Saturday, December 30, 2023

నవ దుర్గా స్తోత్రం/नव दुर्गा स्तोत्रम्


నవ దుర్గా స్తోత్రం


గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥

దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥

దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥



नव दुर्गा स्तोत्रम्


गणेशः
हरिद्राभंचतुर्वादु हारिद्रवसनंविभुम् ।
पाशांकुशधरं दैवंमोदकंदंतमेव च ॥

देवी शैलपुत्री
वंदे वांछितलाभाय चंद्रार्धकृतशेखरां।
वृषारूढां शूलधरां शैलपुत्री यशस्विनीम् ॥

देवी ब्रह्मचारिणी
दधाना करपद्माभ्यामक्षमाला कमंडलू ।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥

देवी चंद्रघंटेति
पिंडजप्रवरारूढा चंदकोपास्त्रकैर्युता ।
प्रसादं तनुते मह्यं चंद्रघंटेति विश्रुता ॥

देवी कूष्मांडा
सुरासंपूर्णकलशं रुधिराप्लुतमेव च ।
दधाना हस्तपद्माभ्यां कूष्मांडा शुभदास्तु मे ॥

देवीस्कंदमाता
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया ।
शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी ॥

देवीकात्यायणी
चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना ।
कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी ॥

देवीकालरात्रि
एकवेणी जपाकर्णपूर नग्ना खरास्थिता ।
लंबोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ॥ वामपादोल्लसल्लोहलताकंटकभूषणा ।
वर्धनमूर्ध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी ॥

देवीमहागौरी
श्वेते वृषे समारूढा श्वेतांबरधरा शुचिः ।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ॥

देवीसिद्धिदात्रि
सिद्धगंधर्वयक्षाद्यैरसुरैरमरैरपि ।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी ॥

Friday, December 29, 2023

गणेश मङ्गलाष्टकम्/గణేశ మంగళాష్టకం

గణేశ మంగళాష్టకం

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥ 1 ॥

నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే ।
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 2 ॥

ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే ।
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 3 ॥

సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ ।
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ ॥ 4 ॥

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ ।
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ ॥ 5 ॥

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ ।
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ ॥ 6 ॥

ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ।
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ॥ 7 ॥

మంగళం గణనాథాయ మంగళం హరసూననే ।
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ ॥ 8 ॥

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ ।
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥

॥ ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ॥

गणेश मङ्गलाष्टकम्

गजाननाय गाङ्गेयसहजाय सदात्मने ।
गौरीप्रिय तनूजाय गणेशायास्तु मङ्गलम् ॥ 1 ॥

नागयज्ञोपवीदाय नतविघ्नविनाशिने ।
नन्द्यादि गणनाथाय नायकायास्तु मङ्गलम् ॥ 2 ॥

इभवक्त्राय चेन्द्रादि वन्दिताय चिदात्मने ।
ईशानप्रेमपात्राय नायकायास्तु मङ्गलम् ॥ 3 ॥

सुमुखाय सुशुण्डाग्रात्-क्षिप्तामृतघटाय च ।
सुरबृन्द निषेव्याय चेष्टदायास्तु मङ्गलम् ॥ 4 ॥

चतुर्भुजाय चन्द्रार्धविलसन्मस्तकाय च ।
चरणावनतानन्ततारणायास्तु मङ्गलम् ॥ 5 ॥

वक्रतुण्डाय वटवे वन्याय वरदाय च ।
विरूपाक्ष सुतायास्तु मङ्गलम् ॥ 6 ॥

प्रमोदमोदरूपाय सिद्धिविज्ञानरूपिणे ।
प्रकृष्टा पापनाशाय फलदायास्तु मङ्गलम् ॥ 7 ॥

मङ्गलं गणनाथाय मङ्गलं हरसूनने ।
मङ्गलं विघ्नराजाय विघहर्त्रेस्तु मङ्गलम् ॥ 8 ॥

श्लोकाष्टकमिदं पुण्यं मङ्गलप्रद मादरात् ।
पठितव्यं प्रयत्नेन सर्वविघ्ननिवृत्तये ॥

॥ इति श्री गणेश मङ्गलाष्टकम् ॥

आञ्जनेय द्वादश नाम स्तोत्रम्/ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం



ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః ।
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః ॥ 1 ॥

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః ।
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ॥ 2 ॥

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః ।
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః ।
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ॥ 3 ॥


आञ्जनेय द्वादश नाम स्तोत्रम्

हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः ।
रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षोऽमितविक्रमः ॥ 1 ॥

उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः ।
लक्ष्मण प्राणदाताच दशग्रीवस्य दर्पहा ॥ 2 ॥

द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः ।
स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः ।
तस्यमृत्यु भयं नास्ति सर्वत्र विजयी भवेत् ॥ 3 ॥

ఐశ్వర్య దీపం ఉపయోగాలు

ఐశ్వర్య దీపం /ఉప్పు దీపం
ఉపయోగాలు :-

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎలా పెడతారో
తెలుసుకుందాము.

ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ  పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు, కుంకుమా రాసి నేలపైన బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదాని పైన ఒకటిగా  పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమలు  చల్లాలి. చిన్న ప్రమిదలు ఒకదాని పైన ఒకటి ఆ రాళ్ళ ఉప్పు పైన పెట్టి పసుపు, కుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.

పళ్ళు కానీ, పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలులోని ఉప్పును తీసి నీటిలో కలపాలి, వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి. నీళ్ళలో వేయడమే సరైన పద్ధతి. అవకాశం ఉన్నవాళ్లు  నదిలో కలపవచ్చు, ప్రమిదలు మాటి మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు. 


ప్రతి వారం అవి వాడుకోవచ్చు, ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు, తోటకూర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి. 

ఇలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం లు కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ సంకల్పం అనుకోని ఇంట్లో చేయాలి . ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది, అంటే పూర్తి  ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. 41 శుక్రవారాలు ఈ విధం గా  ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్ధిక  ఇబ్బందులు తొలగిపోతాయి. 

రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం. తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్ళలో వేసి కలిపి కరిగాక చెట్లకు పోయవచ్చును, ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు.

Durga Sooktam/ दुर्गा सूक्तम्


 














దుర్గా సూక్తం

ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ ।


స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైఀ ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా᳚మ్ ।
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥

అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్​స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ ।
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శం​యోఀః ॥

విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి ।
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనా᳚మ్ ॥

పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా᳚త్ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ ।
స్వాంచా᳚ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥

గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేం᳚ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ ।
నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒​వఀసా॑నో॒ వైష్ణ॑వీం-లోఀ॒క ఇ॒హ మా॑దయంతామ్ ॥

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥


दुर्गा सूक्तम्


ओम् ॥ जा॒तवे॑दसे सुनवाम॒ सोम॑ मरातीय॒तो निद॑हाति॒ वेदः॑ ।
स नः॑ पर्-ष॒दति॑ दु॒र्गाणि॒ विश्वा॑ ना॒वेव॒ सिन्धुं॑ दुरि॒ताऽत्य॒ग्निः ॥

ताम॒ग्निव॑र्णां॒ तप॑सा ज्वल॒न्तीं-वैँ॑रोच॒नीं क॑र्मफ॒लेषु॒ जुष्टा᳚म् ।
दु॒र्गां दे॒वीग्ं शर॑णम॒हं प्रप॑द्ये सु॒तर॑सि तरसे॒ नमः॑ ॥

अग्ने॒ त्वं पा॑रया॒ नव्यो॑ अ॒स्मान्​थ्स्व॒स्तिभि॒रति॑ दु॒र्गाणि॒ विश्वा᳚ ।
पूश्च॑ पृ॒थ्वी ब॑हु॒ला न॑ उ॒र्वी भवा॑ तो॒काय॒ तन॑याय॒ शं​योँः ॥

विश्वा॑नि नो दु॒र्गहा॑ जातवेदः॒ सिन्धु॒न्न ना॒वा दु॑रि॒ताऽति॑पर्-षि ।
अग्ने॑ अत्रि॒वन्मन॑सा गृणा॒नो᳚ऽस्माकं॑ बोध्यवि॒ता त॒नूना᳚म् ॥

पृ॒त॒ना॒ जित॒ग्ं॒ सह॑मानमु॒ग्रम॒ग्निग्ं हु॑वेम पर॒माथ्स॒धस्था᳚त् ।
स नः॑ पर्-ष॒दति॑ दु॒र्गाणि॒ विश्वा॒ क्षाम॑द्दे॒वो अति॑ दुरि॒ताऽत्य॒ग्निः ॥

प्र॒त्नोषि॑ क॒मीड्यो॑ अध्व॒रेषु॑ स॒नाच्च॒ होता॒ नव्य॑श्च॒ सत्सि॑ ।
स्वाञ्चा᳚ऽग्ने त॒नुवं॑ पि॒प्रय॑स्वा॒स्मभ्यं॑ च॒ सौभ॑ग॒माय॑जस्व ॥

गोभि॒र्जुष्ट॑मयुजो॒ निषि॑क्तं॒ तवे᳚न्द्र विष्णो॒रनु॒सञ्च॑रेम ।
नाक॑स्य पृ॒ष्ठम॒भि सं॒​वँसा॑नो॒ वैष्ण॑वीं-लोँ॒क इ॒ह मा॑दयन्ताम् ॥

