Sunday, September 20, 2020

చంద్రగ్రహ దోష నివారణ చర్యలు

 
ఏదైనా ఒక స్మశానంలో నీటి సదుపాయాన్ని కల్పించండి 
ఏదైనా వెండి గ్లాసు నీరు త్రాగుటకు ఉపయోగించండి 
పాల వ్యాపారం వ్యాపారం చేయరాదు ప్రతిరోజు మరియు చెట్టుకు నీరు పోయండి 

ఏదైనా దేవాలయమునకు సెనగలు బెల్లం అరటి పండ్లు గోధుమలు సమర్పించండి 

ప్రతిరోజు దుర్గామాతను పూజించండి 

ఎవరైనా పేదవారికి పాలను పంచండి 
మీ తల్లి గారిని మీ వ్యాపారం లో భాగస్వామ్యం చేయండి 
మీరు నిద్రించే మంచం కోళ్లకు వెండి మేకులు కొట్టండి 
మీ ఇంటి పునాది లో వెండి ముక్కను పాతండి
పక్షులకు ఆహారం అందించండి 

ఎప్పుడైనా ఏదైనా నదిని దాటుతూ ఉన్నప్పుడు ఆ నదిలో నాణాన్ని వేయండి 

ఆడపిల్లలకు స్వీట్లు పంచండి

Note : పైన చెప్పిన పరిహారక్రియలు చిట్కాలు వంటివి మాత్రమే. చంద్ర మహర్దశ నడుస్తున్నప్పుడు మీ జాతకంలో చంద్రుడు నీచలో ఉన్నప్పుడు గానీ దుస్థానాల్లో ఉన్నప్పుడు గానీ చెడు ఫలితాలను ఇస్తున్నప్పుడుగానీ చంద్రుడికి జపం ,హోమం, దానాలు చేయించాలి దుర్గా సూక్త సహిత శివ హోమం చేసుకోవాలి

Thursday, September 17, 2020

రవి దోష నివారణకు చేయవలసినవి

రవి దోష నివారణ చర్యలు
నల్లని ఆవును పెంచండి 
శాఖాహారం మాత్రమే తినండి 
గాజు ముక్కలను భూమిలో పాతి పెట్టండి
ఏదైనా ఒక వీధిలో నీటి సదుపాయాన్ని కల్పించండి 
ఎర్రని మూతిగల కోతులకు ఆహారాన్ని పెట్టండి 
మద్యపానీయాలు తాగకండి 
ఏదైనా పని చేసే ముందుగా కొంచెం బెల్లం తిని మంచి నీళ్లు తాగండి
ఆచార వ్యవహారాలను పాటించండి 

చతురస్రాకారంలో ఉన్న రాగి ముక్కలను భూమిలో పాతండి

వంట పూర్తి అయిన తర్వాత పాలతో  పొయ్యి ఆర్పండి

 ఒక చతురస్రాకారపు వెండి ముక్కను మీవద్ద ఉంచుకోండి లేకపోతే ఏదైనా దేవతా విగ్రహాన్ని వెండితో తయారు చేయించి ఇంటిలో ఉంచుకోండి

కుక్కను పెంచుకోండి 

ప్రతిరోజు మీ తల్లి ఆశీర్వచనం తీసుకోండి 

రాగితో తయారుచేసిన పాత్రలను ఉపయోగించండి

కోతులకు బెల్లం పెట్టండి 

దేనిని ఉచితంగా తీసుకొనరాదు

 నీటితో నిండిన ఏదైనా ఒక పాత్రను ప్రతిరోజు రాత్రి నిద్రించి నప్పుడు తల వద్ద ఉంచుకొనవలెను మరునాడు ఆ నీటిని మొక్కలకు పోయాలి 

