Tuesday, March 21, 2023

శ్రీ శోభకృన్నామ సంవత్సర నక్షత్రాల వారీ సంక్షిప్త 2023-24 ఫలితాలు

 


అశ్వినీ : ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని పనులూ ప్రణాళికా బద్ధంగా చేసుకోవాలి . డబ్బు పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం. మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి.

భరణీ : తరుచుగా మోసపోయే అవకాశాలు వున్నాయి. ఎవరినో నమ్మి ఏ పనులు మొదలు పెట్టకండి. మీరు స్వయంగా చేసుకునే పనులు విజయవంతం అవుతాయి. పుణ్య కార్యాల తో కాలక్షేపం చేస్తూ వుంటారు.
కృత్తిక 1 వ పాదం : సరదాలు ఎక్కువగా వుంటాయి. సంతోషం గా వుంటారు. ఉద్యోగం లో ఎక్కువగా వొత్తిడి కి లోనవ్వరు. మీరు ఏది అనుకుంటే అది సమకూరుతుంది. బంధువులు , స్నేహితులు సహకరిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.
కృత్తిక 2,3,4 పాదాల వారు : అధికారులతో తొందరపాటుతనం తో సంభాషణ లు చేసి ఇబ్బందులు పడతారు. ప్రతీ పని లోనూ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఎదురుకుంటారు. అతి కష్టం మీద transfer లు వస్తాయి. కుటుంబం లో వైద్య ఖర్చులు అవుతూ వుంటాయి.
రోహిణీ : ఆరోగ్యం బాగుంటుంది. గత సమస్యల నుండీ క్రమం గా బైటపడతారు. పిల్లల విషయం లో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మృగశిర 1,2 పాదాల వారికి : మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో విజయాలు వుంటాయి. స్నేహితులకు సహాయం చేస్తారు.
మృగశిర 3,4 పాదాల వారికి : క్రమంగా శుభ పరిణామాలు వుంటాయి. సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుని బైటపడటారు. శుభ కార్యాల కోసం ఖర్చులు చేస్తారు. ప్రమోషన్ లు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కలిసివస్తాయి. పాత సమస్యలు తీరతాయి.
ఆర్ద్ర : శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా వుంటుంది. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త ఋణాలు తీసుకోవలసి వొస్తుంది. మెరుగైన జీవితం ప్రారంభం అవుతుంది. భవిష్యత్తు మీద ఆశ కలుగుతుంది.
పునర్వసు 1,2,3 : స్వంత వృత్తి వ్యాపారాలలో వున్న వారికి మంచి లాభాలు. ఉద్యోగం లో అధికారుల ఒత్తిడి వుంటుంది. ప్రతీ విషయం లో నూ మంచి మార్పులు కనిపిస్తాయి.ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటిస్తారు.
పునర్వసు 4 వ పాదం వారికి : స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన బంధువులతో, స్నేహితులతో విభేదాలు. తప్పుడు నిర్ణయాలతో నష్ట పోతారు. కుటుంబీకులకు సమస్యగా మీ నిర్ణయాలు వుండొచ్చు.
పుష్యమీ: మంచి చెడులు సమానం గా వుంటాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయం గా ఇబ్బందులు వొచ్చే పరిస్థితులు వుంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశ్రేష: ప్రతీ విషయం ఇబ్బందికరంగా వుంటుంది. కానీ అన్ని పనులూ విజయవంతం అవుతాయి. పిల్లల గురించీ శుభవార్తలు వింటారు. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వుంటాయి.
మఘా: స్వేచ్చగా కాలం గడిపే అవకాశం. వృత్తి విషయాల్లో ప్రశాంతం గా వుంటుంది. అనుకోని లాభాలు. కొన్నిసార్లు విచిత్రం గా అవమానాలు, సమస్యలు వుంటాయి. తరుచుగా ప్రయాణాలు చేయవలసి వొచ్చి ఇబ్బందులు పడతారు.
పుబ్బా: వూహించని విజయాలు. మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి. పుణ్య కార్యాలు చేస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. కోర్టు సమస్యలు తీరతాయి. శుభకార్యాలు చేస్తారు.
ఉత్తరా 1వ పాదం : ఖర్చులు పెరుగుతాయి. వృత్తి విషయంగా తరుచుగా ప్రయాణాలు చేస్తారు. అక్టోబర్ తరువాత అర్ధిక వృద్ధి. మానసిక వొత్తిడి. పనులలో ఆలస్యం. పిల్లల తో కలహాలు వుంటాయి.
ఉత్తరా 2,3,4 వ పాదాల వారికి : తరుచుగా గాయాలు అవుతూ వుంటాయి. వృత్తి సౌఖ్యం బాగా ఉంటుంది. స్థిరాస్తి చికాకులు ఈ సంవత్సరం పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. పాత సమస్యలకు పరిష్కారాలకు దొరుకుతాయి.
హస్త : వీరు మీద రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ. మంచి మార్పులు మొదలవుతాయి. కుటుంబంలో విచిత్రమైన సమస్యలు ఎక్కువవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి రీత్యా అనుకోని లాభాలు ఉంటాయి. మీ మాటల వల్ల ఇబ్బందులు పడతారు.
చిత్తా 1,2 : గురు రాహువుల సంచారం వల్ల సంవత్సరం రెండవ భాగంలో ఆర్థికంగా మోసపోతారు. వృత్తి విషయంలోనూ కుటుంబ పరంగాను మీ మాట చెల్లదు. తరచుగా గురువులను సందర్శిస్తారు. స్థాన చలన ప్రయత్నాలు ప్రత్యేకంగా చేస్తుంటారు.
చిత్త 3,4 పాదాల వారికి : అంతట విజయాలు ఉంటాయి కానీ ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల అభివృద్ధి గురించి వింటారు. కోర్టు సమస్యలు రుణ సమస్యలు మీద ఎక్కువగా దృష్టి పెడితే లాభాలు ఉంటాయి.
