Thursday, August 10, 2023

గ్రహ దోషాల ఉపశమనానికి పరిహారాలు చేసుకోడానికి ఆగస్ట్ నెలలో అనుకూలమైన రోజులు

గ్రహ దోష నివారణకు జప/హోమ/దానాలు చేసుకోవడానికి రానున్న రోజుల్లో అనుకూలమైన రోజులు(ఆగస్ట్ నెలలో) : 

ఆగస్ట్ 11 ,ఏకాదశి, శుక్రవారం, - వైష్ణవ , శైవ ఉపాసనకు అనుకూలమైన తిథి.

ఆగస్ట్ 13, ఆదివారం, ఆర్ద్ర నక్షత్రం - రాహు కేతు పూజ చేయించుకోవడానికి, రాహు కేతువుల కు జప/దానాలు చేయించుకోవడానికి అనుకూలమైన రోజు.

ఆగస్ట్ 14 , బహుళ త్రయోదశి , సోమవారం, పునర్వసు నక్షత్రం - రాహు మహర్దశ అంతర్దశ లు జరుగుతున్న వారు రాహు జపం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. 

ఆగస్ట్ 14 , బహుళ చతుర్దశి, సోమవారం,పునర్వసు నక్షత్రం  - మాస శివరాత్రి -  రుద్రాభిషేకం చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు .

ఆగస్ట్ 15 , అమావాస్య , పుష్యమీ నక్షత్రం, మంగళవారం - శివారాధన కు అనుకూలమైన రోజు. శని మహర్దశ, అంతర్దశ జరుగుతున్న వారు శని జపం చేయించుకోవడానికి అనుకూలమైన రోజు. 

ఆగస్ట్ 19, శుక్ల తదియ, ఉత్తరా నక్షత్రం - శని మహర్దశ అంతర్దశ లు జరుగుతున్న వారు శని జపం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. 

ఆగస్ట్ 20, ఆదివారం, హస్తా నక్షత్రం, బహుళ చవితి - కేతు గ్రహ దశ అంతర్దశ జరుగుతున్న వారు కేతు జపం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు.

ఆగస్ట్ 22, శుక్ల షష్ఠి, మంగళవారం - స్కంద షష్ఠి - సుబ్రమణ్య ఆరాధనకు అనుకూలమైన రోజు. 

ఆగస్టు 23,శుక్ల సప్తమి, బుధవారం, స్వాతీ నక్షత్రం - కుజ,రాహు అంతర్దశలకి జపాలు మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు. 

ఆగస్ట్ 24, శుక్ల అష్టమి, గురువారం - దుర్గా దేవి ఆరాధనకు అనుకూలమైన రోజు .

ఆగస్ట్ 27, ఆదివారం, శుక్ల ఏకాదశి, మూలా నక్షత్రం - బుధ మహర్దశ,అంతర్దశ జరుగుతున్న వారు దోష నివారణార్థం  బుధ గ్రహ జపం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. 

ఆగస్ట్ 29, మంగళవారం, శుక్ల త్రయోదశి, శ్రవణా నక్షత్రం - ఏ లి నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారు శని జపం మొదలు పెట్టుకోవడానికి అనుకూలమైన రోజు. 

ఆగస్ట్ 31, శ్రావణ పూర్ణిమ - గాయత్రీ జయంతి  - ఈ రోజు గాయత్రీ మంత్రోపదేశం వున్నవారు సహస్ర గాయత్రీ జపం చెయ్యడం చాలా మంచిది. లక్ష్మీ పూజ , శ్రీ సూక్త పారాయణం వల్ల అష్టైశ్వర్య సిద్ధి , వాంఛా ఫల సిద్ధి కలుగుతాయి . 

శివరామ కృష్ణ జ్యోతిష్యాలయం 
96407 54054
91828 17435