రియా చక్రబొర్తి - జన్మ లగ్న నిర్ణయం -జాతక ఫలితం
ఈ మధ్య బాగా వార్తల్లో వున్నా వ్యక్తి రియా చక్రబొర్తి. ఈవిడ సుశాంత్ సింఘ్ రాజపుట్ గర్ల్ ఫ్రెండ్ గా మనకి తెలుసు. సుశాంత్ సింఘ్ ఆత్మా హత్య చేసుకోవడం లో ఈవిడ పాత్ర ఉందని ఈవిడ మీద సిబిఐ కేసు ఎన్ఫోర్స్మెంట్ కేసు లు పెట్టడం జరిగింది. ఈ సంఘటనలో ఈమె పాత్ర వుందా లేదా అనేది జాతక చక్రం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ విషయాలని మీకు తెలియజేయడం ఈ పోస్టు ఉద్దేశ్యం
ఇంటర్నెట్ లో/వికీపీడియా లో ఈమె జన్మ తేదీ 01. 07. 1992 గా ఇవ్వబడింది. జాతక పరిశీలనకు కావలసిన జన్మ సమయం ఇలాంటి సెలబ్రిటీ ల విషయం లో దొరకదు కాబట్టి మనమే శోధించి తెలుసుకోవాలి .
ఈమె కనుముక్కు తీరు , మాట్లాడే పధ్ధతి, గమనిస్తే ఈమె ముఖం పైన కుడి కణత మీద ఒక పుట్టుమచ్చ, మెడ కిందుగా కుడి వైపుగా కాలర్ బోన్ పైన ఒక పుట్టుమచ్చ కనపడుతున్నాయి. రెండూ నల్లటి రంగులో వున్నాయి. స్వరం కొద్దిగా మొద్దుబారినట్టుగా వుంది . ఎర్రటి వర్ణం లో వున్న పుట్టుమచ్చలు కుజుడి ని సూచిస్తాయి,అలాగే తేనే రంగు లో వున్న మచ్చలు రవి ని సూచిస్తాయి. జాతక చక్రం లో పాప గ్రహాల భావ స్థితి బట్టీ పుట్టుమచ్చలు ఉంటాయి . అంటే ఈమె కు వున్న పుట్టుమచ్చలు ఈమెకు లగ్నం లో నూ , ధన స్థానం లో నూ పాప గ్రహాలు ఉన్నాయని సూచిస్తున్నాయి . గరుకుగా వున్న స్వరం రెండో ఇంట్లో శని స్థితి ని తెలియచేస్తోంది .
జులై 1, 1992 రోజున జాతక చక్రం పరిశీలిస్తే మేషం లో కుజుడు, మిధునం లో రవి,శుక్ర,కేతువులు, కర్కాటకం లో బుధ చంద్రులు, సింహం లో గురువు ,ధనుస్సు లో రాహువు, మకరం లో శని వున్నారు . రెండు పాప గ్రహాలూ వరుసగా వున్నది ధనుస్సు,మకరం లో నే కాబట్టి ఈమెది ధనుర్లగ్నం అని తెలుస్తోంది . ఈమె జులై 1,1992 న సాయంత్రం 6. 30 కి దగ్గిరలో పుట్టివుంటుందని ఖచ్చితం గా చెప్పవచ్చు .
జన్మ తేదీ న వున్న గ్రహ స్థితి ధనుర్లగ్నం నుండీ పరిశీలిస్తే ఈవిడ కుట్రపూరితమైన ఉద్దేశ్యం తో నే సుశాంత్ సింఘ్ పంచన చేరిందని చెప్పవొచ్చు . లగ్నానికి ఇరువైపులా వున్న పాప గ్రహ స్థితి పాపకర్తరీ యోగాన్ని కలుగచేస్తోంది. మూలా నక్షత్రం లో రాహు స్థితి దీనికి ఇంకా బలాన్ని ఇస్తోంది . ఈ యోగం వున్న వాళ్ళు పయోముఖ విషకుంభాలనే చెప్పాలి . లగ్నాధిపతి గురు దృష్టి లగ్నానికి, లగ్నంలో వున్న రాహువు కి వున్నా , రాక్షస గురువైన శుక్రుడి బలమైన లగ్నవీక్షణ,పాపగ్రహమైన రవి లగ్నం పై పూర్ణ దృష్టి , గురువు చెయ్యాలనుకున్న మంచిని ఎక్కడో మరుగున పడేస్తున్నారు . దీనికి తోడు లగ్నంపై ద్వితీయ స్థానం లో వున్న శని ఆర్గళం చెడు ఆలోచనలనే ఈమెకు కలుగచేస్తున్నాయి .
ఈమె ధనుర్లగ్న జాతకురాలని చెప్పడానికి ఖచ్చితమైన మరో ఋజువు సప్తమం లో,అష్టమమ్ లో వున్న గ్రహ సముదాయం. సప్తమ స్థానాన్ని పరిశీలిస్తే రవి,శుక్ర,కేతువుల స్థితి ఈమెకి వివాహం అంతగా కలిసిరాదనే చెప్పాలి . రవి శుక్రుల సంయోగం ఈమెకి సుశాంత్ లాంటి ప్రఖ్యాత నటుడితో పరిచయం,సహజీవనం ఏర్పడడానికి తోడ్పడ్డాయని చెప్పాలి . సప్తమం లో ని కేతు స్థితి సుశాంత్ డిప్రెషన్ కి లోనవ్వడానితో సరిపోలుతోంది .
ఇకపోతే స్త్రీ జాతకం లో వివాహానికి సంబంధించి మరో ముఖ్యమైన భావం అష్టమమ్. వివాహం నిలబడడానికీ ఇది ఎంతో ముఖ్యమైనది . అలాంటి అష్టమ భావాధిపతి ఐన చంద్రుడు సంధి లో ఉండడం, సప్తమాధిపతి ఐన బుధుడు శత్రు రాశి లో ,అష్టమం లో ఉండడం వైవాహిక బంధం ఎక్కువకాలం నిలబడదని సూచిస్తోంది.
జూన్ 21 వ తేదీ 2020 న ఈమె కి సప్తమ భావమైన మిధునం లో సూర్య గ్రహణం జరగడానికి కొద్ది రోజుల ముందు 14 జూన్ న సుషాంత్ సింఘ్ ఆత్మ హత్య చేసుకుని మరణించడం జరిగింది. ఈ సంఘటన కూడా ఈమె ధనుర్లగ్నం లో పుట్టిందనడానికి మరో రుజువు .
ప్రస్తుతం అష్టమమ్ లో శత్రు రాశి గతుడై సప్తమ,దశమాధిపతి ఐన బుధ మహా దశ లో అస్తంగతుడైన శుక్ర మహా దశ చాలా కష్ట కాలమనే చెప్పాలి. బుధ -శుక్ర - బుధ దశ జులై,6 న మొదలైయ్యింది. జులై 7 నుండీ సుషాంత్ సింఘ్ కేస్ లో విచారణ ఊపందుకుంది.
లగ్నానికి ఇరు ప్రక్కలా వున్న పాప గ్రహాలూ ,అష్టమమ్ లో వున్న గ్రహాలు,12 వ స్థానం పై వున్న కుజ దృష్టి ఈమెకి బంధన యోగాన్ని కలుగ చేస్తున్నాయి.