Saturday, December 7, 2024

Tara Bala of Jupiter in Transit for each nakshatra in 2025-26

 

Click on the image for an enlarged view

Above chart shows transit of Jupiter through nakshatras and the periods of transit and the Tarabala of Jupiter transit for each nakshatra is also given. 

If  Jupiter is transiting in your Janma, Vipat,Pratyak or Naidhana tara , you should perform remedies for Jupiter during the period in which the transit happens.    

Tara & Chandra Bala for all nakshatras for 08.12.2024

 

Click on the image for an enlarged view

Thursday, December 5, 2024

Tara Bala of Saturn Transit for each Nakshatra in 2025-26

Following chart shows the Tara Bala of Saturn for each Nakshatra in the year 2025-2026. Saturn transits through Purva Bhadrapada and Uttara Bhadra Pada during the year as shown in the chart below. 

Remedies for Saturn are to be done during the period in which Saturn transits your Janma,Vipat, Pratyak or Naidhana Tara . 

Natives of Mercury nakshatras Asresha, Jyeshta, Revati have a fully beneficial Saturn transit during the Coming Viswavasu year. Even though Revati natives have Sade Sati period running they will not experience much of its impact. 


Wednesday, November 27, 2024

Thursday, October 31, 2024

Wednesday, October 30, 2024

Daily Rasi Phala - 31.10.2024

 




Click on the above pictures for an enlarged view 

రాశి ఫలితాలు నవంబర్ 3 నుండీ నవంబర్ 9 వరకు

 

మేష రాశి :
వారం మొదట్లో పనులు పూర్తి కాక ఇబంది పడతారు .  శుక్ర శని వారాలు అనుకూలం . ఈ రాశి  వారు ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడే సూచనలు వున్నాయి . ఆహార నియమాలు పాటించాలి.జీవిత భాగస్వామి, సంతాన ఆరోగ్యం పై  శ్రద్ధ పెట్టాలి . దగ్గిర బంధువులతో, భార్య తో లేదా భర్త తో  విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి . వారం చివరిలో చంద్ర బలం పెరుగుతోంది .  అనుకున్న పనులు అన్నీ అధికారుల అండ తో పూర్తి అవుతాయి . శుక్ర శని వారాల్లో ధన లాభం , గృహం లో సంతోష కరమైన వాతావరణం ఉంటాయి . 

వృషభ రాశి :  
వారం మొదట్లో అన్నింటా అనుకూలతలు ఉంటాయి. మిత్రులు ,బంధువుల రాక తో ఆనందం గా వుంటారు . వారం మధ్యలో మోకాళ్ళ నొప్పి తో బాధ పడతారు . బుధ గురు , వారాల్లో అనుకోని ఆటంకాల వల్ల పనులు వాయిదా పడతాయి . ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల తో వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువై ఒత్తిడి పెరుగుతుంది . కొన్ని విషయాలలో అవమానాలు ఎదుర్కో వలసి వస్తుంది.శుక్ర శని వారాల్లో విచారం , ఆందోళన తగ్గు ముఖం పట్టి ఊపిరి పీల్చు కుంటారు . వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు తొలగుతాయి . శుక్ర శని వారాల్లో పనులు వాయిదా వెయ్యకండి. 

మిధున రాశి : 
ఈ వారం సోమ మంగళ వారాలు అనుకూలం . మీ పిల్లల విషయాల్లో ఆందోళన చెందుతారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి . తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . ప్రేమ వ్యవహారాలు  కలిసి రావు . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . కోర్టు వ్యవహారాలు కలిసి రావు . ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం లభిస్తుంది . ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోండి . కుటుంబ సభ్యుల తో విభేదాలు వొచ్చే అవకాశం వుంది . ఆలోచించి మాట్లాడండి . స్థిరాస్తుల విలువలు తగ్గే అవకాశం వుంది . వారం చివరిలో జీవిత బాగా స్వామి తో విభేదాలు . 

కర్కాటక రాశి : 
ఏకా దశ  గురువు మీ రాశికి చాలా బలాన్ని ఇస్తున్నాడు .అష్టమ శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాడు .గురువు యొక్క ఈ అనుకూల సంచారం వల్ల కొందరికి మంత్ర సిద్ధి , ఉద్యోగ లాభం వంటి ఫలితాలు ఉంటాయి .  ఈ రాశి  వారికి జన్మ రాశి లో కుజ సంచారం వల్ల  జ్వరం వల్ల ఇబ్బంది పడొచ్చు . వాహనాలతో ఇబ్బందులు ఉంటాయి . బంధువులతో, పై అధికారులతో వైరం రాకుండా జాగ్రత్త పడాలి . బుధ వారం నుండీ చంద్ర బలం పెరుగుతుండడం వల్ల  నూతన వస్తు ప్రాప్తి , ఆరోగ్యము , శత్రువులపై జయం , మిత్ర లాభం వంటి ఫలితాలు ఉంటాయి . రాహువు నవమ సంచారం వల్ల  ప్రయాణాలు చేసేటప్పుడు సరైన ప్లానింగ్ లేకపోతే ఇబ్బందులు పడవలసి  ఉంటుంది .

సింహ రాశి : 
రవి , బుధ , శుక్రులు అనుకూలంగా వున్నారు . అనవసరమైన ఖర్చులు అదుపు చెయ్యాలి . మూడవ ఇంట రవి సంచారం వల్ల ధన లాభం , బంధు మిత్రుల కలయిక , స్థాన లాభం , అనుకున్నది సాధించడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి . శుక్ర శని వారాల్లో అనుకూలతలు ఎక్కువ . సంతాన పురోగతి విషయం లో సంతోషం గా వుంటారు . నాల్గవ ఇంట బుధ సంచారం వల్ల  తల్లి ఆరోగ్యం మెరుగు పడుతుంది . ధన ధాన్య లాభం ఉంటుంది . ప్రారంభించిన పనులు మంచి ఫలితాలను ఇస్తాయి . 12 వ ఇంట కుజ సంచారం వల్ల దేశాంతర వాసం , పలుకుబడి తగ్గడం , అనేక రకాల ఖర్చులు , స్త్రీ లతో వివాదాలు ఉండొచ్చు .

కన్యా రాశి  : 
సోమ మంగళ వారాలు అనుకూలం . బుధవారం చెయ్యవలసిన పనులు పూర్తి కాక ఆందోళన పడతారు . మీకు అనవసరమైన వ్యవహారాల్లో తలా దూర్చకండి . కొన్ని విషయాల్లో అనుమానాలు ఉంటాయి . అనవసరమైన ఖర్చులు చేస్తారు . శుక్ర శని వారాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు . బుధుడి మూడవ ఇంట సంచారం వల్ల అవసరమైన విషయాలు మరిచిపోవడం , పరధ్యాస గా ఉండడం వంటి ప్రభావాలు ఉండొచ్చు . మొత్తం మీద ఈ రాశి వారికి మంచి కాలం జరుగుతోంది . ఏకాదశ కుజ స్థితి , నవమ గురు స్థితి , 6 వ ఇంట శని స్థితి వల్ల ఈ కాలం లో మంచి అభివృద్ధి సాధిస్తారు . ఆర్ధికం గా స్థిర పడతారు . మంచి పేరు తెచ్చుకుంటారు  . 

తులా రాశి : 
వారం మధ్య నుండీ చంద్ర బలం పెరుగుతుంది . బుధ వారం నుండీ అనుకున్న పనులు తేలికగా  పూర్తి  చేయగలుగుతారు . జన్మ రాశి  లో రవి సంచారం వల్ల తల నొప్పి , కీళ్ల నొప్పులు బాధించ వొచ్చు . బంధు మిత్ర విరోధము , కోపం ,ఆందోళన , రోగ భయమూ ఉంటాయి . పదవ ఇంట కుజ సంచారం వల్ల  పై అధికారులతో విభేదాలు , శత్రువులు పెరగడం , ఎప్పుడూ తిరుగుతూ వుండే ఉద్యోగం చెయ్యడం వంటి ఫలితాలు ఉంటాయి . బుధుడి రెండవ రాశి  సంచారం వల్ల రాబోయే రెండు నెలలు ధన లాభం , మంచి ఆరోగ్యం కలుగుతాయి. వారం మొదట్లో రెండవ ఇంట శుక్ర సంచారం వల్ల ధన లాభం , కీర్తి , వస్త్ర లాభం , కుటుంబ వృద్ధి ఉంటాయి . వారం మధ్య నుండీ శుక్ర సంచారం మధ్యమ ఫలితాలు ఇస్తాడు . మీ మాటకి విలువ పెరుగుతుంది . మిత్ర లాభం ఉంటుంది కానీ శతృవృద్ధి కూడా ఉంటుంది . 

