Thursday, April 21, 2022

రేపటి తారా చంద్ర బలాలు ,చేసుకోవలసిన గ్రహ జపాలు, పారాయణలు


నక్షత్ర పాదాల వారీగా రేపటి (22. 04. 2022) తారా చంద్ర బలాలు , శుభ కాల ,దుర్ముహూర్త ,రాహు ,వర్జ్య కాలా లు తెలిపే పట్టిక ఇవ్వబడింది . 

రేపు రాత్రి 20:14 వరకు పూర్వాషాఢ నక్షత్రం తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం లో చంద్రుడి సంచారం వుంటుంది . 

మృగశిర ,చిత్తా ,ధనిష్టా వారికి 20:14 వరకు నైధన తార . పునర్వసు,విశాఖ , పూర్వాభాద్రపద వారికి ప్రత్యక్  తార.  ఆశ్లేష,జ్యేష్టా , రేవతీ వారికి విపత్  తార . 

రేపు రోజంతా ధనుస్సు రాశి లో చంద్రుడి సంచారం కనుక వృషభ రాశి వారికి అష్టమ చంద్ర      దోషం . 

పైన చెప్పబడిన నక్షత్రాల వారు , రాశుల  వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి 

రేపు ఉదయం 08:42 వరకు షష్టి తరువాత సప్తమి . సప్తమి ఘడియల్లో శుక్ర గ్రహానికి సంబంధించిన దానాలు చేసుకోవడం మంచిది . 

రేపు జపం చేసుకోవలసిన గ్రహ జపాలు రవి, శుక్రులకి . 

లలితా పంచ రత్న స్తోత్ర పారాయణ మంచిది