గండాంత సంచారం లొ వున్నా ఏ గ్రహమైనా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు . కుజుడు గండాంత సంచారం లొ వున్నప్పుడు ముఖ్యం గా మేష వృశ్చిక వృషభ రాశి వారికీ , మృగశిరా , చిత్తా , ధనిష్టా నక్షత్రాల వారికీ ప్రతికూల ఫలితాలు ఇస్తాడు . అలాగే కుజ దశ , అంతర్దశ జరుగుతున్నా వారికి కూడా ప్రతికూలతలు ఉంటాయి .
కుజుడు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నప్పుడు తోడబుట్టిన వారితో విభేదాలు వొస్తాయి . ఎవరితోనైనా వాదోపవాదాలు జరిగి గొడవపడే పరిస్థితులు రావొచ్చు , భూ సంబంధమైన లావాదేవీల్లో ఇబ్బందులు ,మోసాలు జరుగవొచ్చు . వాటి విలువ పడిపోవచ్చు . తరచుగా గాయాలు ఏర్పడవొచ్చు ( చాకు ,కత్తి , బ్లేడు ,కత్తి పీట ఉపయోగించినప్పుడు వాటివలన తెగుట మొదలైనవి ) , కోర్టు వ్యవహారాల్లో పాల్గొనవలసి రావొచ్చు , వాహనాలను తరుచుగా మరమత్తులు చేయించవలసి రావొచ్చు .
పై ఫలితాల్లో ఏదైనా మీకు అనుభవం అయినప్పుడు కుజ మంత్రం ధ్యానం చేసుకోవడం ,సుభ్రమణ్యేశ్వర ఆలయ సందర్శనం , విశేష పూజ చేయించుకోవాలి .
ఈ క్రింది మంత్రాలలో ఏదైనా ఒకటి రోజుకి 11/27/54/108 సార్లు జపం చెయ్యడం వల్ల ఉపశమనం కలుగుతుంది :
కుజ ధ్యాన శ్లోకములు :