వృశ్చిక రాశి  :
బుధ గురు వారాల్లో కొంత ఇబ్బందులు వున్నా మిగిలిన వారం బావుంటుంది . జన్మ రాశి లో, తరువాత ద్వితీయ రాశి లో శుక్ర సంచారం వల్ల  మంచి శుభ ఫలితాలు ఉంటాయి . మీ మాటకి విలువ పెరుగుతుంది. ధన వస్త్ర లాభాలు  ఉంటాయి . సప్తమ గురు సంచారం మీకు వొచ్చే మే వరకు అనుకూల ఫలితాలు ఇస్తూనే ఉంటాడు . 12 వ ఇంట రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు , ఉద్యోగ మార్పులు , స్థాన చలనం ఉండొచ్చు . పై అధికారులతో విభేదాల వల్ల మీకు మనః శాంతి తక్కువ గా ఉంటుంది . జన్మ రాశి  లో బుధ సంచారం వల్ల  మతిమరపు , శత్రువులు పెరగడం , బంధు వైరం వంటి ఫలితాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవలసిన సమయం కాదు . మీ సంతానం తో విరోధం ఉండొచ్చు . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి .కొందరు  ప్రభుత్వ జరిమానాలు కట్టవలసి రావొచ్చు .  

ధనుస్సు రాశి : 
బుధ గురు వారాలు అనుకూలం . ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వారికి అనుకూలమైన కాలం . టెండర్ లు మీకు అనుకూలం గా వస్తాయి . ధన , మిత్ర లాభం ఉంటుంది . మీరు తలచిన అన్ని  కార్యాల్లో  విజయం సాధిస్తారు . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . మీ ఇంటి కి మరమత్తులు చేయిస్తారు . అరుగుదల కి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు . సరైన ఆరామ వ్యాయామాలు ఉండాలి . అష్టమ కుజుడి వల్ల ఆరోగ్య సమస్యలు ధన నష్టం , అప్పుల వల్ల అవమానాలు ఉండొచ్చు . బ్రోన్ కై టిస్ , ఆస్తమా వున్న వాళ్లకి ఇబ్బందికరమైన సంచారం ఇది. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి . గురువారం నుండీ జన్మ రాశి లో శుక్ర సంచారం వల్ల ధన లాభం , విద్యా వృద్ధి . 

మకర రాశి : 
వారం మొదట్లో 6 గ్రహాలు అనుకూలం గా వున్నాయి . మంచి అభివృద్ధి , ధన లాభం వుంటాయి . బుధ గురు వారాల్లో మధ్యమ ఫలితాలు . మిగతా వారం అనుకూలం . ఏకాదశ స్థానం లో బుధ, చంద్ర , శుక్రుల  సంచారం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి . ఆరోగ్య , ధన , మిత్ర లాభాలు ఉంటాయి . బుధ వారం శుక్రుడి రాశి మార్పు వల్ల చోర భయం , కార్య విఘ్నాలు కలుగుతాయి . ఖర్చులు ఎక్కువ అవుతాయి . 
సప్తమ కుజుడి వల్ల రాబోయే కొంత కాలం ఈ రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి . బంధువులతో ఎడతెగని విరోధం , ఇబ్బంది కలిగించే మాటలు వినుట , భార్య తో మాట పట్టింపులు . సంతానం తో , సోదరులతో విభేదాలు ఉండవచ్చు . నేత్ర , ఉదర వ్యాధులు వుండే అవకాశం . 5 వ ఇంట గురు సంచారం వల్ల సంతాన పరంగా ఆనందం , అధికారుల ప్రాపకం ఉంటాయి . 

కుంభ రాశి  : 
శుక్ర శని వారాల్లో తప్ప మిగిలిన వారం అంతా  అనుకూలమైన చంద్ర బలం వుంది . దశమ బుధుడి వల్ల  ఉద్యోగ వృద్ధి , కీర్తి , జయము ఉంటాయి . ఆహార నియమాలు పాటించాలి . పనులు వాయిదా వేసే ధోరణి పక్కన పెట్టాలి . వారం మధ్య నుండీ శుక్రుడి అనుకూల సంచారం వల్ల ధన లాభం , కీర్తి , మిత్ర లాభము , క్షీరాన్న భోజనము , ఇష్ట మైన కార్యక్రమములలో పాల్గొనడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ లు వొచ్చే అవకాశం . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . నాలుగవ ఇంట గురు సంచారం వల్ల , జన్మ  శని వల్ల విచారం , బంధు విరోధం వంటివి ఉండొచ్చు.  మనః శాంతి కోసం మెడిటేషన్, ధ్యానం వంటివి  చెయ్యాలి  . 

మీన రాశి  : 
బుధ వారం తరువాత నుండీ మంచి ఫలితాలు ఉంటాయి . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . తోడపుట్టిన వాళ్ళతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి . ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి . పనులు వాయిదా వెయ్యకూడదు .తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . ప్రభుత్వ కాంట్రాక్టర్ ల కి అనుకూలమైన కాలం కాదు . జరిమానాలు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది . ఈ వారం గ్రహ స్థితులు కొంత ఇబ్బంది పెట్టేవి గా వున్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి . దూర ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండొచ్చు . సరైన ఆరామ వ్యాయామాలు ఉండేట్టు చూసుకోండి . పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . ఎంత చేసిన ఫలితం వుండదేమిటని విచారం గా ఉంటుంది . 

Sunday, October 27, 2024

Tara & Chandra Bala for Each Nakshatra Pada - for 28.10.2024

 


Click on the above picture for an enlarged view 

Daily Rasi Phala using Ashtaka Varga - for 28.10.2024


 Click on the picture above for an enlarged view 

వార ఫలితాలు - అక్టోబర్ 27 నుండీ నవంబర్ 2 వరకు


 




















మేష రాశి :

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ వారం అద్భుతం గా ఉంటుంది . వారం మొదట్లో  తలనొప్పి బాదించవొచ్చు .  ఉద్యోగస్తులు మంచి పురోగతి సాధిస్తారు . మనః శాంతి ఉంటుంది . పరిచయస్తులు వల్ల లాభ పడతారు . నూతన గృహం కొనుగోలు/నిర్మాణం చేసే ఆలోచన చేస్తారు . ఏ విషయం లో నూ నిర్లక్ష్యం పనికి రాదు . ఈ వారం అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది . విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కొంత మందికి ప్రమోషన్లు వొచ్చే అవకాశం. వారాంతంలో శుభ వార్తలు వింటారు .  

వృషభ రాశి : 

మీ కృషికి తగిన ఫలితం ఈ వారం మీకు లభిస్తుంది. మనఃశాంతి ఉంటుంది .  వారం మొదట్లో సవాళ్లు ఎదుర్కొంటారు . గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు . కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు . మీ వ్యాపారాల్లో లాభాలు పెరిగే విధం గా చర్యలు తీసుకుంటారు . పరిస్థితులు అన్నీ మీ అదుపులో  ఉంచుకుంటారు . తోడపుట్టిన వారితో సత్సంబంధాలు ఉంటాయి . గొంతుకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు . మీ సంతానం పురోగతి మీకు సంతోషం కలిగిస్తుంది . ఇన్కమ్ టాక్స్ వల్ల ఇబ్బందులు ఉండొచ్చు . ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రవారం , శని వారం అనుకూలమైన రోజులు .  

