Friday, March 17, 2023

భారత దేశం - శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫలితం - 2023-24 దేశ జాతకం :


 

భారత దేశం - శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫలితం - 2023-24 దేశ జాతకం :
మార్చ్ 21 రాత్రి 10: 53 ని ల : 37 సేకన్లకు చైత్రాది నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అయ్యింది.
సూర్యోదయానికి 22 వ తారీఖు న చైత్ర శుక్ల పాడ్యమి వున్నందున ఉగాది 22 వ తారీఖు న జరుపుకుంటున్నాము.
చైత్ర శుక్ల పాడ్యమి మొదలైన సమయానికి జాతక చక్రం ఈ క్రింద ఇవ్వబడింది.
వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి కుజుడు మిథునం లో అష్టమ స్థితి, అష్టమాధిపతి బుధుడు మీన రాశిలో నీచ స్థితి, వృశ్చిక లగ్నం నుండీ 5 వ ఇంట చాతుర్గ్రహా కూటమి, అందులో రవి,చంద్ర,గురు,బుధులు వుండడం, కుంభం లో 4 వ ఇంట స్వస్థానం లో శని, మేషం లో 6 వ ఇంట రాహు శుక్రులు, వీరిద్దరూ గ్రహ యుద్ధం లో వుండడం, తులా రాశిలో 12వ ఇంట కేతువు. ఇవీ గ్రహ స్థితులు.
ఈ ఉగాది చక్రం పరిశీలిస్తే ఈ క్రింద ఇవ్వబడిన ఫలితాలు వొచ్చే ఉగాది లోపల కలుగుతాయని నా అభిప్రాయం :
1. భారత దేశం విధి విధానాల్లో దూకుడు ధోరణి,తొందరపాటుతనం కనపడుతోంది. ఇరుగు పొరుగు దేశాలతో కఠినమైన ధోరణి ప్రదర్శిస్తూ వుంటుందని అనిపిస్తున్నది.
2. సంవత్సరాధిపతి బుధుడు. బుధుడు వాణిజ్యానికి కారకుడు. ఈ బుధుడు మాటి మాటి కీ అస్తంగతమౌతూ, తన నీచ రాశిలో స్థితుడై వుండడం వల్ల స్టాక్ మార్కెట్లు అతలాకుతలం గా వుండడం , వాణిజ్య సూచీలు హెచ్చు తగ్గులు తరుచుగా కనపరచడం వంటి ఫలితాలు వుంటాయి. కానీ గురు సంయోగం వల్ల బ్యాంకింగ్ రంగం బాగానే వుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు గానే వుంటుంది. కానీ లగ్నానికి వున్న శని దృష్టి వల్ల GDP పెరుగుదల శాతం అనుకున్నంతగా వుండక పోవచ్చు.
3. యుద్ధం అంటే తుపాకులు, విమానాలు, యుద్ధ టాంకులతో చేసేదే కాదు Cyber war fare అనేది ఇప్పటి కాలం లో కొత్త రకపు యుద్ధం. ఈ సంవత్సరం భారత దేశం ఇలాంటి యుద్ధం ఎదుర్కొనడమే కాదు ఇరుగు పొరుగు దేశాలు చేసే హ్యాకింగ్ వల్ల కొంత నష్ట పోయినా దీటుగా సమాధానం కూడా చెప్పే పరిస్థితులు వున్నాయి.
4. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల పై ఆధిపత్య ధోరణి ప్రదర్శించగలుగుతుంది. కొత్త ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి సమాయత్తమైయ్యే సూచనలు వున్నాయి.
5. క్రీడా రంగం లో భారత దేశ క్రీడాకారులకు మంచి విజయాలు, గుర్తింపు లభిస్తాయి.
6. స్త్రీ ల సమస్యలపై పోరాటాలు అనూహ్యం గా దేశవ్యాప్తంగా విస్తరించి అధికార పార్టీకి తల నొప్పులు తెచ్చిపెడతాయి. స్త్రీ ల పై అత్యాచారాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ మంది స్త్రీ లు live in relationship ల మాయ లో పడతారు.
7. విద్యా రంగం లో ప్రభుత్వం చేయాలనుకున్న సంస్కరణలు విమర్శలు ఎదురుకుంటాయి.
8.దౌత్య సంబంధాల విషయం లో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం లో విమర్శలు ఎదురుకుంటుంది.
9.మధ్యప్రదేశ్ ఒరిస్సా,ఉత్తరాంధ్ర సరిహద్దు అడవుల్లో నక్సలైట్ ప్రాబల్యం పెరగడం, అనుకోని దుస్సంఘటనలు జరగొచ్చు.
10. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయ అలజడి, అల్లర్లు జరిగే అవకాశం
11. ఎక్కువ శాతం ప్రజలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నే వుంటారు. నాయకులు కీర్తింపబడతారు. ఈశాన్య,తూర్పు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు ఎన్నికలలో ఓటమి భయం పట్టుకుంటుంది.
12. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తి పెరుగుతుంది. యజ్ఞ యాగాలు నిర్వహించేవారు పెరుగుతారు.
13. Dairy Products ధరలు పెరుగుతాయి.
14. లగ్నాధిపతి అష్టమ స్థితి, అష్టమాధిపతి నీచ స్థితి వల్ల, వృశ్చిక లగ్నానికి శని దృష్టి వల్ల కొన్ని కొత్త రకాల రోగాల వల్ల ప్రాణ నష్టం వుంటుంది.
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

All reactions:
Ravikumar Evs, Bala Subrahmanyam and 18 others