Sunday, March 5, 2023

నారా చంద్ర బాబు నాయుడు గారి జాతకం - Horoscope of Sri Nara Chandra Babu Naidu


 నారా చంద్ర బాబు నాయుడు గారి జాతకం :

చంద్ర బాబు గారు ఏప్రిల్,20,1950, ఉ 10 గం 20 ని ల కు జన్మించినట్టు సమాచారం.
CBN గారి జాతకం పరిశీలిస్తే మిధున లగ్నం, కృత్తిక నక్షత్రం 4 వ పాదం, లగ్నాధిపతి బుధుడు ఏకాదశ స్థానం లో వుండడం, ఏకాదశం లో ఉచ్ఛ స్థితి లో రవి, ద్వాదశ స్థానం లో ఉచ్ఛ స్థితి లో చంద్రుడు, దశమం లో రాహువు, నవమం లో గురు, శుక్రులు, తృతీయ స్థానం లో వక్ర శని, వక్ర కుజుడు, చతుర్థము లో కేతువు ఇవి ఆయన జాతకం లో గ్రహ స్థితులు.
ప్రస్తుత భారతం లో ఈయనకు సరితూగగల నాయకులు ఎవరైనా వుంటే అది మోడీ మాత్రమే.
ఈయన జాతకం లో రవి చంద్రులు ఉచ్ఛ స్థితి లో వుండడం, ఏకాదశం లో బుధాదిత్య యోగం, నవమం లో దశమాధిపతి గురువు, అలాగే పంచమ వ్యయాధిపతి శుక్రుడు, అన్నిటి కన్నా ముఖ్యం గా ఉచ్ఛ చంద్రుడి నుండీ కేంద్రం లో వున్న గురువు వల్ల ఏర్పడిన గజ కేసరి యోగం.
పైన చెప్పబడిన యోగాలు చంద్ర బాబు గారు ఒక విశిష్ట మైన లెజెండరీ నాయకుడు అవ్వడానికి కారణాలు అయ్యాయి అనడం లో ఏటువంటి సందేహం లేదు.

చంద్ర బాబు గారి జాతకం లో ముఖ్యం గా చెప్పుకోదగ్గ సంఘటనలు అన్నీ రాహు దశా శుక్ర అంతర్దశ లో జరగడం గమనించవచ్చు. ఆయన మొదటి సారి ఎమ్మెల్యే ,మంత్రి అవ్వడం , భువనేశ్వరి గారిని వివాహం చేసుకోవడం, లోకేష్ కి తండ్రి కావడం ఇవన్నీ 1980 నుండీ 1983 మధ్య జరిగాయి. 23.01.1980 నుండీ 23.01.1983 వరకు రాహు దశ శుక్ర అంతర్దశ జరిగింది ఈయనకి.
శుక్రుడు పంచమాధిపతి అవ్వడం వల్ల అధికారాన్ని, కళత్ర కారకుడు అవ్వడం వల్ల, సప్తమాధిపతి గురువు తో యుతి వల్ల వివాహాన్ని, పుత్ర స్థానాధిపతి అవ్వడం వల్ల కొడుకు నీ ఈ దశ లో నే పొందాడు.
దశమ రాహువు గురువు స్థానం లో వుండడం వల్ల, ఈ రాహువు కి ఏకాదశాధిపతి కుజ దృష్టి వల్ల , నవమాధి పతి శని దృష్టి వల్ల రాజకీయ రంగం లో ఆసక్తి,ప్రజా సేవ మీద ఇష్టం,నాయకత్వ లక్షణాలు ఈయనకు కలిగాయని చెప్పవొచ్చు.
కానీ ఈ కుజ,శనుల వల్లనే ఆయన మంచికి పోతే చెడు ఎదురైనట్టు ఆరోపణలు ఎదుర్కోవడం కూడా జరిగింది.
చంద్ర బాబు గారు మొట్ట మొదటి సారి ముఖ్యమంత్రి అయినది కూడా శుక్ర అంతర్దశ లో నే . 1.09.1995 మొట్టమొదటిసారి ముఖ్య మంత్రి అయ్యారు. ఈయన జాతకం లో 18.05.1994 నుండీ 17.01.1997 వరకు గురు మహర్దశ లో శుక్ర అంతర్దశ జరిగింది. శుక్రుడు అధికారాన్ని ఇచ్చే పంచమాధిపతి కావడం ,నవమ స్థానం లో దశమాధిపతి గురువు తో స్థితుడై వుండడం వల్ల బలమైన రాజ యోగం ఏర్పడింది !!!
07.07.1986 నుండీ 07.07.2002 వరకు జరిగిన గురు మహర్దశ లో ప్రజలు ఈయనకు బ్రహ్మ రథం పట్టారు. హైదరాబాద్ ని ప్రపంచ చిత్ర పటం లో IT hub గా నిలబెట్టిన ఘనత దక్కించుకున్నారు చంద్ర బాబు గారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి CEO అని పేరుతెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు గడించారు. ఇది గురువు గజకేశరి యోగం లో వుండడం వల్ల జరిగింది.
07.07.2002 నుండీ 06.07.2021 వరకు శని మహర్దశ జరిగింది. శని మహర్దశ మొదలైన కొద్దికాలం లో నే 01.10.2003 న తిరుమల దారిలో అలిపిరి దగ్గిర నక్సలైట్ల దాడి లో గాయపడడం కోలుకోవడం జరిగింది. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.
ఇది శని అష్టమాధిపతి కూడా కావడం వల్ల జరిగింది.
అప్పటి నుండీ 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. శని మహర్దశ వల్ల.
ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఆయన ముందు లేడు ఆయన తరువాత వుండబోడు.
మళ్లీ 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత మిగులు రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్ర బాబు గారే సరైన నాయకుడని నమ్మారు. మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది శని మహర్దశ చంద్ర అంతర్దశ. చంద్రుడు గజకేశరి యోగం లో వున్నాడని, ఉచ్ఛ స్థితి లో వున్నాడని పైన. చెప్పడం జరిగింది.
2019 లో శని మహర్దశ వల్ల, దశా సంధి కాలం జరుగుతూ వుండడం వల్ల పరిస్థితులు అనుకూలించక ఓటమి పాలు అవ్వ వలసి వొచ్చింది. శని మహర్దశ జూలై 2002 లో మొదలై 2021 జూలై తో పూర్తి అయ్యింది.
06.07.2021 నుండీ లగ్నాధిపతి, ఏకాదశం లో వుండి, బుధాదిత్య యోగం ఇస్తున్న బుధ దశ మొదలు అయ్యింది. ఈ దశ యోగ దశ. మళ్లీ అధికార యోగం ఉన్నదనే చెప్పాలి.
శుభం భూయాత్
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435