మిధున రాశి : 

ఆరోగ్యం బాగుంటుంది . తోడ పుట్టిన వారి సహకారం ఉంటుంది . కష్ట సాధ్యమైన పనులు సాధిస్తారు . మెడికల్ రంగం లోని వారికి అనుకూలమైన వారం . వ్యాపారం లో అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి . కోపం గా వున్నవారిని కూడా మీ ప్రవర్తనతో శాంత పరుస్తారు . ఆదివారం , సోమవారం అనుకూలమైన రోజులు . ఆదాయానికి ఖర్చులకీ పొంతన ఉండదు . పనులు వాయిదా వెయ్యకండి . ఆదాయ  వనరుల్లో పెట్టుబడులు పెడతారు . కుటుంబ వ్యవహారాల్లో బైట వ్యక్తుల ప్రమేయం వల్ల  ఇబ్బందులు కలుగుతాయి . బుధ ,గురు వారాల్లో చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి . ఊహల్లో విహరించకండి . 

కర్కాటక రాశి : 

ఉద్యోగస్తులకు ప్రొమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు రావొచ్చు . తోటి పని ఆరితో  మంచి సఖ్యత వారి నుండీ సహకారం  ఉంటాయి . మీ మీద మీకు చాలా విశ్వాసం ఉంటుంది . ఈ వారం మీకు మంచి అవకాశాలు ఇస్తుంది . దగ్గిర వ్యక్తుల విలువ తెలుసుకుంటారు . మంగళ,బుధ వారాలు మీకు అనుకూలం . వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు . ఒకేసారి అన్ని పనులు చేద్దామని ప్రయత్నించకండి .   ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోకండి . ఆరోగ్య వంతమైన ఆహారపు అలాఅట్లు పాటించాలి . సమయానికి నిద్ర ముఖ్యం . సోమ, శుక్రవారాల్లో అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి . 

సింహ రాశి : 

ఈ వారం ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉద్యోగస్తుల కు ఈ వారం చాలా అనుకూలం . ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న ప్రయాణాలు ఈ వారం వీలౌతాయి . శుభవార్తలు వింటారు . ఆదాయం పెరుగుతుంది . ఉద్యోగాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు . మీరు ఇష్టపడే వ్యక్తి తో విభేదాలు వస్తాయి .  పెద్ద ఉద్యోగ అవకాశాలు వస్తాయి . ఆది , శుక్ర వారాలు అనుకూలం . మునగాల, బుధ వారాలు అననుకూలం గా ఉంటాయి .  పెళ్లికాని వారికి సంబంధం కుదిరే   అవకాశం . అదృష్టం కలిసి వస్తుంది . మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఎక్కువ పని ఒత్తిడి వల్ల దిన చర్య  మీద ప్రభావం చూపిస్తుంది . సరిపడా విశ్రాంతి  అవసరం . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి .     

కన్యా రాశి : 

ఉద్యోగం లో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి . అప్పులు తీర్చేస్తారు . కష్ట సాధ్యమైన పనులు పూర్తి చెయ్యడం లో నిమగ్నమై వుంటారు . భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి . భార్యా భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది . శత్రువులపై విజయం సాధిస్తారు . మంగళ ,బుధ ,గురు వారాలు అనుకూలం . తల్లి తండ్రుల మాట అభిప్రాయాలకి విలువ ఇవ్వండి . పిల్లల విషయాల్లో అసంతృప్తి గా వుంటారు . రహస్య శత్రువులు నష్టం చెయ్యాలని చూస్తారు అన్న విధాలా జాగ్రత్తగా ఉండాలి . అనవసర భయాలు తో ఆందోళన చెందుతారు . 

తులా రాశి : 

వారం మొదట్లో శుభ వార్తలు వింటారు . భార్యా భర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది . వ్యాపారం లో మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు వస్తాయి . కండరాల సమస్యలు ఉండొచ్చు . ముఖ్యమైన వ్యవహారాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల ఇబ్బందులు పడతారు . అడ్మినిస్ట్రేషన్ రంగం లో ని వారికి ఈ వారం చాలా అనుకూలం . మీ సమర్ధత పెరుగుతుంది . కన్సల్టెంట్ ల కి అనుకూలం . ఆర్ధిక వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి . కొంత మంది మిమ్ములను అపార్ధం చేసుకునే ప్రమాదం వుంది . సోమ ,శుక్ర వారాల్లో మంచి అనుకూలతలు . మంగళ బుధ వారాల్లో ఇబ్బందులు ఉంటాయి . స్వంత విషయాలు అందరికీ తేలిపోతాయని భయపడతారు . మీ సంతానం మొండి పట్టుదల పట్టడం వల్ల  చిరాకు పడతారు . 

వృశ్చిక రాశి :

ఆర్ధిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది . ఆఫీసు లో మీ అధికారాలు పెరుగుతాయి . అవసరమైన సమయానికి మీ మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి . మీ దగ్గిర పని చేసే వాళ్లకి జీతాలు పెంచాల్సిన పరిస్థితి . వ్యాపారాల్లో అన్ని సవాళ్లనూ అధిగమిస్తారు . పాత పొరపాట్లనుంచీ మంచి పాఠాలు నేర్చుకుంటారు . కుటుంబ సమస్యలు ఉంటాయి . ఖర్చులు ఎక్కువ అవుతాయి . మీ పట్టుదల వల్ల పూర్తి కావాల్సిన పనులు త్వరగా పూర్తి అవుతాయి . ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు . ఆదివారం నుండీ బుధ వారం వరకు అనుకూలం . శుక్ర శని వారాలు కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకపోతేనే మంచిది . చెడు స్నేహాల వల్ల మీకు చెడ్డ పేరు వొచ్చే అవకాశం. 

ధనుస్సు రాశి  : 

మీరు చేసిన మంచి పనుల వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది . రాజకీయ నాయకీలకి బాగా అనుకూలమైన వారం .ఆర్ధిక విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది . విదేశీ ప్రయాణాలకు అవకాశం . కానీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండొచ్చు .  ఏదైనా పని మొదలు పెట్టేముందు పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం మంచిది. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు . స్నేహితులతో ఆనందం గా గడుపుతారు . ఈ వారం ఎదురైనా అన్ని ఆటంకాలు అధిగమిస్తారు . బుధ గురు వారాలు అనుకూలం . రక్తపోటు మధుమేహం సమస్యలు వున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . కుటుంబ సమస్యలు పరాయి వ్యక్తుల ముందు ప్రస్తావించకండి . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి . తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . 

మకర రాశి : 

ఈ వారం పనులతో తల మునకలై వుంటారు . నూతనోత్సాహం తో వుంటారు . వ్యాపారం లో పురోగతి సాధిస్తారు . మీ పై అధికారులు మిమ్ములను ప్రశంసిస్తారు . షేర్ మార్కెట్ పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి . రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్ మొదలు పెట్టొచ్చు . మీ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారు . బంధువులు లేక మిత్రుల రాక తో ఆనందం గా వుంటారు . శుక్ర శని వారాలు అనుకూలం . పని ఒత్తిడితో చిరాకు ప్రదర్శిస్తారు . మీ గౌరవం పెరుగుతుంది . భజంత్రీ గాళ్ళను నమ్మకండి . ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి . 

కుంభ రాశి :

ఉద్యోగస్తులకు చాలా పని ఉంటుంది . కుటుంబం లో సుఖ సంతోషాలు ఉంటాయి . ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటుంది . మీ పై అధికారులతో మీ సంబంధాలు బావుంటాయి . కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి . ధైర్యం తో  మంచి నిర్ణయాలు తీసుకుంటారు . ఇంటికి మరమత్తులు చేయిస్తారు . మీ సంతానం పరివర్తన పట్ల సంతోషం గా వుంటారు . దగ్గు జలుబు వంటి వాటితో ఇబ్బంది పడతారు . భుజం నొప్పితో బాధ పడతారు . సరైన ఆరామ వ్యాయామాలు ఉండేలా జాగ్రత్త పడాలి . బుధ గురు వారాల్లో అన్ని విషయాల్లో జాగ్రత్త గా ఉండాలి .  