స్వాతి నక్షత్రం : వేగంగా పనులు చేసి అందరి మన్ననలు పొందుతారు. తరచుగా శుభకార్యాలలో పాల్గొంటారు సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలలో చేసే నూతన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రుణ సమస్యలు మాత్రం తీరవు.
విశాఖ 1,2,3 : అలంకరణ వస్తువుల కొనుగోలు విషయంలో తరచుగా ఖర్చు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. కానీ వారిని విశ్వసించరు. ఈ ఈ సంవత్సరం చాలా సమస్యలు తీరిపోతాయి . అభివృద్ధి ప్రారంభమవుతుంది
విశాఖ 4 వ పాదం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎవరినీ నమ్మి పనులు ప్రారంభించవద్దు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అయ్యి చికాకుల పడతారు. వృధా తగాదాలు మీకు ఇబ్బందులు తీసుకొస్తాయి. పుత్రులు సహకరిస్తారు.
అనురాధా : శుభకార్య ప్రయత్నాలలో సక్సెస్ అవుతారు. అన్ని రకాలుగా మీకు ఆర్థిక వెసులుబాటు చేకూరుతుంది. దూరప్రాంత ప్రయాణాలు పుణ్యకార్యాలు చేస్తారు. మంచికాలం.
జ్యేష్టా : తరచుగా దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీకు సహకరించే వ్యక్తులతో కూడా తగాదాలు పడతారు. మీరు చేయవలసిన పనిని సకాలంలో చేయలేరు.
మూలా: వృత్తి రీత్యా బాగా అభివృద్ధిలో ఉంటారు. ప్రతిరోజు విజయ పరంపర సాగుతుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు చాలా విశేష లాభాలు ఉంటాయి. ప్రధానంగా వివాదాలు లేని మంచి జీవనం సాగిస్తారు. కుటుంబ అవసరాలు చక్కగా సరిచేసుకుంటూ గౌరవ జీవనం సాగిస్తారు.
పూర్వాషాఢ : అందరి నుండి గౌరవ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం మధ్య మధ్యలో చికాకులు కలిగించినా మొత్తం మీద బాగానే ఉంటుంది. ప్రశాంతమైన చిత్తంతో ఆలోచించి మంచి నిర్ణయాలు చేస్తారు. విజయాలు ఎక్కువగా సాధిస్తారు.
ఉత్తరాషాఢ 1వ పాదం : గత సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి. స్థిరాస్తులు కొంటారు. మీ పిల్లలు మంచి అభివృద్ధి సాధిస్తారు. పుణ్యకార్యాలు శుభకార్యాలు చేయటం మీద శ్రద్ధ పెడతారు.
ఉత్తరాషాడ 2,3,4 పాదాల వారికి : చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. గత సంవత్సరం కన్నా మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. రుణ సౌకర్యాలు చక్కగా అందుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో కొత్త ప్రయోగాల్లో సక్సెస్ అవుతారు.
శ్రవణం : అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక విసులుబాటు ఉంటుంది. రుణ సంబంధం గా చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో చికాకులు దూరం అవుతాయి. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ సమస్యలు తీరుతాయి.
ధనిష్ట 1,2 : చాలా విచిత్రమైన జీవితం గడుపుతారు. ప్రతి పని వేగంగానే అవుతుంది. కానీ ఏదో తెలియని ఇబ్బంది మానసిక చికాకు ఉంటాయి. అందరూ స్నేహంగానే ఉంటారు కానీ అందరినీ అనుమానించే లక్షణాలు పెరుగుతాయి. అయితే కుటుంబ విషయంలో ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది.
ధనిష్ట 3,4 పాదాలవారికి : ఒత్తిడిని జయించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. మీ కోపావేశాలతో కొత్త సమస్యలు తెచ్చి పెట్టుకుంటారు. సంవత్సరం రెండవ భాగంలో ధనం వెసులుబాటు కష్టమవుతుంది. తీసుకున్న రుణాలు చికాకు కలిగిస్తాయి. అందరి నుండి దూరంగా వెళ్లాలి అనే ఆలోచనలు తరచుగా వస్తూ ఉంటాయి.
శతభిష: వాహన చికాకులు ఉంటాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభం చేయడం శ్రేయస్కరం కాదు. గౌరవభంగం జరక్కుండా మీరు మీ పనులు చేసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలగ చేసుకోకండి. ఏ విషయంలోనూ మీ నిర్ణయాలను ఇతరులకు చెప్పవద్దు.
పూర్వాభాద్ర 1,2,3 పాదాలవారికి: ప్రతి పని ఆలస్యం అవుతుంది. షేర్ మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగాలు దొరకవు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి.
పూర్వాభాద్ర 4 వ పాదం వారికి: ఒంటరి ప్రయాణాలు ఒంటరి కాలక్షేపాలు చేయవద్దు. తరచుగా రాకూడని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇతరుల వలన కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి. శక్తికి మించిన పనులు చేయవద్దు. ధనయోగం బాగానే ఉంది. అక్టోబర్ తర్వాత ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయి.
ఉత్తరాభాద్ర: అవమానకర ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించకండి. రుణాల విషయంలో జాగ్రత్త పడండి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. చిన్న చిన్న సమస్యలు వస్తే కంగారు పడవద్దు.
రేవతి: చాలా వ్యవహారాలలో సానుకూల స్థితి ఉంటుంది. అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. విజయాలు సాధిస్తారు. వృత్తి విషయంలో క్రమంగా అనుకున్నది సాధిస్తారు. అందరి నుండి సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగు చేసుకుంటారు.
శుభం భూయాత్.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