కొంచెం బెల్లం ప్రవహిస్తున్న నీటిలో వేయవలెను 

ఎల్లప్పుడూ తలపాగా లేదా తెల్లని టోపీ ధరించవలెను

వరుసగా 8 ఆదివారములు 800 గ్రాముల బెల్లం, 800 గ్రాముల గోధుమలు దేవాలయంలో ఇవ్వండి 

పాలు వెండి బియ్యం దానం చేయవలెను 

ఏదైనా సీసపు నాణెమును ఖాకీ రంగుగల దారం చుట్టి మెడలో ధరించవలెను 

నీలం, నలుపు రంగు బట్టలు వాడరాదు 

పేద వారిని ఆదరించండి 

ఏదైనా గుడికి కొబ్బరి నూనె ను దానం చేయండి 

ఇంటికి దక్షిణం దిక్కుగా సింహద్వారం ఉండరాదు

Tuesday, September 15, 2020

శని దోష నివారణా చర్యలు

 ఒక ముద్ద ఆహారాన్ని రోజూ కాకుకలు పెట్టండి 

కోతులని పెంచండి 

పాములని చంపకండి 

ప్రవహిస్తున్న కాలువలో కొబ్బరికాయను వేయండి 

ప్రవహిస్తున్న నీటిలో 800 గ్రాములు లేదా 8 కిలో గ్రాములు మినుములను నూనె తో రుద్ది వేయండి 

పాదరక్షలను దానం చేయండి 

 కొడుకు  పుడితే ఉప్పు ఎక్కువగా వేసిన వంటకాలు లేదా సాల్ట్ బిస్కెట్లు పంచిపెట్టండి 

ఏదైనా ఒక చీకటి గదిని ఇంటి చివర ఏర్పాటు చేయండి 

తూర్పు వైపు లేదా దక్షిణం వేపు ఇంటి సింహ ద్వారము ఉండరాదు 

ప్రవహించే నీటిలో సారాయి పోయండి 

నీచ స్త్రీ లకు దూరం గా వుండండి 

గ్రుడ్డి వారికి ఆహారాన్ని అందించండి 

మద్య మాంసాలు సేవించకండి 

ప్రతీరోజూ కుంకుమ ధరించండి 

రాత్రిపూట పాలు త్రాగకండి 

నలుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించకండి 

మీ వద్ద ఎప్పుడూ ఒక చతురస్రాకారపు వెండి ముక్కను ఉంచుకోండి 

ఇంటి గడపకు ఇనుపమేకును కొట్టండి 

శనగలు దానం చెయ్యండి 

ప్రతీ రోజూ మర్రి చెట్టుకి వేళ్ళు తడిసేలా నీళ్లు పోసి ఆ తడిసిన మట్టిని తిలకం లా ధరించాలి 

బెల్లం తో నింపిన వేణువును ఒక నిర్జన ప్రాంతం లో పాతిపెట్టండి 

వెండితో తయారు చేసిన గోళీలను మీ వద్ద ఉంచుకోండి 

ఒక బల్ల లేదా రాతి మీద కూర్చుని స్నానం చెయ్యండి 

తేనెతో నింపిన మట్టిపాత్రను నిర్జన ప్రాంతం లో పాతి  పెట్టండి 

నీచ స్థితి లో గల గ్రహసంబంధిత దోష నివారణ క్రియలు చేయండి 




Thursday, September 10, 2020

ప్రదేశాలు - గ్రహ ప్రభావాలు

గమనించండి 
ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా వున్న చోట రవి బలం ఎక్కువగా వున్నట్టుగా తెలుసుకోవాలి 
ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్ లు ఎక్కువగా  వున్నచోట శుక్రుడి ప్రభావం ఎక్కువగా వుంటుంది. 

విద్యా సంస్థలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లు వున్నచోట గురు బుధుల బలం ఎక్కువ వుంటుంది. 
అమ్మకాలూ, కొనుగోళ్లు ఎక్కువగా జరిగేచోట బుధుడి బలం ఎక్కువగా వుంటుంది. అలాగే ఇనుము అమ్మకాలు,కొనుగోళ్లు జరిగే చోట శని ప్రభావం ఎక్కువ
కార్మికులు ఎక్కువగా వున్న చోట శని ప్రభావం ఎక్కువ. 

ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా వున్న చోట వున్న రామాలయం చాలా ప్రభావ వంతమైన శక్తివంతమైన గుడి గా భావించాలి. 

విఘ్నేశ్వరుని గుడి వున్న చోటు కుండలినీ శక్తి ఎక్కువగా వుంటుంది. దగ్గిరలో సన్యాసాశ్రమం కూడా వుంటే అలాంటి విఘ్నేశ్వరుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అవుతుంది. ఇక్కడ కేతు ప్రభావం ఎక్కువ. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది. 