మీన రాశి :

మత పరమైన వ్యవహారాల లో ఆసక్తి చూపిస్తారు . మీ మీద గౌరవం పెరుగుతుంది . ముఖ్యమైన వ్యవహారాలు అనుభవజ్ఞులు , సీనియర్ ల సహాయం తో పూర్తి చేస్తారు . వ్యాపారం లో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తారు . మీ జీవిత భాగస్వామి వృత్తిపరమైన మంచి విజయం సాధిస్తారు . విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోవాలి . ఆర్ధిక పురోగతి బాగుంటుంది . మంగళ బుధ వారాలు బాగా అనుకూలం . ఎక్కువ పని ఒత్తిడి వాళ్ళ ఇబందులు ఉంటాయి . అలసట , చిరాకు వల్ల ఇబ్బంది పడతారు . సరైన ఆహార నియమాలు పాటించాలి .  

Saturday, October 26, 2024

విశ్వావసు నామ సంవత్సరం


శశ్వద్విశ్వావసావబ్దే మధ్య సస్తార్థ వృష్ఠయః 
ప్రచురాశ్చౌర రోగాశ్చ నృపా లోభాభి భూతయః

విశ్వావసు నామక సంవత్సరం లో సస్యములు వర్షములు మధ్యమముగా వుండును. ధాన్యములు ధరలు అధికమగును. రోగములు మరియు చోరులు అధిక మగును. రాజులు లోభముతో కూడి వుందురు. 

(నారద సంహిత) 


సుపుత్ర దారః సుతరాముదారో 
నర్మః సదాచార రతో 2_ తి ధీరః ।
మిష్టన్న భుక్ సర్వ గుణాభిరామో 
విశ్వా వ సౌ యస్య భవేత్ప్ర సూతిః ।। 

విశ్వావసు నామ సంవత్సరమున జన్మించిన వారలు సత్పుత్రుల తోటి సతీ సమేతుడై , ఉదారభావోపేతులు, సదాచార సంపన్నులు, ఇష్టాన్నపానములు కలిగి, సకల గుణో పేతులై వుండెదరు. 

(జాతకాభరణం)

Friday, October 25, 2024

వృశ్చిక  రాశి లో బుధ సంచారం 29. 10. 2024 నుండీ 04. 01. 2025 వరకు 

 


ప్రస్తుతం తులా రాశి లో సంచారం చేస్తున్న బుధుడు , 29.10.2024 న వృశ్చిక రాశి లో ప్రవేశిస్తాడు.

మామూలుగా ఒక రాశి లో 15 నుండీ 17 రోజులు సంచారం చేసే బుధుడు ఈ సారి వృశ్చిక రాశి లో 66 రోజుల పాటు వుంటాడు.
అంటే 29.10.2024 నుండీ 04.01.2025 వరకు వృశ్చిక రాశి లో నే బుధుడు వుంటాడు.
మధ్యలో 26.11.2024 నుండీ 16.12.2024 వరకు వక్ర గతి లో వుంటాడు.
నైసర్గిక రాశి చక్రం లో 8 వ రాశి అయిన వృశ్చిక రాశి చాలా నిగూఢమైనది . చాలా రహస్యాలు దాచుకున్న రాశి.
బుద్ధి కారకుడైన బుధుడు ఈ రాశిలో ఎక్కువ కాలం వుండడం వల్ల చాలా రహస్యాలు వెలుగులోకి వొచ్చే అవకాశం వుంది.
వృశ్చిక రాశిలో నే వక్ర గమనం లో వున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల ఎక్కువగా వుంటాయి.
వక్రము చెందిన బుధుడు విపరీత ఫలితాలను ఇస్తాడని గర్గ , కాశ్యప మహర్షులు చెప్పినట్లు భట్టోత్పల వ్యాఖ్య.

శ్లో: నోత్పాత పరిత్యక్తః కదాచిదపి చంద్రజో వ్రజత్యుదయమ్
జల దహన పవన భయకృత్ ధాన్యార్ఘ క్షయ వివృద్ధౌ

పై శ్లోకం బుధ చారం గురించీ చెప్తూ వరాహమిహిరుడు బృహత్ సంహిత లో చెప్పిన మొదటి శ్లోకం.
పై శ్లోకం తాత్పర్యం: చంద్రుని కుమారుడైన బుధుడు ఉత్పాతములు లేనిదే ఉదయించడు. బుధోదయము జరిగినప్పుడు జల అగ్ని వాయు భయములునూ దాన్యాధికముల ధరలు హెచ్చు తగ్గులగుటయూ,ధాన్య నాశనమునూ జరుగు చండునని పై శ్లోకం లో చెప్పబడింది .

శ్లో : హస్తాదీని చరన్ షడృక్షాణ్యుపపీడయాన్ గవామ శుభః
స్నేహ రసార్ఘ వివృద్ధిం కరోతి చొర్వీ ప్రభూతాన్నమ్
(బృహత్ సంహిత)

పై శ్లోకం లో హస్తా నక్షత్రం మొదలు జ్యేష్టా నక్షత్రం వరకూ బుధుడు సంచరిస్తున్నప్పుడు , గోవులకు అశుభమూ, తైలాది రస ద్రవ్యముల ధరలు హెచ్చుటయూ, అన్నమూ మొదలగు ద్రవ్యముల సమృద్ధి గా వుండుననియూ చెప్పబడింది.

మొత్తం మీద రాబోయే బుధుడి వృశ్చిక సంచారం లో ఈ కింది ఫలితాలు వుండొచ్చు -
1.పెట్రోల్, డీజిల్ , వంట నూనె ల ధరలు పెరుగుతాయి.
2. ధాన్యం సమృద్ధి గా వున్నా ధరలు పెరుగుతాయి.
3. జల తత్వపు రాశిలో బుధ వక్ర గమనం వల్ల అకాల వర్షాలు , వరదలు వల్ల నష్టాలు వుంటాయి.
4. ఎప్పటి నుండో దాచి ఉంచిన రహస్యాలు అనూహ్యం గా వెలుగు లోకి వస్తాయి.
5. సాహిత్య రంగంలో ప్రముఖులకి ప్రమాదం
6. నవంబర్ 30 అమావాస్యకు దగ్గరలో ప్రకృతి వైపరీత్యాలు
7. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ప్రమాదాలు, అంతరాయాలు.
8. సముద్ర గర్భం లో వున్న కేబుల్స్ తెగి ఇంటర్నెట్ కి అంతరాయం కలగొచ్చు.

Tara & Chandra Bala for each nakshatra pada - For 26.10.2024

 


Click on the picture for an enlarged view 

Daily Rasi Phala for 26.10.2024

 


Click on the picture for an enlarged view

Planetary Placements which may cause Diabetes

Following Combinations of Planets and their placements as stated herein below may cause Diabetes during their Mahardasa or Antardasa : - 

When Mercury is positioned in Sagittarius or Pisces and is aspected by Sun , the native will suffer due to urinary diseases. 

Saturn, Sun and Venus when situated in the 5th bhava the person will suffer due to Diabetes . 

Mars in the 10th house when in conjunction with or aspected by Saturn 

when Sun and Mars occupy the ascendant and 6th house respectively 

Ascendant Lord in  either debilitated or in an inimical sign

Ascendant aspected by malefic and Venus in the 8th house or Venus aspecting the 8th house

Malefic Jupiter in the 6th house 

Ascendant aspected by malefic and Jupiter in conjunction with another malefic

Jupiter is afflicted by Saturn and Rahu either by aspect or conjunction

Combust Jupiter on Rahu-Ketu axis

Jupiter in any Nakshatra ruled by Saturn

When the Moon is afflicted by Saturn

5th lord with the lord of a Trik Bhava

Jupiter in Poorvashadha constellation

Jupiter afflicted, retrograde and in a Trik Bhava

Cancer sign is afflicted by Saturn 

Venus in 6th house and Jupiter in 12th house 

Afflicted or debilitated Jupiter or Venus in a Trik Bhava without any benefic

Jupiter afflicted by Rahu when Jupiter is in any of  Rahu's constellations 

Venus and Jupiter having conjunction with malefic planets.

While a malefic is posited in 8th house 

Venus in 2nd house when the lord of the ascendant is posited in the 6th bhava coinciding with its debilitation sign

Moon and Jupiter afflicted by a malefic posited in the 8th house

Venus and Jupiter having association with a malefic when the ascendant is occupied by a malefic

Venus with a malefic in 8th house aspect of malefics on ascendant, the lord of the ascendant, in its debilitation or in an inimical sign and Venus in the 8th house

A strong malefic in ascendant while Moon and Jupiter are afflicted

Rahu and the lord of the 8th house posited in the 8th bhava  are in a trine

A strong malefic in the 8th house and Venus & Jupiter are afflicted, causes diabetes.

