Sunday, April 3, 2022

మత్స్య జయంతి శుభాకాంక్షలు.


 **శ్రీ గురుభ్యో నమః**


అందరికీ మత్స్య జయంతి శుభాకాంక్షలు.

(చైత్ర శుక్ల తృతీయ ఈ రోజు మధ్యాన్నం 12.38 ని నుండీ రేపు మధ్యాన్నం 13:54 వరకు )

దశావతారాల్లో మొట్టమొదటి విష్ణు అవతారం మత్స్య అవతారం. హాయగ్రీవాసురుడు వేదాల్ని అపహరించినప్పుడు ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను కాపాడడానికి మహా విష్ణువు మత్స్యావతారమెత్తినట్టు పురాణాల్లో చెప్పబడింది.

ప్రళయం సంభవించి ప్రపంచం అంతా లయమైపోయినప్పుడు మొట్ట మొదటి మనువు ని రక్షించినది కూడా ఈ అవతారం లోనే.

మత్స్యావతారం గురించీ మొదటిగా షతపత బ్రాహ్మణం లో చెప్పబడింది.

అలాంటి అవతారం జరిగిన రోజున (తృతీయ ఘడియల్లో ) పురుష సూక్తం పారాయణ,శ్రవణం మంచిది.
వేద పండితులతో వేదాశీర్వచనం తీసుకోవడం మంచిది.
నమక, చమక పారాయణం ,శ్రవణం మంచిది.

శుభం భూయాత్.
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054