ॐ का॒त्या॒य॒नाय॑ वि॒द्महे॑ कन्यकु॒मारि॑ धीमहि । तन्नो॑ दुर्गिः प्रचो॒दया᳚त् ॥

ॐ शान्तिः॒ शान्तिः॒ शान्तिः॑ ॥

అష్ట లక్ష్మీ స్తోత్రం

అష్టలక్ష్మీ స్తోత్రం

(మనోవాంఛా సిద్ధి కోసం, ఆయురారోగ్య ఫలసిద్ధి కోసం ఈ స్తోత్రం)

ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ||

ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ||




ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ||

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ||

సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ||

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ||

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ||

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద
సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ||

ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢ భక్త మోక్ష ప్రదాయిని ॥
శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై. ఓం శనైశ్చరాయనమః

Wednesday, December 27, 2023

శ్రీ నరసింహ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం : 

మహా మహిమాన్వితం శక్తివంతం, ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి, భయంతొలగుతుంది,

*శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం 

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ |
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ||

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ||

నవమం ప్రహ్లాద వరదో దశమో అనంత హస్తకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ||

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ||

క్షయాపస్మార కుష్టాది తాపజ్వర నివారణం |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాప్త చోరామయాదిషు |
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ||

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ |
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్

Aardra Darshana

Aardra Darshan : 

Aardra Darshan is a Tamil festival and this day is dedicated to Lord Shiva. Aardra Nakshatram, which is also known as Thiruvaathirai Nakshatram, during
Maargazhi Masam is considered highly auspicious.

On this day Aardra Nakshatra also coincides with Pournami.

On this day Nataraj form of Lord Shiva is
worshipped during Arunodaya along with holy chanting from Vedas. Being dedicated to Nataraj form of Lord Shiva this day is also considered as the birthday of Lord Shiva. 

In rest of the India it is Maha Shivaratri which is considered as the birthday of Lord Shiva.

Tuesday, December 26, 2023

దత్త జయంతి శుభాకాంక్షలు

ఈ రోజు మార్గశిర పౌర్ణమి. దత్తా త్రేయ జయంతి. దత్తా త్రేయుడికి జ్ఞానోదయం అయిన రోజు గా చెప్పబడింది. త్రిమూర్తులను కలగలిపిన శక్తి స్వరూపం  దత్తా త్రేయుడు. ఈయనే ఆది గురువు. 

భగవద్గీత లో పరమాత్ముడు మాసాలలో నేను  మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. మార్గశిర మాసం మాసాలలో 9 వ ది. మార్గశిర పౌర్ణమి రోజున మృగశిరా నక్షత్రం లో పౌర్ణమి జరుగుతుంది. ఇదే మాసం లో రవి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ధనుస్సు రాశి రాశులలో 9 వ రాశి. అందుకే ఇది అత్యంత విశేషమైన మాసం . 

ఈ రోజు దత్తాత్రేయ ఆలయ సందర్శనం, విశేష పూజ జరిపించుకోవడం, గురువులను గౌరవించు కోవడం, గురు చరిత్ర పుస్తకాలను పంచిపెట్టడం, దత్తాత్రేయుడి మంత్రాలలో ఏదైనా ఒకటి 108 సార్లు జపం చేసుకోవడం వల్ల  చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. 

Sunday, December 24, 2023

శ్రీ సూర్యాష్టకం

శ్రీ సూర్యాష్టకం

సాంబ ఉవాచ |

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || ౧ ||

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 9 ||

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౩ ||

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౪ ||

బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ|
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౫||

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥౭ ||

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౭ ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ ౮॥

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ ౮॥

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ ।
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ ॥ ౯ ||

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే।
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ॥ ౧౦ |

స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ॥౧౧ ||

ఇతి శ్రీ సూర్యాష్టకమ్ |

Saturday, December 23, 2023

అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు


మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 

Thursday, December 21, 2023

కుజుడి గండాంత సంచారం - డిసెంబర్ 23 నుండీ జనవరి 1 వరకు

 

ప్రస్తుతం వృశ్చిక రాశి లో సంచరిస్తున్న కుజుడు వృశ్చిక రాశి లో ని చివరి భాగమైన జ్యేష్టా నక్షత్రం 4 వ పాదం లో కి డిసెంబర్ 23 న ఉదయం 10:51 కి ప్రవేశిస్తాడు డిసెంబర్ 27 న రాత్రి 23:29 కి ధనుస్సు రాశి లో మూలా నక్షత్రం 1 వ పాదం లో కి ప్రవేశిస్తాడు  జనవరి 1 ఉదయం 11:37 కి మూలా నక్షత్రం 2వ పాదం లో కి ప్రవేశించడం తో గండాంత సంచారం ముగుస్తుంది . 

