గురు గ్రహ రాశి మార్పు - 20. 11. 2020 - రాశుల పై ప్రభావం
ఈ సంవత్సరం శని , రాహు కేతువుల తరువాత మరో గురు గ్రహం కూడా రాశి మారబోతున్నాడు . నవంబర్ 20వ తేదీన ధను రాశి నుండీ తన నీచ రాశి అయిన మకర రాశి లో కి గురు సంచారం జరుగనున్నది.
20. 11. 2020 నుండీ 07. 01. 2021 వరకూ ఉత్తరాషాఢా నక్షత్రం లో
07. 01. 2020 నుండీ 05.03. 2021 వరకూ శ్రవణా నక్షత్రం లో
05. 03. 2021 నుండీ ఉగాది వరకూ ధనిష్టా నక్షత్రం లో గురు సంచారం జరుగుతుంది
ఈ మార్పు వల్ల ఏ రాశికి ఎటువంటి ప్రభావం కలగబోతోందో చూద్దాం :
మేష రాశి/లగ్నం : నవమ ,వ్యయాధిపతి దశమం లో తన నీచ రాశి లో సంచారం కాబట్టి వృత్తి పరం గా అంత మంచిది కాదనే చెప్పాలి . కష్ట పడి పని చేస్తే తప్ప ఫలితం కనపడదు . ఎంత పని చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండకపోవచ్చు . పని చేసే చోట అధికారులతో ,తోటి పని వారలతో భేదాభిప్రాయాలు రావొచ్చు . జాగ్రత్త వహించాలి. అనుకోని విధంగా బదిలీలు ఉండొచ్చు . గురువు ఉత్తరాషాఢా నక్షత్రం లో వున్నప్పుడు పిల్లల తో చీకాకులు ఉంటాయి. తండ్రి నించీ కొంత ధనం అందొచ్చు . శ్రవణా/ధనిష్టా నక్షత్రాలలో సంచరించే సమయం లో దైవ భక్తి పెరుగుతుంది . తీర్థయాత్రలు చేస్తారు .
వృషభ రాశి /లగ్నం : అష్టమ ,ఏకాదశాధిపతి నవమం లో నీచ లో సంచారం . దైవభక్తి తగ్గుతుంది . ఉత్తరాషాఢా నక్షత్రం లో గురు సంచారం వల్ల తండ్రి కి ఆరోగ్య భంగం. పిల్లలతో చీకాకులు ఉంటాయి. తోడ పుట్టిన వాళ్ళతో సఖ్యత ఉంటుంది . ధన నష్టం సూచింపబడుతోంది . అనుకున్న పనులు త్వరగా జరగక ఇబ్బంది పడతారు .
మిథున రాశి /లగ్నం : సప్తమ ,దసమాధిపతి అష్టమమ్ లో నీచలో సంచారం వల్ల దైవభక్తి ఉండదు . అదృష్టం తక్కువగా ఉంటుంది . సహధర్మచారిణికి ఆరోగ్య భంగం . వృత్తి పరంగా ఒత్తిడులు ఉంటాయి .ఖర్చులు అధికం గా ఉంటాయి కానీ కొత్త ఉద్యోగాల నుండీ ఆదాయం కూడా ఉంటుంది . సంతృప్తి ఉండదు . సంతోషం ఉండదు . పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి . ఆస్తి పరమైన చిక్కులు ఉంటాయి .
కర్కాటక రాశి /లగ్నం : సష్ట ,నవమాధిపతి సప్తమం లో నీచ లో సంచారం వల్ల కళత్రానికి ఆరోగ్య భంగం, సంతానం తో చీకాకులు ఉంటాయి . ధన సంబంధమైన అసంతృప్తి ఉంటుంది . మేనమామ సహాయం ఉంటుంది .