శోభకృత్ సంవత్సరం లో మరికొన్ని విషేషాంశాలు - రెండవ భాగము

 


శ్రీ గురుభ్యోన్నమః

శని చారము : ఈ సంవత్సరం జనవరి 17 న కుంభ రాశి ప్రవేశం చేసిన శనికి 22 ఏప్రిల్ నుండీ 3 వ రాశి లో గురు సంచారం మంచిది కాదు. వింధ్య పర్వతం నుండీ శ్రీ లంక మధ్యన వున్న రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు, వాహన ,అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
సంవత్సరం శని మూడు నక్షత్రాలలో సంచరించడం వల్ల అధమ ఫలితాలు వుంటాయి. అకాల వర్షాలు, గాలి తుఫానులు సంభవిస్తాయి. ప్రభుత్వాల వింత విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు.
వైద్యులు,కవులు, జడ్జీ లు,న్యాయవాదులు, మంత్రులు అనేక సమస్యలు ఎదురు కోవలసి వస్తుంది.
17 జూన్ నుండీ నవంబర్ 4 వరకు శని వక్రించడం వల్ల ఉత్తర భారత దేశం లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోతాయి. ఎందరో అధికారులు పదవులు కోల్పోతారు.
శని వక్రత్వ కాలం లో ముఖ్యం గా 15 అక్టోబర్ నుండీ 23 నవంబర్ వరకు మార్కెట్లో అన్ని కూరగాయలు, పప్పు ధాన్యాలు అధిక దిగుబడి వుండటం వల్ల ధరలు దారుణం గా పడిపోతాయి. రైతులు జాగ్రత్త పడి వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి వారు చెప్పిన పంటలు పండించాలి.
శని వక్రత్వ కాలం లో నే జూన్ 17 నుండీ ఆగస్ట్ 8 వరకు వక్రం లో ని శని మేషం లో అతిచారం లో వున్న గురువు ని చూస్తూ వుండడం వల్ల ప్రపంచం మొత్తం అనుకోని సంఘాటనలు జరిగే అవకాశం. అనిశ్చితి.
గ్రహాల సమ సప్తక , సష్టాష్టక స్థితి: జూలై సెప్టెంబర్ ల మధ్య శని గ్రహానికి మిగతా గ్రహాలు సమ సప్తక స్థితి లో గానీ సస్టాష్టక స్థితి లో గానీ వుండడం జరుగుతోంది.
పైన చెప్పబడిన స్థితుల వల్ల పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం వుంటుంది. మన దేశానికీ చైనా దేశానికీ మధ్య కూడా ఉద్రిక్తత వుంటుంది.
ఇండోనేషియా దాని సమీప దేశాల్లో భూకంపాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగ చేస్తాయి.
కృష్ణా ,గోదావరి నదులకు వరదలు వస్తాయి.
శుక్ర మౌడ్హ్యమి: ఆగస్ట్ 2 ,2023 నుండీ ఆగస్ట్ 19 వరకు శుక్ర మౌడ్హ్యమి. ఈ సమయం లో తమిళనాడు లో రాజకీయ సమస్యలు , పశ్చిమ రాష్ట్రాల్లో తుఫానులు, వరదలు.
ఆగస్ట్ 19 తరువాత గుజరాత్ లో అల్లర్లు, సమ్మెలు.
శుభం భూయాత్.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Monday, March 20, 2023

Ganesha Mantras for Each Zodiac Sign

 

Chanting these mantras create an influx of positive energy and a tandem that resonates positivity and prosperity in your life.


  • मेष (Mesha/Aries) लग्न- ॐ विघ्नेश्वराय नम: Om Vighneshwaraya namah
  • वृषभ (Vrishabha/Taurus) लग्न- ॐ शिवपुत्राय नम: Om Shiva putraya namah
  • मिथुन (Midhuna/Gemini) लग्न- ॐ लम्बोदराय नम: Om lambodaraya namah
  • कर्क (Karkataka/Cancer) लग्न- ॐ गौरीपुत्राय नम: Om gauriputray namah
  • सिंह (Simha/Leo) लग्न- ॐ भक्तवासाय नम: Om bhaktavaasaaye namah
  • कन्या (kanya/Virgo) लग्न- ॐ लम्बोदराय नम: Om lambodaraya namah
  • तुला (Tula/Libra) लग्न- ॐ सर्वकल्याणहेतवे नम: Om Sarva kalyaana hetaveh namah
  • वृश्चिक (Vrischika/Scorpio) लग्न- ॐ एकदंताय नम: Om Eka dantaya namah
  • धनु (Dhanu/Sagittarius) लग्न- ॐ उमासुताय नम: Om Uma sutaaya namah
  • मकर (Makar/Capricorn) लग्न- ॐ विघ्नहराय नम: Om Vighna haraya namah
  • कुंभ (khumbha/Aquarius) लग्न- ॐ दुःखहर्ता नम: Om Dukha harta namah
  • मीन (Meena/Pisces) लग्न- ॐ पार्वतीपुत्राय नम: Om Parvati putraya namah
  • All zodiac signs must chant these mantras at least 108 times or in multiple of it to seek blessings of Lord Ganesh.

