Tuesday, March 21, 2023

శోభకృత్ సంవత్సరం లో మరికొన్ని విషేషాంశాలు - రెండవ భాగము

 


శ్రీ గురుభ్యోన్నమః

శని చారము : ఈ సంవత్సరం జనవరి 17 న కుంభ రాశి ప్రవేశం చేసిన శనికి 22 ఏప్రిల్ నుండీ 3 వ రాశి లో గురు సంచారం మంచిది కాదు. వింధ్య పర్వతం నుండీ శ్రీ లంక మధ్యన వున్న రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు, వాహన ,అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
సంవత్సరం శని మూడు నక్షత్రాలలో సంచరించడం వల్ల అధమ ఫలితాలు వుంటాయి. అకాల వర్షాలు, గాలి తుఫానులు సంభవిస్తాయి. ప్రభుత్వాల వింత విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు.
వైద్యులు,కవులు, జడ్జీ లు,న్యాయవాదులు, మంత్రులు అనేక సమస్యలు ఎదురు కోవలసి వస్తుంది.
17 జూన్ నుండీ నవంబర్ 4 వరకు శని వక్రించడం వల్ల ఉత్తర భారత దేశం లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోతాయి. ఎందరో అధికారులు పదవులు కోల్పోతారు.
శని వక్రత్వ కాలం లో ముఖ్యం గా 15 అక్టోబర్ నుండీ 23 నవంబర్ వరకు మార్కెట్లో అన్ని కూరగాయలు, పప్పు ధాన్యాలు అధిక దిగుబడి వుండటం వల్ల ధరలు దారుణం గా పడిపోతాయి. రైతులు జాగ్రత్త పడి వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి వారు చెప్పిన పంటలు పండించాలి.
శని వక్రత్వ కాలం లో నే జూన్ 17 నుండీ ఆగస్ట్ 8 వరకు వక్రం లో ని శని మేషం లో అతిచారం లో వున్న గురువు ని చూస్తూ వుండడం వల్ల ప్రపంచం మొత్తం అనుకోని సంఘాటనలు జరిగే అవకాశం. అనిశ్చితి.
గ్రహాల సమ సప్తక , సష్టాష్టక స్థితి: జూలై సెప్టెంబర్ ల మధ్య శని గ్రహానికి మిగతా గ్రహాలు సమ సప్తక స్థితి లో గానీ సస్టాష్టక స్థితి లో గానీ వుండడం జరుగుతోంది.
పైన చెప్పబడిన స్థితుల వల్ల పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం వుంటుంది. మన దేశానికీ చైనా దేశానికీ మధ్య కూడా ఉద్రిక్తత వుంటుంది.
ఇండోనేషియా దాని సమీప దేశాల్లో భూకంపాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగ చేస్తాయి.
కృష్ణా ,గోదావరి నదులకు వరదలు వస్తాయి.
శుక్ర మౌడ్హ్యమి: ఆగస్ట్ 2 ,2023 నుండీ ఆగస్ట్ 19 వరకు శుక్ర మౌడ్హ్యమి. ఈ సమయం లో తమిళనాడు లో రాజకీయ సమస్యలు , పశ్చిమ రాష్ట్రాల్లో తుఫానులు, వరదలు.
ఆగస్ట్ 19 తరువాత గుజరాత్ లో అల్లర్లు, సమ్మెలు.
శుభం భూయాత్.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435