Wednesday, July 26, 2023

స్వర్గలోక ప్రాప్తి యోగము ; పరమపద ప్రాప్తి యోగము:


 1. స్వర్గలోక ప్రాప్తి యోగము :

శ్లో॥ శుభేస్వోచ్చవ్యయేవాపి సౌమ్యఖేచరవీక్షి తే
దేవలోకదిభాగస్థే స్వర్గ ప్రాప్తిభవిష్యతి ||
తా॥ ఏదైనా ఒక శుభగ్రహం జనన కాలంలో స్వోచ్చ, వ్యయస్థానాలలో వుండగా శుభగ్రహం చూస్తూవుండగా, దేవలోకాద్యంశలో ఉన్నట్లయితే జాతకుడికి స్వర్గప్రాప్తి.
శ్లో॥ దేవాంశేకర్మరాశీ వ్యయరాశిగతేపివా
శుభగ్రహేణసందృష్టే స్వర్గ ప్రాప్తిర్ననంశయః||
తా॥ దశమాధిపతి దైవాంశంలో లేదా వ్యయస్థానంలో ఉండగా బుధగ్రహం చూస్తూ ఉన్నట్లయితే జాతకుడికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

2. పరమపద ప్రాప్తి యోగము:
శ్లో॥ వ్యయాధిపేవ్యయస్థేతు ఉచ్చగ్రహసమన్వి తే
శుభేన సంయుతేదృష్టే ప్రాప్నోతి పరమంపదం ||
తా॥ వ్యయాధిపతి వ్యయంలో ఉండి- ఉచ్ఛగ్రహంతో కలసివున్నా, శుభులతో కలసినా,ఉచ్ఛగ్రహం లేదా శుభులు చూస్తున్నా జాతకుడు పరమపదం పొందుతాడు.
శ్లో॥ వ్యయస్థాన గతే జీవే శుభగ్రహనిరీక్షి తే
సకేతౌతుంగనాధేన సంసారాన్ముచ్యతే నరః ॥
తా॥ వ్యయంలో గురుడుండగా శుభగ్రహాలు చూస్తున్నా, వ్యయాధిపతి ఉచ్ఛస్థానంలో ఉండి కేతువుతో కలసి ఉన్నట్లయితే జాతకుడు మోక్షం పొందుతాడు.
శ్లో॥ లగ్నాధిపే గురుయుతే గురుక్షేత్రగతోపివా
ఉచ్చ స్థితే దేవ గురౌ సంసారాన్ముచ్యతేనరః ॥
తా|| లగ్నాధిపతి గురుడుతో కలిసినా గురుక్షేత్రంలో ఉన్నా ఉచ్చస్థితి పొందినా జాతకుడు మోక్షగతిని పొందుతాడు.