కి వృత్తి పరమైన ఇబ్బందులు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు సంతానం తో ఆర్ధిక పరమైన వివాదాలు .

ధను రాశి /లగ్నం : లగ్న చతుర్ధాధిపతి ద్వితీయం లో నీచలో ఉండడం వల్ల  ఆర్ధికం గా చాలా నష్టపోతారు జాగ్రత్తలు తీసుకోకపోతే . మనసు చంచలంగా ఉంటుంది . స్పెక్యులేషన్ నష్టాలు ఉంటాయి . రావలసిన ధనం చేతికందదు . స్టాక్ మార్కెట్ లో నష్టాలు ఉంటాయి. వ్యసనాలు బాధిస్తాయి . ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది . శ్రవణా నక్షత్రం లో సంచారం కష్టాలు ఉంటాయి . ధనిష్టా నక్షత్రం లో సంచారం వల్ల  సంతానం వల్ల  విచారం ,ధన నష్టం  



Friday, November 6, 2020

మకర రాశి లోకి గురు గ్రహ రాశి మార్పు - 20. 11. 2020 - రాశుల పై ప్రభావం - Part I

 


గురు గ్రహ రాశి మార్పు - 20. 11. 2020 - రాశుల పై ప్రభావం 

ఈ సంవత్సరం శని , రాహు కేతువుల తరువాత మరో గురు గ్రహం కూడా రాశి మారబోతున్నాడు . నవంబర్ 20వ తేదీన ధను రాశి నుండీ తన నీచ రాశి అయిన మకర రాశి లో కి గురు సంచారం జరుగనున్నది. 

20. 11. 2020 నుండీ 07. 01. 2021 వరకూ ఉత్తరాషాఢా నక్షత్రం లో 

07. 01. 2020 నుండీ 05.03. 2021 వరకూ శ్రవణా నక్షత్రం లో 

05. 03. 2021 నుండీ ఉగాది వరకూ ధనిష్టా నక్షత్రం లో  గురు సంచారం జరుగుతుంది 

ఈ మార్పు వల్ల ఏ రాశికి ఎటువంటి ప్రభావం కలగబోతోందో చూద్దాం :

మేష రాశి/లగ్నం    : నవమ ,వ్యయాధిపతి దశమం  లో  తన నీచ రాశి లో సంచారం  కాబట్టి వృత్తి పరం గా అంత మంచిది కాదనే చెప్పాలి .   కష్ట పడి పని చేస్తే తప్ప ఫలితం కనపడదు . ఎంత పని చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండకపోవచ్చు . పని చేసే చోట అధికారులతో ,తోటి పని వారలతో భేదాభిప్రాయాలు రావొచ్చు . జాగ్రత్త వహించాలి. అనుకోని విధంగా బదిలీలు ఉండొచ్చు . గురువు ఉత్తరాషాఢా నక్షత్రం లో వున్నప్పుడు పిల్లల తో చీకాకులు ఉంటాయి. తండ్రి నించీ కొంత ధనం  అందొచ్చు . శ్రవణా/ధనిష్టా  నక్షత్రాలలో  సంచరించే సమయం లో దైవ భక్తి పెరుగుతుంది . తీర్థయాత్రలు చేస్తారు . 

వృషభ రాశి /లగ్నం : అష్టమ ,ఏకాదశాధిపతి నవమం లో నీచ లో సంచారం . దైవభక్తి తగ్గుతుంది . ఉత్తరాషాఢా నక్షత్రం లో గురు సంచారం వల్ల  తండ్రి కి ఆరోగ్య భంగం. పిల్లలతో చీకాకులు ఉంటాయి.  తోడ పుట్టిన వాళ్ళతో సఖ్యత ఉంటుంది . ధన నష్టం సూచింపబడుతోంది . అనుకున్న పనులు త్వరగా జరగక ఇబ్బంది పడతారు . 

మిథున రాశి /లగ్నం : సప్తమ ,దసమాధిపతి అష్టమమ్ లో నీచలో సంచారం వల్ల దైవభక్తి ఉండదు . అదృష్టం తక్కువగా ఉంటుంది . సహధర్మచారిణికి ఆరోగ్య భంగం . వృత్తి పరంగా ఒత్తిడులు ఉంటాయి .ఖర్చులు అధికం గా ఉంటాయి కానీ కొత్త ఉద్యోగాల నుండీ ఆదాయం కూడా ఉంటుంది . సంతృప్తి ఉండదు . సంతోషం ఉండదు . పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి . ఆస్తి పరమైన చిక్కులు ఉంటాయి . 

కర్కాటక రాశి /లగ్నం : సష్ట ,నవమాధిపతి సప్తమం లో  నీచ లో సంచారం వల్ల  కళత్రానికి ఆరోగ్య భంగం, సంతానం తో చీకాకులు ఉంటాయి . ధన సంబంధమైన అసంతృప్తి ఉంటుంది . మేనమామ సహాయం ఉంటుంది .   

  

Sunday, November 1, 2020

Tara Balam For 02.11.2020

 

Tomorrow's Stock Markets - 02.11.2020


Tomorrow's stock markets will be opening on a weak note in the wake of lock downs announced in Britain and France. Less volumes will be traded than in the previous trading session. Early Trade will see a fall in the indices.  There will be a fall in the prices of stocks of Power Sector and Public Sector Units till 9.025 AM . From  9.25 AM till 10.23 AM markets will see a rise in the activity and indices will be in the Green due to rise in the prices of Petroleum, Shipping and Oil and Gas Sector stocks , Capital Goods, Automobiles, Pharmaceuticals, Steel and Metal Sectors. 

Banking , Finance and Insurance Sectors will be volatile from the start and will be down from 10.23 till 12.17 AM .  From 12.17 AM till 01.21 PM market will be in a mixed state. Infrastructure, Realty and Agriculture Sector companies will see a rise while other sectors will be in the red. 

From 01.21 PM till 02.18 stocks of Telecommunications, FMCG, Textile, IT ,Banking,Financial and Insurance, Publication and Aviation Sectors will see a rise in prices. 

From 02.18 PM till 02.41 PM there will be a fall in the prices of Crude Oils,Oil and Gas, Pharmaceuticals, Coal and realty shares. 

From 02.41 PM till 03.30 PM there will be a moderate fall in the indices. Stocks of Hotel , Hospitality, Travel and Tourism, Essential Oils, Gems and Jewellery ,Fashion Industry will fall .

Overall Market will lose tomorrow. 

Disclaimer : Above mentioned trends are solely for the purpose of study of stock market trends in the light of  astrological techniques. 

Long Term Investments - Tips

 

Current Planetary Positions indicate investments with a long term perspective in stocks of Cement, Infrastructure, Iron and Steel, Leather and Footwear, Crude Oil and Gas, Coal, Mining, Metals, Realty and Agriculture Sectors. 

There will be intermittent fall in the prices of stocks of above mentioned Industries due to changes in Planetary aspects and conjunctions but the opportunity has to be utilised by buying more stocks. 

The stocks of above mentioned sectors are to be held at least for the coming 6.5 years to get good gains. 

Companies with good record and strong financials have to be selected before investing. 

Today's Tara Balam