A strong malefic in the 8th house and Moon & Jupiter are afflicted

Mercury in a sign of Jupiter aspected by Mars

Venus in ascendant aspected by a malefic or in the 8th house

Venus in 8th house with a malefic aspect

Mars, Saturn, Rahu or Ketu in a watery sign especially in 6th 8th or 12th house

The Moon in Cancer or Scorpio, sign or navamsa being afflicted by a malefic

The lord of the 6th house posited in the 12th house and lord of the 12th house aspected by Jupiter

The 7th house being a watery sign occupied by the Sun,Saturn, Mars or Rahu, 

Malefics in ascendant or in 8th and afflicted Jupiter and Venus

Jupiter in 6th, 8th and 12th houses

Jupiter in 8th aspected by Saturn

Venus conjoined with malefics in 6th, 8th or 12th houses

Jupiter in 12th and Venus posited in the 6th

Jupiter aspected by 12th lord or 6th lord

Venus conjoined with malefics in ascendant

Venus in 6th house and Rahu in the ascendant

Rahu with 8th lord in 5th, 8th or 9th house

Planetary Combinations which may cause Skin Diseases

Following Combinations of Planets and their placements cause Skin Diseases during their  Maha dasa or Antar dasa : -   

Saturn in ascendant aspected by Mars
 
Rahu in the 8th joined with or aspected by a malefic 

Moon in Sagittarius or Leo aspected by Mars or Saturn

Powerful Saturn in the 3rd joined with or aspected by Mars 

Moon and Mars in the 2nd aspected by Saturn 

Jupiter in conjunction with Saturn, weak Moon in the 10th, Mars in ascendant

Mercury conjoined with Sun in the 6th house aspected by 8th lord

Malefic Mars in 6th 

Moon in the 2nd, which is a watery sign 

Sun and Saturn in ascendant 

If the Moon is in Sagittarius and in the navamsa of Leo, Aries, Cancer and simulatenously Mars and Saturn join or aspect the Moon

Afflicted atmakaraka in Gemini, Virgo or Capricorn navamsa 

Moon in the 6th aspected by a malefic 

Mercury as lord of the ascendant posited in 6th 

Moon conjunct Saturn in Pisces, Cancer, Capricorn or Taurus and aspected by malefics

The Sun, the Moon and Mars in the 6th 

Moon in Virgo between malefics 

Mercury in the 2nd aspected by the Moon 

Mercury in the ascendant aspected by lord of the 6th or 8th 

If the 5th or 9th from ascendant is Taurus, Cancer, Scorpio, or Capricorn with Mars and Saturn, 

Tara & Chandra Bala for each nakshatra pada for today - 25.10.2024

Click on the picture for an enlarged view
 

Rasi Phala for today 25.10.2024

 


Click on the picture for an enlarged view 

Saturday, October 19, 2024

Wednesday, October 16, 2024

Bharani Nakshatra Compatibility for marraige

Following is the list of nakshatras compatible with Bharani nakshatra for marraige : 

Krittika - 75% 

Uttara -1 - 75%

Uttarashadha - 75% 

Rohini - 64%

Sravana - 72%

Ardra - 75%

Swati - 81%

Satabhisha - 58% 

Punarvasu - 72%

Visakha 1,2,3 -  61%

Purvabhadra - 69%

Aslesha - 64%

Revati - 67%

Aswini - 92%

Magha - 58%

Moola - 55%

Nakshatras not mentioned above are not compatible for marraige and should be avoided.

In the above list , Nakshatras with higher compatibility percentage have to be given priority. 

Personal horoscopes of the Bride and Groom have to be checked to see whether there are any doshas like Rahu Ketu dosha, Kuja Dosha and other doshas, 

Longevity , Marital felicity, Sexual happiness, Ability to have children have to be checked from the personal horoscopes before deciding . 

Aswini Nakshatra Compatiblity for Marraige

Nakshatras compatible in marraige with Aswini nakshatra are as given below : 

Bharani - 94 %

Purva Phalguni - 75%

Purvashadha - 75%

Uttara Phalguni  - 1st Pada ( Simha Rasi )   - 50%

Uttarashadha - 69%

Mrigasira - 61%

Aswini - 78%

Chitta - 3,4 ( Tula Rasi ) - 61%

Dhanishta - 56%

Ardra - 53%

Swati - 75%

Pushyami - 83%

Uttara Bhadra - 67%

Aslesha - 69%

Revati - 69%

Nakshatras not mentioned above are not compatible for marraige and should be avoided.

In the above list , Nakshatras with higher compatibility percentage have to be given priority. 

Personal horoscopes of the Bride and Groom have to be checked to see whether there are any doshas like Rahu Ketu dosha, Kuja Dosha and other doshas, 

Longevity , Marital felicity, Sexual happiness, Ability to have children have to be checked from the personal horoscopes before deciding . 

Thursday, September 26, 2024

బృహత్ సంహిత లో చెప్పబడిన నక్షత్ర కారకత్వములు

 అశ్విని : గుఱ్ఱముల వ్యాపారులు , సేనాధిపతులు , వైద్యులు , సేవకులు , గుఱ్ఱములు , వర్తకులు , రూపవంతులను సూచిస్తుంది 

భరణి : క్రూరులు , బానిసలు , కర్రలతో కొట్టేవారు , తృణ ధాన్యములు, శీలం లేని వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది 

కృత్తిక : తెల్లని పువ్వులను, బ్రాహ్మణులు , నిత్యాగ్ని హోత్రము , వేద పఠనము , మంత్రాదులు తెలిసిన వారు , భాషా పండితులు , వ్యాకరణము తెలిసిన వారు , క్షురకులు , కుమ్మరులు , పురోహితులు జ్యోతిష్యులను సూచిస్తుంది . 

రోహిణి : వ్యాపారులు , ప్రభువులు , విశేష సంపదలు కలిగిన వారు , యోగినులు , వాహనములు నడిపేవారు , గోవులు , ఎద్దులు , జలచరములు , వ్యవసాయదారులు , పర్వతములు , అధికారములో వున్న వారినీ సూచిస్తుంది 

మృగశిర : సువాసన కలిగిన వస్తువులు , వస్త్రములు , సముద్రోత్పత్తులు , పువ్వులు , ఫలములు , మణి మాణిక్యములు , గిరిజనులు , పక్షులు , క్రూర మృగములు , సోమ పానము చేయు వారు , సంగీతవేత్తలు , ప్రేమికులు ,  లేఖలను తీసుకెళ్లేవారలనూ ఈ నక్షత్రం సూచిస్తుంది 

ఆర్ద్రా : బానిసలు , వాదించేవారు , అబద్ధములు ఆడు వారు , జారులు , చోరులు , దొమ్మీలు , తగవులు పెట్టేవారు , తృణ ధాన్యములు , క్రూర బుద్ధి కలిగిన వారు , తీవ్ర మంత్ర వాదులు , అభిచార కర్మలు చేసేవారు , క్షుద్రోపాసకులను ఈ నక్షత్రం సూచిస్తుంది . 