గండాంత సంచారం లొ వున్నా ఏ గ్రహమైనా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు . కుజుడు గండాంత  సంచారం లొ  వున్నప్పుడు ముఖ్యం గా  మేష వృశ్చిక వృషభ  రాశి వారికీ , మృగశిరా , చిత్తా , ధనిష్టా నక్షత్రాల వారికీ  ప్రతికూల ఫలితాలు ఇస్తాడు . అలాగే కుజ దశ , అంతర్దశ జరుగుతున్నా వారికి కూడా ప్రతికూలతలు ఉంటాయి . 

కుజుడు  ప్రతికూల ఫలితాలు ఇస్తున్నప్పుడు  తోడబుట్టిన వారితో విభేదాలు వొస్తాయి . ఎవరితోనైనా వాదోపవాదాలు జరిగి గొడవపడే పరిస్థితులు రావొచ్చు , భూ సంబంధమైన లావాదేవీల్లో ఇబ్బందులు ,మోసాలు జరుగవొచ్చు . వాటి విలువ పడిపోవచ్చు . తరచుగా గాయాలు ఏర్పడవొచ్చు ( చాకు ,కత్తి , బ్లేడు ,కత్తి పీట ఉపయోగించినప్పుడు వాటివలన తెగుట మొదలైనవి ) , కోర్టు వ్యవహారాల్లో పాల్గొనవలసి రావొచ్చు , వాహనాలను తరుచుగా మరమత్తులు చేయించవలసి రావొచ్చు . 

పై ఫలితాల్లో ఏదైనా మీకు అనుభవం అయినప్పుడు కుజ మంత్రం ధ్యానం చేసుకోవడం ,సుభ్రమణ్యేశ్వర ఆలయ సందర్శనం , విశేష పూజ చేయించుకోవాలి . 

ఈ క్రింది మంత్రాలలో ఏదైనా ఒకటి రోజుకి 11/27/54/108 సార్లు జపం  చెయ్యడం వల్ల ఉపశమనం కలుగుతుంది : 

కుజ ధ్యాన శ్లోకములు :


1. రక్త మాల్యాంబరధరం। మేషారూఢం చతుర్భుజం |
శక్తి శూల గదా పద్మమ్। ధారయం తం కరాంబుజైః || 

2. ధరణీ గర్భ సంభూతం। విద్యుత్కాంతి సమప్రభం|
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం||

3.రక్తమాల్యాంబరధరం। హేమరూపం చతుర్భుజం |
శక్తిశూలం గదాపద్మమ్ ధారయంతం కరాంబుజైః ||

4. కుజారిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచ కారయేత్ |
కుజథ్యానం ప్రవక్ష్యామిరోగపీడోప శాంతయే||

Wednesday, December 20, 2023

బుధాష్టమి శుభాకాంక్షలు

బుధాష్టమి :
బుధవారము నాడు సంభవించిన అష్టమిని "బుదాష్టమి” అని అంటారు. ఈ
బుదాష్టమి శివ పార్వతుల పూజకు మరియు గణపతిని ఆరాధించడం
శ్రేష్టము. ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసముండి, శివారాధన, పార్వతి ఆరాధన చేస్తారో, అట్టి వారు, వారి మరణానంతరం నరకమునకు పోరట.
స్వచ్ఛమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితాన సకాల అభివృద్ధి పొందుతారు. అలాగే బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని
పండితులు చెబుతున్నారు. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అప్లైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి, ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించాలి. ఇలా ఆచరించినవారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి, బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.

బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత, పూర్వ జన్మ పాపముల నుండి  విముక్తి లభించును. శివ, పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ
దోషములు నివారింపబడి, బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.

Tuesday, December 19, 2023

శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం



ఈ స్తోత్రం రోజు కొక సారి విన్నా లేదా పారాయణ చేసినా ఆరోగ్యం మెరుగుపడుతుంది . 

నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ |
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ || ౧ ||

నానారత్నసమాయుక్తకుణ్ణలాదివిభూషితమ్ |
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా |
తుఙ్గమ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే || ౩ ||

నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః |
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః || ౪||

భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ |
వ్యాసతీర్థయతీన్హేణ పూజితం ప్రణిధానతః || ౨౫||

త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః |
వాంఛితం లభతే భీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు || ౬ ||

పుత్రార్థీ లభతే పుత్రం యశోబర్థీ లభతే యశః |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥

సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః |
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నరకం ధ్రువమ్ || ౮ ||

ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ యంత్రోద్దారక
హనుమత్య్రోత్రం సమ్పూర్ణమ్ |

Monday, December 18, 2023

శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం

నమస్తే నమస్తే గుహ తారకారే
నమస్తే నమస్తే గుహ శక్తిపాణే |
నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ ౧॥

నమస్తే నమస్తే గుహ దానవారే
నమస్తే నమస్తే గుహ చారుమూర్తే ॥
నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ ౨॥

నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
నమస్తే నమస్తే మయూరాసనస్థా  |
నమస్తే నమస్తే సరోర్భూత దేవ
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || ౩ ||

నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
నమస్తే నమస్తే పరం జ్యోతిరూప |
నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || ౪ ||

నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర
నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర |
నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || ౫ ||

నమస్తే నమస్తే గుహ లోకపాల
నమస్తే నమస్తే గుహ ధర్మపాల |
నమస్తే నమస్తే గుహ సత్యపాల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || ౬ |

నమస్తే నమస్తే గుహ లోకదీప
నమస్తే నమస్తే గుహ బోధరూప ।
నమస్తే నమస్తే గుహ గానలోల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || ౭ ॥

నమస్తే నమస్తే మహాదేవసూనో
నమస్తే నమస్తే మహామోహహారిన్ |
నమస్తే నమస్తే మహారోగహారిన్
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ ౮॥
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ ॥

Sunday, December 17, 2023

ధనదాయక సూర్యాష్టకం


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ॥

సప్తాశ్వ రధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥

లోహితం రధమారూఢం సర్వలోక పితామహం |
మనఃపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం |
నుహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥

బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమే వచ |
ప్రభుస్త్యం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం ॥

బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం ।
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥

విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపకం |
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥

శ్రీవిష్ణుం జగతాంనాధం జ్ఞాన విజ్ఞాన మోక్షదం |
మహాపాప హరం దేవం తంసూర్యం ప్రణమామ్యహమ్ ॥

ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం సూర్య సూక్తం

సూర్య సూక్తమ్

ఓం || నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయ తదృతం సపర్యత ।
దూరేదృశే దేవజాతాయ కేతవే దివసుత్రాయ సూర్యాయ శంసత ॥

సా మా సత్యోక్తిః పరి పాతు విశ్వతో ద్యావా చ యత్ర తతనన్నహాని చ |
విశ్వమన్యన్ని విశతే యదేజతి విశ్వాహాపో విశ్వాహోదేతి సూర్యః ॥

న తే అదేవః ప్రదివో ని వాసతే యదేతశోభిః పతరై రథర్యసి |
ప్రాచీనమన్యదను వర్తతే రజ ఉదన్యేన జ్యోతిషా యాసి సూర్య ॥

యేన సూర్య జ్యోతిషా బాధసే తమో జగచ్చ విశ్వముదియష్రి భానునా ।
తేనాస్మద్విశ్వామనిరామనాహుతిమపా మీవామప దూష్యాప్యు సువ ॥

విశ్వస్య హి ప్రేషితో రక్షసి వ్రతమహేళయన్నుచ్చరసి స్వధా అను ।
యదద్య త్వా సూర్యాపబ్రవామహే తం నో దేవా అనుమంసీరత క్రతుమ్ ॥ 

తం నో ద్యావాపృథివీ తన్న ఆప ఇంద్రః శృణ్వన్తు మరుతో హవం వచః I
మా శూనే భూమ సూర్యస్య సందృసి భద్రం జీవన్తో జరణామశీమహి ॥

విశ్వాహా త్వా సుమనసః సుచక్షసః ప్రజావన్తో అనమీవా అనాగసః ।
ఉద్యంతం త్వా మిత్రమహా దివేదివే జ్యోగీవాః ప్రతి పశ్యేమ సూర్యః ॥

మహి జ్యోతిర్బిభ్రతం త్వా విచక్షణ భాస్వన్తం చక్షుషే చక్షుషే మయ |
ఆరోహన్తం బృహతః పాజసస్పరి వయం జీవాః ప్రతి పశ్యేమ సూర్య ॥

యస్య తే విశ్వా భువనాని కేతునా ప్ర చేరతే ని చ విశక్తే అక్తుభిః ।
అనాగాస్త్యేన హరికేశ సూర్యాహ్నాహ్నా నో వస్యసావస్యసోదిహి॥

శం నో భవ చక్షసా శం నో అహ్నా శం భానునా శం హిమాశం ధృణేన |
యథా శమధ్వంఛమసద్ దురోణే తత్ సూర్యద్రవిణం ధేహి చిత్రమ్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః

రేపు సుభ్రమణ్య షష్ఠి

 
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. 

కృత్తిక నక్షత్రాన
జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల
శరవణభవుడని,ఆరుముఖాలుండటం  వల్ల షణ్ముఖుడని, ఇంకా
స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు.

శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం
నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం,
షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు  నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ, రాహు, కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు, సంతానంలేని వారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని
పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని   సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు.
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ  తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. 

బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. 

శ్లో : 
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

పై  శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూర్తిగా పఠించితే శత్రు విజయం చేకూరుతుంది.

ఆరోగ్యం కోసం సూర్య మంత్రం

సూర్యమంత్రం :

'నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహిదేవః జగత్పతే!!