కోర్టులు వున్న చోటు గురు బలం ఎక్కువ వుంటుంది. ధనుస్సు రాశి ప్రభావం వుంటుంది. ఇక్కడ వుండే దత్తాత్రేయుని ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది, ప్రభావ వంతం అయ్యుంటుంది. 

కుజ ప్రభావం ఎక్కువగా వున్న ప్రదేశం లో నరసింహ,హనుమ, కుమార స్వామి ఆలయాలు వుంటాయి. 

దుర్గా దేవి ఆలయం వున్న చోటు రాహు ప్రభావం వుంటుంది. 

వూరికి ఈశాన్యం లో వున్న ఆలయాలు శక్తిమంతమైన వి. 

శుభ గ్రహాల యుతి గానీ దృష్టి గానీ  గ్రహాలకు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన   పైన చెప్పిన ప్రదేశాల్లో శుభం జరుగుతుంది. 
అలాగే పాప గ్రహాల యుతి గానీ దృష్టి గానీ గ్రహాలకు వున్నప్పుడు  ఆ గ్రహాలకి సంబంధించిన ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతాయి. అశాంతి వుంటుంది.

Wednesday, September 2, 2020

మహాత్ములు పుట్టే సమయం - సెప్టెంబర్ 13 నుండీ సెప్టెంబర్ 15, 2020

సెప్టెంబర్ 8 వ తారీఖు నుండీ 15 వ తారీఖు దాకా ఉన్న గ్రహ స్థితి ఆసక్తికరంగా ఉంది. 

ఆరు గ్రహాలు స్వస్థానాల్లో ఉండడం చాలా అరుదు. కొన్ని వందల సంవత్సరాల్లో కానీ ఇలాంటి గ్రహస్తితి ఉండదు. 

ఈ సమయం లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులౌతారు. సమాజానికి మార్గదర్శకులౌతారు. 

ముఖ్యం గా 13 వ తారీఖు నుండీ 15 వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళల్లో మేష లగ్నం లో గానీ, తులా లగ్నం లో గానీ, మకర లగ్నం లో గానీ పుట్టిన వాళ్ళు రెండు మహాపురుష యోగాలతో జన్మిస్తారు . 

ఈ రోజుల్లో దైవ ధ్యానం చేసుకోవడం చాలా మంచిది.

Sunday, August 30, 2020

రాహు కేతు గోచారం 2020

సెప్టెంబర్ 23 న రాహు కేతువులు వృషభ, వృశ్చిక రాశుల్లోకి మారుతున్నారు. మీరు ఫలితం చూసుకునేటప్పుడు మీ చంద్ర రాశి నుండీ, జన్మ లగ్నం నుండీ కూడా చూసుకోవాలి. 

రాహువు వృషభ రాశి సంచారం మన దేశం లో ఎప్పుడూ మత సంఘర్షణలకి కారణమైయ్యింది. 

జరుగబోయే 18 నెలల కాలం లో వెండి ధరలు బాగా పెరుగుతాయి. కొత్తిమీర ధర మండి పోతుంది. కార్ల ధరలు పెరుగుతాయి. కార్ల అమ్మకాలు పడిపోతాయి.

ఢిల్లీ లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు బయట పడతాయి. కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి.  అత్యాచారాలు పెరుగుతాయి.  డిసెంబర్, జనవరి నెలల్లో అప్రమత్తంగా ఉండాలి. 

దుర్గా దేవి ధ్యానం మంచిది.

