Thursday, August 27, 2020

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి జన్మ దిన శుభాకాంక్షలు

చాలా కాలం క్రితం ఆంధ్ర భూమి మాస పత్రిక లో చదివిన గుర్తు . మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు పాఠకులకి సమాధానాలు చెప్పే శీర్షిక అది.
 ఒక పాఠకుడి ప్రశ్న :  కురుక్షేత్ర యుద్ధం సరిగ్గా మొదలైయ్యే ముందు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు కదా ...??? అటు వైపు 11 అక్షౌహిణులు , ఇటు వైపు 7 అక్షౌహిణులు మోహరించి వున్నప్పుడు అంత సేపు గీత ఎలా బోధించాడు భగవంతుడు ??? అంత సేపు అందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారా ??? 

దానికి శాస్త్రి గారి సమాధానం : భగవంతుడు కాల స్వరూపుడు. క్షణాన్ని యుగం గానూ యుగాన్ని క్షణం గానూ మార్చగలడు. ఇంకెవ్వరికీ తెలియకుండానే లిప్త పాటు లో అర్జునుడికి గీతా బోధ చేసి విశ్వరూప దర్శనం చూపించాడు. భగ వంతుడికి ఏదైనా సాధ్యమే !!! అని సమాధాన పరిచారు . 

ఇది ఇంత కాలమైనా గుర్తుండిపోయింది . అలాంటి మహానుభావులు చెప్తే నాలాంటి వాళ్ళకి కూడా తేలికగా అర్ధమౌతుంది . గుర్తుండిపోతుంది ఏదైనా. 

మల్లాది వారి 96 వ జన్మ దినం మొన్న . ఈ సందర్భంగా ఆయనకి నా  నమస్కారాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