అర్థం : 
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు
సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు.
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.

సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం
లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు
సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య
నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు
అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..

1. ఓం మిత్రాయ నమః
2.ఓం రవయే నమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూషేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8. ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10. ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః

ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.

Wednesday, December 13, 2023

రవి గ్రహ గండాంత సంచారం డిసెంబర్ 13 నుండీ 19 వరకు

రవి గ్రహ గండాంత సంచారం - డిసెంబర్ 13 నుండీ 19 వరకు : 

రేపు ఉదయం 08:49 ని లకు జ్యేష్టా నక్షత్రం 4 వ పాదం లో రవి గ్రహ ప్రవేశం తో గండాంత సంచారం ప్రారంభం అవుతుంది. 19 వ తారీకు 22:03 కి మూలా నక్షత్రం రెండవ పాదం లో ప్రవేశించడం తో ముగుస్తుంది. 

ఈ సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది కానీ సింహ,మకర రాశుల వారి మీద, కృత్తిక, ఉత్తరా ఫాల్గుణీ, ఉత్తరాషాఢ నక్షత్రం వారి మీద ఎక్కువ ప్రభావం వుంటుంది. 

మేష రాశి వారు వారి తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దూర ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పై చదువుల కోసం విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఫలించవు. 

వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామి తో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు.

మిధున రాశి వారికి భాగస్వాముల తో విభేదాలు , వాతావరణ మార్పు వల్ల వొచ్చే ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

కర్కాటక రాశి వారు తమ సంతానం గురించీ ఆందోళన చెందుతారు. వాతావరణ మార్పుల వల్ల వొచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. 

సింహ రాశి వారికి కంటికి సంబంధించిన సమస్యలు, తల నొప్పి, వృత్తి ఉద్యోగాలలో సమస్యలు రావొచ్చు.

కన్యా రాశి వారు తమ తల్లి ఆరోగ్యం గురించీ శ్రద్ధ పెట్టాలి. ఇంటికి, వాహనానికి రిపేర్లు చేయించ వలసి రావొచ్చు. దూరప్రాంతాల నుండీ దుర్వార్తలు రావొచ్చు. 

తులా రాశి వారు తాము మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తోడ పుట్టిన వారితో విభేదాలు రావొచ్చు. రావలసిన బాకీ లు ఆలస్యం అవుతాయి. 

వృశ్చిక రాశి వారు ఉద్యోగ అవకాశాలు జారవిడుచుకుంటారు. పై అధికారుల తో మాట పడతారు. అనుకున్న పనులు పూర్తి కావు.

ధనుస్సు రాశి వారికి కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టవలసి రావొచ్చు. తీర్థ యాత్రలు వాయిదా వేసుకోవడం మంచిది. 

మకర రాశి వారు పై అధికారులతో ఇబ్బందులు. గవర్నమెంటు పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య భంగం. అధిక వ్యయం. దూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

కుంభ రాశి వారికి పై అధికారులతో ఇబ్బందులు. అనుకున్న పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. రాజకీయ పదవుల్లో వున్న వారికి అప్రతిష్ట ,ఇబ్బందులు.

మీన రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకోని ఇబ్బందులు. తీసుకున్న రుణాల వల్ల ఇబ్బందులు. 

సూర్యుడి సంచారం వల్ల ప్రతికూలతలు ఎదురుకుంటున్న వారు ఈ క్రింది స్తోత్రం రోజూ పారాయణ చెయ్యాలి: 

శ్రీ సూర్య ఏకవింశతి నామ స్తోత్రమ్

భాస్కరో భగవాన్ సూర్య శ్చిత్రభాను ర్విభావసుః
యమః సహస్రాంశుమాలీ యమునాప్రీతిదాయకః ॥

దివాకరో జగన్నాథః సప్తాశ్వశ్చ ప్రభాకరః |
లోకచక్షుః స్వయంభూశ్చఛాయాప్రీతిప్రదాయకః ॥

తిమిరారి ర్దినధవో లోకత్రయప్రకాశకః |
భక్తబంధు ర్దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః ॥

ఏకవింశతి నామాని యః పఠే దుదితే మయి |
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహం ॥

Tuesday, December 12, 2023

మార్గశిర మాసం ఏ నక్షత్రాల వారికి అనుకూలం గా వుంది ?

పుష్యమి , అనురాధా , ఉత్తరాభాద్ర వారికి సంపద వృద్ధి చెందుతుంది 

అశ్విని , మఘ ,మూల వారికి అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి .శుభ కార్యాలు చేస్తారు 

భరణీ , పూర్వ ఫల్గుణీ , పూర్వా షాఢా వారికి మాసం అంతా అనుకూలం గా ఉంటుంది 

రోహిణీ ,హస్తా , శ్రవణా వారు ఎప్పటి నుండో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి . కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలమైన మాసం . 