పునర్వసు : నిజము ,నిజాయితీ , ధార్మిక గుణమూ , నిర్మలత్వమూ , ఉన్నత కులమూ , సౌందర్యము , తెలివితేటలు , ధనము కీర్తి కలవారు , విలువైన ధాన్యములను , వర్తక వాణిజ్య వేత్తలనూ , సేవకులు , కళాకారులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

పుష్యమి : బార్లీ , గోధుమలు , యవలు ( ఒక రకమైన  ధాన్యం ) , చెఱుకు , అడవులు , మంత్రులు , ప్రభువులు , మత్స్యకారులు , ఇదే రకమైన వృత్తులు కలవారు , త్యాగమూర్తులు , నీతి నిజాయితీ కలవారు వీరికి ఈ నక్షతం కారకత్వం వహిస్తుంది 

ఆశ్రేష : ఆర్టిఫిషల్ లేదా నకిలీ  వస్తువులు , సరీసృపాలు (reptiles ) , విషం (poisonous chemicals) , తృణ ధాన్యాలు , అన్ని రకాల వైద్యులు ( allopathy /homeopathy /ayurvedic ) , వేళ్ళు , దుంపలు , ఫలాలు , పురుగులు , దోపిడీదొంగల ని ఈ నక్షత్రం సూచిస్తుంది 

మఘా : ధనవంతులు , ధాన్యం , ధాన్యాగారాలు , పర్వతారోహకులు , పెద్దలు మరియూ పితూరీ దేవతల పట్ల గౌరమ్మ కలవారు , వర్తకులు , నాయకులు , మాంస భక్షకులు , స్త్రీ ద్వేషులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

పూర్వ ఫల్గుణి ( పుబ్బా ) : నటీ నటులు , అందమైన స్త్రీలు , స్నేహ వర్గములు , సంగీత వేత్తలు , కళాకారులు , వ్యాపారవేత్తలు , ఉప్పు , తేనె , వివిధ తైలములు , బాలల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది . 

ఉత్తర ఫల్గుణి ( ఉత్తర) : మంచి వారు , బద్దకస్తులు , వినయము కలిగిన వారు , ధార్మిక గుణము కలవారు , విద్యా జ్ఞానము కలవారు , మంచి ధాన్యము , విశేషమైన సంపదలు కలిగిన వారు , ఉత్తమ కర్మలు చేయు వారు , ప్రభువుల కోసం బాధ్యత తీసుకునే వారికి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

హస్తా  : చోరులు , ఏనుగులు , రథములు నడిపేవారు , మావటీ లు , వివిధ కళాకారులు , శిల్పులు , తృణ ధాన్యాలు , వేద శాస్త్రాలు చదివిన వారు , వర్తకులు , అమితమైన శక్తి యుక్తులు కలవారి కి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

చిత్తా : రత్నా భరణాలు , నగలు తయారు చేసేవారు , చిత్ర కారులు , వ్రాత కారులు , సంగీతము , సుగంధ ద్రవ్యములు , గణిత శాస్త్ర వేత్తలు , వస్త్రములు నేసే వారు , నేత్ర వైద్యుల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

స్వాతీ : పక్షులు , క్రూర మృగాలు , గుర్రాలు , వర్తకులు , ధాన్యము , పప్పు ధాన్యములు , కుత్సితమైన మనస్సు కలిగిన మిత్రులు , సాత్వీకులు , పుణ్య కుశలురకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది . 

విశాఖ : ఎర్రటి పుష్పాలు ,ఫలాలు , నువ్వులు ,పెసలు , మినుములు ,సెనగలు , పత్తి , ఇంద్ర మరియు అగ్ని ఆరాధకులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

అనురాధ : సౌర్య వంతులు , అత్యున్నత సంస్థలకు అధిపతులు , మంచి మిత్రులు , రాజ సభ లో గోష్టులు చేసే వారు , ప్రయాణాలు చేసే వారు , నీతి ,నిజాయితీ గల జనులు , శరదృతువులో ఉద్భవించే అన్నింటికీ అనురాధా నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

జ్యేష్టా : యుద్ధ తంత్ర నిపుణులు , ఉన్నత వర్గములకు చెందిన వారు , వారి కుటుంబము , సంపదలు , కీర్తి , చోరులు , సేనానులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

మూలా : ఔషధములు , వైద్యులు , పెద్ద పెద్ద సంస్థ ల ను నడిపే స్త్రీ లు , పువ్వులు , పళ్ళు , విత్తనములు , పూలు పళ్ళు అమ్మేవారు , ధన వంతులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

పూర్వాషాఢ : మృదువైన మనస్సు గల వారినీ , చేపలు పట్టే వాళ్ళనీ , టూరిస్ట్ గైడ్ ల నూ , జల చరాలనూ , నీతి నిజాయితీ , సంపదలు కలవారినీ , వంతెనలు కట్టే  ఇంజినీర్లనూ  , నీటి ఆధారిత వృత్తులు చేసుకునే వారినీ , నీటి లో వుండే పూలనూ , పళ్ళనూ ఈ నక్షత్రం సూచిస్తుంది 

ఉత్తరాషాఢ : మావటి వాళ్లు , వస్తాదులు , ఏనుగులు , గుర్రాలు , దైవ భక్తులు , సైనికులు , తీవ్రవాదులనూ  ఈ నక్షత్రం  సూచిస్తుంది 

శ్రవణా : విష్ణు భక్తులు , నిజాయితీ కల వారు , magicians , సమర్ధత కలవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది 

ధనిష్టా : గౌరవాదులు లేని వారు , కుత్సితమైన బుద్ధి కలవారు , స్త్రీ ద్వేషం కలవారు , ధార్మిక గుణం కలవారు , శాంతి కాముకులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

శతభిషా : సముద్ర ఉత్పత్తులు , రజకులు , బోయలు , చేపలు పట్టే వారు , చేపల వ్యాపారం చేసే వారినీ , పందులను వేటాడే వారినీ , సారా కాచే వారినీ పక్షులను వేటాడే వారినీ ఈ నక్షత్రం సూచిస్తుంది . 

పూర్వాభాద్రపదా : పశుపాలకులు , చోరులు , హంతకులు , పిసినారులు , చెడ్డ బుద్ధి కలవారు , డాంబికం గా వుండే వాళ్ళు , నీతి ,మతము పై గౌరవము లేని వారు , రెండు నాలుకల ధోరణి కలిగిన వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది . 

ఉత్తరాభాద్రపదా : బ్రాహ్మణులు , త్యాగ నిరతులు , ధార్మిక సంస్థలు , నివారణోపాయములు , తపస్సు , విలువైన సారవంతమైన ధాన్యములు , ధనవంతులు , విరాగులు , నాస్తీకులు , మతవిరోధులు , ప్రభువులను ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

రేవతీ : నీరు అధికం గా వుండే పళ్ళు , పువ్వులు , ఉప్పు, రత్నాలు , శంఖాలు , ముత్యాలు , సుగంధ ద్రవ్యాలు , వాసన గల పుష్పాలు , వీటితో వర్తకం చేసేవారు , నౌకలు నడిపేవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది .       

Tuesday, September 17, 2024

Gaja Kesari Yoga

Gaja Kesari Yoga forms between Jupiter and Moon. ' चन्द्र केन्द्रे बृहस्पतिं ' is the phrase used while describing this Yoga. In English  it is 'Chandra Kendre Bruhaspatim ' . Which means when Jupiter is in a kendra from Moon , then this Yoga is said to be formed. 

The person who has this yoga will be very famous and affluent. 

For the Yoga to give its full results neither Moon or Jupiter should be afflicted due to aspect or conjunction  from a malefic planet . They should not be in their signs of debilitation. They should  be with good Shad bala and should not be weak. The Yoga will give its full results when one of Jupiter or Moon are in their signs of exaltation. 

Why the name Gaja Kesari Yoga ?? -  Gaja means Elephant and Kesari means Lion. The Yoga when formed in a horoscope, drives away the doshas in the horoscope just like how One Lion scares away a group of Elephants !!! . That is the purpose of naming this yoga as Gaja Kesari Yoga.    


General Effects of Gaja Kesari Yoga : 

This yoga gives the person  a plethora of opportunities to generate money on a continual basis.
-The person with this yoga will be fortunate and lucky to have a good spouse, who will come from a well-established family.
-The person with this yoga will get married at an early stage and get settled.
-will have the caliber to become a successful entrepreneur and a businessman.
-will have good health and high vitality.
-will transform the person into a leader capable of inspiring others and changing others through motivational speech and actions.
- will accumulate wealth, fame, name, and respect.

The Yoga gives effect in the dasas of both Moon and Jupiter. The Yoga gives its results based on the houses where the Moon and Jupiter are situated in the horoscope. 

along with being a highly successful person materially as above mentioned, - 

When the Yoga is formed by Moon and Jupiter both being placed in the lagna , the person with this Yoga will be a Political leader, Philanthropist and a very good person at heart . 