శోభకృత్ సంవత్సర ఫలితాల్లో కొన్ని విశేషాంశాలు - మొదటి భాగము

 


శ్రీ గురుభ్యోనమః

గురు గ్రహ గండాంత స్థితి : ఏప్రిల్ 22 న మీన రాశి లో నుండీ మేష రాశి లో కి మారనున్న గురు గ్రహం ఏప్రిల్ 7 వ తారీఖు నుండీ మే 6 వ తారీఖు ఉదయం వరకు గండాంత నక్షత్ర పాదాల్లో సంచరిస్తాడు. ఆ తరువాత రాహువు తో యుతి లో వుంటాడు.
ఈ గురు గ్రహ గండాంత సంచారం లో జాగ్రత్త పడవలసినది మఠాధిపతులు, గురువులు, విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో బోధకులు, మీన, ధనుస్సు రాశుల వారు, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రపదా నక్షత్రాల వారు.
యూరోప్ దేశాల్లోని గురువులకు, మఠాధిపతులు, అధ్యాపకులకు ఎక్కువగా ఈ సంచార ప్రభావం వుంటుంది. మిగతా దేశాల మత ప్రచారకులు, బోధకుల మీద కూడా ఈ యుతి ప్రభావం వుంటుంది. జాగ్రత్త పడవలసిందే.
పోప్ , పాస్టర్ లు , ఇతర మత ప్రచారకులు వంటి వారిపై ఆరోపణలు, వారు చేసిన అక్రమాలు , కుంభకోణాలు వెలుగు లోకి వస్తాయి.
బ్యాంకింగ్ రంగం నష్టాల వొత్తిడి లో వుంటుంది. కుంభకోణాలు బయటపడే అవకాశం వుంది.
ఈ ఉగాది కి సైన్యాధిపతి గురువు కనుక కొన్ని దేశాల్లో సైనిక తిరుగుబాట్లు వుంటాయి. సైన్యానికి సమకూర్చే ఆయుధ కొనుగోళ్లలో కుంభకోణాలు వెలుగు చూస్తాయి.
కొత్త జీవ రాశులు కనుగొన బడతాయి. సంతానం లేని వారి చికిత్స లో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. Cloning వంటి ప్రక్రియల్లో శాస్త్ర వేత్తలు కొత్త విషయాలు కనుగొంటారు.
ఈ గురు రాహు యుతి ప్రభావం ఏప్రిల్ 22 నుండీ జూన్ 15 వరకు ఎక్కువగా వుంటుంది.
రాహు గ్రహ గండాంత స్థితి : ఆగస్ట్ 29 ,2023 నుండీ జనవరి 8,2024 వరకు రాహువు మేష మీన రాశుల మధ్య గండాంత నక్షత్ర పాదాల్లో సంచరిస్తాడు. అక్టోబర్ 30 న 0 డిగ్రీ మేష రాశి లో వుంటాడు.
అక్టోబర్ 30 కి దగ్గిరగా అంతరిక్షం లో ని రహస్యాలు, Space -Time గురించి, విశ్వ ఆవిర్భావం గురించి , కృష్ణ బిలాల గురించీ మరింత అవగాహన కలిగే అవకాశం వుంది.
రాహువు మేషం లో గండాంత స్థితి లో వున్న ఈ సమయం లో నే అక్టోబర్ 28 న మేష రాశి లో జరగబోయే పాక్షిక చంద్ర గ్రహణం చాలా ప్రాధాన్యత కలది. ఈ సమయం లోనే రాహువు మేషారంభం లో వుండడం ఒక ప్రముఖ వ్యక్తి/ ఆధ్యాత్మిక వేత్త పరమాత్మని చేరుకోవడాన్ని సూచిస్తుంది .
జన్మ జాతక చక్రం లో సర్ప దోషాలు వున్నవారు తరుచుగా రాహు కేతు పూజలు ఈ సమయం లో చేసుకోవాలి
శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Saturday, March 18, 2023

Ketu Mahardasa and effects of Various Antardasas


Ketu is the Dragon’s tail as per Vedic Astrology. If it is placed favorably in your chart, this Dasha makes you more spiritual. Ketu Mahadasha prolongs for almost 7 years.

Ketu Dasha boosts one’s involvement in spiritual tasks and gives inner strength to the native. You may begin to channelize your energy and time towards philosophical subjects, virtuous pursuits, worshipping, and practicing Ayurveda.

Native moves towards spiritual liberation during Ketu Mahadasha as one feels detached from the material world and more inclined towards occult realms, things beyond common understanding.

You may also enjoy a lot of domestic comforts and luxuries during this time.

You might feel religiously inclined and your interest in Yoga and meditation increases during this period.

Ketu also boosts one’s inclination towards travel.

Sometimes, Ketu Mahadasha also causes unwanted fears and confusion, pain in the legs, stomach issues, mental strain, accidents, fear from poison, weapons, etc.

Problems in family life and loss of wealth are a few other negative possibilities of Ketu Mahadasha if the placement is not favorable.

Ketu Antardasha in Ketu Mahadasha

This Antardasha gives inner strength to the individual. The person feels more driven towards spiritual pursuits. Some religious travels and pilgrimages are also possible during this Dasha.

Native feels a sense of disinterest in the material world and is inclined to explore the spiritual realms of life.

Some business-related travels are also possible. Native is quite irresolute and overly optimistic during this period, so any new decisions in career or job change should be avoided.

This is a period of Ketu Antardasha in Ketu Mahadasha is a period of

a lot of mental confusions and unreasonable fears and native may also observe distance in relationships.

Venus Antardasha in Ketu Mahadasha

Venus is a benefic planet but due to Ketu’s influence, it struggles to use its energy towards the benefit of the native. A lot of negativity pervades the native’s mind.

During this Dasha, the native experiences hurdle in their career. He or she may also build a tendency to strike disputes with friends and family.