ఆర్ద్రా , స్వాతీ , శతభిషా నక్షత్రాల వారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది . సొంతోషం గా గడుపుతారు . 

కృత్తికా , ఉత్తరా ఫల్ల్గుణీ , ఉత్తరా షాఢా వారికి చీకాకులు , ఆటంకాలు ఉంటాయి 

మృగశిర , చిత్తా , ధనిష్టా వారికీ ప్రయత్నాలు అనుకూలించవు .అనుకున్న కార్యాలు పూర్తి చెయ్యడానికి  ఎక్కువ ప్రయత్నాలు చెయ్యాలి .

పునర్వసు ,విశాఖ , పూర్వా భాద్రా నక్షత్రాల వారికి కార్య హాని , ఎదురు దెబ్బలు 

ఆశ్లేష ,జేష్టా ,రేవతీ నక్షత్రాల వారికి ఆరోగ్య భంగాలు ఉంటాయి వాతావరణం వల్ల  వొచ్చే జ్వరాలు బాధిస్తాయి . పనులు మందకొడిగా సాగుతాయి .  

మార్గశిర మాసం ఆరంభం - గంగా స్నానం

రేపటి నుండీ మార్గశిర మాసం ప్రారంభం. మార్గశిర మాసం మొదటి రోజున గంగా నదీ స్నానం వల్ల  కోటి సూర్య గ్రహణ స్నానాల ఫలితం దక్కుతుంది . గంగా నది వెళ్లలేక పోయినప్పుడు గంగా జలం స్నానపు నీటి లో కలుపుకుని తల స్నానం చెయ్యాలి . అది కూడా కుదరక పోతే ఈ క్రింది శ్లోకం పఠిస్తూ స్నానం చెయ్యాలి : 

గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ 

నర్మదే సింధూ కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు 


 गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती 

नर्मदे सिन्धु कावेरी जलेस्मिन संनिधं कुरु 

Tara & Chandra Bala for each nakshatra , Ghataka Chakra , Ashtama Chandra Dosha for tomorrow - 13.12.2023


 Click on the picture above for a better view

Monday, December 11, 2023

Rahu in the 8th House - Part 1

If Mesha/Aries is the 8th house and the native is born when Rahu is in Mesha, the native will be a criminal.8th house represents the longevity of the natie and with Rahu placed here adversely effects the life span of the native.  8 th is the house which represents Crime, Conspiracy and Serious trouble. Being a Sign of Mars and also being the 8th house , the native will be rash and quarrelsome. The native will be involved in Criminal Undercover activities. These activities may land up the native in unexpected and sudden troubles. When Rahu is in the 2nd pada of Bharani in the sign between 16 degree 4 mins and 20 degrees, the native will become an atheist. Rahu in Aswini also will make the person not interested in religion. The native may also seek to harm his enemies through occult practices when Rahu is in Aswini. Rahu in Bharani will make the native a sexual pervert and make him do crimes related to sex. In some cases where Rahu is in Bharani, the native may go abroad and may meet his end there. The mother of the native too will be involved in clandestine love relations which may bring her a disrepute. Rahu in Krittika will effect the health of the father of the native. Rahu in contact with Mercury here,will make the native ill. Rahu in contact with Jupiter will make the mother of the native ill. When Rahu is in contact with Saturn by aspect or conjunction with Saturn , will make the native suffer from untreatable diseases. 

If Vrishabha/Taurus is the 8th house and Rahu is placed in it: Rahu in Vrushabha is said to be placed in his sign of exaltation in Vrushabha rasi. How ever , being placed in the 8 th house Rahu will lessen the longevity of the native. Vrushabha rasi is the sign owned by faminine Sukra/Venus. Rahu placed in this sign will make the native to be of poor conduct and will make him commit reprehensible acts. The native will always indulge in a luxurious way of life and waste his money on material pleasures. This position of Rahu in the 8th house and in Vrushabha rasi will make the native suffer from venereal diseases. If Rahu is connected to Saturn or Mars , the other malefics, the native will commit financial frauds relating to insurance, legacies and wills. Rahu here in contact with Saturn will result in the native contacting untreatable diseases. In some cases Rahu in this house will make the native a researcher. Rahu placed in Rohini nakshatra will cause foreign travels. If Rahu is in Mrigasira nakshatra owned by Mars, the native may resort to violence to achieve material success. The native may die in mysterious circumstances.

If Midhuna/Gemini is the 8th house and Rahu is placed in it : This means the native will be of Vrischika lagna. The native will have unstable wealth. Wealth will come and go. This placement of Rahu in the 8th house in Midhuna will effect the longevity of the individual. The native will contact difficult to diagnos illnesses. The native will be secretive in nature. He will communicate in coded language. He will be interested in mysteries. When Rahu is in Mrigasira, the native will be manipulative. He will always try to defraud others. If Rahu is in Punarvasu nakshatra the native may gain wealth through unethical means. As Midhuna is a sign of Mercury, the native with Rahu here may write and publish Pornographic literature. 