Friday, August 28, 2020

కలియుగ వాలి - డొనాల్డ్ ట్రంప్ - జాతక పరిశీలన

కలియుగ వాలి - డోనాల్డ్ ట్రంప్ - జాతక పరిశీలన 

అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గారి పుట్టిన తేదీ ,సమయం బర్త్ సర్టిఫికెట్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇంటర్నెట్ లో దొరుకుతోంది . ఈయన జాతకం పరిశీలిస్తే చాలా  ప్రత్యేకతలు కనపడతాయి . ట్రంప్ గారి జాతక చక్రం ఈ క్రింద ఇవ్వబడినది . 
వీరిది సింహ లగ్నం. సింహ లగ్నానికి యోగ కారకుడు, బాధకుడు  కుజుడు  లగ్నం లో నే వున్నాడు.   లగ్నాధిపతి రవి రాహుగ్రస్తుడై దశమం లో, చంద్రుడు కేతుగ్రస్తుడై చతుర్ధం లో వున్నారు. శని,శుక్రులు కర్కాటకం లో నూ ,ఏకాదశాధిపతి బుధుడు ఏకాదశం లో నూ వున్నారు . పంచమ అష్టమాధిపతి బృహస్పతి  ద్వితీయం లో స్థితుడై వున్నాడు.  ఈ రకం గా వున్నా గ్రహ స్థితి ని పరిశీలిస్తే ఈయనకి అపసవ్య దిశలో కాలసర్ప యోగం వున్నది. ఈ యోగం చాలా మంచి చేస్తుంది. 
లగ్నం లో వున్న యోగ కారకుడు, చతుర్థ నవమ స్థానాధిపతి కుజుడు  చాలా యోగం చేస్తాడు అదృష్ట కారకుడవుతాడు .  ఏకాదశాధిపతి బుధుడు ఏకాదశం లో నే ఉండడం మరో అదృష్ట కారక స్థితి. లగ్నాధిపతి రవి దశమం లో ఉండడం , ఉచ్చ స్థితి లో వున్న రాహువు తో అతి దగ్గిరగా ఉండడం  , వీరిద్దరికీ గురు దృష్టి ఉండడం ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి కారణమైయ్యాయి అనొచ్చు .  కేతువు కూడా స్వస్థానం లో ఉండి  మనః కారకుడైన చంద్రుడి తో కలిసి ఉండడం ,చంద్రుడి నీచ స్థితి  ఈయనకి చంచలమైన మనః స్థితి కి కారణం అవుతున్నారు.
ఈయన జాతకం లో ని మరో ప్రత్యేకత సష్ట ,సప్తమాధిపతి ఐన శని లాభ  భావం లో సంధిలో ఉండడం, చాలా బలహీనం గా ఉండడం . సష్ట స్థానం అంటే శత్రు,రోగ,రుణ  స్థానం. అంటే శత్రువుల వల్ల ,రుణాల వల్ల ఈయనకి లాభం జరుగుతుందనేది సుస్స్పష్టం .   ఈయన మూడు నాలుగు సార్లు ఇన్సోల్వెన్సీ పిటిషన్ లు పెట్టి వున్న రుణాలు మాఫీ చేసుకున్నాడు.   క్రితం సారి ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ బలహీనతలు ఈయనకు బాగా కలిసివొచ్చి ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది .  ఈ సారి ఎన్నికలలో కూడా జరగబోయేది అదే . ఈయనని గెలవడం అసాధ్యం అని నా నమ్మకం .      రామాయణం లో ని వాలి మనకి తెలుసు . వాలి మెడలో ఒక హారం ఉంటుంది . ఆ హారం వల్ల  ఎదురుగా వున్న శత్రువు ఎవరైనా వారి బలం లో సగం వాలి కి వచ్చేస్తుంది . అది వాలికి వున్న వరం . డోనాల్డ్ ట్రంప్ గారి జాతకం లో శత్రు స్థానాధిపతి శని అతి బలహీనం గా ఉండడం ఈయనకి కూడా వాలి కి వున్న లాంటి వరం వుంది . ఈయనని మనం కలియుగ వాలిగా అనుకోవచ్చు .

Thursday, August 27, 2020

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి జన్మ దిన శుభాకాంక్షలు

చాలా కాలం క్రితం ఆంధ్ర భూమి మాస పత్రిక లో చదివిన గుర్తు . మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు పాఠకులకి సమాధానాలు చెప్పే శీర్షిక అది.
 ఒక పాఠకుడి ప్రశ్న :  కురుక్షేత్ర యుద్ధం సరిగ్గా మొదలైయ్యే ముందు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు కదా ...??? అటు వైపు 11 అక్షౌహిణులు , ఇటు వైపు 7 అక్షౌహిణులు మోహరించి వున్నప్పుడు అంత సేపు గీత ఎలా బోధించాడు భగవంతుడు ??? అంత సేపు అందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారా ??? 