This period of Venus Antardasha in Ketu Mahadasha is also not favorable for married couples. Chances of separation from a spouse are possible as well.

Native may feel a lot more sensitive during this period and desires sympathy from loved ones.

This Dasha can also cause eye-related problems to the native.

Sun Antardasha in Ketu Mahadasha

Sun Antardasha in Ketu Mahadasha is not a favorable position, as Ketu is inimical towards Sun.

During this period, the native has to encounter a lot of problems and difficulties in all aspects of life.

Issues with seniors at the workplace are possible. The native also struggles to attain the promotion that he wants or deserves. Lack of support in professional matters persists.

Moreover, the native also becomes a lot more aggressive than before. Decisions making ability of the native also suffers which can also affect the success rate in all endeavors.

Moon Antardasha in Ketu Mahadasha

This Antardasha is also considered negative in Vedic Astrology because of the inimical relationship between Moon and Ketu. Their combined effect eclipses one’s happiness.

Ketu here reduces the benefic effects of Moon so the native feels a lot of distress and depression during this period. Excess of unwanted thoughts keeps the native disturbed and he or she may have to struggle with unwanted fears and anxieties.

A sense of dissatisfaction pervades through life and native feels detached from the world. There is a strong need for nurture and support from others to prevent a miserable life during this period of Moon Antardasha in Ketu Mahadasha.

Mars Antardasha in Ketu Mahadasha

Mars is aggressive and ambitious and Ketu is also said to work a lot like Mars. This period is not that positive due to the temperamental issues one faces.

Native develops a tendency to indulge in unreasonable conflicts. Strong aggressive instincts in personality affect their behavior with others.

The native undergoes a lot of physical and mental suffering. It’s like negative vibes have surrounded the person during this period of Mars Antardasha in Ketu Mahadasha.

Profession life also observes hurdles. Native becomes quite straightforward and short-tempered which poses risk to their power and status.

Native also runs the risk of encountering accidents, allergies, and medical infections.

This Dasha however gives a lot of determination and courage to the native to defeat the opposition.

Rahu Antardasha in Ketu Mahadasha

This Dasha gives sudden wealth and gains to the native if there is no affliction.

However, the native may also suffer on the health front during this time of Rahu Antardasha in Ketu Mahadasha, especially related to the chest or stomach.

Mental distress also pervades throughout the Dasha period. Unwanted thoughts keep the native disturbed during this period.

A lot of confusion occurs in life, which affects personal happiness and contentment.

However, the person develops a strong will power to topple enemies.

Jupiter Antardasha in Ketu Mahadasha

This is a good placement for spiritual progression since both Ketu and Jupiter relate to liberation and spirituality.

The native takes a lot of religious trips during this time of Jupiter Antardasha in Ketu Mahadasha. He or she may spend a lot on virtuous pursuits.

Planets also create possibilities for foreign travel.

This period brings a lot of confusion in work life and some concentration issues also persist in studies.

Struggle in married life is also possible due to this Antardasha.

Saturn Antardasha in Ketu Mahadasha

This is a rough phase in the native’s life. A lot of obstacles come up in the professional area.

This is generally a difficult period in relationships. Native may also lose an important relationship during this time if caution is not practiced.

The person also feels detached from worldly affairs.

Expenditure also rises during this period.

Mental distress and restlessness prevail throughout this Dasha.

Some physical suffering is possible too and the native feels lethargic and dissatisfied.

Some wasteful and in fact, risky journeys may also take place during this period of Saturn Antardasha in Ketu Mahadasha.

Mercury Antardasha in Ketu Mahadasha

Lack of concentration persists throughout this Dasha. The planetary position also causes excessive expenditure during this period of Mercury Antardasha in Ketu Mahadasha.

Native’s mind is occupied by unwanted thoughts. He or she may also begin to speak harshly without thinking of the implications.

Their mind is always lost in thoughts of travel and wandering.

The person feels religiously inclined nonetheless.

While Ketu brings a lot of problems in life, Mercury at the same time helps keep a positive attitude in life.

Rahu Maha Dasa and Effects of Different Antar Dasas


Rahu Mahadasha runs for as long as 18 years. Rahu is a shadow planet and is considered malefic. However, its Dasha also brings positive changes in life.

Native experience a surge of energy and enthusiasm to be self-dependent, stand on their own feet and make a mark with their efforts. Rahu gives a new capacity to make informed decisions.

However, it is also the planet of confusion. During Rahu Mahadasha, it plays with your imagination and gives a lot of confusion in key areas of life such as career, marriage, and family.

A sort of restlessness persists in life during this period. Health issues also strike, mostly as a result of own actions.

On a positive note, Rahu Dasha can also give authority and power to the natives too. Gains and rise in the government sector are also possible but a lot depends upon its placement in the chart.

Here is the influence of the Antardashas of different planets under Rahu Mahadasha.

Rahu Antardasha in Rahu Mahadasha :

This Antardasha gives sudden rise and profits in career and business. Happiness makes way into life.

Inclination towards spiritual pursuits also increases during this period.

Native also gets a chance to go abroad during this period.

Willpower and courage also get a boost and you get the power to defeat the opposition.

If malefic, this Dasha can also lead to confusion, indecisiveness, wealth loss, and career downfall.
Problems in family matters and failures in life drag the native down in case of affliction.

Any major decisions should be avoided in life during this period of Rahu Antardasha in Rahu Mahadasha if the placement of Rahu is difficult in your horoscope.

Jupiter Antardasha in Rahu Mahadasha :

This Antardasha brings slight improvement in health matters. Native gets a lot of fame and status during this period of Jupiter Antardasha in Rahu Mahadasha due to the benefic presence of Jupiter.

