Saturday, November 7, 2020

మకర రాశి లో గురు గ్రహ సంచారం - 20. 11. 2020 నుండీ సంవత్సరాంతం వరకు - రాశులపై ప్రభావం - Part 3

 మకర రాశి /లగ్నం : వ్యయ తృతీయాధి పతి గురువు తన నీచ రాశిలో సంచారం వల్ల  మకర రాశి వారికి ఈ సమయం లో వివాహం జరిగే అవకాశం ఉంటుంది . ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి .  కొన్ని తెలివితక్కువ నిర్ణయాలు చేసే అవకాశం  . ఖర్చులు ఎక్కువగా చేస్తారు . తమ్ముడికి వృత్తి పరమైన ఇబ్బందులు ఉంటాయి .సంపాదన కూడా తక్కువగా ఉంటుంది . మకర రాశి వారికి స్థల మార్పులు వుండే అవకాశం .  మకర రాశి లో గురువు తో బుధుడు కలిసినప్పుడు రాతల వల్ల , మాటల వల్ల ఇబ్బందులు వొస్తాయి . శుక్రుడితో కలిసినప్పుడు సంతానం కలిగే అవకాశం . శని తో కలిసి గురువు ఇక్కడ సంచరిస్తున్నప్పుడు వ్యవసాయ మూలక  నష్టాలు ఉంటాయి . గురువు ఉత్తరాషాఢ నక్షత్రం లో సంచరిస్తున్నప్పుడు సంఘం లో గౌరవం పెరుగుతుంది కానీ తండ్రికి ఆరోగ్య భంగం. శ్రవణా నక్షత్రం లో గురువు సంచరిస్తున్నప్పుడు గురువు నీచత్వం తగ్గి మంచి ఫలితాలు ఇస్తాడు . ధనిష్టా నక్షత్రం లో సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి లాభాలు ఉంటాయి . 

కుంభ రాశి /లగ్నం : ద్వితీయ ఏకాదశాధిపతి గురువు వ్యయం లో తన నీచ రాశిలో సంచారం వల్ల ఆర్ధిక పరమైన ఇబ్బందులు తప్పవు. దేనిలోనూ జయం ఉండదు . పెద్దన్నయ్య కి లాభం గా ఉంటుంది . కుటుంబం ఇబ్బందుల్లో ఉంటుంది . సంతోషం తక్కువగా ఉంటుంది . మాతృ వర్గీయులు బాగుంటారు కానీ వారితో విరోధం ఉంటుంది . 

మీన రాశి /లగ్నం : లగ్న దసమాధిపతి ఏకాదశం లో నీచ రాశి లో సంచారం వల్ల సంఘం లో గౌరవం తగ్గుతుంది . ఆదాయం,సంతోషం, విజయం తక్కువ . సంతానం వల్ల సంతోషం ఉంటుంది . అనవసర ప్రయాణాలు ఉంటాయి . తమ్ముడికి ఆరోగ్య భంగం . విదేశాల్లో ఇబ్బందులు


 .