If Karkataka/Cancer is the 8th house and Rahu is placed in it : The native will have lagna in Dhanu/Sagittarius. Rahu placed here will cause the native to travel distant and far countries but the native may not prosper there. This placement of Rahu will also lessen the longevity of the native. The native will not be of good conduct. His mother will suffer due to his wrong deeds. The relatives of the native will not have a good opinion on this person and will avoid him. Rahu in the 8th house placed in the sign of Moon will cause the native to commit sins.   

To Be Continued ...  

Mercury Retrograde from December 13,2023 till January 2nd ,2024


Budha/Mercury will be retrograde in Dhanu Rasi , Poorvashadha Nakshatra from December 13 th ,2023 till January 2nd,2024. The period of retrogression will be for 20 days and during this transit Budha will transit back from Poorvashadha to Moola on December 16th  and into Jyeshta on December 28 th. During retrogression Mercury will transit back from Sagittarius into Scorpio before turning direct on January 2nd. Planets are more Stronger/Powerful during their retrogression period. As Mercury is transiting in an inimical sign, Mercury will give negative effects related to his general significations.

Though this retrogression will effect everyone, people of Midhuna/Gemini , Kanya/Virgo natives and those who have Janma Nakshatra in Asresha, Jyeshta and Revati are more likely to be impacted. 

Trading activity should be done cautiously during the Budha/Mercury retrogression period as there will be sudden changes in the market conditions.  

Mercury governs the literary world, Newspapers, Publishers, Ambassadors, Trade and Commerce, Accountants and the intellectual world.

Mercury retrogression will cause upheavals to all those related to the above fields.  

Mercury retrogression will generally cause increase in the prices of Jaggery, Sugar and may cause decrease in the price of Wheat.

Mercury in Poorvashadha causes unrest in public, Opposition to rulers, there will be increase in the prices of Silver, Til Oil, Sugar, Cotton seed and Cotton seed cake. Prices of Food grains and related products will decrease.  

Mercury in Moola Nakshatra causes sudden fall in the prices of Cotton and Cotton thread.  

Mercury in Jyeshta causes increase in the prices of Ghee and Products made out of Ghee ( Sweets). Diseases may spread in Horses. 

Effects of Mercury retrogression on each rasi : 

Mesha/Aries : Those trying for higher education abroad may have to wait for some more time to get admission or Visa. There will be differences with father and mentor. Luck will not favour during this period. Long distance travels and piligrimages are better postponed.

Vrishabha/ Taurus : Speculation should be avoided at any cost. More attention has to be  given to relations. There is a possibility of break up in love relation ships. There will be difference of opinion between married couples. Check twice before sending out any communication to loved ones. 

Midhuna/Gemini : You may have troubles with relatives from maternal side. Take care of seasonal illnesses. Think twice before giving loans to any one. There might be sudden enemity with those around you. You may receive unpleasant news through communications. 

Karkataka/Cancer : Think twice before taking any investment decision. Those in Creative/Artistic fields may have to re do their work. Do not over think about any issue. Children's progress in education will be source of worry. 

Simha/ Leo : Old disputes/ Legal disputes may resurface. You should be careful with your competitors and enemies. You may have to rethink about your past decisions.  Relation ships may suddenly turn bitter. Avoid speculation. Try not to be emotional while making decisions.         

Kanya/Virgo : There might be confusion in your mind and you may not be able to take quick decisions. You may have to take advice from elders. Your Mother may suffer due to nervous weakness or skin allergies during this period. Do not neglect your valuable possessions. You may contract cough and cold during this period.

Tula/ Libra : There may be trouble during short journeys. Relations with your younger coborns will be strained. You may have pain in the Shoulders or right ear or lower neck. Be careful about all your communications. 

Vrischika/ Scorpio : You may have troubles with your teeth and throat. Be careful about what you talk. You may suffer due to untimely food or food allergies. Safe guard your relations with your family members. Father's health has to be taken care of. 

Dhanu/ Sagittarius : Health of your maternal uncle and your Mother may suffer during this period. Value of your property will go down. Your younger co borns may suffer losses. 

Makara/Capricorn : You may have troubles related to your eye sight. Father may have heart troubles. You may face trouble sleeping during this period. You may receive unpleasant news from abroad.

Kumbha/Aquarius : You may incur losses in business due to turbulent market conditions. Be careful with what you communicate with your friends and elder siblings. Mother's health may suffer.

Meena/Pisces : There may be sudden troubles at your place of work. You may be strained with over work. Official communications may not be in your favour. Be care ful while communicating with your mentors and your father.