New energy enters your spirit to defeat natives and succeed in endeavors. Native also experiences a rise in career, promotion, and growth in relationships.

This is also a good period to take up spiritual travels.

If getting married during this Antardasha, native chooses a person of the other caste.

People living abroad also come back to their native land during this period.

If malefic, this Dasha leads to legal problems, health issues to the spouse, loss of wealth, dip in a career as well as separation from spouse.
Saturn Antardasha in Rahu Mahadasha

Both these planets are considered malefic so negativity and challenges persist in life during this Antardasha.

Hurdles can also be felt in a career during this period. The native might lose his or her position, suffer wealth loss, and defame. Some issues with authority may also persist.

This Dasha also creates distance in relationships and health issues, heart problems, or accidents. The relationship with the spouse also weakens during this period of Saturn Antardasha in Rahu Mahadasha.

Mercury Antardasha in Rahu Mahadasha :

Mercury Antardasha in Rahu Mahadasha is a relatively positive period as native does well on the career front. Promotion at work and growth in business matters is quite likely too.

Happiness persists in married life.

Native also enjoys the comfort of their own vehicle during this period.

This is a positive Dasha for education matters as well.

Intellect improves which helps to make the right choices in life.

Mercury’s presence help comes out of troubles. Health and financial status also improve during this period.

Ketu Antardasha in Rahu Mahadasha :

Both are malefic shadow planets so this Dasha is not considered positive, especially for mental and physical health. The problem with the diagnosis of a health complication keeps the native troubled.

The financial position also wavers during this period.

These planets also create problems in relationships. Native experience a sense of detachment from the loved ones.

During this Dasha, a native should guard him or herself against fire, poison, infections, and weaponry. This period of Ketu Antardasha in Rahu Mahadasha may also bring defame and losses in career matters.

Venus Antardasha in Rahu Mahadasha :

Venus Antardasha helps to alleviate the negative impact. Native eventually recovers from the hurdles and difficulties. However, some challenges still persist in life.

Native experiences some improvement in married life. Venus here affords the native with a lot of material comforts, vehicle, and luxuries.

Native works hard in life to sidestep the roadblocks in life. A promotion is also possible during this period of Venus Antardasha in Rahu Mahadasha.
Sun Antardasha in Rahu Mahadasha

Sun and Rahu are inimical to each other so some problems persist in this Dasha as well. The effects are quite like a solar eclipse.

The native might experience a lot of tension in work life. A transfer is also possible during this period.

Health also dips in this period of Sun Antardasha in Rahu Mahadasha and native feels drained on a mental level too.

However, if the position of planets is positive in your horoscope, this Dasha also brings name and fame. Native begins to take risks in life to gain success. It makes the person stronger and courageous too.

He or she may get to travel abroad.

Support from the government is also likely which helps fulfill ambitions in life. Overall, this is a period of growth but with some occasional hurdles.

Moon Antardasha in Rahu Mahadasha :

Moon is mind and emotions and when it is shadowed by Rahu, the impact can be felt in the form of restlessness and anxiety. Mental tensions, confusion, and depression persist during this period of Moon Antardasha in Rahu Mahadasha.

Native develops a tendency to strike arguments and conflicts with loved ones.

While you work hard to achieve success, there are a lot of hurdles to block your way. Native also observes a lack of support on the professional front.

Any major decisions should be avoided during this period.

Mars Antardasha in Rahu Mahadasha :

Mars Antardasha in Rahu Mahadasha is also not much positive as it increases your aggressive instincts.

Legal issues and the possibility of accidents persist during this period so caution should be practiced. This Dasha also leads to loss of wealth and status at times.

Native frequently indulges in disputes with spouse and family.

While you would work harder during this period, results may not be as expected.

This Dasha entails a negative period in life but no drastic damage is usually there. You should however be careful

Effect of the Rahu Mahadasha Saturn Antardasha


Imprudent acts may cause losses. There is a possibility of loss of position and incurring the anger of the state.

Quarrels with dear ones, unhappiness for friends and residing in far off lands is possible.

One may suffer injury on some part of the body and there may be ailments due to gastric and blood infection.

Effects like pleasure of the king for devotion in his service, auspicious functions like celebration of marriage, etc at home, construction of a garden, reservoir, etc., gain of wealth and cattle from well to do persons belonging to the Sudra class, loss of wealth caused by the king 9government officials) during journey to the West, reduction in income due to lethargy, return to homeland.

Danger from menials, the king, and enemies, distress to wife and children, distress to kinsmen, disputes with the coparceners, disputes in dealings with others, but sudden gain of ornaments.

There will be heart disease, defamation, quarrels, danger from enemies, foreign journeys, affliction with Gulma (enlargement of the skin), unpalatable food, and sorrows, etc.

Friday, March 17, 2023

భారత దేశం - శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫలితం - 2023-24 దేశ జాతకం :


 