దానికి శాస్త్రి గారి సమాధానం : భగవంతుడు కాల స్వరూపుడు. క్షణాన్ని యుగం గానూ యుగాన్ని క్షణం గానూ మార్చగలడు. ఇంకెవ్వరికీ తెలియకుండానే లిప్త పాటు లో అర్జునుడికి గీతా బోధ చేసి విశ్వరూప దర్శనం చూపించాడు. భగ వంతుడికి ఏదైనా సాధ్యమే !!! అని సమాధాన పరిచారు . 

ఇది ఇంత కాలమైనా గుర్తుండిపోయింది . అలాంటి మహానుభావులు చెప్తే నాలాంటి వాళ్ళకి కూడా తేలికగా అర్ధమౌతుంది . గుర్తుండిపోతుంది ఏదైనా. 

మల్లాది వారి 96 వ జన్మ దినం మొన్న . ఈ సందర్భంగా ఆయనకి నా  నమస్కారాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏

Tuesday, August 25, 2020

రియా చక్రబర్తి - లగ్న నిర్ణయం - జాతక ఫలితం

రియా చక్రబొర్తి - జన్మ లగ్న నిర్ణయం -జాతక ఫలితం 
ఈ మధ్య బాగా వార్తల్లో వున్నా వ్యక్తి రియా చక్రబొర్తి. ఈవిడ సుశాంత్ సింఘ్ రాజపుట్ గర్ల్ ఫ్రెండ్ గా మనకి తెలుసు. సుశాంత్ సింఘ్  ఆత్మా హత్య చేసుకోవడం లో ఈవిడ పాత్ర ఉందని ఈవిడ మీద సిబిఐ కేసు ఎన్ఫోర్స్మెంట్ కేసు లు పెట్టడం జరిగింది.  ఈ సంఘటనలో ఈమె పాత్ర వుందా లేదా అనేది జాతక చక్రం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం  చేసి ఆ  విషయాలని మీకు తెలియజేయడం ఈ పోస్టు ఉద్దేశ్యం 
ఇంటర్నెట్ లో/వికీపీడియా లో  ఈమె జన్మ తేదీ 01. 07. 1992 గా ఇవ్వబడింది. జాతక పరిశీలనకు కావలసిన జన్మ సమయం ఇలాంటి సెలబ్రిటీ ల విషయం లో దొరకదు కాబట్టి మనమే శోధించి తెలుసుకోవాలి .
ఈమె కనుముక్కు తీరు , మాట్లాడే పధ్ధతి, గమనిస్తే ఈమె ముఖం పైన కుడి కణత మీద ఒక పుట్టుమచ్చ, మెడ  కిందుగా కుడి వైపుగా  కాలర్ బోన్ పైన ఒక పుట్టుమచ్చ కనపడుతున్నాయి. రెండూ నల్లటి రంగులో వున్నాయి. స్వరం కొద్దిగా మొద్దుబారినట్టుగా వుంది . ఎర్రటి  వర్ణం లో వున్న  పుట్టుమచ్చలు కుజుడి ని సూచిస్తాయి,అలాగే తేనే రంగు లో వున్న మచ్చలు రవి ని సూచిస్తాయి.  జాతక చక్రం లో పాప గ్రహాల భావ స్థితి బట్టీ  పుట్టుమచ్చలు ఉంటాయి . అంటే ఈమె కు వున్న పుట్టుమచ్చలు ఈమెకు లగ్నం లో నూ  , ధన స్థానం లో నూ పాప గ్రహాలు ఉన్నాయని సూచిస్తున్నాయి . గరుకుగా వున్న స్వరం రెండో ఇంట్లో శని స్థితి ని తెలియచేస్తోంది . 
జులై 1, 1992 రోజున  జాతక చక్రం పరిశీలిస్తే  మేషం లో కుజుడు, మిధునం లో రవి,శుక్ర,కేతువులు, కర్కాటకం లో బుధ చంద్రులు, సింహం లో గురువు ,ధనుస్సు లో రాహువు, మకరం లో శని వున్నారు .  రెండు పాప గ్రహాలూ వరుసగా వున్నది ధనుస్సు,మకరం లో నే కాబట్టి ఈమెది ధనుర్లగ్నం అని తెలుస్తోంది . ఈమె జులై 1,1992 న సాయంత్రం 6. 30 కి దగ్గిరలో పుట్టివుంటుందని ఖచ్చితం గా చెప్పవచ్చు  .  
