శ్రీ గురుభ్యోనమః
గురు గ్రహ గండాంత స్థితి : ఏప్రిల్ 22 న మీన రాశి లో నుండీ మేష రాశి లో కి మారనున్న గురు గ్రహం ఏప్రిల్ 7 వ తారీఖు నుండీ మే 6 వ తారీఖు ఉదయం వరకు గండాంత నక్షత్ర పాదాల్లో సంచరిస్తాడు. ఆ తరువాత రాహువు తో యుతి లో వుంటాడు.
ఈ గురు గ్రహ గండాంత సంచారం లో జాగ్రత్త పడవలసినది మఠాధిపతులు, గురువులు, విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో బోధకులు, మీన, ధనుస్సు రాశుల వారు, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రపదా నక్షత్రాల వారు.
యూరోప్ దేశాల్లోని గురువులకు, మఠాధిపతులు, అధ్యాపకులకు ఎక్కువగా ఈ సంచార ప్రభావం వుంటుంది. మిగతా దేశాల మత ప్రచారకులు, బోధకుల మీద కూడా ఈ యుతి ప్రభావం వుంటుంది. జాగ్రత్త పడవలసిందే.
పోప్ , పాస్టర్ లు , ఇతర మత ప్రచారకులు వంటి వారిపై ఆరోపణలు, వారు చేసిన అక్రమాలు , కుంభకోణాలు వెలుగు లోకి వస్తాయి.
బ్యాంకింగ్ రంగం నష్టాల వొత్తిడి లో వుంటుంది. కుంభకోణాలు బయటపడే అవకాశం వుంది.
ఈ ఉగాది కి సైన్యాధిపతి గురువు కనుక కొన్ని దేశాల్లో సైనిక తిరుగుబాట్లు వుంటాయి. సైన్యానికి సమకూర్చే ఆయుధ కొనుగోళ్లలో కుంభకోణాలు వెలుగు చూస్తాయి.
కొత్త జీవ రాశులు కనుగొన బడతాయి. సంతానం లేని వారి చికిత్స లో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. Cloning వంటి ప్రక్రియల్లో శాస్త్ర వేత్తలు కొత్త విషయాలు కనుగొంటారు.
ఈ గురు రాహు యుతి ప్రభావం ఏప్రిల్ 22 నుండీ జూన్ 15 వరకు ఎక్కువగా వుంటుంది.
రాహు గ్రహ గండాంత స్థితి : ఆగస్ట్ 29 ,2023 నుండీ జనవరి 8,2024 వరకు రాహువు మేష మీన రాశుల మధ్య గండాంత నక్షత్ర పాదాల్లో సంచరిస్తాడు. అక్టోబర్ 30 న 0 డిగ్రీ మేష రాశి లో వుంటాడు.
అక్టోబర్ 30 కి దగ్గిరగా అంతరిక్షం లో ని రహస్యాలు, Space -Time గురించి, విశ్వ ఆవిర్భావం గురించి , కృష్ణ బిలాల గురించీ మరింత అవగాహన కలిగే అవకాశం వుంది.
రాహువు మేషం లో గండాంత స్థితి లో వున్న ఈ సమయం లో నే అక్టోబర్ 28 న మేష రాశి లో జరగబోయే పాక్షిక చంద్ర గ్రహణం చాలా ప్రాధాన్యత కలది. ఈ సమయం లోనే రాహువు మేషారంభం లో వుండడం ఒక ప్రముఖ వ్యక్తి/ ఆధ్యాత్మిక వేత్త పరమాత్మని చేరుకోవడాన్ని సూచిస్తుంది .
జన్మ జాతక చక్రం లో సర్ప దోషాలు వున్నవారు తరుచుగా రాహు కేతు పూజలు ఈ సమయం లో చేసుకోవాలి
శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435