కార్తీక మాసారంభ శుభాకాంక్షలు అందరికీ. ఈ నెల మొత్తం పరమ శివుణ్ణి ఎన్ని సార్లు తలుచుకుంటే అంత మంచిది.
పంచాక్షరీ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదు. ఎవ్వరైనా ఎన్నిసార్లైనా జపం చేసుకోవొచ్చు.
ఏదైనా గ్రహ దశ వల్ల దుష్ఫలితాలు కలుగుతుంటే త్ర్యంబక మంత్రం తో కలిపి ఆ గ్రహ గాయత్రీ మంత్రం జపం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఈ క్రింద మీకు ఉపయోగపడే మంత్రాలు ఇవ్వడం జరిగింది:
త్య్రంబకం యజామహే సుగన్ధిమ్ పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
ఓం భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహీ
తన్నో ఆదిత్య: ప్రచోదయాత్
ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి
తన్నశ్చంద్ర : ప్రచోదయాత్
ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి
తన్న: కుజ: ప్రచోదయాత్
ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి
తన్నో బుధ: ప్రచోదయాత్
సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి
తన్నో గురుః ప్రచోదయాత్
భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి
తన్నో శుక్ర: ప్రచోదయాత్
రవిసుతాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి
తన్నో శని: ప్రచోదయాత్
శీర్ష రూపాయ విద్మహే వక్ర: పంధాయ ధీమహి
తన్నో రాహు:ప్రచోదయాత్
తమో గ్రహాయ విద్మహే ధ్వజస్ధితాయ ధీమహి
తన్నో కేతుః ప్రచోదయాత్
జపం చేసుకునే విధానం:
మొదట త్రయంబక మంత్రం చదివి తరువాత రెండుసార్లు గ్రహగాయత్రీ మంత్రం చదివి తరువాత మళ్ళీ త్రయంబక మంత్రం చదవాలి. ఇది ఒక సారి చదివినట్టు. ఇలా రోజుకి ఒక రుద్రాక్ష మాల (108 రుద్రాక్షలు ఉన్నది ) చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వొస్తాయి. ప్రయత్నించండి.