When the Yoga is formed with  Moon in the lagna and Jupiter in the 10th house , the person will be a spiritual Guru or a great Teacher 

When the Yoga is formed with Moon in the 5th house and Jupiter in the 8th house , the person with such a Gaja Kesari Yoga may be a scientist who will be making path breaking inventions. 

Friday, August 16, 2024

శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సదాసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతాయై నమః
ఓం నందాయై నమః (90)

ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

Tuesday, August 13, 2024

వినాయక అష్టోత్తర శత నామావళి

ఓం వినాయకాయ నమః ।ఓం విఘ్నరాజాయ నమః ।ఓం గౌరీపుత్రాయ నమః ।ఓం గణేశ్వరాయ నమః ।ఓం స్కందాగ్రజాయ నమః ।ఓం అవ్యయాయ నమః ।ఓం పూతాయ నమః ।ఓం దక్షాయ నమః ।ఓం అధ్యక్షాయ నమః ।ఓం ద్విజప్రియాయ నమః । 10 ।

ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః ।ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ।ఓం వాణీప్రదాయకాయ నమః ।ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।ఓం శర్వతనయాయ నమః ।ఓం శర్వరీప్రియాయ నమః ।ఓం సర్వాత్మకాయ నమః ।ఓం సృష్టికర్త్రే నమః ।ఓం దేవానీకార్చితాయ నమః ।ఓం శివాయ నమః । 20 ।

ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ।ఓం శాంతాయ నమః ।ఓం బ్రహ్మచారిణే నమః ।ఓం గజాననాయ నమః ।ఓం ద్వైమాతురాయ నమః ।ఓం మునిస్తుత్యాయ నమః ।ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః ।
ఓం ఏకదంతాయ నమః ।ఓం చతుర్బాహవే నమః ।ఓం చతురాయ నమః । 30 ।

ఓం శక్తిసంయుతాయ నమః ।ఓం లంబోదరాయ నమః ।ఓం శూర్పకర్ణాయ నమః ।ఓం హరయే నమః ।ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ।ఓం కావ్యాయ నమః ।ఓం గ్రహపతయే నమః ।ఓం కామినే నమః ।ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।ఓం పాశాంకుశధరాయ నమః । 40 ।

ఓం చండాయ నమః ।ఓం గుణాతీతాయ నమః ।ఓం నిరంజనాయ నమః ।ఓం అకల్మషాయ నమః ।
ఓం స్వయం సిద్ధాయ నమః ।ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః ।ఓం బీజాపూరఫలాసక్తాయ నమః ।ఓం వరదాయ నమః ।ఓం శాశ్వతాయ నమః ।ఓం కృతినే నమః । 50 ।

ఓం ద్విజప్రియాయ నమః ।ఓం వీతభయాయ నమః ।ఓం గదినే నమః ।ఓం చక్రిణే నమః ।ఓం ఇక్షుచాపధృతే నమః ।ఓం శ్రీదాయ నమః ।ఓం అజాయ నమః ।ఓం ఉత్పలకరాయ నమః ।
ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః ।ఓం కులాద్రిభేత్త్రే నమః । 60 ।

ఓం జటిలాయ నమః ।ఓం చంద్రచూడాయ నమః ।ఓం అమరేశ్వరాయ నమః ।ఓం నాగయజ్ఞోపవీతవతే నమః ।ఓం కలికల్మషనాశనాయ నమః ।ఓం స్థులకంఠాయ నమః ।
ఓం స్వయంకర్త్రే నమః ।ఓం సామఘోషప్రియాయ నమః ।ఓం పరాయ నమః ।ఓం స్థూలతుండాయ నమః । 70 ।

ఓం అగ్రణ్యాయ నమః ।ఓం ధీరాయ నమః ।ఓం వాగీశాయ నమః ।ఓం సిద్ధిదాయకాయ నమః ।
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ।ఓం కాంతాయ నమః ।ఓం పాపహారిణే నమః ।ఓం సమాహితాయ నమః ।ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ।ఓం సౌమ్యాయ నమః । 80 ।

ఓం భక్తవాంఛితదాయకాయ నమః ।ఓం శాంతాయ నమః ।ఓం అచ్యుతార్చ్యాయ నమః ।ఓం కైవల్యాయ నమః ।ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ।ఓం జ్ఞానినే నమః ।ఓం దయాయుతాయ నమః ।ఓం దాంతాయ నమః ।ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః ।ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః । 90 ।

ఓం వ్యక్తమూర్తయే నమః ।ఓం అమూర్తిమతే నమః ।ఓం శైలేంద్ర తనుజోత్సంగ ఖేలనోత్సుక మానసాయ నమః ।ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః ।ఓం సమస్తజగదాధారాయ నమః ।ఓం మాయినే నమః ।ఓం మూషకవాహనాయ నమః ।ఓం రమార్చితాయ నమః ।ఓం విధయే నమః ।ఓం శ్రీకంఠాయ నమః । 100 ।

ఓం విబుధేశ్వరాయ నమః ।ఓం చింతామణిద్వీపపతయే నమః ।ఓం పరమాత్మనే నమః ।ఓం గజాననాయ నమః ।ఓం హృష్టాయ నమః ।ఓం తుష్టాయ నమః ।ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః । 108 ।

కేతు అష్టోత్తర శత నామావళి

ఓం కేతవే నమః ।ఓం స్థూలశిరసే నమః ।ఓం శిరోమాత్రాయ నమః ।ఓం ధ్వజాకృతయే నమః ।
ఓం నవగ్రహయుతాయ నమః ।ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః ।ఓం మహాభీతికరాయ నమః ।ఓం చిత్రవర్ణాయ నమః ।ఓం పింగళాక్షకాయ నమః ।ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః ॥ 10 ॥

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ।ఓం మహోరగాయ నమః ।ఓం రక్తనేత్రాయ నమః ।ఓం చిత్రకారిణే నమః ।ఓం తీవ్రకోపాయ నమః ।ఓం మహాసురాయ నమః ।ఓం క్రూరకంఠాయ నమః ।ఓం క్రోధనిధయే నమః ।ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః ।ఓం అంత్యగ్రహాయ నమః ॥ 20 ॥

ఓం మహాశీర్షాయ నమః ।ఓం సూర్యారయే నమః ।ఓం పుష్పవద్గ్రహిణే నమః ।ఓం వరదహస్తాయ నమః ।ఓం గదాపాణయే నమః ।ఓం చిత్రవస్త్రధరాయ నమః ।ఓం చిత్రధ్వజపతాకాయ నమః ।
ఓం ఘోరాయ నమః ।ఓం చిత్రరథాయ నమః ।ఓం శిఖినే నమః ॥ 30 ॥

ఓం కుళుత్థభక్షకాయ నమః ।ఓం వైడూర్యాభరణాయ నమః ।ఓం ఉత్పాతజనకాయ నమః ।
ఓం శుక్రమిత్రాయ నమః ।ఓం మందసఖాయ నమః ।ఓం గదాధరాయ నమః ।ఓం నాకపతయే నమః ।ఓం అంతర్వేదీశ్వరాయ నమః ।ఓం జైమినిగోత్రజాయ నమః ।ఓం చిత్రగుప్తాత్మనే నమః ॥ 40 ॥

ఓం దక్షిణాముఖాయ నమః ।ఓం ముకుందవరపాత్రాయ నమః ।ఓం మహాసురకులోద్భవాయ నమః ।ఓం ఘనవర్ణాయ నమః ।ఓం లంబదేహాయ నమః ।ఓం మృత్యుపుత్రాయ నమః ।ఓం ఉత్పాతరూపధారిణే నమః ।ఓం అదృశ్యాయ నమః ।ఓం కాలాగ్నిసన్నిభాయ నమః ।ఓం నృపీడాయ నమః ॥ 50 ॥

ఓం గ్రహకారిణే నమః ।ఓం సర్వోపద్రవకారకాయ నమః ।ఓం చిత్రప్రసూతాయ నమః ।ఓం అనలాయ నమః ।ఓం సర్వవ్యాధివినాశకాయ నమః ।ఓం అపసవ్యప్రచారిణే నమః ।ఓం నవమే పాపదాయకాయ నమః ।ఓం పంచమే శోకదాయ నమః ।ఓం ఉపరాగఖేచరాయ నమః ।ఓం అతిపురుషకర్మణే నమః ॥ 60 ॥