జన్మ తేదీ న  వున్న గ్రహ స్థితి ధనుర్లగ్నం నుండీ పరిశీలిస్తే ఈవిడ కుట్రపూరితమైన ఉద్దేశ్యం తో నే సుశాంత్ సింఘ్ పంచన చేరిందని చెప్పవొచ్చు . లగ్నానికి ఇరువైపులా వున్న పాప గ్రహ స్థితి పాపకర్తరీ యోగాన్ని కలుగచేస్తోంది. మూలా నక్షత్రం లో రాహు స్థితి దీనికి ఇంకా బలాన్ని ఇస్తోంది .  ఈ యోగం వున్న వాళ్ళు పయోముఖ విషకుంభాలనే చెప్పాలి . లగ్నాధిపతి గురు దృష్టి లగ్నానికి, లగ్నంలో వున్న రాహువు కి  వున్నా , రాక్షస గురువైన శుక్రుడి బలమైన లగ్నవీక్షణ,పాపగ్రహమైన రవి లగ్నం పై పూర్ణ దృష్టి , గురువు చెయ్యాలనుకున్న మంచిని ఎక్కడో మరుగున పడేస్తున్నారు . దీనికి తోడు లగ్నంపై ద్వితీయ స్థానం లో వున్న శని ఆర్గళం చెడు ఆలోచనలనే ఈమెకు కలుగచేస్తున్నాయి .  
ఈమె ధనుర్లగ్న జాతకురాలని చెప్పడానికి ఖచ్చితమైన మరో ఋజువు  సప్తమం లో,అష్టమమ్ లో  వున్న గ్రహ సముదాయం.  సప్తమ స్థానాన్ని పరిశీలిస్తే రవి,శుక్ర,కేతువుల స్థితి ఈమెకి వివాహం అంతగా కలిసిరాదనే చెప్పాలి . రవి శుక్రుల సంయోగం ఈమెకి సుశాంత్ లాంటి ప్రఖ్యాత నటుడితో పరిచయం,సహజీవనం ఏర్పడడానికి తోడ్పడ్డాయని చెప్పాలి . సప్తమం లో ని కేతు స్థితి సుశాంత్ డిప్రెషన్ కి లోనవ్వడానితో సరిపోలుతోంది . 
ఇకపోతే స్త్రీ జాతకం లో వివాహానికి సంబంధించి మరో ముఖ్యమైన భావం అష్టమమ్. వివాహం నిలబడడానికీ ఇది ఎంతో ముఖ్యమైనది .  అలాంటి అష్టమ భావాధిపతి ఐన చంద్రుడు సంధి లో ఉండడం, సప్తమాధిపతి ఐన బుధుడు శత్రు రాశి లో ,అష్టమం లో ఉండడం వైవాహిక బంధం ఎక్కువకాలం నిలబడదని సూచిస్తోంది. 
జూన్ 21 వ తేదీ 2020 న  ఈమె కి సప్తమ భావమైన  మిధునం లో సూర్య గ్రహణం జరగడానికి కొద్ది రోజుల ముందు 14 జూన్ న సుషాంత్ సింఘ్ ఆత్మ హత్య చేసుకుని మరణించడం జరిగింది.  ఈ సంఘటన కూడా ఈమె ధనుర్లగ్నం లో పుట్టిందనడానికి మరో రుజువు .  
ప్రస్తుతం అష్టమమ్ లో శత్రు రాశి గతుడై సప్తమ,దశమాధిపతి  ఐన బుధ మహా దశ లో అస్తంగతుడైన శుక్ర మహా దశ చాలా కష్ట కాలమనే చెప్పాలి.    బుధ -శుక్ర - బుధ దశ జులై,6 న మొదలైయ్యింది. జులై 7 నుండీ సుషాంత్ సింఘ్ కేస్ లో విచారణ ఊపందుకుంది.  
లగ్నానికి ఇరు ప్రక్కలా వున్న పాప గ్రహాలూ ,అష్టమమ్ లో వున్న గ్రహాలు,12 వ స్థానం పై వున్న కుజ దృష్టి ఈమెకి బంధన యోగాన్ని కలుగ చేస్తున్నాయి.