Wednesday, December 13, 2023

రవి గ్రహ గండాంత సంచారం డిసెంబర్ 13 నుండీ 19 వరకు

రవి గ్రహ గండాంత సంచారం - డిసెంబర్ 13 నుండీ 19 వరకు : 

రేపు ఉదయం 08:49 ని లకు జ్యేష్టా నక్షత్రం 4 వ పాదం లో రవి గ్రహ ప్రవేశం తో గండాంత సంచారం ప్రారంభం అవుతుంది. 19 వ తారీకు 22:03 కి మూలా నక్షత్రం రెండవ పాదం లో ప్రవేశించడం తో ముగుస్తుంది. 

ఈ సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది కానీ సింహ,మకర రాశుల వారి మీద, కృత్తిక, ఉత్తరా ఫాల్గుణీ, ఉత్తరాషాఢ నక్షత్రం వారి మీద ఎక్కువ ప్రభావం వుంటుంది. 

మేష రాశి వారు వారి తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దూర ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పై చదువుల కోసం విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఫలించవు. 

వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామి తో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు.

మిధున రాశి వారికి భాగస్వాముల తో విభేదాలు , వాతావరణ మార్పు వల్ల వొచ్చే ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

కర్కాటక రాశి వారు తమ సంతానం గురించీ ఆందోళన చెందుతారు. వాతావరణ మార్పుల వల్ల వొచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. 

సింహ రాశి వారికి కంటికి సంబంధించిన సమస్యలు, తల నొప్పి, వృత్తి ఉద్యోగాలలో సమస్యలు రావొచ్చు.

కన్యా రాశి వారు తమ తల్లి ఆరోగ్యం గురించీ శ్రద్ధ పెట్టాలి. ఇంటికి, వాహనానికి రిపేర్లు చేయించ వలసి రావొచ్చు. దూరప్రాంతాల నుండీ దుర్వార్తలు రావొచ్చు. 

తులా రాశి వారు తాము మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తోడ పుట్టిన వారితో విభేదాలు రావొచ్చు. రావలసిన బాకీ లు ఆలస్యం అవుతాయి. 

వృశ్చిక రాశి వారు ఉద్యోగ అవకాశాలు జారవిడుచుకుంటారు. పై అధికారుల తో మాట పడతారు. అనుకున్న పనులు పూర్తి కావు.

ధనుస్సు రాశి వారికి కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టవలసి రావొచ్చు. తీర్థ యాత్రలు వాయిదా వేసుకోవడం మంచిది. 

మకర రాశి వారు పై అధికారులతో ఇబ్బందులు. గవర్నమెంటు పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య భంగం. అధిక వ్యయం. దూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

కుంభ రాశి వారికి పై అధికారులతో ఇబ్బందులు. అనుకున్న పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. రాజకీయ పదవుల్లో వున్న వారికి అప్రతిష్ట ,ఇబ్బందులు.

మీన రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకోని ఇబ్బందులు. తీసుకున్న రుణాల వల్ల ఇబ్బందులు. 

సూర్యుడి సంచారం వల్ల ప్రతికూలతలు ఎదురుకుంటున్న వారు ఈ క్రింది స్తోత్రం రోజూ పారాయణ చెయ్యాలి: 

శ్రీ సూర్య ఏకవింశతి నామ స్తోత్రమ్

భాస్కరో భగవాన్ సూర్య శ్చిత్రభాను ర్విభావసుః
యమః సహస్రాంశుమాలీ యమునాప్రీతిదాయకః ॥

దివాకరో జగన్నాథః సప్తాశ్వశ్చ ప్రభాకరః |
లోకచక్షుః స్వయంభూశ్చఛాయాప్రీతిప్రదాయకః ॥

తిమిరారి ర్దినధవో లోకత్రయప్రకాశకః |
భక్తబంధు ర్దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః ॥

ఏకవింశతి నామాని యః పఠే దుదితే మయి |
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహం ॥