ఓం తురీయే సుఖప్రదాయ నమః ।ఓం తృతీయే వైరదాయ నమః ।ఓం పాపగ్రహాయ నమః ।ఓం స్ఫోటకకారకాయ నమః ।ఓం ప్రాణనాథాయ నమః ।ఓం పంచమే శ్రమకారకాయ నమః ।ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః ।ఓం విషాకులితవక్త్రకాయ నమః ।ఓం కామరూపిణే నమః ।
ఓం సింహదంతాయ నమః ॥ 70 ॥

ఓం సత్యే అనృతవతే నమః ।ఓం చతుర్థే మాతృనాశాయ నమః ।ఓం నవమే పితృనాశకాయ నమః ।ఓం అంత్యే వైరప్రదాయ నమః ।ఓం సుతానందనబంధకాయ నమః ।ఓం సర్పాక్షిజాతాయ నమః ।ఓం అనంగాయ నమః ।ఓం కర్మరాశ్యుద్భవాయ నమః ।ఓం ఉపాంతే కీర్తిదాయ నమః ।ఓం సప్తమే కలహప్రదాయ నమః ॥ 80 ॥

ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః ।ఓం ధనే బహుసుఖప్రదాయ నమః ।ఓం జననే రోగదాయ నమః ।
ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః ।ఓం గ్రహనాయకాయ నమః ।ఓం పాపదృష్టయే నమః ।ఓం ఖేచరాయ నమః ।ఓం శాంభవాయ నమః ।ఓం అశేషపూజితాయ నమః ।ఓం శాశ్వతాయ నమః ॥ 90 ॥

ఓం నటాయ నమః ।ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః ।ఓం ధూమ్రాయ నమః ।ఓం సుధాపాయినే నమః ।ఓం అజితాయ నమః ।ఓం భక్తవత్సలాయ నమః ।ఓం సింహాసనాయ నమః ।ఓం కేతుమూర్తయే నమః ।ఓం రవీందుద్యుతినాశకాయ నమః ।ఓం అమరాయ నమః ॥ 100 ॥

ఓం పీడకాయ నమః ।ఓం అమర్త్యాయ నమః ।ఓం విష్ణుదృష్టాయ నమః ।ఓం అసురేశ్వరాయ నమః ।ఓం భక్తరక్షాయ నమః ।ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః ।ఓం విచిత్రఫలదాయినే నమః ।
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

రాహు అష్టోత్తర శత నామావళి

ఓం రాహవే నమః ।ఓం సైంహికేయాయ నమః ।ఓం విధుంతుదాయ నమః ।ఓం సురశత్రవే నమః ।
ఓం తమసే నమః ।ఓం ఫణినే నమః ।ఓం గార్గ్యాయణాయ నమః ।ఓం సురాగవే నమః ।ఓం నీలజీమూతసంకాశాయ నమః ।ఓం చతుర్భుజాయ నమః ॥ 10 ॥

ఓం ఖడ్గఖేటకధారిణే నమః ।ఓం వరదాయకహస్తకాయ నమః ।ఓం శూలాయుధాయ నమః ।ఓం మేఘవర్ణాయ నమః ।ఓం కృష్ణధ్వజపతాకావతే నమః ।ఓం దక్షిణాశాముఖరతాయ నమః ।ఓం తీక్ష్ణదంష్ట్రధరాయ నమః ।ఓం శూర్పాకారాసనస్థాయ నమః ।ఓం గోమేదాభరణప్రియాయ నమః ।
ఓం మాషప్రియాయ నమః ॥ 20 ॥

ఓం కశ్యపర్షినందనాయ నమః ।ఓం భుజగేశ్వరాయ నమః ।ఓం ఉల్కాపాతజనయే నమః ।ఓం శూలినే నమః ।ఓం నిధిపాయ నమః ।ఓం కృష్ణసర్పరాజే నమః ।ఓం విషజ్వలావృతాస్యాయ నమః ।ఓం అర్ధశరీరాయ నమః ।ఓం జాద్యసంప్రదాయ నమః ।ఓం రవీందుభీకరాయ నమః ॥ 30 ॥

ఓం ఛాయాస్వరూపిణే నమః ।ఓం కఠినాంగకాయ నమః ।ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః ।ఓం కరాలాస్యాయ నమః ।ఓం భయంకరాయ నమః ।ఓం క్రూరకర్మణే నమః ।ఓం తమోరూపాయ నమః ।ఓం శ్యామాత్మనే నమః ।ఓం నీలలోహితాయ నమః ।ఓం కిరీటిణే నమః ॥ 40 ॥

ఓం నీలవసనాయ నమః ।ఓం శనిసామాంతవర్త్మగాయ నమః ।ఓం చాండాలవర్ణాయ నమః ।ఓం అశ్వ్యర్క్షభవాయ నమః ।ఓం మేషభవాయ నమః ।ఓం శనివత్ఫలదాయ నమః ।ఓం శూరాయ నమః ।ఓం అపసవ్యగతయే నమః ।ఓం ఉపరాగకరాయ నమః ।ఓం సూర్యహిమాంశుచ్ఛవిహారకాయ నమః ॥ 50 ॥

ఓం నీలపుష్పవిహారాయ నమః ।ఓం గ్రహశ్రేష్ఠాయ నమః ।ఓం అష్టమగ్రహాయ నమః ।ఓం కబంధమాత్రదేహాయ నమః ।ఓం యాతుధానకులోద్భవాయ నమః ।ఓం గోవిందవరపాత్రాయ నమః ।ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః ।ఓం క్రూరాయ నమః ।ఓం ఘోరాయ నమః ।ఓం శనేర్మిత్రాయ నమః ॥ 60 ॥

ఓం శుక్రమిత్రాయ నమః ।ఓం అగోచరాయ నమః ।ఓం మానే గంగాస్నానదాత్రే నమః ।ఓం స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః ।ఓం సద్గృహేఽన్యబలధృతే నమః ।ఓం చతుర్థే మాతృనాశకాయ నమః ।
ఓం చంద్రయుక్తే చండాలజన్మసూచకాయ నమః ।ఓం జన్మసింహే నమః ।ఓం రాజ్యదాత్రే నమః ।
ఓం మహాకాయాయ నమః ॥ 70 ॥

ఓం జన్మకర్త్రే నమః ।ఓం విధురిపవే నమః ।ఓం మత్తకో జ్ఞానదాయ నమః ।ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః ।ఓం జన్మహానిదాయ నమః ।ఓం నవమే పితృహంత్రే నమః ।ఓం పంచమే శోకదాయకాయ నమః ।ఓం ద్యూనే కళత్రహంత్రే నమః ।ఓం సప్తమే కలహప్రదాయ నమః ।ఓం షష్ఠే విత్తదాత్రే నమః ॥ 80 ॥

ఓం చతుర్థే వైరదాయకాయ నమః ।ఓం నవమే పాపదాత్రే నమః ।ఓం దశమే శోకదాయకాయ నమః ।ఓం ఆదౌ యశః ప్రదాత్రే నమః ।ఓం అంతే వైరప్రదాయకాయ నమః ।ఓం కాలాత్మనే నమః ।
ఓం గోచరాచారాయ నమః ।ఓం ధనే కకుత్ప్రదాయ నమః ।ఓం పంచమే ధృషణాశృంగదాయ నమః ।ఓం స్వర్భానవే నమః ॥ 90 ॥

ఓం బలినే నమః ।ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః ।ఓం చంద్రవైరిణే నమః ।ఓం శాశ్వతాయ నమః ।ఓం సురశత్రవే నమః ।ఓం పాపగ్రహాయ నమః ।ఓం శాంభవాయ నమః ।ఓం పూజ్యకాయ నమః ।ఓం పాఠీనపూరణాయ నమః ।ఓం పైఠీనసకులోద్భవాయ నమః ॥ 100 ॥

ఓం దీర్ఘ కృష్ణాయ నమః ।ఓం అశిరసే నమః ।ఓం విష్ణునేత్రారయే నమః ।ఓం దేవాయ నమః ।
ఓం దానవాయ నమః ।ఓం భక్తరక్షాయ నమః ।ఓం రాహుమూర్తయే నమః ।ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