భారత దేశం - శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫలితం - 2023-24 దేశ జాతకం :
మార్చ్ 21 రాత్రి 10: 53 ని ల : 37 సేకన్లకు చైత్రాది నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అయ్యింది.
సూర్యోదయానికి 22 వ తారీఖు న చైత్ర శుక్ల పాడ్యమి వున్నందున ఉగాది 22 వ తారీఖు న జరుపుకుంటున్నాము.
చైత్ర శుక్ల పాడ్యమి మొదలైన సమయానికి జాతక చక్రం ఈ క్రింద ఇవ్వబడింది.
వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి కుజుడు మిథునం లో అష్టమ స్థితి, అష్టమాధిపతి బుధుడు మీన రాశిలో నీచ స్థితి, వృశ్చిక లగ్నం నుండీ 5 వ ఇంట చాతుర్గ్రహా కూటమి, అందులో రవి,చంద్ర,గురు,బుధులు వుండడం, కుంభం లో 4 వ ఇంట స్వస్థానం లో శని, మేషం లో 6 వ ఇంట రాహు శుక్రులు, వీరిద్దరూ గ్రహ యుద్ధం లో వుండడం, తులా రాశిలో 12వ ఇంట కేతువు. ఇవీ గ్రహ స్థితులు.
ఈ ఉగాది చక్రం పరిశీలిస్తే ఈ క్రింద ఇవ్వబడిన ఫలితాలు వొచ్చే ఉగాది లోపల కలుగుతాయని నా అభిప్రాయం :
1. భారత దేశం విధి విధానాల్లో దూకుడు ధోరణి,తొందరపాటుతనం కనపడుతోంది. ఇరుగు పొరుగు దేశాలతో కఠినమైన ధోరణి ప్రదర్శిస్తూ వుంటుందని అనిపిస్తున్నది.
2. సంవత్సరాధిపతి బుధుడు. బుధుడు వాణిజ్యానికి కారకుడు. ఈ బుధుడు మాటి మాటి కీ అస్తంగతమౌతూ, తన నీచ రాశిలో స్థితుడై వుండడం వల్ల స్టాక్ మార్కెట్లు అతలాకుతలం గా వుండడం , వాణిజ్య సూచీలు హెచ్చు తగ్గులు తరుచుగా కనపరచడం వంటి ఫలితాలు వుంటాయి. కానీ గురు సంయోగం వల్ల బ్యాంకింగ్ రంగం బాగానే వుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు గానే వుంటుంది. కానీ లగ్నానికి వున్న శని దృష్టి వల్ల GDP పెరుగుదల శాతం అనుకున్నంతగా వుండక పోవచ్చు.
3. యుద్ధం అంటే తుపాకులు, విమానాలు, యుద్ధ టాంకులతో చేసేదే కాదు Cyber war fare అనేది ఇప్పటి కాలం లో కొత్త రకపు యుద్ధం. ఈ సంవత్సరం భారత దేశం ఇలాంటి యుద్ధం ఎదుర్కొనడమే కాదు ఇరుగు పొరుగు దేశాలు చేసే హ్యాకింగ్ వల్ల కొంత నష్ట పోయినా దీటుగా సమాధానం కూడా చెప్పే పరిస్థితులు వున్నాయి.
4. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల పై ఆధిపత్య ధోరణి ప్రదర్శించగలుగుతుంది. కొత్త ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి సమాయత్తమైయ్యే సూచనలు వున్నాయి.
5. క్రీడా రంగం లో భారత దేశ క్రీడాకారులకు మంచి విజయాలు, గుర్తింపు లభిస్తాయి.
6. స్త్రీ ల సమస్యలపై పోరాటాలు అనూహ్యం గా దేశవ్యాప్తంగా విస్తరించి అధికార పార్టీకి తల నొప్పులు తెచ్చిపెడతాయి. స్త్రీ ల పై అత్యాచారాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ మంది స్త్రీ లు live in relationship ల మాయ లో పడతారు.
7. విద్యా రంగం లో ప్రభుత్వం చేయాలనుకున్న సంస్కరణలు విమర్శలు ఎదురుకుంటాయి.
8.దౌత్య సంబంధాల విషయం లో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం లో విమర్శలు ఎదురుకుంటుంది.
9.మధ్యప్రదేశ్ ఒరిస్సా,ఉత్తరాంధ్ర సరిహద్దు అడవుల్లో నక్సలైట్ ప్రాబల్యం పెరగడం, అనుకోని దుస్సంఘటనలు జరగొచ్చు.
10. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయ అలజడి, అల్లర్లు జరిగే అవకాశం
11. ఎక్కువ శాతం ప్రజలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నే వుంటారు. నాయకులు కీర్తింపబడతారు. ఈశాన్య,తూర్పు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు ఎన్నికలలో ఓటమి భయం పట్టుకుంటుంది.
12. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తి పెరుగుతుంది. యజ్ఞ యాగాలు నిర్వహించేవారు పెరుగుతారు.
13. Dairy Products ధరలు పెరుగుతాయి.
14. లగ్నాధిపతి అష్టమ స్థితి, అష్టమాధిపతి నీచ స్థితి వల్ల, వృశ్చిక లగ్నానికి శని దృష్టి వల్ల కొన్ని కొత్త రకాల రోగాల వల్ల ప్రాణ నష్టం వుంటుంది.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

All reactions:
Ravikumar Evs, Bala Subrahmanyam and 18 others

Sunday, March 5, 2023

నారా చంద్ర బాబు నాయుడు గారి జాతకం - Horoscope of Sri Nara Chandra Babu Naidu


 నారా చంద్ర బాబు నాయుడు గారి జాతకం :

