Tuesday, March 8, 2022

మీన రాశి లో గురు గ్రహ సంచారం - ఏప్రిల్ 13,2022 నుండీ ఏప్రిల్ 22,2023 వరకు - Part 1


మీన రాశి లో గురు గ్రహ సంచారం  - ఏప్రిల్ 13,2022 నుండీ ఏప్రిల్ 22,2023 వరకు - వివిధ రాశులపై ప్రభావం - మొదటి భాగం 

మీన రాశి లో గురు సంచారం : 

పూర్వాభాద్రపద 4 వ పాదం లో 13 ఏప్రిల్ నుండీ 28 ఏప్రిల్ ,2022 వరకు ; ఉత్తరాభాద్రపదా నక్షత్రం లో 28 ఏప్రిల్ ,2022 నుండీ 24 ఫిబ్రవరి ,2023 వరకు ; రేవతీ నక్షత్రం లో 24 ఫ్రెబ్రవరి,2023 నుండీ 22 ఏప్రిల్,2023 వరకు ఉంటుంది. 

మీన రాశి లో గురు గ్రహ వక్ర సంచారం : జులై 29,2022 నుండీ నవంబర్ 24,2022 వరకు ఉత్తరాభాద్రపదా నక్షత్రం లో . 

మీన రాశి లో ఉండగా గురు గ్రహ సంయోగాలు ఈ విధంగా ఉండ బోతున్నాయి : 1 మే,2022 న శుక్ర గ్రహం తో; 29 మే,2022 న కుజ గ్రహం తో; 28 మార్చి,2023 న బుధ గ్రహం తో; 12 ఏప్రిల్,2023 న రవి గ్రహం తో గురు గ్రహ సంయోగాలు ఉంటాయి. 

రాశులపై ప్రభావం :

మేష రాశి : మీ రాశి నుండీ 12 వ రాశి లో స్వస్థానం లో గురు సంచారం . ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. విదేశాల్లో విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. మే 1 న శుక్రుడితో ఈ గురువు కలిసినప్పుడు మంచి ధనలాభం ఉంటుంది. మార్చ్ 11,2023 నుండీ మార్చ్ 25,2023 వరకు అవరోధాలు,అదృష్టహీనత,ధననష్టం. మీన రాశి నుండీ తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిని గురువు వీక్షిస్తాడు కనుక ఆనందంగా వుంటారు. నూతన గృహం కొనుక్కుంటారు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఉత్తరాభాద్రపదా నక్షత్రం లో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆదాయం బాగుంటుంది

వృషభ రాశి : ఏకాదశ స్థానం లో గురు సంచారం వల్ల అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది. విజయం సాధిస్తారు. సంఘం లో మంచి స్థానం లో వుంటారు. పిల్లల విషయాల్లో శ్రద్ధ వహించాలి.ఆరోగ్యం మెరుగుపడుతుంది.13 నుండీ 28 ఏప్రిల్ లోపల మంచి విజయాన్ని అందుకుంటారు,శుభవార్తలు వింటారు. మొదట్లో అరుగుదల తక్కువగా ఉంటుంది తరువాత మెరుగౌతుంది. వృత్తిపరమైన పురోగతి అద్భుతం గా ఉంటుంది.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రేవతీ నక్షత్రం లో గురు సంచారం జరుగుతున్నప్పుడు వ్యాపార లాభాలు బాగా ఉంటాయి. 

మిధున రాశి : గురు గ్రహ దశమ రాశి సంచారం వల్ల మీలో మంచి నడవడిక ఉంటుంది. వృత్తిపరమైన పురోగతి వుంటుంది. ధనవంతులౌతారు. ఏదో విషయం లో ఆందోళన చెందుతూ వుంటారు. విద్యాభివృద్ధి. ధర్మబద్ధం గా వుంటారు. మాట తీరు మెరుగౌతుంది. మీ మేనమామలు బాగా లాభాలు గడిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

కర్కాటక రాశి : గురు గ్రహ నవమ రాశి  సంచారం మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది. మత విశ్వాసాలు పెరుగుతాయి. గురువు ఆశీస్సులు లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొద్దిగా వొళ్ళు చేస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. మీ తమ్ముడు/చెల్లెళ్ళ విషయం లో ఆందోళన చెందుతారు. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. గురు రవుల సంయోగం జరిగినప్పుడు తండ్రి ఆరోగ్యం మెరుగౌతుంది. తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. 

సింహ రాశి : గురు గ్రహం మీ జన్మ రాశికి అష్టమ రాశి సంచారం. స్వస్థానం కనుక  ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భార్య ఆస్తులు పెరుగుతాయి, మాట తీరు బాగుంటుంది. గురువు వక్ర గమనం లో  వున్నప్పుడు పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తండ్రికి వ్యాపారం లో  నష్టం రావొచ్చు.తండ్రికి అదృష్టం తక్కువగా ఉంటుంది. రేవతీ నక్షత్రం లో  గురు సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి,ధన లాభాలు ఉంటాయి. ఆనందంగా వుంటారు. కొంతమంది కొత్త ఇల్లు కొనుక్కుంటారు. విద్యాభివృద్ధి బాగుంటుంది. 

కన్యా రాశి : గురు గ్రహ సప్తమ రాశి సంచారం మీకు మంచి చేస్తుంది.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక సంబంధాలు సాఫీ గా సంతోషం గా ఉంటాయి. మీ భార్య/భర్త వొళ్ళు చేస్తారు. వారికి  ఆస్తి ధన లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి పర్వాలేదనిపిస్తుంది. గవర్నమెంట్ నుండీ సహకారం లభిస్తుంది. మీ పై తొడబుట్టిన వారికి కష్టాలు ఉంటాయి. బుధుడి తో  గురువు  కలిసినప్పుడు  మంచి విద్యాభివృద్ధి.