చంద్ర బాబు గారు ఏప్రిల్,20,1950, ఉ 10 గం 20 ని ల కు జన్మించినట్టు సమాచారం.
CBN గారి జాతకం పరిశీలిస్తే మిధున లగ్నం, కృత్తిక నక్షత్రం 4 వ పాదం, లగ్నాధిపతి బుధుడు ఏకాదశ స్థానం లో వుండడం, ఏకాదశం లో ఉచ్ఛ స్థితి లో రవి, ద్వాదశ స్థానం లో ఉచ్ఛ స్థితి లో చంద్రుడు, దశమం లో రాహువు, నవమం లో గురు, శుక్రులు, తృతీయ స్థానం లో వక్ర శని, వక్ర కుజుడు, చతుర్థము లో కేతువు ఇవి ఆయన జాతకం లో గ్రహ స్థితులు.
ప్రస్తుత భారతం లో ఈయనకు సరితూగగల నాయకులు ఎవరైనా వుంటే అది మోడీ మాత్రమే.
ఈయన జాతకం లో రవి చంద్రులు ఉచ్ఛ స్థితి లో వుండడం, ఏకాదశం లో బుధాదిత్య యోగం, నవమం లో దశమాధిపతి గురువు, అలాగే పంచమ వ్యయాధిపతి శుక్రుడు, అన్నిటి కన్నా ముఖ్యం గా ఉచ్ఛ చంద్రుడి నుండీ కేంద్రం లో వున్న గురువు వల్ల ఏర్పడిన గజ కేసరి యోగం.
పైన చెప్పబడిన యోగాలు చంద్ర బాబు గారు ఒక విశిష్ట మైన లెజెండరీ నాయకుడు అవ్వడానికి కారణాలు అయ్యాయి అనడం లో ఏటువంటి సందేహం లేదు.

చంద్ర బాబు గారి జాతకం లో ముఖ్యం గా చెప్పుకోదగ్గ సంఘటనలు అన్నీ రాహు దశా శుక్ర అంతర్దశ లో జరగడం గమనించవచ్చు. ఆయన మొదటి సారి ఎమ్మెల్యే ,మంత్రి అవ్వడం , భువనేశ్వరి గారిని వివాహం చేసుకోవడం, లోకేష్ కి తండ్రి కావడం ఇవన్నీ 1980 నుండీ 1983 మధ్య జరిగాయి. 23.01.1980 నుండీ 23.01.1983 వరకు రాహు దశ శుక్ర అంతర్దశ జరిగింది ఈయనకి.
శుక్రుడు పంచమాధిపతి అవ్వడం వల్ల అధికారాన్ని, కళత్ర కారకుడు అవ్వడం వల్ల, సప్తమాధిపతి గురువు తో యుతి వల్ల వివాహాన్ని, పుత్ర స్థానాధిపతి అవ్వడం వల్ల కొడుకు నీ ఈ దశ లో నే పొందాడు.
దశమ రాహువు గురువు స్థానం లో వుండడం వల్ల, ఈ రాహువు కి ఏకాదశాధిపతి కుజ దృష్టి వల్ల , నవమాధి పతి శని దృష్టి వల్ల రాజకీయ రంగం లో ఆసక్తి,ప్రజా సేవ మీద ఇష్టం,నాయకత్వ లక్షణాలు ఈయనకు కలిగాయని చెప్పవొచ్చు.
కానీ ఈ కుజ,శనుల వల్లనే ఆయన మంచికి పోతే చెడు ఎదురైనట్టు ఆరోపణలు ఎదుర్కోవడం కూడా జరిగింది.
చంద్ర బాబు గారు మొట్ట మొదటి సారి ముఖ్యమంత్రి అయినది కూడా శుక్ర అంతర్దశ లో నే . 1.09.1995 మొట్టమొదటిసారి ముఖ్య మంత్రి అయ్యారు. ఈయన జాతకం లో 18.05.1994 నుండీ 17.01.1997 వరకు గురు మహర్దశ లో శుక్ర అంతర్దశ జరిగింది. శుక్రుడు అధికారాన్ని ఇచ్చే పంచమాధిపతి కావడం ,నవమ స్థానం లో దశమాధిపతి గురువు తో స్థితుడై వుండడం వల్ల బలమైన రాజ యోగం ఏర్పడింది !!!
07.07.1986 నుండీ 07.07.2002 వరకు జరిగిన గురు మహర్దశ లో ప్రజలు ఈయనకు బ్రహ్మ రథం పట్టారు. హైదరాబాద్ ని ప్రపంచ చిత్ర పటం లో IT hub గా నిలబెట్టిన ఘనత దక్కించుకున్నారు చంద్ర బాబు గారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి CEO అని పేరుతెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు గడించారు. ఇది గురువు గజకేశరి యోగం లో వుండడం వల్ల జరిగింది.
07.07.2002 నుండీ 06.07.2021 వరకు శని మహర్దశ జరిగింది. శని మహర్దశ మొదలైన కొద్దికాలం లో నే 01.10.2003 న తిరుమల దారిలో అలిపిరి దగ్గిర నక్సలైట్ల దాడి లో గాయపడడం కోలుకోవడం జరిగింది. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.
ఇది శని అష్టమాధిపతి కూడా కావడం వల్ల జరిగింది.
అప్పటి నుండీ 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. శని మహర్దశ వల్ల.
ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఆయన ముందు లేడు ఆయన తరువాత వుండబోడు.
మళ్లీ 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత మిగులు రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్ర బాబు గారే సరైన నాయకుడని నమ్మారు. మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది శని మహర్దశ చంద్ర అంతర్దశ. చంద్రుడు గజకేశరి యోగం లో వున్నాడని, ఉచ్ఛ స్థితి లో వున్నాడని పైన. చెప్పడం జరిగింది.
2019 లో శని మహర్దశ వల్ల, దశా సంధి కాలం జరుగుతూ వుండడం వల్ల పరిస్థితులు అనుకూలించక ఓటమి పాలు అవ్వ వలసి వొచ్చింది. శని మహర్దశ జూలై 2002 లో మొదలై 2021 జూలై తో పూర్తి అయ్యింది.
06.07.2021 నుండీ లగ్నాధిపతి, ఏకాదశం లో వుండి, బుధాదిత్య యోగం ఇస్తున్న బుధ దశ మొదలు అయ్యింది. ఈ దశ యోగ దశ. మళ్లీ అధికార యోగం ఉన్నదనే చెప్పాలి.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435